ధాన్యంకొనుగోల్లలో వేగం పెంచాలి..

ధాన్యంకొనుగోల్లలో వేగం పెంచాలి..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

జిల్లా కలెక్టర్ తో కలసి అధికారులు, రైస్ మిల్లర్లతో నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యే సమీక్ష.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అకాల వర్షాలు,గాలిబేవత్సానికి రైతులు నష్ట పోకుండా ధాన్యం కొనుగోలుల పట్ల వేగంపెంచాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.సోమవారం నర్సంపేట రైతు వేదికలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలసి అధికారులు, రైస్ మిల్లర్లతో నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించి సమర్ధ నిర్వహణకు పలు సూచనలు చేశారు.

Rice Millers.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రబి కాలంలో నియోజకవర్గంలోని 6 మండలాల్లో అధిక వరి దిగుబడి వచ్చిందని, ఇప్పటివరకు 40 శాతం ధాన్యం కొనుగోలు చేసారని అన్నారు. క్షేత్ర స్థాయిలో మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి అధికారులు ధాన్యం నిలువ వివరాలు సేకరించి ,దాని ప్రకారం ప్రణాళికాబద్ధంగా లారీలను, హమాలీలను ఏర్పాటు చేసుకొని వేగవంతంగా మిల్లులకు తరలించాలని సూచించారు.రైస్ మిల్లర్లకు సామర్ధ్యాన్ని బట్టి వెంటనే కేటాయింపులు చేయాలని అధికారులను ఆదేశించారు.
కొంత మంది మిల్లర్లు కావాలని తరుగు పేరుతో రైతులను ఇబ్బం దులు పెడుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ట్రక్ షీట్ ప్రకారమే తీసుకోవాలని కోతలు విధిస్తే ఉపేక్షించేది లేదన్నారు. 1638 రకం ధాన్యం ను గ్రేడ్ ఏ క్రింద పరిగణించి వాటిని తిరస్కరించకుండ తీసుకోవాలని తెలిపారు.ఎక్కువ నూకలు వస్తున్నాయని బోయిల్డ్ రైస్ క్రింద తీసుకోనుటకు అనుమతించాలని మిల్లర్లు ఎమ్మెల్యే కు తెలుపగా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకొంటామని ఎమ్మెల్యే అన్నారు. రైతులు పండించిన ప్రతీ గింజ ను ప్రభుత్వం కొనేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో 1.07 మెట్రిక్ టన్నుల అంచనా ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 31.54 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. , ఇంకను 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓపిఎం ఎస్ నమోదు వెంటనే చేయాలని,తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు పంపించాలని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలను వెంటనే ఖాళీ చేసే ప్రయత్నం చేయాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకూడదని అన్నారు.

Rice Millers.

 

కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నిర్దేశిత మిల్లులకు తరలించాలని తెలిపారు.అవసరమగు లారీలు సమకూర్చాలని జిల్లా రవాణా అధికారిను కలెక్టర్ ఆదేశించారు.
హమాలీల కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద సకాలంలో అన్‌లోడింగ్‌ చేసుకునేలా పర్యవేక్షించాలన్నారు. తగినంత టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను సూచించారు.
ఈ సమీక్ష లో ఆదనవు కలెక్టర్ సంధ్యా రాణి, నర్సంపేట మార్కేట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, డిఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ,ఆర్డీఓ ఉమారాణి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దళిత రత్న అవార్డు ప్రధానం.

‘దళిత రత్న అవార్డు ప్రధానం’

బాలానగర్ నేటి ధాత్రి:

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా.. హైదరాబాదులోని సికింద్రాబాద్ బల్మర్ క్లాసిక్ గార్డెన్ లో సోమవారం దళిత రత్న అవార్డుల ప్రధానం చేశారు. బేడ బుడగ జంగాల హక్కుల దండు వ్యవస్థాపక అధ్యక్షులు చింతల రాజలింగం ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కళ్లెం యాదయ్యకు దళితరత్న అవార్డును ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు ఉత్సవాల సందర్భంగా తనకు దళిత రత్న అవార్డు ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ఇండ్లు కంప్లీట్ చేసుకోండి బిల్లులు చెల్లిస్తాం..

ఇండ్లు కంప్లీట్ చేసుకోండి..బిల్లులు చెల్లిస్తాం..

త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకోవాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనుల పరిశీలన..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో రామ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ చేసుకోండి. బిల్లులు కూడా వెంటనే చెల్లించబడతాయని లబ్ధిదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తానని లబ్ధిదారులతో కలెక్టర్ వివరించారు.

Collector Dr. Satya Sarada..

 

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రావిచంద్రా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,హౌసింగ్ పీడీ గణపతి, డిఇ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర.

నూతన దంపతులను ఆశీర్వధించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర….
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:

మొగుళ్ళపల్లి మండలం, పర్లపల్లి గ్రామ వాస్తవ్యులు, గండ్ర వీరాభిమాని బోయిని స్వామి గారి తమ్ముడు బోయినిరాములు – స్వరూప గార్ల కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్ని నూతన దంపతులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .

