గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

తొర్రూరు(డివిజన్) నేటి ధాత్రి

 


Pregnant women

గర్భిణీలు బాలింతలు పిల్లలు అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అమర్ సింగ్ తండా, కర్రె బిక్యా తండా, చౌల తండా అంగన్వాడి సెంటర్లలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోషకాహారం తీసుకోవడం వల్లే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలు,పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మడిపల్లి హెల్త్ సూపర్వైజర్ జిఎల్. మేరీ, అంగన్వాడి టీచర్లు జె కమలాదేవి, వి.భారతి, చంద్రకళ, సీత, ఏఎన్ఎం ఉమా,శారద, ఆశా కార్యకర్తలు స్వరూప,కరుణ, ఆయా శారద, స్థానికులు పాల్గొన్నారు.

తాటి చెట్టు పైనుంచి పడి కార్మికుడు మృతి.

తాటి చెట్టు పైనుంచి పడి యువ గీతా కార్మికుడు మృతి

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాకేష్ గౌడ్ (28) రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో త్రీవ గాయాలు కాగా గమనించిన స్థానికులు దగ్గర్లో ఉన్న చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇంటికి దిక్కు అయినటువంటి కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంతో నిండిపోయింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలు నాయకులు కోరారు.

బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి


బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలి

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు

తొర్రూర్ (డివిజన్) నేటి ధాత్రి
ఈనెల 27న ఎల్కతుర్తి
వరంగల్ జిల్లాలో జరుగు బిఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని తొర్రూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతానములు గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం నేడు కొమ్మనపల్లి, చింతలపల్లి టీక్య తండా, పెద్దమంగ్య తండా, వెలికట్టే, భోజ్య తండా ఈదులకుంట తండా నాంచారి మడూర్ ,గుడి బండ తండా గ్రామాల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశం చేశారు కార్యక్రమంలో మాజీ తొర్రూరు మండలం ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాజీ జెడ్పిటిసి జిల్లా ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్, పట్టణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి ,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్ మాజీ కో ఆప్షన్ ఎస్కే అంకుష్ ,కాలు నాయక్, ఈనపెళ్లి శ్రీనివాస్ ,పాపిరెడ్డి , పులి వెంకన్న ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు రజితోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు

గణపురం ఎస్ ఐ రేఖ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

 

 

గణపురం మండలంలో మధ్యాహ్నం సేవించి వాహనాల వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు అతిగా మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడుపుతూ వాహనాల తనిఖీలు పట్టుబడిన గణపురం మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన పోలు రమేష్ కు భూపాలపల్లి జ్యుడిషినల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎన్ రామచందర్ రావు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు అని మద్యం సేవించి వాహనాలు నడిపితే వారికి అదే విధంగా త్రిబుల్ రైడింగ్ మైనర్లు డ్రైవింగ్ చేసినట్లయితే వారికి పై శిక్షలు వర్తిస్తాయని హెచ్చరించారు

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఏర్పాటు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:

 

ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు  పాల్గొన్నారు.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.

#మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి, నేటి ధాత్రి

silver

ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని శనిగరం, ఆర్వయ పల్లె, కన్నారావుపేట గ్రామాలలో పార్టీ రజతోత్సవ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీని స్థాపించి 25 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను వరంగల్ జిల్లాలోని ఎలుకతుర్తి లో ఏర్పాటు చేయడం జరిగిందని. తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు. కావున నర్సంపేట నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో సభను విజయవంతం చేయడం కోసం మండలంలోని పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బానోతు హరినాథ్ సింగ్, క్లస్టర్ బాధ్యులు గందె శ్రీనివాస్ గుప్తా, ఇంగ్లీ శివాజీ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తక్కలపల్లి మోహన్ రావు, మాజీ సర్పంచ్ నాన్న బోయిన రాజారాం యాదవ్, నాయకులు మంద రాజిరెడ్డి, తిప్పని రవీందర్ గౌడ్, ఊట్కూరి అశోక్ గౌడ్, భూక్య బాలరాజు, మాడిశెట్టి రవి, తంగెళ్ల రవీందర్ రెడ్డి, పూజారి రాజు గౌడ్, మాజీ వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్.

