రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

రాజీవ్ యువ వికాస పథకం – పేదలకు అందని ద్రాక్ష!

సంఘీ ఎలేందర్, తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు

వరంగల్, నేటిధాత్రి

 

 

రాజీవ్ యువ వికాస పథకాన్ని సిబిల్ స్కోరు ఆధారంగా అమలు చేయడం వలన అసలు లబ్ధి పొందాల్సిన పేద ప్రజలకు ఇది అందని ద్రాక్షగా మారుతుందన్న ఆవేదనను తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు సంఘీ ఎలేందర్ వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బ్యాంకు బాధితులుగా మారిన ఎంతో మంది పేద కుటుంబాలు గతంలో తీసుకున్న లోన్లు, వాటికి సంబంధించిన చెల్లింపులు కట్టని కారణంగా వారి సిబిల్ స్కోర్ దెబ్బ తినడం జరిగింది. ఇప్పుడు అదే సిబిల్ స్కోర్‌ను రాజీవ్ యువ వికాస పథకానికి అర్హతగా మారుస్తే, దాదాపు 40 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది అన్నారు. ప్రస్తుతం 16.25 లక్షల మంది పథకానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో, ఇంత పెద్ద సంఖ్యలో పేదలు ఈ అవకాశాన్ని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పథకం కింద నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడతాయి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులతో చర్చించి, సిబిల్ స్కోరు వంటి అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది అని ఆయన విజ్ఞప్తి చేశారు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు

ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తు గడువు దగ్గర పడుతున్నట్లుగా గమనించి, లబ్ధిదారులు ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా  తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version