వారి వెంట మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య, చిట్యాల వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, నాయకులు బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, చెక్క శ్రీధర్ గ్రామ అధ్యక్షులు గడ్డం రాజు గౌడ్, రాజేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు నేర్పాటి శ్రీనివాస్, యూత్ ఉపాధ్యక్షులు జన్ని రాజు, మాజీ కో ఆప్షన్ నెంబర్ రహీం, సీనియర్ నాయకులు గుండారపు రాజు, బండి కుమార్ స్వామి, తిమ్మాపురం ఆనంద్, ఆకినపల్లి చిరంజీవి, మరియు గండ్ర అభిమానులు పాల్గొన్నారు

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి.

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి

ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

 

 

లేబర్ కోడ్స్ రద్దు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని కనీస పెన్షన్ Rs/- 9000 ఇవ్వాలని, స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనం అమలు చేయాలని హమాలి,బీడీ,భవన నిర్మాణం, ఆటో అండ్ మోటార్,తదితర రంగంలో పనిచేస్తున్న సంఘటిత కార్మికులకు సామాజిక బాధ్యత కల్పించాలని ఈ.ఎస్.ఐ,ఈ.పి.ఎఫ్, ఇన్సూరెన్స్,సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్లపై మే 20 న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు కార్మిక వర్గనికి పిలుపునిస్తుంది.

అలాగే మే 20న జరగవలసిన సమ్మెను దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సార్వత్రిక సమ్మెను వాయిదా వేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని,కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

కానీ సరిహద్దుల్లో కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఇరుదేశాలు ప్రకటించిన నేపథ్యంలో దేశంలో సాధారణ పరిస్థితిలో నెలకొన్న స్థితిలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను వాయిదా వేయటం సరికాదని ఐ ఎఫ్ టి యు భావిస్తుంది.

ఒకవేళ వాయిదా వేయాల్సి వస్తే కేంద్ర కార్మిక సంఘాలు మే 9న ఢిల్లీలో సమావేశమైన సందర్భంలోనే నాటి నిర్దిష్ట పరిస్థితులలో ఈ నిర్ణయం తీసుకొని ఉంటే కార్మికులకు వాయిదా వేయాల్సిన విషయాన్ని అర్థం చేయించడానికి అవకాశం ఉండేది.దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగి కార్మికులు సమ్మెకు సన్నద్ధమై ఉన్న తరుణంలో అకస్మత్తుగా సమ్మెను వాయిదా వేయడం వలన కార్మికులను నిరాశ నిస్పృహ గురి చేసుకున్నది.

ఈ నిర్ణయం కార్మిక వర్గంలో కార్మిక సంఘాల పట్ల విశ్వాసం సన్నగిల్లడం కోసం దోహదపడుతుంది.

భవిష్యత్తు కాలంలో కార్మిక వర్గం సమ్మెలకు దూరంగా ఉండే ప్రమాదం ఉంటుంది.కేంద్రం మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై దాడిని మరింత ముమ్మరంగా చేయడానికి అవకాశం ఇప్పటికే టోకెన్ సమ్మెలు, ఒక్కరోజు సమ్మె వలన కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలపై తాగిన ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం లేకుండా పోతున్న తరుణంలో కార్మిక వర్గంలో క్రమంగా మిలిటేన్సిని పెంచుతూ నిరవధిక సమ్మెల వైపు కార్మిక వర్గాన్ని సన్నద్ధం కర్తవ్యాన్ని కలిగి ఉండి కార్మిక సంఘాలు ముందుకు పోవాల్సిన తరుణంలో ఈ తరహా సమ్మేలను కూడా నిర్మాణాత్మకంగా నడపకపోతే కార్మికుల నుండి కార్మిక సంఘాలు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది.సమ్మె వాయిదా పట్ల ఐ ఎఫ్ టి యు కు భిన్నభిప్రాయం ఉన్నప్పటికీ ఐక్య కార్యక్రమం పట్ల ఉన్న గౌరవం ఐక్య ఉద్యమాలకు ఉన్న ప్రాధాన్యత దృశ్య ఐక్య కార్యచరణలో నిర్దేశించుకున్న పద్ధతులకు కట్టుబడి ఉండే సంస్థగా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన ఈ ఉమ్మడి పిలుపులో మా సంస్థ కూడా భాగస్వామిగా ఉన్నందున మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను జూలై 9కి వాయిదా వేస్తూ చేసిన నిర్ణయానికి కట్టుబడి మే 20 న జరగాల్సిన,నిరసన ప్రదర్శన కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్ని జిల్లాల్లో మా సంస్థ అన్ని జిల్లాల్లో చురుకైన పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ రాష్ట్రంలోని వివిధ విభాగాలలో పనిచేస్తున్న కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐ ఎఫ్ టి యు కార్మికులను విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.

తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర.!

