విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి.

విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలి

(సూపరింటెండెంట్ ఇంజనీర్, మహబూబాబాద్ — విజేందర్ రెడ్డి)

కొత్తగూడ, నేటిధాత్రి
గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహబూబాబాద్ శ్రీ విజేందర్ రెడ్డి కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులతో మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. వ్యవసాయ పొలాల దగ్గర స్టార్టర్ లకు మరియు మోటార్ లకు ఎర్తింగ్ చేసుకోవాలని అలాగే ఇంటి దగ్గర కూడా ఎర్తింగ్ చేసుకోవాలని తెలిపారు. గుండం గ్రామంలోనీ రైతులకి ఉన్నటువంటి విద్యుత్ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేలా ఏఈ కి సూచనలు అందించారు. ఈ వర్షాకాలంలో చెట్లు విరిగి లైన్ ల మీద పడడం లేదా లైన్ తెగి కింద పడిపోయినప్పుడు వెంటనే రైతులు తమ లైన్మెన్ లేదా ఏఈ కి సమాచారం అందించాలని కోరారు.విద్యుత్ ప్రమాదాల సమయం లో విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్ 1912 ఉపయోగించుకోవాలని తెలిపారు. కొత్తగూడ సెక్షన్ లో పనిచేస్తున్న ఇంజనీర్లకు మరియు విద్యుత్ సిబ్బందికి విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ డిఈ ఆపరేషన్ మహబూబాబాద్, సురేష్ ఏఈ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు…

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

అవగాహనతోనే విద్యుత్ ప్రమాదాలకు చెక్

తొర్రూర్ ( డివిజన్ ) నేటి ధాత్రి

 

ఎన్. పి.డి. సి.ఎల్ పరిధిలో మే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున నాంచారి మడూర్ గ్రామంలోని రైతు వేదికలో విద్యుత్ భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ & సేఫ్టీ ఆఫీసర్ శ్రీ పెద్ది రాజం మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా రైతులు మరియు వినియోగదారులు తీసుకోవలసిన అన్ని రకాల జాగ్రత్తలు మరియు సూచనలు విపులంగా తెలియజేశారు. తొర్రూరు డివిజనల్ ఇంజనీర్ శ్రీ జి. మధుసూదన్ గారు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో తొర్రూరు డివిజన్ పరిధిలో జరిగిన విద్యుత్ ప్రమాదాల వల్ల 16 గురు మనుషులు మరియు 30 జంతువులు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదాలకు కారణం రైతులు మరియు వినియోగదారులు విద్యుత్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోవడం వల్లే జరుగుతున్నాయని కావున నిత్యావసరమైన విద్యుత్ వినియోగించుకుంటున్నప్పుడు అన్ని రకాలుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్లలో బట్టలు ఆరేసుకోవటానికి బిగించుకునే జి.ఐ. వైర్లు పై కప్పుగా వేసుకునే ఇనుప రేకులకి షార్ట్ సర్క్యూట్ అయ్యి కొన్ని ప్రమాదాలు జరిగాయని అలాగే ఆకేరు వాగు వెంట ఉన్న గ్రామాల్లోని చాలామంది యువకులు చేపలు పట్టడానికి కరెంటును వినియోగించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రైతులు తమ పొలం చుట్టూ జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి బిగించుకునే విద్యుత్ కంచె వలన కూడా ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారని ఈ విధంగా చేయటం చట్ట ప్రకారం నేరమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్ శ్రీ సి.ఎస్. చలపతిరావు, చిన్న వంగర మరియు తొర్రూరు అసిస్టెంట్ ఇంజనీర్లు , విద్యుత్ సిబ్బంది, రైతులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version