*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…
*సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష..
తిరుపతి (నేటిధాత్రి)
భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే గారని తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ…సంఘసంస్కర్త పోరాటయోధురాలు.
వర్తమాన కాలంలో కూడా మహిళల అభివృద్ధికి అనేక ఆటంకాలు చూస్తున్నాము. అలాంటిది దాదాపు 200 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లాంటి ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్న రోజులలో జన్మించిన సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించడమే కాకుండా తాను నమ్మిన ఆశయాల సాధన కోసం భర్తతో కలిసి పోరాటం చేశారు.
ఉపాధ్యాయులే కాకుండా వారు రచయిత్రికూడా. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషిc చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. అందుకే ఆమె మనందరికి స్పూర్తి ప్రదాత*
*మహిళా విద్యాలయాల మధ్య తొలి మహిళ ఉపాధ్యాయురాలు విగ్రహం సముచితం…
సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్న పెద్దల కృషి పలితంగా నేడు మహిళాయూనివర్సిటి సమీపంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి విగ్రహం ప్రారంభం అవుతుండటం సంతోషించ దగ్గ విషయం మాత్రమే కాదు సముచితమైనది కూడా… ఎందుకంటే సావిత్రీబాయి పూలే మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు. మహిళా యూనివర్సిటీ ఒక వైపు
ఎస్ పి డబ్యూ,
డిగ్రీ, జూనియర్ మరియు పాలటెక్నికల్ కళాశాలలు మధ్య విగ్రహం ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థినులు విద్యనభ్యసించి అటు వైపుగా సంచరించే ప్రాంతంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఉంటే మొత్తం మహిళలకు స్ఫూర్తిని ఇస్తుంది. సావిత్రిబాయి పూలే విద్య ద్వారానే మహిళా సాధికారిత వస్తుంది అని నమ్మడమే కాదు తొలి పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కళాశాలలో చదువుకుని పూలే గారి విగ్రహాన్ని చూస్తే తమ కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుంటారు. తాము అభివృద్ధి చెందటంతో పాటు తోటి మహిళా చైతన్యానికి ప్రయత్నం చేయాలి అందుకు ప్రేరణగా సావిత్రిబాయి పూలే విగ్రహం దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను…
*పూలే ఆలోచనలే జగన్ గారి పాలనా ప్రాధాన్యతలు…
మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సావిత్రిబాయి పూలే గారి ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేసింది. ఆర్ధిక స్వతంత్ర్యం ఆడబిడ్డకు అవసరం అని గుర్తించి అమ్మవడి పథకం, 32 లక్షల ఇల్లస్టలాలు రాష్ట్రంలో మంజులు చేస్తే వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. రాజకీయ పదవులలో 50 శాతం తగ్గకుండా బలహీన వర్గాలు , మహిళలలను నియమించారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతి పథకం మహిళ కేంద్రంగా ఉండే విధంగా ఆలోచనలు చేసి అమలు చేశారు.. వారి రాజకీయ సంకల్పం వల్ల అనేక మంది రాజకీయ పదవులలో రాణిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ సంకల్పానికి నేను ఒక ఉదాహరణ కావడం నాకు లభించిన గౌరవం…
సంఘసంస్కర్త స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన డాక్టర్ శిరీష వారి స్పూర్తితో బలహీన వర్గాల మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు తిరుపతి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,తదితరులు ప్రజాప్రతినిధులు , సీనియర్ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నేతలు పాల్గొన్నారు.
