శ్రీ కంఠమహేశ్వరుని కల్యాణం.

కన్నుల పండుగగా శ్రీ కంఠమహేశ్వరుని కల్యాణం

నర్సంపేట నేటిధాత్రి:

నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో శ్రీ సూరమాంబ -శ్రీ కంఠ మహేశ్వరుని కల్యాణం కన్నుల పండుగగా జరిగింది.ఐదు రోజుల పాటు గౌడ కులస్తుల ఆధ్వర్యంలో శ్రీ కంఠ మహేశ్వరునికి ఉత్సవాలు నిర్వహించారు.మొదటి రోజు ఆలయంలో మామిడి తోరణాల అలంకరణ, గౌడ కులస్తులకు మాలాదారణ, పటం కథ, రెండో రోజు గ్రామ దేవత లకు ప్రత్యేక పూజలు, మూడో రోజు జాలాభిషేకం, నాలుగో రోజు శ్రీ సూరమాంబ దేవి -శ్రీ కంఠ మహేశ్వరునికి కళ్యాణం,శ్రీ రేణుక-ఎల్లమ్మ తల్లి, జమదగ్ని పండుగ,బోనాల సమర్పణ, కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాల భాగంగా బోనాల కార్యక్రమం లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరయ్యారు. శ్రీ కంఠ మహేశ్వరుని ఆలయంలో రేణుకా ఎల్లమ్మ,వనం మైసమ్మ,సూరమంబా దేవి, శ్రీ కంఠ మహేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం బొట్టు పెద్ద మనుషులు కట్ల సుధాకర్ గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం అధ్యక్షులు బుర్ర ఆనందం గౌడ్, కార్యదర్శి కక్కెర్ల కుమారస్వామి గౌడ్, కోశాధికారి తాళ్లపెల్లి అశోక్ గౌడ్, పిఏసిఎస్ వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్ గౌడ్, కట్ల కనుకయ్య గౌడ్, మచ్చిక రవీందర్ గౌడ్, బూడిద రవీందర్ గౌడ్, బూడిద శివ కోటి గౌడ్, ఆరెల్లి హరికిషన్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ లు ఆరెల్లి వేణు గౌడ్, బోడిగే వినయ్ గౌడ్,మాజీ ఎంపీపీ మోతె పద్మ నాబరెడ్డి, మాజీ జెడ్పి టీ సి కోమాండ్ల గోపాల్ రెడ్డి, ఎంపిటీసీ వీరన్న నాయక్, మాజీ పిఏసిఎస్ చైర్మన్ దుపాటి ఆనంద్ గౌడ్,యువజన నాయకులు బోడిగే క్రాంతి గౌడ్, కుమార్ గౌడ్, రాకేష్ గౌడ్, రంజిత్ గౌడ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన .

సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీని సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. అలాగే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేపట్టి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసిల్దార్ వనజా రెడ్డి, విద్యుత్ ఏఈ మనోహర్,ఆర్ఐ తిరుపతి,పంచాయతీ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు..

కమిషనర్ ఎన్.మౌర్య..

తిరుపతి(నేటి ధాత్రి)మే12:

 

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా ఐదు మంది తమ సమస్యలు తెలుపగా, 23 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మునిసిపల్ పార్క్ వెనుక ప్రాంతంలో చెత్త వాహనం సక్రమంగా వచ్చేలా చూడాలని, పూల మార్కెట్, సున్నపు వీధిలో ఆక్రమణలు తొలగించాలని, రాజీవ్ నగర్ లోని మసీదు వద్ద నీటి వసతి కల్పించి, మొక్కలు నాటించాలని, చేపల మార్కెట్ వద్ద శుభ్రంగా ఉంచాలని, కొంకచెన్నాయ గుంటలో అక్రమంగా వేసిన యు డి ఎస్ తొలగించాలని, వరదరాజ నగర్ పాచిగుంట వద్ద సక్రమంగా నీరు రావడం లేదని, గతంలో ఇంటికోసం డబ్బులు కట్టామని ఇళ్ళైనా, డబ్బులు ఇప్పించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ మహాపాత్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, డి.ఈ.లు, ఏసిపి లు, తదితరులు ఉన్నారు.

పద్మశాలి శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం .!

అఖిలభారత పద్మశాలి సంఘం శాశ్వత సభ్యత్వా ల నమోదు కార్యక్రమం

జై మార్కండేయ జై జై మార్కండేయ

జై పద్మశాలి జై జై పద్మశాలి

శాయంపేట నేటిధాత్రి:

 

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని చేనేత సహకార సంఘం గ్రామ ఉపాధ్యక్షుడు తుమ్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘం నందు కార్మికులందరికీ నూతన శాశ్వత సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది.

