యువతి యువకులకు 26 మెగా జాబ్ మేళా పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ లో
గణపురం ఎంపీడీవో ఎల్ భాస్కర్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో రైతు వేదికలో
భూపాలపల్లి నియోజక వర్గం లోని యువతీ యువకులకు ఉన్నత స్థాయి అర్హతకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వ,ప్రవేట్, కార్పొరేట్ వివిధ శిక్షణ సంస్థల భాగస్వామ్యం తో దీవి.26/4/2025 రోజున ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు
భూపాలపల్లి లోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ నందు మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందిఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు తగ్గట్టుగా వివిధ కంపెనీలతో ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ మాట్లాడి 6వ తరగతి నుండి పీజీ వరకు, టెక్నికల్ విద్య ఇతర రంగాలలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వివిధ సెక్టార్, ఐటీ సెక్టర్, నెట్వర్క్ ఇంజనీరింగ్ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్ ,ఫార్మసీ, మెకానికల్ ఇంజనీర్, క్వాలిటీ ఇంజనీర్, క్వాలిటీ మెకానికల్ ఇంజనీర్, ఫైనాన్సు రంగంలో, ఆడిట్ రంగంలో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ రంగంలో, టెలికాలర్ రంగంలో, సెక్యూరిటీ రంగంలో, డెలివరీ బాయ్స్ తదితర సంస్థలు ఈ కార్యక్రమంలో హాజరవుతున్నందున యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది.
జాబ్ మేళా విజయవంతం చేయుటకు గాను ఈరోజు గణపురం మండల కేంద్రంలోని రైతు వేదిక లో(10/4/2025) రోజున సన్నహాక సమావేశం వివిధ ప్రభుత్వ శాఖల గ్రామస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేయడం జరిగింది.

ఇట్టి సమావేశమున కు ఆర్డీవో ఎన్ రవి మాట్లాడుతూ, గ్రామాల్లో నిరుద్యోగ యువత సరియైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి మంచి అవకాశం కల్పించినట్లు అయితే సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదగ గలరని, గ్రామస్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మీ గ్రామాల్లోని యువతకు ఇట్టి సమాచారం చేరవేసి మెగా జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేయాలని కోరినారు.
మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎల్ భాస్కర్ మాట్లాడుతూ 100 కి పైగా కంపెనీలు మన ప్రాంతానికి రావడం యువతీ యువకుల అదృష్టమని, ప్రతి గ్రామం లోని యువతకు తెలియజేసి అత్యధిక సంఖ్యలో మండలం నుండి జాబ్ మేళాలో పాల్గొనేటట్లు చేయాలని కోరినారు, ఈ కార్యక్రమం లో మండల తహసిల్దార్ ఏం సత్యనారాయణ , వ్యవసాయ అధికారి ఐలయ్య , మండల విద్యాశాఖ అధికారి ఉప్పలయ్య గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు అంగన్వాడీ సూపర్వైజర్లు ఆశా వర్కర్లు, గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగులు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.