బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా కవర్లకు బదులు కాగితపు సంచులను వినియోగించుకోవాలని ,ప్రకృతి పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతను నెరవేర్చాలన్నారు.మనం వాడే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి చాలా హానికరం. అంతేగాక నీరు,భూమి,వాయు కాలుష్యానికి దోహదకారిగా పనిచేస్తాయని తెలిపారు.ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఈ రోజునుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం ఆపి పేపర్ బ్యాగులను వాడి పర్యావరణాన్ని కాపాడుతామని ఎన్.సి.సి క్యాడెట్లచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్.సి.సి క్యాడెట్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను తెలుపుతూ ఆకట్టుకునేలా చార్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ ,నాగరాజు, రాజేష్ ,రవీందర్ రెడ్డి భాగ్యలక్ష్మి , రాజేందర్ ,పూర్ణిమ విజయ్, గౌతమ్ క్రాంతి కుమార్, రామ్మూర్తి, వ్యాయామ ఉపాధ్యాయుడు భవాని చంద్ పాల్గొన్నారు.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

కాజూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం.

చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 11:

చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని కాజూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో కలిసి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగర మేయర్ కుమారి ఆముద పుంగనూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ చల్లా బాబు చూడా చైర్ పర్సన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కాజూరుకి విచ్చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి పుష్పాలు, గజమాలతో కాజూరు ప్రాంత కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
ఘన స్వాగతం పలికారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను పంచుతూ ప్రజా సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కాజూరు ప్రజలకు వారు
వివరించారు,
ఇది మంచి ప్రభుత్వం అంటూ
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రశంసించి మళ్లీ మాకు కూటమి ప్రభుత్వమే కావాలంటూ తమ ఆకాంక్షను కాజూరు ప్రాంత ప్రజలు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు  తెలియజేసారు.

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్.

సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకం

 

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ , 4 ఫిబ్రవరి 2024 రోజున కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగనన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం నాలుగు ఫిబ్రవరి 2025న బీసీలకు విద్యా ,ఉద్యోగ ,స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నిన్నటి రోజున తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికల పోతామని దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిర్ణయించడం పట్ల పర్ష హన్మాండ్లు హర్షం వ్యక్తంచేశారు,సామాజిక న్యాయాన్ని ఇచ్చిన మాట మేరకు ఆ మాటను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఎంత చేసినా తక్కువే నని పర్ష హన్మాండ్లు అన్నారు ,గత మూడు దశాబ్దాలుగా గత పాలకులను ఎన్ని సార్లు డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ,కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కులుగా బీసీల కొరకు మొండి పట్టు పట్టి అమలు చేయడం చారిత్రాత్మకమనీ పర్ష హన్మాండ్లు అన్నారు,ఈ ప్రభుత్వానికి బీసీలు అండగా ఉంటారని అదేవిధంగా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు,కోర్టు తీర్పు మేరకు నెల రోజులలో బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని అదేవిధంగా మూడు నెలలుగా ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఆత్రుతగా చూస్తున్న సమయంలో క్యాబినెట్ బీసీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలుగా నేను గర్వపడుతున్నామని కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు ,వాడవాడనా గ్రామ గ్రామాన పట్టణాల అదేవిధంగా నగరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి చారిత్రాత్మక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకోవాలని బీసీ నాయకులకు ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షాన నిలుస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలుగా టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ లు ఇట్టి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు,ఎవరైనా రాజకీయ స్వార్థంతో బీసీలకు ఈ విషయమై వ్యతిరేకంగా చేసిన ఆ పార్టీలను ఎండగడతామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు , బిజెపి పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని అంటున్నదని కేంద్రంలో బీసీ కులగణన చేస్తానని చెప్పి మాట ఇచ్చిందని దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది కాబట్టి కేంద్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు, ఈ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం గా మేము ముందుంటామని సాధించుకొని తీరుతామని ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు తెలిపారు, ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేని మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, కోడం రవీందర్ ,అల్వాల మల్లేష్ ।ఇల్లంతకుంట తిరుపతి ,ఆంజనేయులు ,శ్రీకాంత్ ,బోయిని శ్రీనివాస్,తిరుపతి ,కుసుమ ప్రభాకర్,చిందం శ్రీధర్,దామోదర్ ,కొండయ్య, బుర్ర మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ప్రలోభాలకు లొంగి.. పట్టింపు లేమి…

ప్రలోభాలకు లొంగి.. పట్టింపు లేమి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్లో పరిశ్రమలు థర్మోకోల్, రెగ్జిన్, ఫైబర్ వంటి వ్యర్థాలను కాల్చివేస్తూ, భూగర్భజలాల్లో కలిపేస్తూ తీవ్ర వాయు, జల కాలుష్యానికి పాల్పడుతున్నాయని స్థానికులు వాపోయారు. కాలుష్యం కారణంగా ప్రజలు, మూగజీవాలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని, పరిశ్రమల యాజమాన్యాల ప్రలోభాలకు లొంగి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

డబుల్ బెడ్ రూమ్ ల వద్ద లబ్ధిదారులు.

డబుల్ బెడ్ రూమ్ ల వద్ద లబ్ధిదారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతి కే వద్ద డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు చేరుకున్నారు ఈ రోజు లబ్ధిదారులకు గృహాలు అందజేస్తున్న విషయం తెలుసుకున్న వారు అక్కడికి చేరుకోవడం వల్ల అధికారులు ఇవ్వకుండా వెనకు పంపినట్లు తెలిసింది.

ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే.

ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే

◆ 70 ఏళ్లుగా పూరిగుడిసెల్లోనే జీవనం కొనసాగింపు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గడిచిన 18 నెలల అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను విడుదల చేశారు. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేసిన ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడంతో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. వారి పక్షాన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పే నాయకులే లేకపోయారు. దీనికి నిదర్శనం మండల కేంద్రమైన మొగుడంపల్లి లోని వృద్ధురాని నీ ఉదాహరణగా తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితా ఎలా జరిగిందో అర్ధం అవుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే అవకాశం లేదు. ఫలితంగా పేదలు పేదలుగానే గుడిసెల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. 70 సంవత్సరాల వృద్ధు రాలుని పుట్టక ముందు నుంచి వారి తల్లిదండ్రులు సైతం అదే గుడిసెలో కాపురం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ స్థానిక నాయకుల పక్షపాతమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ మొగుడంపల్లి మండల కేంద్రమైన గుడుపల్లి కు మంజూరైన 35 ఇండ్లలో 18 రిటన్ పంపుతున్నారని దాంట్లో ఎవరికైనా బీదవారి అవసరం ఉన్నవారికి మంజూరు చేయాలని కోరారు. ఇండ్లలో అత్యధికంగా ఉన్న వారికే ఇండ్ల జాబితాలో పేర్లు వచ్చాయన్నారు. గుడుపల్లి గ్రామానికి చెందిన ఖైరున్ బీ, భర్త ఇబ్రహీం షా. వీరికి ఆరు గురు కుమారుడు ఐదు గురు కూతురు ఉన్నారని కానీ పూరి గుడిసెలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నాయకులకు, అధికారులకు మాత్రం బీద వారి ముసలి వయసు ఉండే చేయించే బాధ్యత పూరి గుడిసె కనిపించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి సైతం ఇల్లు ఇచ్చారు. కానీ అలాంటిది నిరుపేదకు -మాత్రం మొండి చేయి చూపించారు. ఇది కేవలం ఒక గుడుపల్లి గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ చెందిన నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అవినీతికి అడ్డా మారిన.నిమ్జ్‌ …..

అవినీతికి అడ్డా మారిన.నిమ్జ్‌ …..

◆ అడ్డాగా మారిన కార్యాలయం

◆ 24గంటల పాటు ఏసీబీ విచారణ

◆ అధికారులు ఇండ్లకు వెళ్లొద్దని ఆదేశం

◆ విలువైన డాక్యుమెంట్లు సీజ్

◆ అసైన్డ్ లబ్దిదారులకే పేచీ

◆ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్న ఏసీబీ

◆ పరిహారంకోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బాధితులు

Corruption

జహీరాబాద్ నేటి ధాత్రి:

తినమరిగిన అధికారులకు నిమ్జ్‌ కార్యాలయం అడ్డగా మారింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే కార్యాలయానికి సంబంధించిన ఓ లంచం వ్యవహారంలో న్యాల్కల్ ఆర్యని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఈ సంఘటనలో అధికారులు అప్రమత్తమై తప్పించుకున్నారు. ఎవరికివారుగా ఉన్నతాధికారులను కాకాపట్టి బదిలీపై వెళ్లిపోయారు. ఎలాగైనా పెద్దచేపను పట్టుకోవాలని ఆశించి భంగపడ్డ ఏసీబీ అధికారుల వ్యూహం ఇప్పటికి ఫలించింది. అనుకున్నట్టుగా నీమ్స్ పెద్ద తలకాయలు అందులో చిక్కిపో యాయి. భూముల నష్టపరిహారం వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు.

◆ అడ్డాగా మారిన కార్యాలయం

◆ విలువైన డాక్యుమెంట్లు సీజ్

◆ అసైన్డ్ లబ్దిదారులకే పేచీ

◆ ప్రభుత్వ భూమే కదా..!

◆ ఇస్తే తప్పేంటని బెదిరింపులు

Corruption

జహీరాబాద్: లంచాలు తినమరిగిన అధి కారులకు నిమ్స్ కార్యాలయం అడ్డగా మారింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే కార్యాలయానికి సంబంధించిన ఓ లంచం వ్యవహారంలో న్యాల్మల్ అర్బని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. తీగ లాగితే దొంక కదులుతుందని భావించిన అధికారు లకు అప్పట్లో నిరాశ మిగిలింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన అధికారులు తమ కాలికి బుద్ధిచెప్పి తప్పించుకున్నారు. ఎవరికివారుగా ఉన్నతాధికారు లను కాక పట్టి నిమ్జ్‌ కార్యాలయాన్ని వదిలి బదిలీపై వెళ్లిపోయారు. ఎలాగైనా పెద్దచేపను పట్టుకోవాలని కాశించి భంగపడ్డ ఏసీబీ అధికారుల వ్యూహం ఇప్పటికి ఫలించింది. అనుకున్నట్టుగా నిమ్జ్‌ పెద్ద తల కాయలు అందులో చిక్కిపోయాయి. భూముల నష్టప రిహారం వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటక టాల్లోకి పంపించారు. అందగొండి అధికారులు అప్ప టికప్పుడు తప్పించుకున్నప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు సామాన్యుల ఆవేదనకు బలికాక తప్పదనేది సత్యం. 24గంటల పాటు అధికారులు అక్కడే..

Corruption

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన.

అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పొదెం వీరయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గా ప్రసాద్

నేటి ధాత్రి చర్ల

తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు ఏఐసీసీ సభ్యులు పొదెం వీరయ్య అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఒక సంవత్సర కాలంలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలను తీసుకుని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రగతికి ఆయన కృషి ఎంతో అభినందనీయమని తెలియజేశారు

ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోండి..

‘ఆరోగ్య సేవలు సద్వినియోగం చేసుకోండి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని సన్ రోహి ఆసుపత్రికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేవలు అందించేందుకు అనుమతి లభించిందని ఆసుపత్రి ఎండీ డా. సంజీవ్ కుమార్ శుక్రవారం తెలిపారు. వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంలో ఉన్న రోగాలన్నింటికి ఫ్రీగా తమ హాస్పిటల్ లో నాణ్యమైన చికిత్సలు అందిస్తామన్నారు. త్వరలో తమ ఆసుపత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ నుండి ఎన్ఏబీఎస్ గుర్తింపు లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం, తదితరులు పాల్గొన్నారు.

సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన..

సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్

Collector Jitesh V Patil, District SP Rohit Raj

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం మారుమూల పూసుగుప్ప గ్రామంలో కోటిన్నర వ్యయంతో నిర్మించిన సంచార వైద్యశాల మరియు నూతన అంబులెన్స్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ సిఆర్పిఎఫ్ 81 బెటాలియన్ కమాండెంట్ ఎంకే సింగ్‌ ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మారుమూల ప్రాంతంలో ఇంత గొప్ప వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసినందుకుగాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా అధికారులను గ్రామస్తులు అభినందించారు

Collector Jitesh V Patil, District SP Rohit Raj

24 గంటలు వైద్య సదుపాయాలు మరియు వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐ రాజ్ వర్మ తహసిల్దార్ శ్రీనివాసు ఎంపీడీవో యాదయ్య ఎస్సై నర్సిరెడ్డి ఎస్సై కేశవ్ మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజలు  పాల్గొన్నారు

Collector Jitesh V Patil, District SP Rohit Raj

సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా.