Registration

భవిష్య త్తులో పద్మశాలీలందరూ ఏకమై అఖిలభారత పద్మశాలి సంఘం ఎదుగుదలకు తోడ్పాటు చేసి భవిష్యత్తులో పద్మశాలీల అందరికీ సమన్యా యం జరిగే విధంగా కార్యవర్గం అందరం కృషి చేస్తారు. ఈ కార్యక్ర మంలో శాయంపేట మాజీ సర్పంచ్ వలుపదాసు చంద్రమౌళి ,చేనేత సహకార సంఘం డైరెక్టర్ బూరలక్ష్మీ, నారాయణ ,నాయకులు, కందగట్ల గోపి తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘ సభ్యత నమోదు.

పద్మశాలి సంఘ సభ్యత నమోదు

మందమర్రి నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మార్కెట్ ప్రాంతంలో గల పద్మశాలి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. గత అధ్యక్ష పదవి కాలం ముగిసిన సందర్భంగా మరల అధ్యక్ష ఎన్నికల కొరకై ప్రణాళిక సిద్ధం చేయుట కొరకు పద్మశాలి కుల బాంధవుల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అడక్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుత అడగ్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ ప్రాంతంలోని అన్ని వార్డులలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ ఏరియాలోనీ వ్యాపార సముదాయాలలో గల పద్మశాలి కుల బాంధవులను కలిసి వారి యొక్క సభ్యత్వ నమోదును కమిటీ సభ్యులు చేపట్టారు. కమిటీ సభ్యులు పిట్టల సుధాకర్, బత్తుల సతీష్ బాబు మాట్లాడుతూ కుల సభ్యులు ఎవరైనా ఇంకా సభ్యత్వ నమోదు చేసుకోనట్లయితే మార్కెట్ ప్రాంతంలో గల కళ్యాణ్ సూపర్ మార్కెట్ వద్ద నమోదు చేసుకోగలరనీ తెలిపారు. అధ్యక్ష పదవి ఎన్నిక కొరకు తేదీ త్వరలో ఖరారు చేస్తామని, ఈలోగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ముత్యాల మహేష్ పార్థివదేహానికి పూలమాలవేసి.!

ముత్యాల మహేష్ పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన…ఎఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు.

కాంగ్రెస్ పార్టీ కట్ర్యాల గ్రామశాఖ అధ్యక్షులు బండారి సతీష్ చేసిన ఆర్థిక సహాయాన్ని మహేష్ కుటుంబ సభ్యులకు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

వర్దన్నపేట (నేటిదాత్రి ):

ఈ రోజు…వర్ధన్నపేట మండలం, కట్ర్యాల గ్రామానికి చెందిన *గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్(ట్రాక్టర్ డ్రైవర్) ముత్యాల మహేష్ అనారోగ్యముతో నిన్న తెల్లవారుజామున మరణించినందున వర్ధన్నపేట AMC చైర్మన్ నరుకుడు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు కట్ర్యాలలోని వారి నివాసం వద్ద మహేష్ పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించి మహేష్ భార్య,పిల్లలను కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కట్ర్యాల గ్రామశాఖ అధ్యక్షులు బండారి సతీష్ మానవతా హృదయంతో చేసిన రూ.2000/- ల ఆర్థిక సహాయాన్ని ఏఏంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ జిల్లా కార్యదర్శి గజ్జల సదయ్య, మాజీ ఉప సర్పంచ్ & మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండి అక్బర్,కాంగ్రెస్ పార్టీ మండల మహిళా నాయకురాలు తీగల సునీత గౌడ్,MD రషీద్ ,గార్లు మహేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.మహేష్ చనిపోవడంతో కుటుంబ యజమానిని కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయినందున నిస్సహాయ స్థితిలో ఉన్న వారి కుటుంబ పరిస్థితులను ఎంఎల్ఏ నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా.
మానవతా హృదయంతో స్పందించిన ఎమ్మెల్యే చనిపోయిన మహేష్ కుటుంబానికి ఏళ్లవెళాల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని తెలిపారు.ఈకార్యక్రమములోకాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు బండారి సతీష్ గౌడ్,మాజీ ఉప సర్పంచ్& కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు ఎండీ అక్బర్,కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ వరంగల్ జిల్లా కార్యదర్శి గజ్జెల సదయ్య,సీనియర్ నాయకులు నాం పెళ్లి రవీందర్,మహిళా మండల నాయకురాలు తీగల సునీత గౌడ్, ఎండి రషీద్ , ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కొండేటి మధుకర్. ఇ రుకు శ్రీధర్ లు పాల్గొన్నారు.

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి.

ఉపాధి హామీ మహిళ కూలీ మృతి….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రాయిపల్లి డి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మాణిక్యమ్మ (62) అనే ఉపాధి హామీ మహిళ కూలీ సోమవారం మధ్యాహ్నం పని స్థలంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని సర్పంచ్ ప్రతినిధి విజయ కుమార్ తెలిపారు. సంబంధితశాఖ అధికారులు, సిబ్బంది మృతురాలి కుటుంబాన్ని పరామార్శించారని విజయ కుమార్ వివరించారు. సంబంధిత శాఖ మండల స్థాయి అధికారులు మృతురాలి అంత్యక్రియలకు కొంత నగదు ఆర్థిక సహాయం అందచేసినట్లు గ్రామస్థులు తెలిపారు.

