అవినీతికి అడ్డా మారిన.నిమ్జ్ …..
◆ అడ్డాగా మారిన కార్యాలయం
◆ 24గంటల పాటు ఏసీబీ విచారణ
◆ అధికారులు ఇండ్లకు వెళ్లొద్దని ఆదేశం
◆ విలువైన డాక్యుమెంట్లు సీజ్
◆ అసైన్డ్ లబ్దిదారులకే పేచీ
◆ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటున్న ఏసీబీ
◆ పరిహారంకోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బాధితులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
తినమరిగిన అధికారులకు నిమ్జ్ కార్యాలయం అడ్డగా మారింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే కార్యాలయానికి సంబంధించిన ఓ లంచం వ్యవహారంలో న్యాల్కల్ ఆర్యని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. ఈ సంఘటనలో అధికారులు అప్రమత్తమై తప్పించుకున్నారు. ఎవరికివారుగా ఉన్నతాధికారులను కాకాపట్టి బదిలీపై వెళ్లిపోయారు. ఎలాగైనా పెద్దచేపను పట్టుకోవాలని ఆశించి భంగపడ్డ ఏసీబీ అధికారుల వ్యూహం ఇప్పటికి ఫలించింది. అనుకున్నట్టుగా నీమ్స్ పెద్ద తలకాయలు అందులో చిక్కిపో యాయి. భూముల నష్టపరిహారం వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల్లోకి పంపించారు.
◆ అడ్డాగా మారిన కార్యాలయం
◆ విలువైన డాక్యుమెంట్లు సీజ్
◆ అసైన్డ్ లబ్దిదారులకే పేచీ
◆ ప్రభుత్వ భూమే కదా..!
◆ ఇస్తే తప్పేంటని బెదిరింపులు
జహీరాబాద్: లంచాలు తినమరిగిన అధి కారులకు నిమ్స్ కార్యాలయం అడ్డగా మారింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే కార్యాలయానికి సంబంధించిన ఓ లంచం వ్యవహారంలో న్యాల్మల్ అర్బని ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. తీగ లాగితే దొంక కదులుతుందని భావించిన అధికారు లకు అప్పట్లో నిరాశ మిగిలింది. ఈ సంఘటనతో అప్రమత్తమైన అధికారులు తమ కాలికి బుద్ధిచెప్పి తప్పించుకున్నారు. ఎవరికివారుగా ఉన్నతాధికారు లను కాక పట్టి నిమ్జ్ కార్యాలయాన్ని వదిలి బదిలీపై వెళ్లిపోయారు. ఎలాగైనా పెద్దచేపను పట్టుకోవాలని కాశించి భంగపడ్డ ఏసీబీ అధికారుల వ్యూహం ఇప్పటికి ఫలించింది. అనుకున్నట్టుగా నిమ్జ్ పెద్ద తల కాయలు అందులో చిక్కిపోయాయి. భూముల నష్టప రిహారం వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటక టాల్లోకి పంపించారు. అందగొండి అధికారులు అప్ప టికప్పుడు తప్పించుకున్నప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు సామాన్యుల ఆవేదనకు బలికాక తప్పదనేది సత్యం. 24గంటల పాటు అధికారులు అక్కడే..