తెలంగాణ జాగృతి మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలుగా మారిపెల్లి మాధవి

ప్రగతి గ్రామైఖ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

మరిపెడ నేటిధాత్రి:

మహబూబాబాద్ జిల్లా విఓఎ ఉద్యోగుల సంఘం,మరిపెడ మండల కమిటీ,ప్రగతి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో చిల్లంచర్ల గ్రామంలో తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి కి ఘనంగా సన్మానించినారు. జాగృతి వ్యవస్థపాక అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మే,16, 2025 న మాధవిని నూతనంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. ఈ సందర్భంగా గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. వి ఓ ఎ రంగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలమైనా నిర్మాణం చేసిన పనితనాన్ని గుర్తించిన కవిత ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు కవితక్క కు కృతజ్ఞతలు తెలిపారు.

Women’s

తనకిచ్చిన బాధ్యతను అలుపెరుగకుండా,మహిళల అభివృద్ధికి, మహిళలను అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు పాత్ర ఎప్పటికీ ఉంటుందని గుర్తు చేశారు,మహిళల సమస్యల మీద పోరాడుతనని, సమాజంలో మహిళపై జరిగే అఘైత్యాలు, అరాచకాలని జాగృతి తరుపున అరికడతామని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి వివోఏల మరిపెడ మండల అధ్యక్షులు రాంపల్లి వెంకన్న గౌడ్,కొండూరు వెంకటయ్య, నాగంజన చారి,నూక రవి, వీరన్న, శాంత కుమారి, జాగృతి నాయకులు గంధసిరి వేణు,నాగిరెడ్డి, దోమల సోమయ్య, ఈరగాని ఉపేందర్,సిరాజ్,మురళి, నూక సురేష్,వివో సభ్యులు శిరీష, రేఖ కేతమ్మ, బొల్లు రమణ, ఆశ, బొల్లు హైమా, రేఖా లింగమ్మ, మౌనిక, శోభ, ఉప్పమ్మ, వినోద, మంజుల, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు.

భద్రాచలం నుండి శ్రీ సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు

ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలోని ధర్మ రావు పేట గ్రామంలో భద్రాచలం నుండి శ్రీ సీతారాముల కళ్యాణ ముత్యాల తలంబ్రాలు అందించడం జరిగింది.. ప్రతి సంవత్సరం గోటితలంబ్రాలను శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యాణానికి పంపించడం జరుగుతుంది వారు కూడా శ్రీరామనవమి కళ్యాణం తర్వాత మళ్లీ మనకు ఆ కళ్యాణ తలంబ్రాలను పంపించడం అనాదిగా వస్తుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీలక్ష్మి మేడం తలంబ్రాలను పంపించడం జరిగింది . ఈ ముత్యాల తలంబ్రాలను గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి అందించడం జరుగుతుంది దాదాపు 200 మంది జయశంకర్ జిల్లాతో పాటు ములుగు జిల్లా వారు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో చేయడం జరిగింది . ధర్మరావుపేట తో పాటు బస్సు రాజు పల్లి 1000 క్వాటర్స్ తిరుమలగిరి కాశీందేవ్ పేట గ్రామాల వారికి పంపించడం జరుగుతుందని ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన.

నేటి ధాత్రి వార్తకు విద్యుత్ అధికారుల స్పందన

నిజాంపేట: నేటి ధాత్రి

 

నేటి ధాత్రిలో ప్రచురితం అయిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గ్రామానికి చెందిన టేకుమల్లి యాదయ్య పొలం వద్ద 11 కేవి కరెంట్ వైర్లు “ప్రమాదకరంగా 11 కేవి విద్యుత్ వైర్లు” అనే శీర్షికతో శనివారం ప్రచురితం కాగా సంబంధిత కరెంట్ ఎఈ గణేష్ స్పందించి సిబ్బందిని పంపించి నూతన స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా రైతు యాదయ్య మాట్లాడుతూ.. తమ సమస్య పరిష్కారనికి తోడుగా నిలిచిన నేటి ధాత్రి న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కబ్జాలు కాదు పేదల పెన్నిధి.

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కబ్జాలు కాదు పేదల పెన్నిధి

మాజీ ఎంపీ ఎంపి కృష నాయక్

వనపర్తి నేటిధాత్రి :

