మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య…

మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకం.. కలెక్టర్ ప్రావీణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో శనివారం సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా,జహీరాబాద్ నియోజకవర్గ (ఎం పి పి ఎస్) రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా భాగ్యసాములుగా పాల్గొన్నారు,

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే…

తొలిమహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

 

భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని మర్రిపల్లి సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ అన్నారు.సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు మర్రిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించగా సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ పాల్గొని ఘన
నివాళులర్పించారు. సర్పంచ్ మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి త్యాగం, విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం కోసం పోరాడి ఆమె జీవితం అందరికీ మార్గదర్శకమని చూపారాన్నారు.అనంతరం ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయుయులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ వార్డ్ సభ్యులు గాజు శివాజీ,కుక్కమూడి కవిత,డ్యాగం రాణి నర్సింగం,రాజేందర్ అపర్ణ,మాజీ సర్పంచ్ చాతరాశి నాగేందర్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ,మాజీ ఉప సర్పంచ్ పొన్నాల ప్రతాపరెడ్డి,మహిళా సంఘం సీసీ వేల్పుల సుజాత,గ్రామ పెద్దలు ఇట్టబోయిన ఐలయ్య,గాజు చిన్న రాజయ్య,కుక్కమూడి సాంబయ్య,గ్రామ మహిళలు కశివొజ్జువుల రాజేశ్వరి,కుక్కమూడి కర్ణ,తలారి రజిత,మైదం స్రవంతి,ఆశా వర్కర్ మైదం సరోజన,యూత్ సభ్యులు డ్యాగం శివాజీ,పొన్నాల మైపాల్,కుక్కమూడి గోవర్ధన్,చిరంజీవి,మైదం దిలీప్,కుక్కమూడి స్వామి,శ్రీనివాస్,ప్రదీప్,సిద్దు,ఇల్లందుల ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…

*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…

*సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష..

తిరుపతి (నేటిధాత్రి)

 

భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే గారని తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ…సంఘసంస్కర్త పోరాటయోధురాలు.
వర్తమాన కాలంలో కూడా మహిళల అభివృద్ధికి అనేక ఆటంకాలు చూస్తున్నాము. అలాంటిది దాదాపు 200 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లాంటి ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్న రోజులలో జన్మించిన సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించడమే కాకుండా తాను నమ్మిన ఆశయాల సాధన కోసం భర్తతో కలిసి పోరాటం చేశారు.
ఉపాధ్యాయులే కాకుండా వారు రచయిత్రికూడా. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషిc చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. అందుకే ఆమె మనందరికి స్పూర్తి ప్రదాత*

*మహిళా విద్యాలయాల మధ్య తొలి మహిళ ఉపాధ్యాయురాలు విగ్రహం సముచితం…

సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్న పెద్దల కృషి పలితంగా నేడు మహిళాయూనివర్సిటి సమీపంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి విగ్రహం ప్రారంభం అవుతుండటం సంతోషించ దగ్గ విషయం మాత్రమే కాదు సముచితమైనది కూడా… ఎందుకంటే సావిత్రీబాయి పూలే మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు. మహిళా యూనివర్సిటీ ఒక వైపు
ఎస్ పి డబ్యూ,
డిగ్రీ, జూనియర్ మరియు పాలటెక్నికల్ కళాశాలలు మధ్య విగ్రహం ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థినులు విద్యనభ్యసించి అటు వైపుగా సంచరించే ప్రాంతంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఉంటే మొత్తం మహిళలకు స్ఫూర్తిని ఇస్తుంది. సావిత్రిబాయి పూలే విద్య ద్వారానే మహిళా సాధికారిత వస్తుంది అని నమ్మడమే కాదు తొలి పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కళాశాలలో చదువుకుని పూలే గారి విగ్రహాన్ని చూస్తే తమ కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుంటారు. తాము అభివృద్ధి చెందటంతో పాటు తోటి మహిళా చైతన్యానికి ప్రయత్నం చేయాలి అందుకు ప్రేరణగా సావిత్రిబాయి పూలే విగ్రహం దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను…

