సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం చారిత్రాత్మకం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు
సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ , 4 ఫిబ్రవరి 2024 రోజున కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగనన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం నాలుగు ఫిబ్రవరి 2025న బీసీలకు విద్యా ,ఉద్యోగ ,స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నిన్నటి రోజున తెలంగాణ సెక్రటేరియట్లో మంత్రివర్గ సమావేశం క్యాబినెట్లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే ఎన్నికల పోతామని దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిర్ణయించడం పట్ల పర్ష హన్మాండ్లు హర్షం వ్యక్తంచేశారు,సామాజిక న్యాయాన్ని ఇచ్చిన మాట మేరకు ఆ మాటను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఎంత చేసినా తక్కువే నని పర్ష హన్మాండ్లు అన్నారు ,గత మూడు దశాబ్దాలుగా గత పాలకులను ఎన్ని సార్లు డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ,కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కులుగా బీసీల కొరకు మొండి పట్టు పట్టి అమలు చేయడం చారిత్రాత్మకమనీ పర్ష హన్మాండ్లు అన్నారు,ఈ ప్రభుత్వానికి బీసీలు అండగా ఉంటారని అదేవిధంగా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు,కోర్టు తీర్పు మేరకు నెల రోజులలో బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని అదేవిధంగా మూడు నెలలుగా ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ ఆత్రుతగా చూస్తున్న సమయంలో క్యాబినెట్ బీసీలకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీలుగా నేను గర్వపడుతున్నామని కాంగ్రెస్ పార్టీని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు ,వాడవాడనా గ్రామ గ్రామాన పట్టణాల అదేవిధంగా నగరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్టి చారిత్రాత్మక నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకోవాలని బీసీ నాయకులకు ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు పిలుపునిచ్చారు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు అండగా ఉంటూ బీసీల పక్షాన నిలుస్తున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీలుగా టిఆర్ఎస్ పార్టీ మరియు బిజెపి పార్టీ లు ఇట్టి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు డిమాండ్ చేశారు,ఎవరైనా రాజకీయ స్వార్థంతో బీసీలకు ఈ విషయమై వ్యతిరేకంగా చేసిన ఆ పార్టీలను ఎండగడతామని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు హెచ్చరించారు , బిజెపి పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానని అంటున్నదని కేంద్రంలో బీసీ కులగణన చేస్తానని చెప్పి మాట ఇచ్చిందని దేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వము ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చింది కాబట్టి కేంద్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు విజ్ఞప్తి చేశారు, ఈ 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు బీసీ సంక్షేమ సంఘం గా మేము ముందుంటామని సాధించుకొని తీరుతామని ఈ సందర్భంగా పర్శ హన్మాండ్లు తెలిపారు, ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరవేని మల్లేష్ యాదవ్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, కోడం రవీందర్ ,అల్వాల మల్లేష్ ।ఇల్లంతకుంట తిరుపతి ,ఆంజనేయులు ,శ్రీకాంత్ ,బోయిని శ్రీనివాస్,తిరుపతి ,కుసుమ ప్రభాకర్,చిందం శ్రీధర్,దామోదర్ ,కొండయ్య, బుర్ర మల్లేశం తదితరులు పాల్గొన్నారు.