చర్లపల్లి పాఠశాల మరో జలియన్వాలాబాగ్

నడికూడ,నేటిధాత్రి:

 

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో జలియన్వాలా బాగ్ సంఘటనను పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో ఆ సంఘటనను కనులకు కట్టినట్లుగా విద్యార్థుల ద్వారా నాటకీకరణ చేయించడం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రజలను ఆకట్టుకున్నది. జలియన్వాలా బాగ్ ప్రదేశంలో మరణించిన భారతీయుల స్తూపానికి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ నివాళులర్పించారు.అనంతరం అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ 1919 ఏప్రిల్ 13 న భారత నేల రక్తంతో తడిసిన రోజు అని, దుర్మార్గపు చట్టాన్ని వ్యతిరేకించినందుకు బ్రిటీష్ వారు ఆడిన రక్తపు క్రీడ అని, బ్రిటీషు ప్రభుత్వం ఆమోదించిన “రౌలత్ చట్టం” ప్రకారం పోలీసులు ప్రజలను అనుమానితుల పేరుతో ఎటువంటి విచారణ లేకుండా, రెండు సంవత్సరాలపాటు నిర్భందించవచ్చఅని, ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సైపుద్దిన్ క్లిచ్, సత్యపాల్ సింగ్లను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వీరి అరెస్ట్ కు వ్యతిరేకంగా ప్రజలు అమృత్సర్ లోని జలియన్ వాలాబాగ్ లో సమావేశం అయ్యారు అని
ఈ సమావేశంలో హన్స్ రాజ్ అనేవ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు, అప్పటి సైనిక అధికారి జనరల్ డయ్యర్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే, నిరాయుధులైన ప్రజలపై 1650 రౌండ్ల కాల్పులు పది నిమిషాల పాటు,379 మరణాలు, రెండువేల మందిని గాయపరిచారు,అనేక మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకొనుటకు అక్కడి బావిలో దూకారనీ,తుటాలు తగలి చాలామంది చనిపోయారు అని అన్నారు.ఈ సంఘటనలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనయే భారతదేశ చరిత్రలో జలియన్ వాలాబాగ్ దురాగతంగా నిలిచిపోయిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మేకల సత్యపాల్,
ఐ ఈ ఆర్ టి రమేష్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

16,వ తేదీన జరిగే భవణ నిర్మాణ.!

ఈనెల 16,వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

 

ములుగు జిల్లాలో ఈరోజు వెంకటాపూర్ మండల కేంద్రములో భవణ నిర్మాణ కార్మిక సంఘం కార్యకర్తల సమావేశం బండి నర్సయ్య అధ్యక్షతన జరిగినది ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ గారు మాట్లాడుతూ భవణ నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని కార్మికులకు పిలుపునిచ్చారు, అనేక పోరాటాల ఫలితంగా భవనిర్మాణ సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగినది అన్నారు, కానీ దాని ద్వారా కార్మికులకు లభిస్తున్న ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయి అన్నారు, ప్రసూతికి,రూ,,30000/-పెళ్ళికి రూ,30000/-ఇస్తున్నారు దానిని రూ,,100000/-కు పెంచాలని అలాగే సహజ మరణానికి రూ,,1,30000/- ప్రమాధ మరణానికి రూ,,6,30000/- ఇస్తున్నారు,మరణం అనేది ఎలా జరిగినా మరణమే కాబట్టి రూ, 10,00000/- అందించాలని డిమాండ్ చేశారు కనుక ఈ సమస్యల పరిష్కారానికి పోరాటాలే శరణ్యం అన్నారు, అందులో భాగంగా ఈనెల 16 వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్ధ్యోగుల భవణములో జరిగే తెలంగాణ భవణ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ద్వితీయ మహాసభలను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, సంఘం జిల్లా కోశాధికారి కొక్కుల రాజేందర్, ఏఐటియుసి మండల నాయకులు తోట సంపత్, దేవేందర్, సురేష్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు

హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం నాడు చింతల హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు
గోకారం రాజు కటకం శ్రీధర్ చిదేరే వెంకటేష్. నూకల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

జాబ్ మేళాకు అత్యధికంగా నిరుద్యోగుల రిజిస్ట్రేషన్.

వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్.

