విద్యుత్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.

విద్యుత్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు,
. ప్రమాదమా..? వివాదమా..?
విచారణ చేపట్టిన విద్యుత్ అధికారులు.
– వరంగల్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు,
నేటి ధాత్రి, మొగుళ్ళపల్లి:

 

 

 

 

మొగుళ్ళపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో గురువారం విద్యుత్తు స్తంభం పై నుండి కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తున్న జనే అనిల్ అలియాస్ అంజి (35) 33 లెవెన్ కె.వి వైర్లు తగిలి పై నుండి కింద పడి తీవ్ర గాయాల పాలు అయ్యాడు స్థానికులు అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్యం కోసం వరంగల్ ప్రైవేటు దావఖానా కు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మొట్లపల్లి గ్రామానికి చెందిన జెన్నే అనిల్ అలియాస్ అంజి గత కొన్ని సంవత్సరాలుగా మొట్లపల్లి సబ్ స్టేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో గ్రామంలోని లెవెన్ కె.వి విద్యుత్తు వైర్లు మరమ్మత్తులు చేస్తుండగా పైన ఉన్న 33 కెవి వైర్లు తగిలి తగలడంతో విద్యుత్ ప్రమాదానికి గురై పైనుండి కింద పడ్డాడు. అయితే 11 కెవికి ఎల్సి తీసుకొని మరమ్మతులు చేస్తున్న అనిల్ ను ప్రమాదానికి కావాలనే గురిచేయాలని కొంతమంది 33 కెవి లైన్ 11 కేవీ లైన్ పైన పచ్చికొమ్మలను వేసి ప్రమాదానికి గురి చేశారని గ్రామంలో ప్రచారం జరుగుతోంది ఇట్టి విషయంపై విద్యుత్తు ఉన్నతాధికారులు గ్రామంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం..!

మహా శివరాత్రి వేళ రాష్ట్రంలో ఘోర ప్రమాదం.. గర్భిణీ సహా ఇద్దరు స్పాట్ డెడ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అంతారం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. భార్య శోభన గర్భిణి కావడంతో తల్లి లక్ష్మితో కలిసి రవి అనే వ్యక్తి బైకుపై ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఇటీవలే సంగారెడ్డికి చెందిన జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి కుటుంబం కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version