సింగరేణి జిఎం ఆఫీస్ ముందు ధర్నా

25వ వార్డులో రోడ్డుకు అడ్డంగా తీసిన కాలువను పూడ్చాలి

సిపిఐ పార్టీ 25వ వార్డ్ ఇంచార్జ్ క్యాతరాజు సతీష్

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక కారల్ మార్క్స్ కాలనీ 25 వార్డులో ఉన్న సింగరేణి స్కూల్ 6వ గని మధ్యలో ఉన్న రోడ్డుకు అడ్డంగా సింగరేణి యాజమాన్యం తీసిన కాలువను వెంటనే పూడ్చాలని 25వ వార్డు కాలనీవాసులు జిఎం ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ పాల్గొని సంఘీభావం తెలిపి అనంతరం జిఎం పర్సనల్ మేనేజర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం నుండి కాలనీ ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిని అర్ధాంతరంగా మూసివేయడం తగదని అన్నారు స్కూలుకు వెళ్లే పిల్లలకు 6 ఇంక్లైన్ గణికి వెళ్లే కార్మికులకు.. అదేవిధంగా కాలనీ వాసుల కోసం నిర్మించిన సులబ్ కాంప్లెక్స్ కి అనేక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న రహదారిని ఏదో స్టాకు చూపి మూసివేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.. గత కొన్ని సంవత్సరాలుగా లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందో చెప్పాలన్నారు.. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ రోడ్డులో గత స్పీకర్ సిసి రోడ్ వేయించడం జరిగింది అన్నారు అప్పటినుండి ఆ రోడ్డుపై నిత్యం వందలాదిమంది ప్రయాణం కొనసాగిస్తున్నారన్నారు.. రోడ్డుకిరువైపులా చెట్లు ఉండడం మూలాన.. ఆ చెట్టు గుబురుగా పెరగడం జరిగిందన్నారు.. దాన్ని పరిశుభ్రం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాన్ని పరిశుభ్రం చేయకుండా చెత్త చెదారం తొలగించకుండా ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్న రోడ్డును అర్ధాంతరంగా మూసివేయడం అన్యాయం అన్నారు.. ప్రజల సౌకర్యం కోసం పాటుపడాల్సిన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఏంటని అన్నారు వెంటనే సింగరేణి యాజమాన్యం ఆ గుంతను పూడ్చి రోడ్డును పునరుద్ధరించాలని కోరారు

పాటల పల్లకి 12 గంటలు పోస్టర్ ఆవిష్కరించిన.

పాటల పల్లకి 12 గంటలు పోస్టర్ ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ నాయకులు

నిజాంపేట్, నేటి ధాత్రి

తెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా కళాకారులూ టీ యన్ జి ఓ భవన్ లో 13 వ తేదీన నిర్వహించే పాటల పల్లకి 12 గంటలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.నిజాంపేట మండలానికి సంబoదించిన మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల జిల్లా ప్రధాన కార్యదర్శి వొళ్ళపు స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం లో సాంస్కృతిక సారథి లో 550 ఉద్యోగాలు ఇచ్చారు అందులో 200 మందికి పైగా ఆట పాట రాని కళాకారులకు అసలు ఉద్యమానికి సంబంధం లేని వారికీ ఉద్యోగాలు ఇచ్చారు రసమయి కి తెలిసిన వారికీ రసమయి కి నచ్చిన వారికీ ఉద్యోగాలు ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం సాంసృతిక సారథి నీ ప్రక్షాళన చేయాలనీ కోరుతూ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మెనిపెస్టోలో ఉద్యమ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని మాట ఇవ్వడం జరిగింది . అందుకు ఇప్పుడు సాంస్కృతిక సారధిలో అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాటల పల్లకి ద్వారా విన్నవించడానికి ఈ పాటల పల్లకి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అర్హులైన ఉద్యమ కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ పాటల పల్లకి కార్యక్రమాన్ని జిల్లాలున్న ప్రతి ఒక్క కళాకారులు నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి ,పంజా మహేందర్, నసీరుద్దీన్ ,
వై వెంకటేశం, కాంగ్రెస్ నిజంపేట గ్రామ అధ్యక్షుడు బాబు, గరుగుల శ్రీనివాస్, కళాకారులూ దేవేందర్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, టపాసులు కలిసి, మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జీఎస్సార్ పాల్గొన్నారు. అనంతరం సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి, మీడియాతో మాట్లాడారు.

Congress party.

సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకోవచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలోప పట్టణ అధ్యక్షుడు దేవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పం కిషన్ బుర్ర కొమురయ్య దాట్ల శ్రీను కురిమిళ్ళ శ్రీను రమణాచారి కోమల స్వామి కేతిరి సుభాష్ పద్మ చల్లూరు సమ్మయ్య కడారి మాలతి మాజీ కౌన్సిలర్లు, బిసి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు

చర్చలకు తమ వంతు ఆర్థికసాయం అందజేసిన..

చర్చలకు తమ వంతు ఆర్థికసాయం అందజేసిన బొల్లారం రత్నం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో నూతనంగా నిర్మిస్తున్న చర్చీలకు దేవుని ప్రేమనుబట్టి మన బొల్లారం,రత్నం తమ వంతు ఆర్థికసాయం అందజేయడం జరిగింది.
అల్గోల్,ఖానాపూర్,బిడెకన్య ,ఇటికేపల్లి,ఈదులపల్లి,జహీరాబాద్,మహేంద్ర కాలనీ,తుమ్మన్ పల్లి ఏడాకులపల్లి,హత్నూర,కుప్పనగర్.ఇట్టి గ్రామాలకు దేవుని ప్రేమనుబట్టి వివిధ గ్రామ సంగ కాపరులకు అందజేయడం జరిగింది రత్నం మాట్లాడుతూ ఇంకా రాబోయే కాలంలో దేవుని ప్రేమఅనుబట్టి ఇంకా కొన్ని సంగాలకు కూడా సహకారం అందిస్తాను అని సానుకూలంగా స్పందించి తన ప్రేమను తెలియజేశారు ఇట్టి కార్యక్రమములో వివిధ గ్రామాల నాయకులు పాల్గొనడం జరిగింది.

విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి.

విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి

(సూపరింటెండెంట్ ఇంజనీర్, మహబూబాబాద్ — విజేందర్ రెడ్డి)

కొత్తగూడ, నేటిధాత్రి
గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహబూబాబాద్ శ్రీ విజేందర్ రెడ్డి కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. వ్యవసాయ పొలాల దగ్గర స్టార్టర్ లకు మరియు మోటార్ లకు ఎర్తింగ్ చేసుకోవాలని అలాగే ఇంటి దగ్గర కూడా ఎర్తింగ్ చేసుకోవాలని తెలిపారు. గుండం గ్రామంలోనీ రైతులకి ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా ఏఈ కి సూచనలు అందించారు. ఈ వర్షాకాలంలో చెట్లు విరిగి లైన్ ల మీద పడడం లేదా లైన్ తెగి కింద పడిపోయినప్పుడు వెంటనే రైతులు తమ లైన్మెన్ లేదా ఏఈ కి సమాచారం అందించాలని కోరారు.విద్యుత్ ప్రమాదాల సమయం లో విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉపయోగించుకోవాలని తెలిపారు. కొత్తగూడ సెక్షన్ లో పనిచేస్తున్న ఇంజనీర్లకు మరియు విద్యుత్ సిబ్బందికి విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ డిఈ ఆపరేషన్ మహబూబాబాద్, సురేష్ ఏఈ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు…

16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

ఈనెల 16న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటిధాత్రి :

బ్యాండు వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో బ్యాండు సమస్యల కోసం ఈనెల 16న సిటిజన్ ఫంక్షన్ హాల్ లష్కర్ బజార్ హనుమకొండ లో జరుగు రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగినది వాయిద్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి గుర్తింపు కార్డులు ఇవ్వాలి ప్రమాద బీమా వర్తిoప చేయాలి హెల్త్ కార్డు లిపించి ఉచిత వైద్యం కల్పించాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న
చిట్యాల మండల అధ్యక్షుడు
పర్లపెల్లి రవి కోశాధికారి లద్దునూరి ప్రభు జాయింట్ సెక్రెటరీ భద్రయ్య తదితరులు అంకుశవాలి బోనగిరి రాజు వైనాల మొగిలి సాయబు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే..

రాత్రి పూట డిన్నర్ చేశాక వాకింగ్ చేస్తే.. ఎన్నో అద్భుతమైన ఫలితాలు..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాల‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే వ్యాయామం అంటే మ‌రీ క‌ష్ట‌ప‌డి జిమ్‌ల‌లో క‌స‌ర‌త్తులు చేయాల్సిన ప‌నిలేదు. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు సాధార‌ణ వాకింగ్ చేసినా చాలు. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద‌యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల రోజంతా మెట‌బాలిజం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది క్యాల‌రీల‌ను క‌రిగిస్తూనే ఉంటుంది. క‌నుక‌నే ఉద‌యం వ్యాయామం చేయాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే కేవ‌లం ఉద‌యం మాత్ర‌మే కాదు.. రాత్రి పూట భోజ‌నం అనంత‌రం కూడా వాకింగ్ చేయాలి. దీంతో మ‌రింత ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పూట డిన్న‌ర్ చేసిన అనంతరం వాకింగ్ చేయ‌డం ఎన్నో మంచి ఫలితాల‌ను ఇస్తుంద‌ని వారు అంటున్నారు.

అధిక బ‌రువు, షుగ‌ర్ లెవ‌ల్స్‌..

Walking after dinner

రాత్రి పూట భోజ‌నం చేసిన అనంతరం క‌నీసం 10 నిమిషాల పాటు తేలిక‌పాటి న‌డ‌క కొన‌సాగించాలి. రాత్రి పూట మ‌న మెట‌బాలిజం త‌గ్గుతుంది. కానీ వాకింగ్ చేస్తే మెట‌బాలిజంను పెంచుకోవ‌చ్చు. దీంతో రాత్రి మ‌నం నిద్రించినా కూడా మ‌న శ‌రీరం క్యాల‌రీల‌ను ఖ‌ర్చు చేస్తూనే ఉంటుంది. ఫ‌లితంగా మ‌నం నిద్ర‌లో ఉన్నా కూడా మ‌న శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా రాత్రి పూట డిన్న‌ర్ త‌రువాత వాకింగ్ చేస్తే ఎన్నో మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక రాత్రి పూట భోజ‌నం అనంత‌రం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్‌న అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం రాత్రి డిన్న‌ర్ త‌రువాత వాకింగ్ చేసేవారి ఫాస్టింగ్ షుగ‌ర్ లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గాయ‌ని తేల్చారు. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫాస్టింగ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించుకునేందుకు గాను రాత్రి పూట డిన్న‌ర్ చేసిన అనంత‌రం వాకింగ్ చేయాలి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేసే విష‌యం.

42శాతం ఒక విప్లవం..కాంగ్రెస్‌ బడుగులకు వరం?

దేశంలో ‘‘మొదటి రాష్ట్రంగా’’ కీర్తిని సంపాదించుకునే ప్రభుత్వం.

`బీసీల చేతుల్లోకి పంచాయతీ పాలన!

`బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలుతోనే ఎన్నికలు.

`ఇక తెలంగాణల పల్లె పాలనలో బీసీలదే అగ్రభాగం.

 

`ఇంత గొప్ప నిర్ణయం చేసినా కాంగ్రెస్‌ శ్రేణులు ఏం చేస్తున్నారు.

`కనీసం క్యాబినెట్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసే తీరిక లేదా!

`ప్రచారం చేసుకునే సోయి కూడా లేదా!

`బీసీరిజర్వేషన్‌ ఆర్డినెన్స్‌ పై జాగృతి సంబరాలు చేస్తుంటే కనిపించడం లేదా!

`క్రెడిట్‌ మాదే అని జాగృతి ప్రకటనలు చేస్తుంటే చూడడం లేదా!

`మంత్రులందరూ ఏం చేస్తున్నారు.

`ఎమ్మెల్యేలందరూ ఏ పనిలో వున్నారు.

`కనీసం నాయకులకు, కార్యకర్తలకు చెప్పినా చేసే వాళ్లు.

`మంత్రి పొంగులేటి క్యాబినెట్‌ బ్రీపింగ్‌ ఇచ్చిన వెంటనే పిసిసి ఏం చేస్తున్నాట్లు!