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నీలం కుమారస్వామి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రియతమ నాయకులు పేదల పెన్నిధి యువతీ యువకులు నిరుద్యోగుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న మన నాయకుడు గౌరవ శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారు ఆదేశాల మేరకు ఈనెల 26 తారీఖున జరగబోయే మేఘా జాబ్ మేళా కు గోపాలపురం మూర్తి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలశంకర్ గౌడ్, పంచాయతి కార్యదర్శి రమాదేవి ఎ ఎస్ ఐ సమ్మిరెడ్డి అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, జ్యోతి, నీలవర్ణ ఆశ వర్కర్స్ మహిళా సమైక్య CA కోడూరు ఓంకార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందుల భద్రయ్య హెడ్ కానిస్టేబుల్ యాకయ్య పిసి నాగరాజ్ యూత్ నాయకులు పనస రాకేష్, సునీల్ కుంచాల, కత్తి మహేష్ శ్రీకాంత్ మూల నాగరాజ్, గ్రామంలోని యువతీ యువకులు మెగా జాబ్ మేళా లో అధికసంఖ్యలో పాల్గొని 70 మంది యువతి యువకులు, పేర్లు నమోదు చేసుకున్నారు.

ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ఉపాధి హామీ పనుల పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)

 

 

రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు పరిశీలన,కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్, అంగన్వాడి సెంటర్ తనిఖీ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు మంచి సీజన్ అని పెద్ద ఎత్తున లేబర్ ను మొబలైజ్ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ,జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకన అడవిలోకి వెళ్లి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలు చేస్తున్న ట్రాం చ్ పనులను పరిశీలించారు.

Collector

అలాగే కూలీల సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కూలీల కుటుంబ వివరాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు,పని వేళలు,తదితరాల విషయాలను అడుగుతూ, వారితో హాయిగా ముచ్చటిస్తూ, స్ఫూర్తిని కలిగించారు.ఈ సందర్భంగా ఎంత మంది ఇక్కడ ఈ కూలీ పనులు చేస్తున్నారు? వారి పని వేళలు ఎప్పటివరకు? రోజుకు ఎంత మేర కొలతతో పనులు చేస్తున్నారు? వంటి వివరాలపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నామని ఉపాధి హామీ పథకం పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు లేబర్ ను మొబలైజ్ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.ఈ మూడు నెలలు అత్యంత కీలకమని చెప్పారు.ఈ మేరకు అధికారులు స్పందిస్తూ పర్వతాపూర్ గ్రామంలో 160 మంది ఈ కూలీ పనులు చేస్తున్నారన్నారు.ఎండాకాలం దృష్ట్యా వారి పని వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు అని అన్నారు. 5 మీటర్స్ పొడవు 1 మీటర్ వెడల్పు , 0.5 మీటర్ లోతు పనులు చేస్తున్నారని వారు కలెక్టర్ కు వివరించారు.అలాగే ఉపాధి హామీ పనులకు సంబంధించిన కొలతల పుస్తకాన్ని, జాబ్ కార్డులను, మాస్టర్ రోల్ ను అన్ని రిజిస్టర్ లను స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించాలని, పనుల పురోగతికి సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని అధికారులను ఆదేశించారు.కొలతల్లో వ్యత్యాసం రావొద్దని, సామాజిక తనిఖీల్లో ఇబ్బందులు వస్తాయని స్పష్టం చేశారు.స్వయంగ అక్కడ తీసిన ట్రెంచ్ ల కొలతలు టేప్ తో కొలచి సంతృప్తి వ్యక్తం చేశారు.వేజ్ పెరిగితే మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుందని అన్నారు.

Collector

 

వేసవిలో తగు జాగ్రత్తలు పాటించాలని అదే విధంగా తాగునీరు,నీడ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.శరీరం నిర్జలీకరణ డీ హైడ్రేషన్ కు గురికాకుండా సరిపడా స్వచ్ఛమైన తాగునీరు, ఉత్తేజితులయ్యేందుకు గాను ఓఆర్ఎస్ నీటిని క్రమం తప్పకుండా తాగాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కూలీలకు సూచించారు.కాట్రియాల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు, అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ పరిశీలిస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు, అంగన్వాడి సెంటర్లో చిన్నారుల మేధస్సును పాటలు పద్యల రూపంలో పరీక్షించి అంగన్వాడీ పనితీరు పట్ల ఆదర్శంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజుద్దీన్, పంచాయతీ సెక్రెటరీ వరలక్ష్మి, ఏపీవో శంకరయ్య, టెక్ని టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి.