పట్టణాన్ని మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర .!

మందమర్రి పట్టణాన్ని నేరా రహితంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ చాబుత్ర

మందమర్రి నేటి ధాత్రి :

 

 

మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి. అర్థరాత్రి ఆవారా గా తిరుగుతున్న 30 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్
18 బైకులు,1 కారు, 5 సెల్ఫోన్లు స్వాధీనం
2 డ్రంకెన్ డ్రైవ్ కేస్ లు నమోదు 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు.

శనివారం అర్థరాత్రి మందమర్రి పట్టణం లో రావడం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపిఎస్, మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్ గార్ల ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ గారి పర్యవేక్షణలో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ముగ్గురు ఎస్ఐలు 25 మంది సిబ్బంది తో పెట్రోలింగ్ పార్టీలుగా మందమర్రి పట్టణాన్ని అష్టదిగ్బంధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లపై అర్ధరాత్రి ఆవారాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకొని మందమర్రి సిఐ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే వారి వద్ద నుండి 18 బైకులు, 1 కారు, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.అలాగే తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై డీడీ కేస్ లు నమోదు చేయడం జరిగింది.

Operation

 

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ….
అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాళ్లకు ఇబ్బందులకు గురిచేసిన, తాగి వాహనాలపై తిరుగుతూ . రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తున్న, గొడవలు సృష్టిస్తున్న మరియు అనుమానస్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఇక మీద నుండి ఈ డ్రైవ్ క్రమ తప్పకుండా నిర్వహిస్తామని హెచ్చరించారు.

అలాగే ఇప్పుడు జరుగుతున్న నేరాలకు ముఖ్యంగా మైనర్లు మరియు 30 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లే అధికంగా ఉంటున్నారని, వీళ్లకు కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొచ్చినట్లైతే చాలా నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలియజేశారు.

మందమర్రి పట్టణాన్ని నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని దీనికి పట్టణవాసులు సహకరించాలని కోరడం జరిగింది.

ఆపరేషన్ చాబుత్ర కార్యక్రమం లో మందమర్రి, రామకృష్ణాపూర్, కాశిపేట ఎస్సైలు సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

అక్రమ వసూళ్లకు ప్రోత్సాహమే లక్ష్యంగా టిజిఎండిసి.

38 రోజుల్లో 24 అక్రమ వసూళ్ల సాక్షాలతో కథనాలు.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

పక్క జిల్లా ఇసుక క్వారీల హద్దులు దాటి ఇసుక తరలిస్తున్న, టీజీఎండిసి నిశ్శబ్దం.

టీజీఎండిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

అక్రమ వసూళ్లకు ప్రభుత్వం కూడా పరోక్షంగా మద్దతు పలుకుతుందా.!?

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

మహాదేవపూర్- నేటి ధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీ మహాదేవపూర్ మండల గోదావరి పరివాహక ప్రాంతానికి అనుకొని నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ ల్లో అక్రమ వసూళ్లకు టీజీఎండిసి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల రూపాయల సొమ్మును కాంట్రాక్టర్లకు దూచిపెట్టడం జరుగుతుంది. అక్రమ వసూళ్లే కాదు అక్రమ ఇసుక తవ్వకాలను కూడా టీజీఎండిసి సహకరించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ల ఇష్ట రాజ్యాన్ని టీజీఎండిసి అధికారులు కాంట్రాక్టర్ల చేతిలో కీలుబొమ్మలుగా మారి కాంట్రాక్టర్లు చెప్పింది వేగంగా వ్యవహరించడం జరుగుతుంది. అక్రమ ఇసుక రవాణా వసూళ్ల సాక్షాలు, వందల సంఖ్యలో తెరపైకి తీసుకువచ్చిన టీజీఎండిసి, చర్యల కు బదులు కాంట్రాక్టర్లతో హోటల్లో సెటిల్మెంట్ చేసుకోవడం, ఆనవాయితీగా మరణంతో పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే క్వారీలు దోపిడీలో మరింత ముందుకు దూసుకు వెళ్లడం జరుగుతుంది. టీజీఎండిసి ఉన్నత అధికారి ఇసుక రీచులను సందర్శించి అక్రమాలు అక్రమ ఇసుక రవాణాకు కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ, ఇసుక రీచ్ లో అక్రమాలు బయటపడుతున్న, ఆ ఉన్నత అధికారి ఎందుకు స్పందించడం లేదు అనేది సందిగ్ధంగా మారింది.

చర్యలకు బదులు సెటిల్మెంట్లు చేసుకుంటున్న అధికారులు.