భూములన్నీ మాజీ మంత్రి నిరంజన్ కబ్జా చేశారు అని ఎమ్మెల్యే మేగారెడ్డి అంటున్నారని అవినీతి నిరూపణ చేయాలని మాజీ ఎంపీ ఎంపీ కృష్ణ నాయక్ మాజీ మంత్రి నివాసములో విలేకరులసమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.నిరంజన్ రెడ్డి ఒక్క గుంట కబ్జా చేసినా రాజీనామాకు సిద్ధం.నీవు సిద్ధమా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పై ఫిర్యాదు నీవే చేస్తావు తీర్పు నీవే ఇస్తావా అని ప్రశ్నించారు.అభివృద్ధి చేతకాక బురద చల్లుతున్నావు. నిరాధార ఆరోపణలపై న్యాయ స్థానాలలో తేల్చుకుంటాంమని అన్నారు వనపర్తి లోరోడ్ల విస్తరణ, ఐ.టి.హబ్,ఇంటిగ్రేటెడ్ విద్యా సముదాయాలు,పాలిటెక్నిక్ ఆధునీకరణతో పాటురాష్ట్ర ప్రభుత్వ.ప్రజలకు ఇచ్చి న హామీలు రైతు బంధు, రైతు భరోసా రైతు రుణ మాఫీ ధాన్యంపై 500బోనస్,మహిళకు 500 వంట గ్యాస్ సిలిండర్ 2500,తులం బంగారం,నిరుద్యోగ భృతి,కె.సి.ఆర్ కిట్టు వంటి పథకాలు అమలు చేసి నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధిని మించి అభివృద్ధి చేసి చూపాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరు.ల సమావేశములో బీ ఆర్ ఎస్ నేతలు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుసరమేష్ గౌడ్,మార్క ఫేడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా,మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,సునీల్ వాల్మీకి,మంద.రాము,అలీం,శంకర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు

రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!!

రోడ్లపై విగ్రహ తయారీ కేంద్రాలు….!!!

నిబంధనలకు విరుద్ధంగా రేకుల షెడ్డుల నిర్మాణం

చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు, గ్రానైట్ పెర్మిషన్ లేకుండానే వ్యాపారం

లక్షల్లో వ్యాపారం, పట్టించుకొని ఆదాయపు శాఖ అధికారులు?

ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న విగ్రహ తయారీ పరిశ్రమలు

పట్టించుకోని మున్సిపల్ అధికారులు., తడకల షెడ్డుకు విద్యుత్ కనెక్షన్ లు?

Construction

 

మామూళ్ల మత్తులో మున్సిపల్ సిబ్బంది, విద్యుత్ అధికారులు?

దుమ్ము దూలితో వాహనదారులకు ఇబ్బందులు

జీఎస్టీ లేదు, బిల్లు బుక్కులు లేవు, రోజుకు లక్షల రూపాయల వ్యాపారం

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విగ్రహ వ్యాపారాలు.

 

Construction

 

 

ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉండాల్సిన పరిశ్రమ కేంద్రాలు, రోడ్ల మీద తడకల షెడ్డు వేసి అక్రమ వ్యాపారం

చిన్న స్థాయి, పై స్థాయి ఉన్నతాధికారుల వరకు అందరికీ ముడుపులు?

వరంగల్, ములుగు రోడ్డు, ఆరేపల్లి, నేటిధాత్రి

 

 

 

ప్రభుత్వ జాగా, కెనాల్ కాలువకు ఆనుకొని దర్జాగా తడకల (రేకుల) షెడ్డు వేసి, అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని, ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాల తయారీ నడుపుతున్న నిర్వాహకులు. వివరాల్లోకి వెళితే వరంగల్ ములుగు రోడ్డు నుండి ఆరేపల్లికి వెళ్ళే దారిలో, పెద్దమ్మగడ్డ కెనాల్ కాలువ పక్కన, అలాగే ఆరేపల్లి వ్యవసాయ క్షేత్రం ముందు ఉన్న విగ్రహ తయారీ నిర్మాణ కేంద్రాలు అక్రమంగా తడుకలు, రేకుల షెడ్డులు వేసి, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్న తీరు.

Construction

 

ప్రధాన రహదారిపై వ్యాపారానికి ఎవరు పెర్మిషన్ ఇచ్చారు? విద్యుత్ కనెక్షన్ ఎలా వచ్చింది? రోజు విగ్రహాలు తయారీ వలన దుమ్ము ధూళి వెలువడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్న పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఇక్కడ తయారు చేసిన విగ్రహాలను వేల రూపాయలకు అమ్ముతూ ఎలాంటి జీఎస్టీ కానీ, బిల్లు బుక్కులు కూడా లేకుండా అమ్ముతున్న నిర్వాహకులు. ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా, అక్రమంగా నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న విగ్రహ తయారీ కేంద్రాలను సీజ్ చేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా రోడ్డు మీద పట్ట పగలు అక్రమ వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజల విన్నపం.

Construction

 

ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఉండాల్సిన తయారీ పరిశ్రమ కేంద్రాలు, ప్రధాన రహదారులపై ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగించడం, తనిఖీలు చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు, గ్రానైట్ పెర్మిషన్ లేకుండానే వ్యాపారం? లక్షల్లో వ్యాపారం, పట్టించుకొని ఆదాయపు శాఖ అధికారులు? విజిలెన్స్ అధికారులు స్పందిస్తారా లేదా వేచి చూడాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తయారి కేంద్రాలను వేరే చోటికి తరలించాలని ప్రజలు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా అందుకున్.!

