ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు అంతే
◆ 70 ఏళ్లుగా పూరిగుడిసెల్లోనే జీవనం కొనసాగింపు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. గడిచిన 18 నెలల అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితాను విడుదల చేశారు. అందులో సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను ఎంపిక చేసిన ఇల్లు ఉన్న వారికే ఇల్లు రావడంతో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగింది. వారి పక్షాన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పే నాయకులే లేకపోయారు. దీనికి నిదర్శనం మండల కేంద్రమైన మొగుడంపల్లి లోని వృద్ధురాని నీ ఉదాహరణగా తీసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితా ఎలా జరిగిందో అర్ధం అవుతుంది. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఏ ప్రభుత్వం కూడా నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే అవకాశం లేదు. ఫలితంగా పేదలు పేదలుగానే గుడిసెల్లోనే జీవనం కొనసాగిస్తున్నారు. 70 సంవత్సరాల వృద్ధు రాలుని పుట్టక ముందు నుంచి వారి తల్లిదండ్రులు సైతం అదే గుడిసెలో కాపురం చేశారు. ఈసారైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డారు. కానీ స్థానిక నాయకుల పక్షపాతమో.. అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ మొగుడంపల్లి మండల కేంద్రమైన గుడుపల్లి కు మంజూరైన 35 ఇండ్లలో 18 రిటన్ పంపుతున్నారని దాంట్లో ఎవరికైనా బీదవారి అవసరం ఉన్నవారికి మంజూరు చేయాలని కోరారు. ఇండ్లలో అత్యధికంగా ఉన్న వారికే ఇండ్ల జాబితాలో పేర్లు వచ్చాయన్నారు. గుడుపల్లి గ్రామానికి చెందిన ఖైరున్ బీ, భర్త ఇబ్రహీం షా. వీరికి ఆరు గురు కుమారుడు ఐదు గురు కూతురు ఉన్నారని కానీ పూరి గుడిసెలోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నాయకులకు, అధికారులకు మాత్రం బీద వారి ముసలి వయసు ఉండే చేయించే బాధ్యత పూరి గుడిసె కనిపించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారితోపాటు ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి సైతం ఇల్లు ఇచ్చారు. కానీ అలాంటిది నిరుపేదకు -మాత్రం మొండి చేయి చూపించారు. ఇది కేవలం ఒక గుడుపల్లి గ్రామంలోనే కాదు ప్రతి గ్రామంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ చెందిన నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.