మండలంలో నిర్వహించబడుతున్న ఇసుక రీచులకు సంబంధించి అక్రమ వసూళ్ల వ్యవహారం, అదుపు ఇసుక రవాణా చేస్తున్న లారీల వివరాలు, కాంటాల వద్ద అదునపు ఇసుక వసూళ్లు, సాక్షాలతో “నేటి ధాత్రి” గత నెల నాలుగవ తేదీ నుండి నేటి వరకు, 34 కథనాలు అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తున్న సాక్షాలతో ప్రచురించడం జరిగింది. కానీ అధికారులు చర్యలకు బదులు, హోటళ్లలో కాంట్రాక్టర్లను పిలుచుకొని సెటిల్మెంట్ చేసుకుని వెళ్లడం జరగడంతో, రెచ్చిపోయిన కాంట్రాక్టర్లు వసూళ్ల పరంపర అక్రమంగా అదునపు ఇసుక రవాణా కు హద్దు అదుపు లేకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించడం ఆశ్చర్యం. అంతేకాకుండా పక్క జిల్లా కు కేటాయించిన ఏర్రాయిపేట ఇసుక క్వారీ, గోదావరిలో అక్రమంగా రోడ్డు నిర్మించి, కుంట్లం గ్రామ సరిహద్దు వద్ద తవ్వకాలు జరిపి ఇసుకను తరలిస్తుంటే, కాంట్రాక్టర్లతో టీజీఎండిసి అధికారుల చీకటి ఒప్పందం నేటి వరకు ఏర్రాయిపేట ఇసుక కాంట్రాక్టర్, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రోడ్డును నిర్మించి భారీ తవ్వకాలతో ఇసుకను రవాణా చేయడం జరుగుతుంది అంటే, టీజీఎండిసి అధికారులు ఎంతవరకు అవినీతి మత్తులో ఉన్నారు అర్థమవుతుంది.

Encourage

 

అదనపు ఇసుక అక్రమ వసూళ్లు జోరులో కాంట్రాక్టర్లు.

తాజాగా పలుకుల తొమ్మిది, ఉసుక్పల్లి మహదేవపూర్ ఒకటి, పలుగుల ఎనిమిది, పెద్ద మొత్తంలో ఇసుక రవాణా చేసే ఈ మూడు ఇసుక క్వారీల అక్రమ వసూళ్ల అరాచకాలు హద్దు లేకుండా పోయింది. టీజీఎండిసి సిబ్బంది, కాంట్రాక్టర్ సూపర్వైజర్లు కలిసి, పలుగుల ఎనిమిది ఇసుక రీచ్ లో 1400, పలుగుల తొమ్మిది 1100, అలాగే పుసుక్కుపల్లి మహదేవ్పూర్ ఒకటవ నంబర్ ఇసుక రీచ్ లో 1100 రూపాయల చొప్పున ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది, అక్రమ వసూళ్ల వ్యవహారంతో పాటు, లోడింగ్ వద్ద 200 అదనపు రూపాల వసూలు, కాంట్రా వద్ద పాసింగ్ పై అదనపు ఇసుక మరో 500 రూపాయల చొప్పున వసూళ్లు చేస్తున్న సాక్షాలతో ప్రచురించిన, టీజీఎండిసి మాత్రం సెటిల్మెంట్ చేసుకొని అక్రమాల వైపు కన్నెత్తి చూడడం లేదు. తాజాగా పలుకుల తొమ్మిది, మహదేవపూర్ పుసుపుపల్లి ఒకటి, ప్రస్తుతం వందల సంఖ్యలో లారీల్లో ఇసుక రవాణా చేస్తూ పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లతో లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటుంది. కానీ వీటిపై చర్యలకు టి జి ఎం డి సి, ఏ అధికారి కూడా సాహసం చేయడం లేదు.

 

టీజీజిడిసి అక్రమ వసూళ్లలో సూత్రధారిగా వ్యవహరిస్తే కొత్త ఇసుక పాలసీ ఏలా అమలవుతుంది.