గీతం యూనివర్సిటీ నుండి పిహెచ్‌డి పట్టా అందుకున్న డాక్టర్ దీప్తి..

వరంగల్ తూర్పు నేటిధాత్రి:

వరంగల్ నగరానికి చెందిన స్కాలర్ ఆర్ దీప్తి, గీతం యూనివర్శిటీ విశాఖపట్నం లోని, స్కూల్ ఆఫ్ ఫార్మసీ నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీకి అర్హత సాధించారు. ఈ విషయాన్ని ఇటీవల విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం రిజిస్టర్ ప్రకటించారు. గీతం యూనివర్సిటీ పరిశోధనా స్కాలర్ అయిన రయిల్లా దీప్తి “అడెనిన్-ప్రేరిత దీర్ఘకాలిక కిడ్నీ నష్టం మరియు కార్డియోవాస్కులర్ ఆల్టరేషన్స్-టార్గెటింగ్, టిజిఎఫ్, కాస్పేస్ 3, ఎంచుకున్న సహజ సమ్మేళనాల రక్షణ ప్రభావాల మూల్యాంకనం” అనే శీర్షికతో తన పిహెచ్‌డి పరిశోధనను సమర్పించింది. ఆమె గీతం విశ్వవిద్యాలయంలో ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి సుహాసిన్ పర్యవేక్షణలో తన పరిశోధన చేశారు. వరంగల్ నగరానికి చెందిన డాక్టర్ దీప్తి, ప్రస్తుతం హనుమకొండ జిల్లా, ఓగ్లాపూర్‌లోని కేర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అంకిత భావంతో డాక్టర్ దీప్తి పిహెచ్‌డి పూర్తి చేయడం పట్ల తోటి స్కాలర్స్, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు దీప్తిని అభినందించారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలో ఈరోజు ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్లో 1985-1986 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ను నిర్వహించారు సమావేశానికి ముందుగా వందేమాతరం తో ప్రారంభించి తర్వాత జ్యోతి ప్రజ్వలన గురువు లచే చేయించడమైనది
గురువులను సన్మానించి ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా 40 సంవత్సరాల క్రితం చదివిన స్మృతులు నెమరూ వేసుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ప్రవీణ్ మోడల్ హై స్కూల్ డైరెక్టర్ ఎల్ యాదగిరి అధ్యక్షత వహించగా మారగాని శ్రీనివాస్ యం సారీ రాజన్న ముల్కనూరు రవి మిరియాల రత్నయ్య ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.

Alumni reunion

ఈ కార్యక్రమానికి సుమారు 70 మంది విద్యార్థులు గురువులు వారి పరిచయాలు వారి కుటుంబ జీవనం భవిష్యత్తు గురించి కూడా చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జనే మొగిలి వోడాపెల్లి నరేందర్ దూలం శివశంకర్ కొవ్వూరి శ్రీనివాస్ బత్తిని రాజన్న సత్యం వెంకటేశ్వర్లు మార్గ మహేందర్ వేణుగోపాల్ రెడ్డి గాద శ్రీనివాస్ మామిళ్ల సురేందర్ కోల మహేందర్ బేతి రవీందర్ రెడ్డి సంజీవ్ పూల రాజేందర్ సంపత్ నరసింహస్వామి సుదర్శన్ బుచ్చన్న మొగిలి నారగాని సుజాత నాగపురి సుజాత సులోచన ప్రసున ఉమా శకుంతల ఎండి హాజీ మున్నిస తదితరులు పాల్గొన్నారు

మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదా తిరస్కరించండి.

మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదా తిరస్కరించండి.

తొర్రూర్ (డివిజన్) నేటిదాత్రి

 

 

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవసాయ మార్కెట్ల చట్ట సవరణ ముసాయిదాను భారత రైతాంగం తిరస్కరించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. డివిజన్ కేంద్రమైన తొర్రూర్ లో సోమవారం రోజున సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) కరపత్రం సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు తన పండించిన పంటకు చట్టం తేవడంలో నరేంద్ర మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. రైతు తన పండించిన పంటలకు మార్కెట్లో అమ్ముకోవడానికి ఉన్న వ్యవస్థను మార్చి అదానీ,అంబానీ లాంటి కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ధర నిర్ణయంలో గాని, తూకాలలో జరిగే అక్రమాలను గాని, పండించిన పంటకు డబ్బులు కొనుగోలుదారు ఇవ్వకుంటే అడిగే హక్కు లేకుండా చట్ట సవరణ ముసాయిదా ఉందని ఆరోపించారు. ఇప్పటికే పుటేడు కష్టాలలో దినదిన గండంగా బతుకుతున్న రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతూ అక్కడ రైతులకు నిలువ దోపిడి తప్పదా అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి ఈనెల 20న నిరసన ప్రదర్శనలు, జూన్ 9న గ్రామీణ భారత్ బంద్ లు జయప్రదం చేయాలని వీరన్న పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంల్ మాల్ మాస్ లాంటి డివిజన్ నాయకులు ఊడుగుల రాములు జక్కుల యాకయ్య గద్దల వెంకటయ్య గజ్జి యాకయ్య కేశవులు తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి.