‘అందరిపై.. ఆంజనేయ స్వామి కటాక్షం ఉండాలి’

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

అందరిపైనా ఆంజనేయ స్వామి కృపా కటాక్షం ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా.. మహబూబ్ నగర్ పట్టణంలోని అప్పన్నపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ప్రజలంతా సుఖసంతోషాలతో ఆకాంక్షించారు. ఎంతో పురాతనమైన ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు గుండా మనోహర్, శివశంకర్, రామాంజనేయులు , హరిబాబు , రామకృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్

వైద్య రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చాము
– బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత
– కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్

సిరిసిల్ల, ఏప్రిల్ 

ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కరీంనగర్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్ లో జరిగిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవంలో పాల్గొన్న కేటీఆర్, పేషంట్లతో డాక్టర్లు సరిగా మాట్లాడితే సగం జబ్బు నయమవుతుందన్నారు.

education

ఈ సందర్భంగా మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
2019 బ్యాచ్ ఎంబిబిఎస్ స్టూడెంట్స్ కు డాక్టర్లుగా మారబోతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.
నా చిన్నతనంలో మా అమ్మ కూడా నేను డాక్టర్ కావాలని కోరుకుందని అన్నారు.
వ్యక్తిగత జీవితం, ప్రాధాన్యతలను కూడా పక్కన పెట్టి ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు పనిచేయాల్సి ఉంటుందని కెసిఆర్ నాకు చెప్పారు.
డాక్టర్లు పేషంట్లతో సరిగా మాట్లాడితే 50 శాతం జబ్బు నయమవుతుంది. ఇది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రూపంలో డాక్టర్లకు రాబోయే రోజుల్లో పెద్ద చాలెంజ్ ఎదురు కాబోతుందని అన్నారు.
చాట్ జిపిటి , గ్రోక్ లు ప్రిస్కిప్షన్ లు కూడా రాస్తున్నాయని అన్నారు.
ఏఐ ఇచ్చే సమాచారం ఆధారంతో చాలా మంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అన్నారు.
ఇలాంటి పేషెంట్లను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని అన్నారు.
కరుణ, సానుభూతితో రోగులకు డాక్టర్లు సేవ చేయాలని అన్నారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కాలంలో తెలంగాణలో మెడికల్ విద్య, ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు.
ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని అన్నారు.
హెల్త్ కేర్ రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా మార్చామని అన్నారు.
వైద్యరంగంలో తెలంగాణ సాధించబోయే ప్రగతిలో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు.

అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర.

రాజ్యాంగమును కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలంలో నగరంపల్లి కొండంపల్లి కొండాపూర్ రంగారావుపల్లి బిక్కోనిపల్లి బంగ్లాపల్లి సీతారాంపురం అప్పయ్య పల్లి, భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జై బాపు,జై భీం,జై సంవిధాను లో బాగంగా ఈ రోజు గణపురం మండలం గ్రామంల లో కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,రాజ్యాంగ పిటికలకు పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రేపాక రాజేందర్,కార్యక్రమ మండల ఇన్చార్జి పంతకాని సమ్మయ్య మాజీ ఎంపిటిసి కాటారం పిఎసిఎస్ చైర్మన్ కన్నబోయిన కుమారస్వామి, మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖుని చేస్తుందని అన్నారు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ,అణగారిన వర్గాల హక్కులు కాలరాస్తున బీజేపీ వైఖరి నశించాలని నినదించారుభారత రాజ్యాంగమును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆద్వర్యంలో నెల రోజులు మండల వ్యాప్తంగా జరిగే యాత్రలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు,విద్యావంతులు పాల్గొని విజయంతం చేయాలని కోరారు. నగరంపల్లి మాజీ సర్పంచ్ ఆలూరి కుమారస్వామి, పరశురాంపల్లి మాజీ సర్పంచ్ తాళ్ల పెళ్లి భాస్కర్ రావు, మాధవ్ సత్యనారాయణ రెడ్డి, గొర్రె బాలరాజు, గొర్రె రవి, వెల్గం రాజయ్య, మల్లికార్జున, ఆవుల రవి, తదితరులు పాల్గొన్నారు.కొండంపల్లి దాసర రవి,చిట్యాల నాగరాజు, దాసరి లక్ష్మయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజబాబు , మాజీ సర్పంచ్ మామిడి రవి, మామిడి సర్వేశం, మాజీ ఎంపిటిసి పెద్దల్ల సారయ్య, మామిడి చిరంజీవి, రవి తదితరులు పాల్గొన్నారు. రంగారావు పల్లి మాజీ ఎంపీపీ రామేశ్వరరావు, కందుకూరు బ్రహ్మచారి, రవి, ఎర్రబెల్లి మలల్ రావు,భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు. బంగ్లాపల్లి సీనియర్ నాయకులు ఉపేందర్ రావ్, గొట్టేముక్కల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సీతారాంపురం గ్రామ శాఖ అధ్యక్షులు పీట్ల రంజిత్, మాజీ ఎంపిటిసి బొల్లం జంపయ్య, మాజీ ఎంపిటిసి పెద్దోళ్ల సారయ్య, ఉపేందర్ రావ్, గొట్టేముక్కుల సుధాకర్ రావు, దూడ దేవేందర్ రెడ్డి, గంధం రాజు, మంద రగు, మేకల పున్నo, తదితరులు పాల్గొన్నారు. అప్పయ్య పల్లె గ్రామ శాఖ అధ్యక్షులు కొడాలరి రవి, దోమల రాజయ్య, దోమల సమ్మయ్య, ఎలుక పెళ్లి రమేష్, దోబ్బాల సాంబయ్య, మాజీ సర్పంచ్ దోమల రవీందర్, తదితరులు పాల్గొన్నారు

శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం.

అంగరంగ వైభవంగా శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణం
చిల్పూర్(జనగాం)నేటి ధాత్రి

 

భక్తుల కోరిన కోర్కెలు తీర్చుతూ దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న చిల్పూర్ గుట్ట చిల్పూర్ మండల కేంద్రంలోని కొలువైన శ్రీ ముగ్గులు వెంకటేశ్వర స్వామి వార కళ్యాణ మహోత్సవం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీ ప్రసన్న ,ఆలయ ప్రధాన అర్చకులు రంగాచార్యులు,కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయ అర్చకుల శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలలో భాగంగా హారతులు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.ఇందులో భాగంగా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు.దీంతో ఆలయ పరిసరాలు ఓం నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం.

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పట్టణం లోని పదో వార్డులో గల పోచమ్మ కాలనీ కి చెందిన పోలబోయిన ఆగమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానిక వార్డు మాజి కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగమ్మ భౌతిక గాయనికి పూలమాలవేసి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5 వేలు అర్ధిక సహయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డులోని ముఖ్య నాయకులు ఎదురబోయిన రామస్వామి, మామిడాల బిక్షపతి, వలుస సత్యనారయణ,పస్తం ఎల్లాస్వామి,వలుస అదినారయణ,జక్క రవిందర్,పస్తం కృష్ణ, అరెపెల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్జయ్.

ప్రజాసేవ ధ్యేయంగా దూసు కుపోతున్న తీన్మార్ జయ్

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో రెండు రోజుల క్రితం గాలి దుమారం వల్ల గ్రామంలో మక్కా జొన్న పంట నేలకు వాలడంతో గ్రామంలో రైతులకు జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకున్న తీన్మార్ జయ్ సమస్యను మండల వ్యవసాయ శాఖ అధికారు లకు వివరించి రైతులకు అధికారుల నుండి న్యాయం జరిగేలా కృషి చేశాడు తమ ఓటు వేసి గెలిపించుకున్న నాయకులు చేయవలసిన పని మంచి మనసుతో తమ గ్రామం లోని తీన్మార్ జయ్ రైతుల పక్షాన నిలవడం చాలా సంతోషంగా ఉందని రైతులు ప్రశంసించారు తండా గ్రామం లో 42 మందికి ఉచిత కంటి ఆపరేషన్ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో చేయించి వారి మన్ననలను పొందాడు తన గ్రామంలో వారం అంగడి స్థాపించి చుట్టుపక్కల గ్రామా లకు కూడా తను ఒక ఆదర్శ వంతమైన వ్యక్తిగా నిలిచాడు అలాగే ఫ్లోరైడ్ నీటి వాటర్ ఉండకూడదని ఆ తండా గ్రామంలో ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఉచితంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ను కొంతమంది దాతల సహాయంతో కలిసి నిర్మిస్తున్నాడు తన పుట్టిన ఊరు తన కన్న తల్లితో సమాన మని తన గ్రామ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచు కోవడం లేనే నాకు ఆనందంగా ఉంది అని ఎవరో వస్తారు ఏమో చేస్తారు అని ఎదురు చూడటం చేతగాని తనం అవు తుందని అన్నారు రానున్న స్థానిక సంస్థల్లో ఆ సూర్య నాయక్ తండా గ్రామంలో తాను తప్పకుండా పోటీలో నిలిచి తన గ్రామాన్ని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దాలని తీన్మార్ జయ్ అన్నారు. గ్రామంలోని ప్రజలు తీన్మార్ జయ్ చేస్తున్న మంచి పను లకు ఎప్పుడు తనకు అండగా ఉంటామని ప్రజలు తెలిపారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే.!