ఇసుక రీచ్ లో అక్రమాలపై పరోక్షంగా ప్రత్యక్షంగా టీజీఎండిసి అధికారులు లంచాలకు మత్తులో ఇసుక రీచుల్లో అక్రమాలు కనబడకుండా పోయింది. కాంట్రాక్టర్లు మాత్రం పెద్ద మొత్తంలో లంచాలు అందించడం జరిగిందని తమకు అడిగే వారు లేరు అనుకొని అక్రమ వసూళ్ల అరాచకాలను మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇప్పటికె మండలంలో అనేక రీచ్లు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ల వెసులుబాటు కొరకు టీజిఎండిసి కాంట్రాక్టర్లు చెప్పే విధంగా తల ఊపడంతో మండలంలో ఇసుక రీచులు ప్రారంభం కావడం లేదు. అంతేకాకుండా ఇప్పటికీ నెలల తరబడి ఇసుక స్టార్ చేసుకొని ఉన్న రీచులు కూడా లోడింగ్ ప్రక్రియ ప్రారంభించపోకపోవడానికి టీజీఎండిసి చీకటి ఒప్పందమే ప్రధాన కారణం. అవినీతికి కేరాఫ్ టీజిఎండిసీ, గా శాఖ మారడంతో, నూతన ఇసుక పాలసీ అక్రమ ఇసుక రవాణా అక్రమ వసూళ్ల వ్యవహారంపై, కొరడా విధించడం జరుగుతుందని ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. అధికారుల ప్రవర్తన మార్చుకోవాలని ప్రభుత్వం డేట్ లైన్ కూడా డొంట్ కేర్ అనే విధంగా వ్యవహారిసున్న టీజీఎండిసి వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాక్షాలతో ఇసుక రచుల్లో అక్రమాలను తెరపైకి వస్తున్న పక్షం రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఇసుక రీచ్ లో అక్రమాలకు పరోక్షంగా సహకరిస్తుందన్నా వాదనలు బలమవుతున్నాయి.

టీజీఎండిసి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండి ఎక్కడ.!?

ఇసుక రీచ్ లు ప్రారంభం కాకముందే,టిజీ ఎం డి సి ఉన్నత అధికారి మేనేజింగ్ డైరెక్టర్ మండలంలోని పలు ఇసుక రీచ్ లను సందర్శించి అక్రమాలు అదనపు ఇసుక ఇలాంటి వ్యవహారాన్ని ఉపేక్షించమని బల్ల గుద్ది చెప్పిన ఎండి, పక్షం రోజులుగా టిజిఎండిసి సిబ్బంది వసూళ్ల పర్వాన్ని, సాక్షాలతో తెరపైకి తీసుకువచ్చిన, అదనపు వసూళ్ల వ్యవహారం ఇసుక కాంట్రాక్టర్ల సూపర్వైజర్లు దౌర్జన్యంగా అదనపు వసూళ్ల వ్యవహారాన్ని కూడా సాక్షాలతో తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. అంతేకాకుండా పక్క జిల్లాల ఇసుక రీచులు కూడా హద్దులు దాటి అక్రమ తవ్వకాలు, లాంటి వాటిని కూడా సాక్షాలతో ప్రచురించినప్పటికీ టీజీఎండిసి మేనేజింగ్ డైరెక్టర్ ఎందుకు నిశ్శబ్దాన్ని వహిస్తున్నారు, మరోవైపు అధికారులు కాంట్రాక్టర్లకు హోటల్లో పిలుచుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారు అని స్పష్టంగా ప్రచురించడం జరిగినప్పటికీ కూడా ఎండి చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణమేమిటి, ఇసుక రీచుల్లో కాంట్రాక్టర్లు టీజీఎండిసి సిబ్బంది అధికారుల ప్రోత్సాహంతో దోపిడి రాజ్యాన్ని సృష్టించి అక్రమ వసూళ్లు అదనపు ఇసుక రవాణా చేస్తుంటే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి ఎక్కడ అని, ప్రజలు ప్రశ్నించక తప్పడం లేదు. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్, అలాగే మేనేజింగ్ డైరెక్టర్ టి జి ఎం డి సి తక్షణమే, చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

కలెక్టర్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి .!

కలెక్టర్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు ఆదేశాలు.

వనపర్తి నేటిధాత్రి :

 

 

సోమవారం కలెక్టర్ కార్యలయముల నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనప కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు కలెక్టర్ ఆదర్శ్ సురభి స్వీకరించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుదారులకు తగిన సమాచారం ఇచ్చే బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ ప్రజావాణి, మంత్రి ద్వారా వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజావాణిలో మొత్తం 66 ఫిర్యాదులు వచ్చాయి. పి డి ఆర్ డి ఏ ఉమాదేవి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

కడుపు నొప్పని వస్తే, కాటికి పంపిన బంధన్ హాస్పిటల్ వైద్యం.

బంధన్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం బలి.

హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వరంగల్ కి చెందిన మహేందర్ అనే వ్యక్తి మృతి.

అనుభవం లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్లే మహేందర్ రావు మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువుల ఆందోళన.

హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించని పోలీసులు. మృతుడి బంధువులు, పలువురిని హాస్పిటల్ లోనే ఉంచి తాళాలేసిన యాజమాన్యం.

మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు, న్యాయం చేయాలని బంధువుల డిమాండ్.

గతంలో కూడా బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించిన వైనం..

గతంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఉంటే ఈ మృతి జరిగేది కాదంటూ పలువురి ఆవేదన

చోద్యం చూస్తున్న “వైద్యాధికారులు”.! ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించేనా..?

*బంధన్ హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న హనుమకొండ వైద్యశాఖ అధికారులు?.