గీత కార్మికులకు ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి:

తాడి చెట్టుపై నుండి జారీ పడి మృతి చెందిన గీత కార్మికులకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా వెంటనే చెల్లించాలని గోపా జిల్లా అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్,డివిజన్ అధ్యక్షుడు తాళ్లపల్లి రమేష్ గౌడ్ లు కోరారు.మండలంలోని కంటయపాలెం గ్రామానికి చెందిన పల్లె యాకయ్య గత 25 రోజుల క్రితం తాటి చెట్టు పైనుండి పడి వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పల్లె యాకయ్య గౌడ్ కుటుంబాన్ని గౌడ సంఘల ప్రతినిధులు,గోపా నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొర్రూరు మండలంలో తాటి చెట్టు నుంచి పడి చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం గీతా కార్మికుల కొరకు సేఫ్టీ మోకులు వెంటనే ఇవ్వాలని, చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఐదు లక్షల ఎక్సిగ్రేషియా కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సహకార పరపర సంఘం అధ్యక్షులు దీకొండ శ్రీనివాస్ గౌడ్,కౌండిన్య సహకార పర్పస్ సంఘం కార్యదర్శి కుంభ మహేష్ కుమార్ గౌడ్, ట్రెజరర్ పరిదీలా వెంకటేశ్వర్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు చీకటి అశోక్ గౌడ్, ముఖ్య సలహాదారులు గట్టు కమలాకర్ గౌడ్,కంఠ మహేశ్వర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గౌడ్, గ్రామ గౌడ సంఘ పెద్దలు పల్లె సర్వయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రెండో రోజు ఘనంగా శ్రీ మద్ రామాయణ మహా యాగం.

రెండో రోజు ఘనంగా శ్రీ మద్ రామాయణ మహా యాగం

మందమర్రి నేటి ధాత్రి

 

 

 

శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి రజతోత్సవ వేడుకల సందర్భంగా మిథిలా ప్రాంగణంలో సోమవారం రమణీయంగా సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.

యాగశాలలో తీర్థ గోష్టి ప్రారంభించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అనంతరం మిథిలా ప్రాంగణంలో శ్రీ సుదర్శన నారసింహ యాగం ఆరంభానికి మంగళ శాసనం అందించారు.

Maha Yagam

 

 

అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించడం కోటి సూర్య ప్రభల భగవానుడి ప్రకాశం వల్లే తొలగి పోతాయని చెప్పారు.

ప్రహ్లాదుడు అపారమైన భక్తి ప్రపత్తులు కలిగిన వాడని, ఆ అపర భక్తుడి కోసమే విష్ణువు నారసింహుడి రూపంలో వచ్చి హిరణ్యకశిపుడిని అంతం చేసిన విధానాన్ని జీయర్ స్వామి ఈ సందర్భంగా చాలా విశదీకరించారు.

విష్ణు తత్వాన్ని చూపుతూ..

సన్మార్గంలో నడిపించే వాడు సుదర్శనుడు. సుదర్శన భగవానుడు అని చెప్పారు.

Maha Yagam

ఆరాధిస్తే ప్రతి వస్తువులో ప్రతి చోటా దేవుడు ఉంటాడని జీయర్ స్వామి ఉద్బోధించారు.

ఇష్టి శాలలో ఈ యాగానికి పూర్ణాహుతి ప్రకటించిన అనంతరం..

యాగశాల హోమ గుండం వద్ద సైతం పూర్ణాహుతి హవనంతో కార్యక్రమం ముగిసినట్లు ప్రకటించారు.

Maha Yagam

కార్యక్రమంలో యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాస చార్యులు, గోవర్ధనగిరి అనంతచారీ, కుమారాచార్యులు నవీన్ చార్యులు, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి స్థానా చార్యులు డింగరి కృష్ణ చైతన్య చార్యులు, శ్రీకాంతా చార్యులు, నరసింహ చార్యులు, ఆలయ ధర్మకర్త దివంగత సురేందర్ రావు కుటుంబ సభ్యులు, మందమర్రి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, హనుమాన్ దీక్ష స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

సింగరేణి లాభాల వాటాను 40% కార్మికులకు ఇవ్వాలి.

