డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని పులిగిల్ల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో (ఏప్రిల్ 14) ముందస్తు సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కటుకోజ్వల సతీష్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.కుల వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని స్థాపించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన సూచించిన మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమా,పద్మ, రాజేష్,రమేష్ అటెండర్ సూరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ జీవితం పై ప్రసంగాలు చేసి,నినాదాలు ఇచ్చారు.కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. చిన్నారులందరికీ డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది.అనంతరం రోడ్డు భద్రత వారోత్సవాలు భాగంగా చిన్నారులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
చివరిగా పాఠశాల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

శ్రీ వరవర రంగనాయక భాష నిలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

కోదాడ, నేటి ధాత్రి:

 

మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ వరవర రంగనాయక భాషా నిలయం గ్రంథాలయం నందు జ్యోతిరావు పూలే చిత్రపటాన్ని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జ్యోతి రావు పూలే చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా 1888లో మహాత్మా అనే బిరుదు లభించింది. బడుగు బలహీన వర్గాల మహిళల కోసం ఆయన చేసిన సేవలు శిరస్మరణీయమైనవి.కుల వ్యవస్థ నిర్మూలన, అంటరానితనం తొలగింపు స్త్రీ విద్య, మహిళా సాధికారత కోసం తన భార్య సావిత్రిబాయి పూలే తో కలిసి 1848 లో పూణేలో బాలికల కోసం మొదట పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బల్గూరి స్నేహ దుర్గయ్య, ఇర్ల శ్రీనివాస్ రెడ్డి,వట్టికూటి గురవయ్య, మాజీ సర్పంచ్, పాపి శెట్టి సత్యం పిఎసిఎస్ మాజీ చైర్మన్, కామిశెట్టి నరసింహారావు, మాజీ దేవాలయం చైర్మన్, జాబిశెట్టి నాగప్రసాద్ గ్రామ శాఖ అధ్యక్షులు,బండి చిన్న కోటయ్య, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు 9వ వార్డు మెంబర్, కాసాని శ్రీను, ఇర్ల గోపిరెడ్డి, పోశంఎర్ర కొండలు, ఇర్ల నర్సిరెడ్డి, సంపటం శ్రీనివాసరావు, మార్గం రామచందర్రావు,పొట్టా గాంధీ, అమరబోయిన రవి,దాట్ల సైదాచారి, భూక్యా హీరమ్. కుక్కడపు గోపయ్య,బొర్రా కొండలు, పోశం గాంధీ, పోశం వెంకటయ్య, గూడపు వెంకటేశ్వర్లు,దండాల పద్మావతి, కత్తి మాధవి,బంక వరలక్ష్మి, పిడమర్తి రజిని, తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

పూలే ఆశయాలను కొనసాగించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలను బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య హాజరైనారు అనంతరం జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర పూణేలో మాలి కులంలో జన్మించాడు ఆయన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో సామాజిక సంస్కరణలకు పునాది వేశాడు 1890 నవంబర్ 28న 63 ఏళ్ల వయస్సులో మరణించాడు
జయంతి
జ్యోతిరావు పూలే జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న జరుగుతుంది. ఈ రోజు ఆయన సామాజిక సేవలను గుర్తు చేసుకుని జరుపుకుంటారు.
ఆయన సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తుంది.
జీవిత చరిత్ర
జ్యోతిరావు తండ్రి గోవిందరావు కూరగాయలు అమ్మేవాడు ముస్లిం టీచర్, క్రైస్తవుల సహాయంతో ఆంగ్ల విద్యాభ్యాసం పూర్తి చేశాడు 1841లో స్కాటిష్ మిషన్ పాఠశాలలో చదువుకున్నాడు
ప్రధాన ఉద్యమాలు
1848లో పూణేలో అంటరాని బాలికలకు మొదటి పాఠశాల స్థాపించాడు
1851లో రెండు పాఠశాలలు, 1855లో రాత్రి బడులు ప్రారంభించాడు
1864లో గర్భస్రావ వ్యతిరేక కేంద్రం, వితంతు పునర్వివాహాలు ప్రోత్సహించాడు
1873 సెప్టెంబర్ 24న సత్యశోధక సమాజం స్థాపించి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు
1888లో ముంబై సమావేశంలో ‘మహాత్మా’ బిరుదు పొందాడు కుల వ్యవస్థ, మహిళా విద్య, శూద్రుల హక్కుల కోసం పోరాడి ఆధునిక భారత సామాజిక సంస్కరణలకు మార్గదర్శకుడు నిలిచాడు అని అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి మధుసూదన్ మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు కౌన్సిలర్లు అప్పం కిషన్ శోభ రాజేష్ నాయకులు పుల్ల మహేష్ భద్రయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియర్ రామస్వామి..

నిమ్న కులాల ఉద్యమ నాయకుడు పెరియర్ రామస్వామి.

చిట్యాల, నేటి దాత్రి:

 

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్ ఆధ్వర్యంలో పెరియర్ రామస్వామి వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య విచ్చేసి ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పేరియర్ రామస్వామి 1879 సెప్టెంబర్ 17న జన్మించి 1973 డిశంబర్ 24న మరణించాడని అన్నారు. పెరియర్ 19 సంవత్సరాల వయసులోనే నాగమ్మ అనే బాలికను వివాహమాడరని ఆన్నారు. తన తండ్రి కోపగించుకున్నాడని ఇల్లు విడిచి బెజవాడ కలకత్తా కాశి తిరిగి సన్యాసిగా మారి లోకజ్ఞానం తెలుసుకున్నాడని పెరియార్ రామస్వామి పేరే ఒక అగ్ని కణం ,చాందస వాదుల గుండెల్లో ఒక పిడుగు సాంప్రదాయం పేరా సామాన్యుని పీకు తింటున్న బ్రాహ్మణత్వంపై తిరుగుబాటు చేసి సామాన్య మానవుని కాల్చుకు తింటున్న పెత్తందారి వ్యవస్థపై అలుపెరుగని పోరాటం చేశాడని తెలిపారు. పెరియర్ దళితులకు, దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ఎబి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోల్కొండ సురేష్ మండల ప్రధాన కార్యదర్శి పుల్లా ప్రతాప్ మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల సీనియర్ నాయకులు గుర్రపు తిరుపతి రాజమౌళి గురుకుంట్ల కిరణ్ నేరెళ్ల సమ్మయ్య గడ్డం సదానందం పాముకుంట్ల చందర్ కట్కూరి కుమార్ (గని) తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version