ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లోని మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద ఓదెల నుండి పెగడపల్లి కి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని సిమెంట్ లారీ బైక్ వెనక భాగం లో బలంగా ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోత్క పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెలితే బాధితులు,పోలీసుల కథనం మేరకు ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు యాదవ్ సుమారు 38 సం. కావేరి సీడ్స్ అగ్రి ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు.ఉద్యోగ రీత్య ఓదెల నుండి పెగడపల్లి కి వెళ్లే క్రమంలో ఉదయం 10:30 సుమారు లో ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ సమీపంలో బైక్ పై వెళ్తుండగా సిమెంట్ లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. దీంతో తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు రిషి కుమార్,లడ్డు ఉన్నారు. పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పత్రి కి తరలించారు.

బుల్లెట్ బైక్ సైలెన్సర్ల మోత.

బుల్లెట్ బైక్ సైలెన్సర్ల మోత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో బుల్లెట్ బైక్ సైలెన్సర్ సౌండ్ పొల్యూషన్తో ప్రజలు భయభ్రాంతుల గురవుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా యువత రోడ్లపై రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. బుల్లెట్టు వాహనాలు నడుపుతూ భీకరమైన సైలెన్సర్ సౌండ్లతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైన పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

బైక్ ఇప్పివ్వలేదని బావిలోకి ఆత్మహత్యాయత్నం.

బైక్ ఇప్పివ్వలేదని బావిలోకి ఆత్మహత్యాయత్నం.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

బైక్ ఇప్పించడం లేదని బావిలోకి యువకుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన న్యాల్కల్ మండలం మామిడిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సాల్మన్ (32) బైక్ ఇప్పించాలని తల్లితో తరచుగా గొడవపడేవాడు. గురువారం కూడా తల్లితో గొడవపడి బయటికి వెళ్లి గ్రామంలో ఉన్న బావిలో దూకాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో గ్రామస్తులు సాల్మన్ ను బయటకు తీశారు.

బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.

బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని నవాబుపేట గ్రామానికి చెందిన జిల్లేల కుమార్(42) తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో మంగళవారం రాత్రి చిట్యాల మండల కేంద్రంలోని ఎఫ్ సి ఐ గోదాం సమీపంలో బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, అనంతరం పోలీసులు పోస్టుమార్టం కోసం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు, ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది, కుమారు మృదుస్వభావి అందరితో కలుపుకుపోయే మంచి వ్యక్తి అని అకారణంగా దూరమైనందుకు గ్రామ ప్రజలే కాకుండా మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు, కుమారు ఉన్నత విద్యావంతుడు పీజీ వరకు చదివి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వ శిక్ష అభియాన్ లో అకౌంటెంట్గా పనిచేసినాడు, తర్వాత కైలాపూర్ గ్రామ కారోబార్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు.అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు.చిట్యాల నుండి నవాబుపేటకి తన ఇంటికి వెళ్తుండగా చిట్యాల చెరువు సమీపంలో తాడి చెట్టుకు డీ కొనడంతో రాత్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version