సింగరేణి లాభాల వాటాను 40% కార్మికులకు ఇవ్వాలి

మంచిర్యాల నేటి ధాత్రి:

సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ రామగుండం ఏరియా ఆధ్వర్యంలో సెంటినరీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో సింగరేణి సంస్థ సాధించిన వాస్తవ లాభాలను ప్రకటించి లాభాలపై 40 శాతం వాటాన్ని జాప్యం లేకుండా కార్మికులకు చెల్లించాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ మరియు డైరెక్టర్ పా) కొప్పుల వెంకటేశ్వర్లు ని కలిసి మెమోరాండం అందించడం జరిగింది.అనంతరం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రకారం 2024-2025 ఆర్థిక సంవత్సరం ముగిసింది.ఇప్పటి వరకు ప్రకటించని వాస్తవ లాభాలు,జాప్యం లేకుండా వెంటనే ప్రకటించి 40% వాటాను పంపిణీ చేయుటకు ఆదేశాలు జారీ చేయాలని సంస్థ డైరెక్టర్ (పా)ని రామగుండం పర్యటనలో కలిసి చర్చించామని,
2023-24 ఆర్థిక సంవత్సరంలో 70.12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తే 37వేల కోట్ల బిజినెస్ జరిగిందని,వాస్తవ లాభాలు రూ.4701 కోట్లు ప్రకటించి,సిఎస్ఆర్ నిధులు,డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ మళ్లింపులు మినహాయింపులు రూ.2289 కోట్లు పోను రూ.2412 కోట్లలో 33% అంటే 795.96కోట్ల రూపాయలను గత సంవత్సరం చెల్లించడం జరిగిందని తెలిపినారు.అలాగే ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం కార్మికులు కష్టపడి రికార్డ్ స్థాయిలో 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి గాను 69.01మిలియన్ టన్నులు సాధించారని,వేల కోట్ల వ్యాపారం జరిగిందని,గత సంవత్సరం పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సాధించిన కార్మికుల కోసం ఈ సారి లాభాల వాటా 40% ప్రకటించాలని విజ్ఞప్తి చేసినారు.గతంలో ఇచ్చిన లాభాల వాట వివరాలు ప్రకారo 2015-2016: 23%,2016-2017: 25%,2017-2018: 27%,2018-2019: 28%,2019-2020: 28%,2020-2021: 29%,2021-2022: 30%,2022-2023: 32%,2023-2024: 33% ఇవ్వడం జరిగిందని, 40 శాతానికి పెంచడం వల్ల కార్మిక కుటుంబాలకు పిల్లల చదువులు,కాలేజీ హాస్టల్ స్కూల్స్ ఫీజులు చెల్లించుటకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుందని,త్వరితగతిన పూర్తి చేసి జూన్ మాసంలో చెల్లించుటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నాతాడి శ్రీధర్ రెడ్డి,నాయకులు రౌతు రమేష్,దొనీకిన రమేష్,తిరునహరి కిరణ్ కుమార్,సల్ల వేణు,పాక కృష్ణ, కందుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.

త్రాగునీటి బోర రిపేర్ చేయించిన.

త్రాగునీటి బోర రిపేర్ చేయించిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ

వనపర్తి నేటిధాత్రి :

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో నవత ట్రాన్స్ పోర్ట్ దగ్గర 15 వార్డులో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ త్రాగునీటి బోరును దగ్గరుండి మున్సిపల్ కార్మికులతో రిపేర్ చేయించారు . బోరు పనిచేయందున 15 వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టి కి తెచ్చారు .వెంటనే ఆయన స్పందించి మున్సిపల్ అధికారుల తెలిపి త్రాగునీటి బోరును రిపేరు చేయించారు . ఈ మేరకు 15 వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ బండారు కు ఈమేరకు కొంపల రమేష్ కొంపల సురేష్ బండారు సూరి పాపి శెట్టి శ్రీనివాస్ ఆర్ ఎంపీ డాక్టర్ దానియల్ ఇలియాస్ ప్రజలు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

పుకార్లు పుట్టిస్తున్న పుణ్యాత్ములు…

పుకార్లు పుట్టిస్తున్న పుణ్యాత్ములు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి.. పనిచేసే వారికే పట్టం కట్టండి. మండలంలో ఎవరికిచ్చిన పార్టీకి అతీతంగా కార్యకర్తగా పనిచేస్తాను.

మండలంలో. త్వరలో రానున్న తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుల పదవులపై మండలంలో కొందరు నాయకులు పార్టీ ఏదైనా సరే పనికట్టుకొని అవసరమైన ఆరోపణలు చేస్తూ పార్టీకి భంగం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలియజేశారు.

ఈ సందర్భంగా  తంగళ్ళపల్లి మండల అధ్యక్ష స్థానంపై ఎందరిదో కనుపడిందని.

అధికారం ఉంది కదా అని ప్రచారం చేస్తున్న నాయకులు ఇదే విషయమై.ముందుకు రాకపోగా పేరు చెప్పుకో పోగా తెరవెనక రాజకీయాలు నడిపిస్తున్నారని జగమెరిగిన సత్యం.

ఇంతకముందు కొన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి సేవకుడిగా ఉన్న వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా అరెస్టులకు వెనుకాడకుండా జైలు జీవితం గడిపి.

ఒకప్పుడు.అధికార పార్టీకి భయపడకుండా వెనుకాడకుండా మండలంలోని ప్రజలకు అనుకూలంగా పనిచేస్తూ.

అధికార పార్టీ చేస్తున్న పనులకు వ్యతిరేకంగా పోరాడుతూ పలుసమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని.