`ముఖ్యమంత్రి రేవంత్‌ తర్వాత ఆక్టివ్‌గా వుండేది ఇద్దరు మంత్రులేనా?

`పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ లకు తప్ప మిగతా వారికెవ్వరికీ పట్టదా?

`బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అనేది సంచలనమైన నిర్ణయం.

`ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం.

`ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రచారం చేసుకోవడంలో కాంగ్రెస్‌ వెనుకబడితే ఎలా?

`మా ఒత్తిడి వల్లనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఇతర పార్టీలు ప్రచారం చేసుకుంటాయి.

`తెలంగాణ ఇచ్చినా అప్పుడు ప్రచారం చేసుకోలేకపోయారు.

`రుణమాఫీ విషయంలో అదే పొరపాటు చేశారు.

`సన్న బియ్యంపై అనుకున్నంత ప్రచారం చేసింది లేదు.

`ఇందిరమ్మ ఇండ్లను కూడా ప్రచారం చేసుకునే ఓపిక కాంగ్రెస్‌ నాయకులకు లేదు.

`బీసీల రిజర్వేషన్‌ మీద ఎవ్వరూ నోరు మెదపడం లేదు.

`గతం ప్రభుత్వానికి మించి పాలన సాగిస్తున్నా చెప్పుకునే దిక్కు కాంగ్రెస్‌ లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీ మేరకు బిసిలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు దిశగా అడుగులు వడివడిగా పడుతున్నాయి. సెప్టెంబర్‌ ఆఖరులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశంతోపాటు, 42 శాతం బిసి రిజర్వేషన్‌ అమలు చేయడం పై కాంగ్రెస్‌ పార్టీ సిరియస్‌గా దృస్టిపెట్టింది. నిజం చెప్పాలంటే ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయంగా దేశ చరిత్రలో లిఖించబడుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి పేరు చిరస్ధాయిగా నిలిచిపోతుంది. మనదేశంలో బిసిల జనాభా మేరకు ఎన్నికల్లో అవకాశాలు కల్పించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో వుంది. కాని డెబ్బై ఏళ్లలో ఏనాడు, ఏ స్దాయిలో ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. అందుకు సుప్రింకోర్డు ఆదేశాలు కూడా అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నాయి. ఒకవేళ సుప్రింకోర్టు తీర్పు అడ్డులేకపోతే అమలు చేసేవాళ్లమని పదే పదే అనేక పార్టీలు చెప్పుకున్న సందర్బాలున్నాయి. దాట వేసేందుకే ఎక్కువ ఇష్టపడేవి. బిసిల మీద ప్రేమ ఒలబోస్తున్నట్లు నటిస్తూనే బిసిల రిజర్వేషన్‌ అమలుచేయాలంటే దైర్యం చేయలేకపోయాయి. బిసిలు రాజకీయంగా ఎదిగితే ఓసిల రాజకీయానికి మరణ శాసనమే అని భావించేవారు. అందుకే బిసిలను రాజకీయంగా ఎదగకుండా ఎప్పటికప్పుడు ఏదో సానును చూపిస్తూ వుండేవారు. మొత్తానికి బిసిలను ఎదగకుండా చేశారు. ఇప్పుడ బిసిలకు 42శాతం ఎట్టిపరిస్ధితుల్లోనూ రిజర్వేషన్‌ అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నది. ఈ విషయంలో ముందుకు పోవడం తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నట్లే వుంది. బిసిల రిజర్వేషన్‌ ఎలా అమలు చేయాలన్నదానిపై క్యాబినేట్‌లో సుధీర్ఘమైన చర్చ జరిగింది. అందుకోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పనిలో పనిగా మరోసారి అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, కేంద్రానికి మరోసారి తీర్మాణాన్ని పంపించాలనుకుంటున్నారు. తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. ఏది ఏమైనా బిసి రిజర్వేషన్‌ అమలుకు ఒక దారి పడినట్లే అని అంటున్నారు. దేశంలోనే ఇది సంచలనామ్మకమైన ప్రక్రియగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో అమలు జరిగితే మాత్రం దేశమంతా ఆచరించాల్సిందే అని అంటున్నారు. అది కాంగ్రెస్‌ పార్టీకి దేశ వ్యాప్తంగా ఏంతో మేలు జరుగుతుంది. ఆ పార్టీ దేశ వ్యాప్తంగా బలపేందుకు కూడా మార్గం వేసినట్లౌవుంది. ఒకే దెబ్బకు రెండుపిట్టలన్నట్లు కాంగ్రెస్‌ పార్టీకి దేశ మంతా నీరాజనం పడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. తెలంగాణలో బిసిల రిజర్వేషన్‌ అమలు జరడం వల్ల పంచాయతీ ఎన్నికలల్లో బిసిలు రాజకీయంగా మరింత ఎదుగుతారు. రాష్ట్రంలో సగం మంది సర్పంచ్‌లు, ఎంపిపిలు, జడ్పీచైర్మన్‌లు అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తులో బిసి రాజ్యానికి దారి పడుతుంది. ఇంత గొప్ప కార్యాక్రమం చేపట్టాలని సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాని అమలుకు దారులు వెతుకుతున్నది. ఇలా క్యాబినేట్‌ తీర్మానం చేసిందనే ప్రకటన వచ్చిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా జాగృతి సంస్ధ సంబరాలు చేసుకున్నది. ఈ విషయం తమ ఖాతాలో వేసుకునే ఎత్తుగడ వేసింది. ఈ మాత్రం సోయి కాంగ్రెస్‌పార్టీ నాయకులకు లేకుండాపోయింది. ఎన్నికల ముందు ఈ హమీ ఇచ్చి, ఇప్పటికే అసెంబ్లీలో తీర్మాణం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం డిల్లీకి పంపింది. అంటే బిసిల రిజర్వేషన్‌ అమలు బిల్లు క్రెడిట్‌ అంతా కాంగ్రెస్‌ పార్టీకే చెందాలి. కాని సందిట్లో సడేమియా అన్నట్లు జాగృతి సంబరాలు చేసుకుంటోంది. ఈ సందర్భాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు గడ్లప్పగించి చూస్తున్నారు. ఈ మాత్రం బాద్యత లేని కాంగ్రెస్‌ నాయకుల వల్లనే ప్రభుత్వం ఎంత మంచి కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి వెళ్లడం లేదు. ప్రచారం జరగడం లేదు. కాంగ్రెస్‌ పార్టీకి బలం చేకూరడం లేదు. తెలంగాణ ఏర్పాటకు అసలైన నిర్వచనం చెప్పేటు వంటి 42శాతం రిజర్వేషన్ల అమలును కాంగ్రెస్‌ ప్రచారం చేసుకోలేకపోవడం విడ్డూరం. ఇప్పటికే ఏ పధకమైనా, ప్రతిపక్షాలకు సమాదానం చెప్పడంలో అటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. అడపా దడపా ఓ ఇద్దరు ముగ్గురు మంత్రులు కనిపిస్తుంటారు. మిగతా మంత్రులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. వాళ్లు ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చినా సమాదానం చెప్పడానికి ఎప్పుడూ ముందుకు రారు. మాకు సంబంధం లేని విషమనుకుంటారో..