తాటి చెట్టు పైనుంచి పడి యువ గీతా కార్మికుడు మృతి
జైపూర్,నేటి ధాత్రి:
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేమనపల్లి మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాకేష్ గౌడ్ (28) రోజు మాదిరిగానే తాటి చెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో త్రీవ గాయాలు కాగా గమనించిన స్థానికులు దగ్గర్లో ఉన్న చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఇంటికి దిక్కు అయినటువంటి కుమారుడు చనిపోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంతో నిండిపోయింది.మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలు నాయకులు కోరారు.