ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకలు…

ఘనంగా ప్రముఖ వ్యాపారవేత్త జన్మదిన వేడుకలు.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

 

కల్వకుర్తి పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త జిల్లా రైస్ మిల్ మాజీ అధ్యక్షుడు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ట్రస్టీ చైర్మన్ జూలూరు రమేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కల్వకుర్తి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఉచిత మధుమేహ పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలోని సత్యేశ్వర ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ కల్వకుర్తి అధ్యక్షుడు బాదం రాఘవేందర్,ప్రధాన కార్యదర్శి నీల కోటేశ్వర్, జోన్ చైర్మన్ చిదిరే శ్రీనివాసులు, పూర్వ అధ్యక్షులు ఈ. రమేష్, జి . శంకర్,. కె గోపాల్, జే సత్యనారాయణ,. యo. అశోక్, బాదం హరీష్,సిహెచ్ శ్రీధర్, గుబ్బ ప్రభాకర్, నారాయణ రాజు, పి నరసింహులు గుప్తా, పట్టణ అధ్యక్షులు వాస శేఖర్, కంది ప్రవీణ్, సంబు రమణ, దుగ్గి వెంకటేష్,పాపిశెట్టి శ్రీనివాసులు, గార్లపాటి శ్రీనివాసులు, సంబు ముత్యాలు,రాచూరి రామ్మోహన్, పోల శ్రీధర్,గోవిందు చంద్రయ్య, వాసవి క్లబ్ మిత్రులు పాల్గొన్నారు. 

బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.

బైకు ప్రమాదంలో గ్రామపంచాయతీ కారోబార్ మృతి.

చిట్యాల, నేటిధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని నవాబుపేట గ్రామానికి చెందిన జిల్లేల కుమార్(42) తన పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో మంగళవారం రాత్రి చిట్యాల మండల కేంద్రంలోని ఎఫ్ సి ఐ గోదాం సమీపంలో బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, అనంతరం పోలీసులు పోస్టుమార్టం కోసం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు, ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది, కుమారు మృదుస్వభావి అందరితో కలుపుకుపోయే మంచి వ్యక్తి అని అకారణంగా దూరమైనందుకు గ్రామ ప్రజలే కాకుండా మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు, కుమారు ఉన్నత విద్యావంతుడు పీజీ వరకు చదివి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వ శిక్ష అభియాన్ లో అకౌంటెంట్గా పనిచేసినాడు, తర్వాత కైలాపూర్ గ్రామ కారోబార్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుండేవాడు.అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు.చిట్యాల నుండి నవాబుపేటకి తన ఇంటికి వెళ్తుండగా చిట్యాల చెరువు సమీపంలో తాడి చెట్టుకు డీ కొనడంతో రాత్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version