లేక సిఎం రేవంత్‌ చూసుకుంటారనుకుంటారో గాని, నోరు విప్పరు. ప్రతిపక్షాలను పల్లెత్తు మాట అనరు. ఇతర సమయాల్లో మాట్లాడలేకపోయినా, బిసిల రిజర్వేషన్‌ అంశంపై కూడా నోరువిప్పకపోతే ఎలా? ప్రభుత్వం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం స్పందిం చకపోతే ఎలా? మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాబినేట్‌ బ్రీఫింగ్‌ చేస్తున్నప్పుడే జాగృతి సంబరాలు చేసుకున్నది. ఈసంగతి కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడ ంలేదా? ఏకంగా జాగృతి కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకున్నారు. క్రెడిట్‌ మాదే అంటూ ప్రకటనలు కూడా చేశారు. కాని ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు కనిపించలేదు. పిసిసి కూడా ఏం చేస్తున్నట్లో అర్ధం కావడం లేదు. దీనిపై ఇతర మంత్రులగాని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్కడా ప్రకటనలు చేయలేదు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పలేదు. తెలంగాణలో ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు సంబరాలు జరుపుకున్నది లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలాభిషేకాలు జరిపింది లేదు. ఇదే కాదు ప్రజా ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత తీసుకున్న అనేక కార్యక్రమాలను కూడా అలాగే నిర్లక్ష్యం చేశారు. మీడియాలో వార్తలు వస్తే స్పందించలేదు. నిజం చెప్పాలంటే 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ అనేది దేశంలోనే తొలి రాష్ట్రంగా కీర్తిపొందుతుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దేశ ప్రజల నుంచి ప్రశంసలు కూడా అందుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన నిర్ణయం చేసినప్పుడైనా కాంగ్రెస్‌ శ్రేణులకు సోయి రాకపోవడం విడ్డూరం. తెలంగాణ ఇస్తే ఏపిలో కాంగ్రెస్‌ పూర్తిగా కనుమరుగౌతుందని తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలు కూడా ఒక్కరు కూడా లేకుండాపోతారని తెలుసు. భవిష్యత్తులో ఏపిలో కాంగ్రెస్‌ ఉనికిలో వుండదని కూడా తెలుసు. జెండా మోసేవారే కనుమరుగౌతారని తెలుసు. కాంగ్రెస్‌ జండా పట్టుకుంటే ప్రజలే లాక్కుంటారని తెలుసు. మరో వందేళ్లయినా సరే ఏపిలో కాంగ్రెస్‌కు ఊపిరి అనేది లభించదని తెలుసు. అయినా సోనియాగాందీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తెలంగాణ ఇచ్చారు. అలాంటి తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ కనుమరుగౌతుందని ఎవరూ ఊహించలేదు. తెలంగాన ఇచ్చిన వెంటనే బిఆర్‌ఎస్‌ సంబరాలు చేసుకున్నది. తెలంగాణ తెచ్చింది మేమే అని ప్రజలను నమ్మించింది. కాని తెలంగాణ ఇచ్చింది మేమే అని అప్పుడు కాంగ్రెస్‌ నాయకులు బలంగా చెప్పుకుంటే పరిస్దితి మరోలా వుండేది. కాంగ్రెస్‌ అప్పుడే గెలిచేది. కాని ఆనాడు కూడా కాంగ్రెస్‌ నాయకులు అదికారం రాదన్నట్లే చేతులెత్తేశారు. అలా రెండు ఎన్నికల్లోనూ తెలంగాణ ఇచ్చింది మేమే అని బలంగా చెప్పుకోలేకపోయారు. పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రచారం మొదలైంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అవకాశమివ్వాలని రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతో విన్నవించుకున్నారు. ఏపిలో పార్టీకి తీరని నష్టమైనా సరే తెలంగాణ ఇచ్చిన సోనియాగాందీకి కృతజ్ఞత తెలియజేయాలని కోరారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కాలుకు బలపం కట్టుకొని తిరిగారు. అప్పుడు గాని ఇతర కాంగ్రెస్‌ నాయకులకు జ్ఞానోదయం కాలేదు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అనేక గొప్ప కార్యక్రమాలు అమలు చేశారు. పదేళ్ల కాలంలో కేసిఆర్‌కు సాధ్యంకాని రుణమాఫీని ఏక కాలంలో చేపట్టారు. రైతులను రెండు లక్షల రూపాయల రుణమాఫీ నుంచి విముక్తి ప్రసాదించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మొదటి సారి పేదలకు సన్న బియ్యం రేషన్‌ దుకాణాల ద్వారా అందజేస్తున్నారు. దానిని కూడా ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు బద్దకిస్తున్నారు. పదేళ్ల తర్వాత ఇందిరమ్మ ఇండ్ల సంబురాలు ప్రజల్లో కనిపిస్తున్నంతగా కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో కనిపించడం లేదు. ఇది కాంగ్రెస్‌కు భవిష్యత్తులో తీరని నష్టాన్ని మిగిల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికైనా తేరుకోండి. మేలుకోండి. పార్టీని కాపాడుకోండి. మరింత బలంగా కాంగ్రెస్‌ను నిర్మాణం చేసుకోండి.