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? అపెండిక్స్ ఆపరేషన్ లు సైతం చేయరాని ఇలాంటి హాస్పటల్ ను సీజ్ చేయాలని బాధితుల డిమాండ్.

“బంధన్ ఆసుపత్రి” వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు?

నలుగురు డాక్టర్లు కలిసి కోట్లు పెట్టి హాస్పిటల్ లు కట్టడం.., పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా వీళ్ళ టార్గెట్?

నాణ్యమైన వైద్యం అందివ్వడం చేతకాదా.. డబ్బుల సంపాదనే వీళ్ళ ప్రధాన ఎజెండా?

వరంగల్ నేటిధాత్రి:

అమ్మ జన్మనిస్తే.. ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దాని నుంచి కాపాడి.. పునర్జన్మనిచ్చే దేవుళ్లుగా వైద్యులను ఆరాధిస్తుంటారు. అలా గొప్పగా కీర్తించబడే పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందినవారే హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి వైద్యులు అని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు, వరంగల్ నగరం రంగశాయిపేట కు చెందిన మహేందర్ రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని అందుబాటులో ఉన్న అనుభవం లేని డి ఫార్మా,, బిఏఎంఎస్ చేసిన డాక్టర్లు పరిశీలించి ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యక్తి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రావుకు గతంలోనే గుండెకు సంబంధించి వైద్యం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని గుండె కు సంబంధించిన డాక్టర్ను పిలవండి అని కుటుంబ సభ్యులు తెలిపిన కానీ, బంధన్ హాస్పిటల్ వాళ్ళు ఈ రోజు ఆదివారం గుండెకు సంబంధించి డాక్టర్ రారు, మేము చూసుకుంటాం అని, కనీసం జనరల్ అనస్థీషియా డాక్టర్ లేకుండానే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపునొప్పి, ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తి హాస్పిటల్ కు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి, డిశ్చార్జ్ కూడా రాసిన డాక్టర్లు, మరి ఏమైందో, ఏమో కానీ అచ్చిరాని వైద్యం చేసి మంచిగున్న వ్యక్తిని నిర్లక్ష్యంగా ప్రాణాలు బలిగొన్నారు అని మృతుడి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. పేషెంట్ కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు నడుచుకుంటూ బయటికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు బంధువులు.

hospital

పేషంట్ కొరకు కార్డియాలజిస్ట్ డాక్టర్ ను పిలవండి, లేదంటే మేము వేరే హాస్పటల్ కు వెళ్తాము అని, అంబులెన్స్ కూడా తెచ్చుకొని, హాస్పిటల్ దగ్గర దాదాపుగా మూడు గంటలు వేచి ఉన్నా కానీ, సదరు బంధన్ డాక్టర్లు నిర్లక్ష్యంతో అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం ద్వారా వ్యక్తి మృతి చెందిన సంఘటన. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసి, తమ తండ్రి మృతికి కారణం అయ్యారు బంధన్ హాస్పిటల్ డాక్టర్లు అని, ఈ హాస్పిటల్ లో ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరని, అనుభవం లేని డాక్టర్లు మాత్రమే వైద్యం చేస్తున్నారనీ నడుచుకుంటూ వచ్చిన మా నాన్నని నిర్లక్ష్యంగా వైద్యం చేసి మరణానికి కారకులయ్యారు అని మృతుడి కుమార్తెలు కన్నీరు పెట్టుకున్నారు. మహేందర్ రావు మృతి విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేశారు. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి బంధువులతో, హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడారు. బంధన్ హాస్పిటల్ బడా బాబులది కావడం దీని వెనుక రాజకీయ నాయకుల అండ ఉండడంతో, సమస్యను మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి, విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసిన తీరు ఆశ్చర్యం. ఏది ఏమైనా కానీ బంధం హాస్పిటల్ లో సరియైన డాక్టర్లు లేకుండానే వైద్యం చేస్తున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అనుభవం లేని డాక్టర్లు అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయిన ఘటన మరువకముందే, కడుపు నొప్పితో బాధపడుతున్న మరో వ్యక్తి ఈ హాస్పిటల్ లో జాయిన్ అయి, మృతి చెందిన వార్త నగరంలో కలకలం రేపింది. గతంలోనే అపెండిక్స్ ఫెయిల్యూర్ కు సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యం వలన తనకు అన్యాయం జరిగిందని ఒక జర్నలిస్ట్ హనుమకొండ వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా, సదరు వైద్య శాఖ అధికారులు కానీ, హనుమకొండ డిఎంహెచ్ఓ సైతం స్పందించకుండా, హాస్పిటల్ పై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. అప్పుడే వాళ్లు స్పందించి హాస్పిటల్ లో వైద్యులు ఎవరున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.