మండలంలో కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నిలిచిన.

మండల పార్టీ అధ్యక్షుడు నాయకుడు.

అని అటువంటి నాయకుడిపై దొంగ మాయ మాటలు చెప్పి పబ్లిక్ పరంగా అతనిపై వ్యతిరేకత. తమకు అనుకూలంగా ఉన్న.

పత్రికలలో.

వ్యతిరేకత వార్తలు పెడుతూ మండలంలో.

ప్రజలకు ఏదో జరుగుతుంది అనే సంకేతాలు పంపిస్తున్నారని.

ముసుకు రాజకీయాలు .

కార్య పాలు చేస్తున్నారని అందరికీ తెలుసునని.

అటువంటి నాయకులు.

ముందుకు రావడానికి ఎందుకు వెనుకాడుతున్నారని తెరవెనక రాజకీయాలు మానుకోవాలని.

నీతిగా పనిచేసే వారికే పట్టం కట్టించాల్సిన బాధ్యత సంబంధిత నాయకుల పై ఉందని దీనిపై సమగ్రంగా ఆలోచించాలని.

అలాగే మండలంలో ఎటువంటి సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ముందుండే నాయకుడు కావాలని.

ఒకవేళ అధిష్టానం నిర్ణయించి సదురు ఉన్న అధ్యక్షుడిని జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో గాని తీసుకువెళ్తే ఇక్కడ ఉన్న సామాన్య యువ నాయకుడు పార్టీకి పనిచేసే నాయకుడు కావాలని అలాంటి సమయంలో.

పనిచేసే నాయకునికే పట్టం కట్టాలని మెజార్టీ కార్యకర్తలు నాయకులు కార్యకర్తలుకోరుకుంటున్నారు.

వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందు ఉండే నాయకుడు కావాలని ఇంత కుముందు పని చేసే నాయకుడు.

అటువంటి సందర్భంలో చాలా సందర్భాల్లో మమ్మల్ని ఆదుకున్నారని ఇంతకముందు అధికార పార్టీ నాయకులు మామీద కేసులు పెట్టిన అరెస్టుకు ప్రయత్నాలు కేసులు పెట్టిన మాకు అండగా నిలిచిన ఏకక నాయకుడు మండల అధ్యక్షుడు అని.

జిల్లా నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం లో మంచి పేరున్న నాయకుడు మన మండల అధ్యక్షుడు ప్రవీణ్ అని.

అధిష్టానం ఆలోచన చేసి మండల అధ్యక్ష.పదవిని. ఎస్సీ. ఎస్టీ. బీసీ .మైనార్టీ. పార్టీలో పనిచేసిన నాయకులకు ఎవరికిచ్చిన పార్టీ అధిష్టాన నాయకత్వం ఆలోచన చేసి పార్టీకి పనిచేసే నాయకుని కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని

ఈ సందర్భంగా మండల ప్రజలు అనుకుంటున్నారు అలాగే.

మండల అధ్యక్ష పదవిపై .

ఆరోపణ చేస్తున్న సదరు నాయకులు తెరమీద కొచ్చి తమ పేరు చెప్పి మాట్లాడాలని తెరవెనుక రాజకీయాలు మానుకోవాలని ఇకనైనా ప్రజలకు మంచి చేయాలి తప్ప మంచి చేస్తున్న నాయకులను ఓర్వలేక అనవసర ఆరోపణ చేయడం మానుకోవాలని రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా మండల ప్రజలు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు . కోరుతున్నారు

హనుమంతరావు పటేల్ ను జన్మదిన శుభాకాంక్షలు.

హనుమంతరావు పటేల్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘ కాంగ్రెస్ పార్టీ నాయకులు’

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ జన్మదినం సందర్బంగా,శాలువా పూలమాలలతో సన్మానించి, కేక్ కట్ చేసి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన,కాంగ్రెస్ యువ సీనియర్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు ఉదయ్ శంకర్ పటేల్ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన మెంబర్లు మల్లన్న పటేల్ నవాజ్ రెడ్డి మరియు గ్రామ మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ కాంగ్రెస్ మైనారిటీ యువ నాయకుడు మొహమ్మద్ ఫక్రుద్దీన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి.

— నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి
• మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలను విక్రయించిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలనీ, స్టాక్ బోర్డులను షాపులలో ప్రదర్శించాలని సూచించడం జరిగిందన్నారు. రోజువారి క్రయ, విక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
30 క్వింటల్ల వరి విత్తనలు స్వాధీనం
మండలంలోని కల్వకుంట గ్రామంలో ఆదివారం గుర్తింపు లేని ప్రదేశంలో ఉంచిన 30 క్వింటల్ల వరి విత్తనాలను స్వాధీన పరుచుకుని నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన రైన్బో అగ్రిటెడ్ సీడ్స్ కు సంబంధించిన మోహన్ అనే డీలర్ పై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేయడం జరిగిందన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version