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేద్దాం ఎమ్మెల్యే మాణిక్ రావు

◆ఈనెల 27 న ఎల్కతుర్తి లో జరిగే సభను కలిసి కట్టుగా విజయవంతం చెయ్యాలి

◆కోహిర్ మండల పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు అన్నారు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మాజి మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, శనివారము మండలంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందని అన్నారు. 10 లక్షల మంది తో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు.రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని.. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

MLA Manik Rao

 

కోహిర్ మండలం నుండి పెద్ద ఎత్తున కదలిరావాలని ఎమ్మెల్యే మాణిక్ రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి,కొహిర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు మొహిద్దీన్ , ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి కేతకీ ఆలయ చైర్మన్ నర్సింహ గౌడ్,
సీనియర్ నాయకులు కలీం, కొహిర్ పట్టణ అధ్యక్షులు ఇఫ్టేకార్,యువ నాయకులు మిథున్ రాజ్,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ ,మాజి సర్పంచ్ లు నర్సింలు , మొలయ్య,రమేష్ ,మాజి ఎంపీటీసీ లు సంపత్,విఠల్ రెడ్డి ,నాయకులు నర్సింహ రెడ్డి,మాజి విజిలెన్స్ కమిషన్ మెంబర్ రామకృష్ణ బంటు,గ్రామ పార్టీ అధ్యక్షులు & కార్యవర్గం ,ముఖ్య నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన మండల మాజీ వైస్ ఎంపీపీ వంగాల నారాయణరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

శాయంపేట మండలంలోని సాధనపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పద్మ సమ్మయ్య దంపతుల కుమార్తె నిత్యశ్రీ వివాహమునకు పాల్గొ ని నూతన వధూవరులను ఆశీర్వదించి ,శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, మైలారం ఎంపీటీసీ గడిపే విజయ కుమార్ శాయంపేట ఉప సర్పంచ్ సుమన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బత్తిని తిరుపతి, మండల నాయకులు పాల్గొన్నారు.

NHRC రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య.

నల్ల రవికిరణ్ ను పరామర్శించిన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

10 వేల రూపాయల ఆర్థిక సహాయం, 50 కేజీల బియ్యం అందజేత

“నేటిధాత్రి” హనుమకొండ:

 

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) వరంగల్ జిల్లా అధ్యక్షులు నల్ల రవి కిరణ్ తండ్రి నల్ల రవీందర్ ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పరామర్శించారు. స్వర్గీయ నల్ల రవీందర్ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. నల్ల రవికిరణ్ ను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పదివేల రూపాయల ఆర్థిక సాయం 50 కేజీల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు.

Assistance

 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మాంచాలక్క, గ్రేటర్ వరంగల్ కమిటీ అధ్యక్షులు ఉచత శ్రీకాంత్, ఉపాధ్యక్షులు గూడూరు నరేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అధికార ప్రతినిధి వేల్పుల మణెమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీనివాస్, రామ్మూర్తి, రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ కోడిపాక రవి, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి సన్నగుండ్ల వెంకటేశ్వర్లు, వరంగల్ జిల్లా ప్రచార కార్యదర్శి సురేందర్, నల్లబెల్లి మండల అధ్యక్షులు ఆవునూరి కిషోర్, జిల్లా అధికార ప్రతినిధి నర్మెట్ట యాదగిరి, కె. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version