మట్టెవాడ సిఐ గా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం సీఐ ల బదిలీలు జరిగాయి అందులో బాగంగా మట్టెవాడ పోలీస్ స్టేషన్ కు నూతన ఇన్స్ స్పెక్టర్ గా కరుణాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2007 సంవత్సరం ఎస్.ఐ బ్యాచ్ కు చెందిన కరుణాకర్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎస్. ఐ గా పని చేశారు. ఇన్స్ స్పెక్టర్ గా ఇంటెలిజెన్స్, సైబర్ క్రైం విభాగాల్లో పనిచేయడం తో పాటు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హన్మకొండ, మహిళా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించారు. మాట్వాడా స్టేషన్ లో పనిచేస్తున్న తుమ్మ గోపి విఆర్ కు బదిలీ అయ్యారు.