పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా

సమాజంలో కుల వ్యవస్థను రూపుమాపిన యోధుడు జ్యోతిరావు పూలే.

ఘనంగా పూలే 135వ వర్ధంతి వేడుకలు.

చిట్యాల, నేటిదాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ నాటీ సమాజంలో కుల వ్యవస్థ అనిచివేత అంటరానితనం దోపిడీ అన్యాయాలను రూపుమాపుటకు ఎనలేని కృషి చేసిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, ముఖ్యంగా స్త్రీలకు ప్రజలకు విద్యను అందించాలనీ ఎంతో కృషి చేసిన మహనీయుడనీ, సామాజిక ఉద్యమకారుడని తెలిపారు. ఆ మహనీయుడు ఏప్రిల్ 11 -1827న జన్మించి , నవంబర్ 28- 1890 లో మరణించాడని అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే బ్రతికినంత కాలం సామాజిక సమానత్వం కోసం పోరాటం చేశాడని చెప్పారు. బాల్యంలో దుర్భరమైన జీవితం గడపడానికి అన్నారు. అగ్రకుల బ్రాహ్మనుల వివక్షితను ఆలోచన పరుడిగా మార్చాయి అని తెలిపారు. 19వ శతాబ్దపు చీకటి రోజుల్లో బ్రాహ్మణీయ కులతత్వపు కోరల్లో చిక్కి చెల్య మై పోతున్న అణగారిన వర్గాల్లో కుల నిర్మూలన దృక్పథాన్ని బోధించి అగ్రకుల దోపిడి వర్గానికి వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలను సామాజిక విప్లవం దిశగా మేల్కొల్పిన సామాజిక విప్లవ చైతన్య స్ఫూర్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ దేశంలో స్త్రీల విద్యకు అంకురార్పణ చేసిన తొలి వ్యక్తి పోలిగారని చెప్పారు. మొట్టమొదట పాఠశాలను స్త్రీలకు ఏర్పాటు చేసి తన భార్య అయిన సావిత్రిబాయి పూలను ఈ దేశంలో మొదటి ఉపాధ్యాయురాలిగా మార్చాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల మాజీ అధ్యక్షులు సరిగముల రాజేందర్ ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ పాము కుంట్ల చందర్ గడ్డం సదానందం తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version