ప.బెంగాల్‌ ఓటర్ల జాబితా ప్రక్షాళన

`తృణమూల్‌ కాంగ్రెస్‌లో గుబులు

`వలస కార్మికులు ఓటుహక్కును కోల్పోయే ప్రమాదం

`ఇదే జరిగితే తృణమూల్‌ భవిష్యత్తు అంధకారం

`సుప్రీంకోర్టును ఆశ్రయించిన పార్టీ

`బీజేపీ మాస్టర్‌ స్ట్రోక్‌తో తృణమూల్‌ విలవిల

డెస్క్‌,నేటిధాత్రి:

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున మార్పులు చేయాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయిచిన నేపథ్యంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి గొంతులో పచ్చివెలక్కాయపడిన చం దంగా మారింది. ప్రజాప్రాతినిధ్య చట్టం`1950లోని సెక్షన్‌ 20 కింద ఎన్నికల కమిషన్‌ ఈ చర్యకు ఉపక్రమించింది. దీని ప్రకారం దేశంలో ఒక ప్రాంతానికి చెందిన పౌరుడు మరో నగరం లో సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పుడు, తన స్వస్థలంలో సొంత ఇల్లు వున్నప్పటికీ, అతనికి ఓటుహక్కు ప్రస్తుతం జీవిస్తున్న నగరంలోనే వుంటుంది తప్ప తన సొంత వూర్లో వుండదు. దీన్నిఈ సెక్షన్‌ చాలా స్పష్టంగా పేర్కొంటున్నది. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు ఇతర రాష్ట్రాల్లో బ్లూకలర్‌ ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా వీరంతా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే. 2011 జనగణన ప్రకారం ఈవిధంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పనిచేస్తున్న బెంగాలీల సంఖ్య కేవలం 24.1లక్షలు కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మూడుకోట్లు దాటిపోయి వుంటుందని అంచనా. అయితే ఇతర రాష్ట్రాల్లో వివిధ రకాల వృత్తుల్లో వైట్‌కాలర్‌ ఉ ద్యోగాల్లో వున్నవారి సంఖ్య ఇందులో చేర్చలేదు. ఇటువంటివారిలో ఓట్లకోసం బెంగాల్‌కు వ చ్చేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అయితే సీఈఐసీ అనే ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇతర రాష్ట్రాలకు వలసపోయిన బెంగాలీల సంఖ్య 3.34కోట్లు! అయితే వెస్ట్‌ బెంగాల్‌ మైగ్రెంట్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డులో నమోదు చేసుకున్న వారి సంఖ్య 21.67లక్షలు మాత్రమే. పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వ సమాచారం ప్రకారం ఈవిధంగా వలసలు ప్రధానంగా ముర్షిరాబాద్‌, నాదియా, మాల్డా, బీర్‌భుమ్‌, 24పరగణాల జిల్లాలనుంచి చోటుచేసుకున్నాయి. ఇవన్నీ దాదాపుగా బంగ్లాదేశ్‌ సరిహద్దులో వుండే జిల్లాలు కావడంతో, ఇక్కడికి బంగ్లాదేశీయుల వలసలు అధి కం. బంగ్లాదేశీయులంటే 80శాతం వరకు ముస్లింలే. అయితే వీరెవరికీ పశ్చిమబెంగాల్‌లో జీవనోపాధికి అవకాశాలుండవు కనుక, రెండు మూడు నెలలపాటు ఈ జిల్లాల్లో వుండి తప్పుడు మార్గాల ద్వారా ఆధార్‌కార్డులు, రేషన్‌ కార్డులు సంపాదించి, వీటి ఆధారంతో ఇతర రాష్ట్రాలకు వలసపోతుండటం జరుగుతోంది. ఇటువంటివారికి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించేది తృణ మూల్‌ కాంగ్రెస్‌ పార్టీనే. అంటే ఈ పార్టీ అధికారంలో వున్నంతవరకు తమ భద్రతకు ఢోకాలేదన్న అభిప్రాయం ఈ ముస్లింలలో వుంటుంది. ఎన్నికల సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇతర ప్రాంతాల్లో వుంటున్న ఈ బంగ్లాదేశీ ముస్లింలను, అసవరమైన ఖర్చులన్నీ పెట్టుకొని స్వరాష్ట్రానికి రప్పించి ఓటుబ్యాంకుగా ఉపయోగించుకుంటోంది. అంతేకాదు, రాష్ట్రంలో ఇతర పార్టీలకు ఓట్లు వేసేవారిని లేదా ఇతర పార్టీల కార్యకర్తలను బెదిరించడం, హింసకు పాల్పడటానికి కూడా వీరు గూండాలుగా పనికివస్తున్నారు. స్థానిక బెంగాలీ ముస్లింలు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం కద్దు. కానీ ఆవిధంగా వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువ. అయితే బంగ్లాదేశ్‌ ముస్లింలకు జీవనోపాధికోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకతప్పదు. స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ లేదా సాధారణ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ పెద్దఎత్తున తన ఓటర్ల సమీకరణ కార్యక్రమాన్ని చేపడుతుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న బంగ్లాదేశ్‌ వలస కార్మికులను (ముస్లింలు) వారి పేర్లు ఎక్కడ రిజిస్టరయి వున్నాయో తెలుసుకొని ఆయా ప్రాంతాలకు తరలిస్తుంది. ఆవిధంగా వారంతా తమకే ఓటువేసేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే సమయంలో ఇటువంటి ఓటర్లకు చార్జీలు పెట్టుకొని కొంత ముట్టచెబుతుండటంతో వీరంతా గంపగుత్తగా తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తున్నారు. నిజానికి అంతకుముందు వామపక్షాలు అధికారంలో వున్నప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాయి.
ఇప్పుడు ఎన్నికల సంఘం ఇటువంటి ఓటర్ల పేర్లను జాబితానుంచి తొలగిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ పుట్టిమునగడం ఖాయం. బంగ్లాదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.5కోట్లు కాగా ముస్లిం ఓటర్లు 2.25కోట్లు.