గతంలో ఒక జర్నలిస్టుకు చేసిన అపెండిక్స్ ఆపరేషన్ సైతం ఫెయిల్యూర్

Hospital

బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలల పాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు జర్నలిస్టు కృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది 21 జూలైన అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జర్నలిస్ట్ కృష్ణకు.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సుమారు నాలుగు గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.  ఒకరోజు తర్వాత హాస్పిటల్ లో వైద్యం సరిగా లేకపోవడం గ్రహించిన కుటుంబ సభ్యులు.. వైద్యులను అడగగా.. ఎవరూ స్పందించకపోవడంతో.. ఆపరేషన్ వికటించిందని భావించి..జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే హైదరాబాద్ బేగంపేట మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న రోగిని చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ ఎక్కువ స్థాయికి చేరుకుందని అబ్జర్వేషన్ లో ఉంచి మరో ఆపరేషన్ చేశారు. దానికి పూర్తిగా అయిన ఖర్చు రూ.14 లక్షలు.. దానికి తోడు ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఐతే అంత పెద్దగా కావడానికి కారణం బంధన్ హాస్పటల్ లో జర్నలిస్టు కృష్ణకు 4 గంటల పాటు చేసిన వైద్యంలో

Hospital

జరిగిన తప్పిదమే కారణం అని బాధితుడు కృష్ణ ఆరోపించారు. అయితే బాధితుడు సర్జరీ చేసే సమయంలో రికార్డు అయిన వీడియో ఇవ్వమని పలుమార్లు అడిగిన కూడా బంధన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ దాట వేయడంతో బాధితుడు తనపై చాలా ప్రయోగాలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమాజంలో జరిగే మంచి చెడును విశ్లేషించే పాత్రికేయుడి నైన తనకు సదరు ఆసుపత్రిలో అన్యాయం జరగగా.., ఇక సామాన్యుడి సంగతి ఏమిటని జర్నలిస్ట్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంధన్ ఆసుపత్రి వెనక ఉన్న రాజకీయ అండదండలను చూసి బెదరకుండా ఆసుపత్రిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి .

ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేయండి

మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట, నేటి ధాత్రి:

 

 

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలో ని నస్కల్, నంద గోకుల్, రాంపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని తెలిపారు లారీలు, హమాలీలు, టార్పినల్ కొరత లేకుండా చూడాలన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీలత, వి ఏ లు మంగ, వాణి, రైతులు తదితరులు పాల్గొన్నారు

గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్.!

తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో కౌన్సిలింగ్ కోసం దరఖాస్తు

పత్రికా ప్రకటన

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి) :

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఇంటర్ లో
2005- 26 . విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు తెలంగాణా గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల, ఇందిరమ్మ కాలనీ (గా). పం). సిరిసిల్ల లో ST బాలికల నుండి ధరఖాస్తులు ఇహ్వానిస్తున్నామని ప్రాంతయ సమ్వన్వయ అధికారి D. S. వెంకన్న ఒక ప్రకటనలో
తెలియజేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు కళాశాల నందు మే 16న నిర్వహించే కౌన్సిలింగ్ అన్ని ఓరిజినల్ (TC, బోనాఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, రెసిడెన్సి, డేట్అఫ్ బర్త్, మొదలగునవి మొగునని దృవీకరణ పత్రంలో పాటు, ఒక సెట్ జిరాక్స్ తీసుకొని వచ్చి అడ్మిషన్లు పొందవచ్చని, కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ : 9032170654, 8333925362

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే.

రజతోత్సవ సభను విజయవంతం చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్దికి సన్మానం.

ఉద్యమ సారధిని సన్మానించిన మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి  నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి రథసారధి కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ వెన్నుదన్నుగా నిలిచి తెలంగాణ ప్రజల గొంతును కేంద్ర ప్రభుత్వాలపై పోరాడిన వ్యక్తి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని ఆయన అన్నారు. ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా అవతరించి దేశ రాజకీయాలను శాసించే శక్తిగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ 25వ వసంతాల రజతోత్సవ సభను తన భుజస్కందాలపై మోస్తూ సభను విజయవంతం చేయడంలో తన మార్కు చూపించిన పెద్దికి మండల పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కర్ల శ్రీనివాస్ గౌడ్, నాయకులు గందే శ్రీనివాసులు గుప్తా, మామిండ్ల మోహన్ రెడ్డి, ఊరటి అమరేందర్ రెడ్డి, భగీరథ, రాజు తదితరులు పాల్గొన్నారు.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో  కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను సానుకూలంగా స్పందించారు. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇప్పపువ్వు లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు.

