ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు…
సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే…
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్.
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, సీనియర్ నాయకులు శ్యామ్ గౌడ్ లు అన్నారు.
రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు.
దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.
కంప్యూటర్ యుగానికి నాంది పలికారని అన్నారు.
రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారు.
యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు.
నేటి యువత రాజీవ్ గాంధీ మార్గంలో నడవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి శ్రీనివాస్,పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అఫ్జల్ లాడెన్,పలిగిరి కనకరాజు, గోపు రాజం, ఉప్పులేటి సురేష్, బత్తుల వేణు, బుడిగే శ్రీను, బొద్దుల ప్రేంసాగర్,బోనగిరి రవీందర్, భాస్కర్,గండి కుమార్ గౌడ్, రామకృష్ణ,రామ్ సాయి,భైర మల్లేష్,మల్యాల బాలకృష్ణ,మల్లేష్,మరపాక రాజయ్య,కనుకుంట్ల కనకయ్య,మస్కం సంపత్,ఒజ్జ ముత్తయ్య, సుధాకర్ మహిళ నాయకురాలు పుష్ప, సునీత తదితరులు పాల్గొన్నారు.