బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం తగ్గించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో భాగంగా కవర్లకు బదులు కాగితపు సంచులను వినియోగించుకోవాలని ,ప్రకృతి పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతను నెరవేర్చాలన్నారు.మనం వాడే ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు పర్యావరణానికి చాలా హానికరం. అంతేగాక నీరు,భూమి,వాయు కాలుష్యానికి దోహదకారిగా పనిచేస్తాయని తెలిపారు.ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఈ రోజునుండి ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం ఆపి పేపర్ బ్యాగులను వాడి పర్యావరణాన్ని కాపాడుతామని ఎన్.సి.సి క్యాడెట్లచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎన్.సి.సి క్యాడెట్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలను తెలుపుతూ ఆకట్టుకునేలా చార్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ ,నాగరాజు, రాజేష్ ,రవీందర్ రెడ్డి భాగ్యలక్ష్మి , రాజేందర్ ,పూర్ణిమ విజయ్, గౌతమ్ క్రాంతి కుమార్, రామ్మూర్తి, వ్యాయామ ఉపాధ్యాయుడు భవాని చంద్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version