ఇప్పపువ్వు లడ్డుతో ఆరోగ్య ప్రయోజనాలు

గంగారం నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ . గంగారం మండలాల్లో సహజ సిద్ధంగా దొరికే ఇప్పపువ్వుతో
కొంతమంది ఆదివాసీ గిరిజనులు సేకరించి అందులో ఇప్పపువ్వు. బెల్లం. నువ్వులు. పల్లీలు. యాలకుల పొడి కలిపి లడ్డులుగా తయారు చేస్తున్నారు గంగారం మండలంలోని మహదేవుని గూడెం గ్రామం లో మద్దెల పద్మ కుటుంబ సభ్యులు ఇప్పపువ్వు లడ్డు తయారు చేసి విక్రయిస్తున్నారు
ఇప్ప పువ్వు లడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పపువ్వు లడ్డు తినడం వల్ల రక్తహీనత ఉన్న వారికి దాదాపు 45 రోజులలో శరీరంలో రక్తం శాతం పెంచడంతో పాటు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుందని
ఇది జాయింట్ల నొప్పులు, మోకాలి నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది.

Health benefits

అంతేకాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది మరియు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుంది మహిళల్లో రక్తహీనత తగ్గిస్తుంది. కొలెస్ట్రాలను తగ్గించి రోగనిరోధక శక్తినీ పెంచుతుంది
ఇప్పటికీ కొంతమంది గిరిజనులు ఇప్పగింజలు ఏరి తీసుకువచ్చి నూనె తయారు చేసి వంటల్లో వాడుతున్నారు.. ప్రభుత్వం స్పందించి సంబంధిత యంత్రాలు ఇప్పించి ఆదివాసీ గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని పలువురు ప్రభుత్వం న్ని వేడుకుంటున్నారు….

సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ.!

కుర్మ సురేందర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ కుర్మ సురేందర్, పార్టీ నాయకులు కుర్మ సుగుణాకర్ ల యొక్క నాన్న కుర్మ రామయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని అందించారు.కుటుంబానికి అండగా ఉంటామని,అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.పరామర్శ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పలిగిరి కనకరాజు, పల్లె దినేష్, కనకం వెంకటేశ్వర్లు, వెంకటస్వామి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం .

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

రామడుగు, నేటిధాత్రి:

 

 

ఇరవై తోమ్మిది సం.ల క్రితం పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఒకే వేదికపై కలిసి చిన్నప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1995-96లో ఎస్ఎస్సి చదివిన విద్యార్థులు చదువుకున్న పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈకార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి, ఒకేషనల్ ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, రాంబ్రహ్మంలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన విద్యార్థులు వారిని ఘనంగా శాలువాతో సన్మానించి వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు తమ జీవనశైలిని, పాఠశాలలో చదువుకున్న జ్ఞాపకాలను, అనుభవాలను ఒక్కొక్కటిగా గురువుల ముందుంచారు. ఈకార్యక్రమంలో బొమ్మరవేణి తిరుపతి, ఆడెపు మనోజ్ కుమార్, శ్రీనివాస్, సంతోష్, మునిందర్, శ్వేతా, సుజాత, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి .

సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి

సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట . గ్రామంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్ అధ్యక్షతన మండల మహాసభ జరిగింది. ఈమండల మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెంకటస్వామి హాజరై మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సిపిఐ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ అభ్యర్థులుగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని, అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కేంద్రంలో, రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్న వారిని హామీలను అమలు పరుచాలని సిపిఐ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలని ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకాన్ని కలిగించాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్బవించి వంద సంవత్సరాలు అవుతుందని, మార్కిసిజం, లేనినిజం సిద్ధాంతాలతో సమ సమాజ స్థాపనే లక్ష్యంగా దోపిడీ లేని సమాజం కోసం అంతరాలు లేని వ్యవస్థ కోసం దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ సిపిఐ పార్టీ అని నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షకుల సమస్యలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతూ హక్కుల సాధన కోసం, సమస్యల పరిష్కారం పోరాడుతున్న ఏకైక పార్టీ అని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి కేవలం కార్పొరేట్ బహుళజాతి సంస్థలకు సంపన్న వర్గాలకు అనూకూల నిర్ణయాలు చేస్తూ దేశ సంపదను కోళ్లగొడుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆలస్యం అవుతుందని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, పెన్షన్స్ పెంపు, రైతుల ఋణమాఫీ తదితర హామీలను వెంటనే నేరవేర్చాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని వెంకటస్వామి హెచ్చరించారు. ఈసమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి గోడిశాల తిరుపతి గౌడ్, ఉమ్మెంతుల రవీందర్ రెడ్డి, మండల నాయకులు ఎగుర్ల మల్లేశం, శంకరయ్య, లక్ష్మి, నర్సయ్య, ఐలయ్య, రాజేష్, అజీమ్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ సమావేశం.!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని మీనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరుగుతింది అని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మరియు రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మరియు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.అని కావున మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు జడ్పిటిసిలు , ఎంపీపీలు , సర్పంచులు , ఎంపీటీసీలు , వార్డ్ మెంబర్స్ జిల్లాస్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ సెల్ విభాగ నాయకులు కార్యకర్తలు మండలంలోని బూత్ ఎన్రోలర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి కోరినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version