ముస్లింఓటర్లు ప్రధానంగా రాష్ట్రంలోని 74 నియోజకవర్గాల్లో కేంద్రీకృతమై వున్నా రు. మరో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీరు గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో వుండటం గమనార్హం. ఇటువంటి నియోజకవర్గాల్లో వలస కార్మికుల ఓట్లను తొలగిస్తే ఇది తృణమూల్‌ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ కాగలదు. దీనికితోడు పశ్చిమ బెంగాల్‌లో హిందువుల ఓట్లు సుసంఘటి తం కావడం ఇప్పటికే మొదలైంది. ఉదాహరణకు నాదియా జిల్లాలో ముస్లింల జనాభా 30శా తం. వీరిలో చాలామంది ఇతర రాష్ట్రాల్లో జీవనం గడుపుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన కాళి గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2.48లక్షలు. వీరిలో ముస్లిం ఓటర్ల సంఖ్య 1.43లక్షలు. వీరిలో 43వేలమంది ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు కనుక వారు, ఈ ని యోజకవర్గానికి చెందిన సాధారణ పౌరులుగా పరిగణించబడరు. ఫలితంగా ఈ 43వేల ఓట్లను ఎన్నికల కమిషన్‌ తొలగిస్తే, ఈ నియోజకవర్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు చాలా కష్టం కాగలదు. ఇదే పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో, వలస కార్మి కుల పేర్లను తొలగించడం వల్ల రాష్ట్రం మొత్తంమీద వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సానుకూలత ఏర్పడగలదు. 2021 అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దాదాపు 45 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే మెజారిటీగా వుండటంతో, వీరి ఓట్లతోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలిచింది. విశేషమేంటంటే ఈ ని యోజకవర్గాల్లో పోటీచేసిన బీజేపీ అభ్యర్థులు గరిష్టగా 15వేల ఓట్ల తేడాతో ఓటమి చెందడం గమనార్హం. ఈ నేపథ్యంలో వలస ఓట్ల తొలగింపు బీజేపీకి ఎంతటి ప్రయోజనం కాగలదో ఆలో చించవచ్చు. ఇదే సమయంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ లక్షలాది బోగస్‌ ఓట్లను జాబితాలోకి చొ ప్పించడం మరో కారణం. ఎన్నికల సంఘం ఇటువంటి వాటిని కూడా విజయవంతంగా తొలగి స్తే, అప్పుడు నిజమైన ఓటర్లు మాత్రమే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోగలగుతారు. అయితే ఎన్నికల కమిషన్‌ కేవలం పశ్చిమ బెంగాల్‌ మాత్రమే కాదు బిహార్‌లో కూడా ఈ ప్రక్రి యను మొదలుపెట్టింది. తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని అమలుచేయనుంది. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఎన్నికల సంఘం వీటికి తొలి ప్రాధాన్యతనిస్తోంది.
రాబోయే అనర్థాన్ని గుర్తించిన తృణమూల్‌ కాంగ్రెస్‌, తమ ఎంపి మొహువా మొయిత్రా ద్వారా సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేయించింది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను నిలుపు చేయాలన్నది ఈ పిటిషన్‌ సారాంశం. ఎన్నికల సంఘం ఓటర్ల నిరూపణకోసం పదకొండు డాక్యుమెంట్లు కోరింది. వీటిల్లో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేవు. ఎందుకంటే వీటిని విచ్చలవిడిగా దొంగతనంగా సృష్టిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతోఓ తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఆందోళన మొదలైంది. దీనివల్ల ఇప్పుడు వలస వెళ్లిన ముస్లిం కార్మి కుల ఓట్లన్నీ రద్దవుతాయి. మొత్తం ఓటుబ్యాంకు కుప్పకూలిపోతుంది. ఈ నేపథ్యంలో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేపట్టాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ యోచిస్తోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో, ఒకవేళ కోర్టు ఎన్నికల సంఘానికి మద్దతుగా నిర్ణయాన్ని ప్రకటిస్తే ఏంచేయాలన్నది ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులను తొలుస్తున్న ప్రశ్న! ఏవిధంగానైనా ఈ వలస కార్మికుల పేర్లను ఓటర్ల జాబితానుంచి తొలగించకుండా చూడాలన్న లక్ష్యంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టుపై ఆశలు పెట్టుకుంది! మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి!

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.

అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు

హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండల కమిటీల నియామకం

Everyone should work towards a corruption-free society.

“నేటిధాత్రి”,హుజురాబాద్ (కరీంనగర్ జిల్లా): దేశంలో ప్రతి పౌరుడు తమ హక్కులను బాధ్యతలు తెలుసుకొని అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన హుజురాబాద్ పట్టణంలో హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండల కమిటీల నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రాల సదన్న, రావుల రాజేశం, పాక శ్రీనివాస్ యాదవ్, పరకాల సమ్మయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు పులుగు లతారెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి రాజ్యమేలుతుందని, దేశ సంపద, ప్రజాధనం అవినీతి అక్రమార్కుల చేతిలో దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన ప్రజా పోరాటాల ద్వారానే దేశాన్ని అవినీతిపరుల నుండి కాపాడుకోగలమని ఆయన అన్నారు. అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే కార్యచరణను జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రాజేశం, పాక శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనపై స్పందించడమే కాకుండా మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలతో పాటు భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ను ఉపయోగించి దేశంలో మార్పు, చైతన్యం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రయత్నంలో 14 రాష్ట్ర కమిటీలు మన రాష్ట్రంలో 33 జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి చేశామని వారు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు మండల కమిటీల ప్రతినిధులకు నియమక పత్రాలు అందించారు.
హుజురాబాద్ మండల కమిటీ
అధ్యక్షురాలుగా: తాళ్లపెళ్లి దేవేంద్ర
ప్రధాన కార్యదర్శిగా: సబ్బని మాధవి
ఉపాధ్యక్షులుగా: జంపాల సువర్ణ, ఆకునూరి గణేష్
అధికార ప్రతినిధిగా: కొడిమ్యాల పవన్ కుమార్
హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలుగా: మల్లెల సరిత

జమ్మికుంట మండల కమిటీ
అధ్యక్షురాలుగా: ఇటికాల స్వరూప
ప్రధాన కార్యదర్శిగా: ఆరె వసంత

జమ్మికుంట పట్టణ కమిటీ
అధ్యక్షురాలుగా: మధిరే హేమలత
ప్రధాన కార్యదర్శిగా: గూడెపు లలిత
ఉపాధ్యక్షురాలుగా: మౌనిక

సైదాపూర్ మండల కమిటీ
అధ్యక్షురాలుగా: మూల భూలక్ష్మి
ఉపాధ్యక్షులుగా: తలారి రాము
ప్రధాన కార్యదర్శిగా: జంగ కవిత
తదితరులకు నియామక పత్రాలు అందించి సంస్థ విధివిధానాలకు అనుగుణంగా కృషి చేయాలని పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version