*పూలే ఆలోచనలే జగన్ గారి పాలనా ప్రాధాన్యతలు…

మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సావిత్రిబాయి పూలే గారి ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేసింది. ఆర్ధిక స్వతంత్ర్యం ఆడబిడ్డకు అవసరం అని గుర్తించి అమ్మవడి పథకం, 32 లక్షల ఇల్లస్టలాలు రాష్ట్రంలో మంజులు చేస్తే వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. రాజకీయ పదవులలో 50 శాతం తగ్గకుండా బలహీన వర్గాలు , మహిళలలను నియమించారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతి పథకం మహిళ కేంద్రంగా ఉండే విధంగా ఆలోచనలు చేసి అమలు చేశారు.. వారి రాజకీయ సంకల్పం వల్ల అనేక మంది రాజకీయ పదవులలో రాణిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ సంకల్పానికి నేను ఒక ఉదాహరణ కావడం నాకు లభించిన గౌరవం…
సంఘసంస్కర్త స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన డాక్టర్ శిరీష వారి స్పూర్తితో బలహీన వర్గాల మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు తిరుపతి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,తదితరులు ప్రజాప్రతినిధులు , సీనియర్ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నేతలు పాల్గొన్నారు.

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

చదువు కోసం పోరాడిన అక్షర జ్యోతి…

దేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే

ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్

కేసముద్రం/ నేటి ధాత్రి

 

శనివారం కేసముద్రం మండలంలోని కల్వల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మధ్య యుగపు చీకటి రోజులలో సమాజం అందాకారంలో బంధించబడి పరిస్థితులు ఉన్న రోజులవి అన్నారు. మూడవిశ్వాసాలతో, సాంఘిక దురాచారాలతో వెలుగొందితూ.. స్త్రీలకు చదువుకునే అవకాశం లేక, స్త్రీలు అనగదొక్కబడుతున్న కాలంలో… భర్త జ్యోతిబాపూలే సహకారంతో చదువుకొని భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు గాయించిందని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే 1848లో పూణేలో మొదటి బాలిక పాఠశాలలను స్థాపించింది. స్త్రీ విద్యకు పునాది వేయడం జరిగింది. పుస్తకం పట్టిన చేతులు భవిష్యత్తును మార్చగలరని, అందాకారాన్ని చీల్చన విద్యా దీపం అని కొనియాడారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థి నీలంతా బాగా చదువుకొని సమాజ సేవలో నిమగ్నం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులైన కే పార్వతి, రాధాదేవిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం బి సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, రాగి బిక్షపతి, మహంకాళి యాకాంబరం, వి రాజేంద్ర చారి, బి బాలాషోరెడ్డి, కే రాములు, ఎం శ్రీనివాస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ ఏ కొప్పుల శంకర్, కె పార్వతి, ఎండి జుబేర్ అలీ, ఓడపల్లి రాము, జి నాగరాజు, ఏ లింగయ్య, ఎస్ సునీల్, ఎస్ రాధాదేవి మరియు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి.

చందుర్తి, నేటిధాత్రి:

 

 

 

ఈరోజు భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహానీయ సామాజిక సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని PM SHRI MPPS చందుర్తి పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో సేవలందిస్తున్న ఉపాధ్యాయినిలైన
వేముల సుజాత, జ్యోతి, స్వప్న, హేమలత ను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని వేముల సుజాత మాట్లాడుతూ,

“సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలు. ఆమె చేసిన పోరాటాలు, సేవలు నేటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకం. బాలికల విద్యను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది”
అని పేర్కొన్నారు.

ఆమె మహిళా సాధికారత, సమానత్వం, విలువలతో కూడిన విద్య ప్రాముఖ్యతను వివరించారు. సావిత్రిబాయి పూలే జీవితం విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాచకొండ ప్రసాద్, గుఱ్ఱం బాలకిషన్, కొత్తూరి శ్రీధర్, రాకం రవి, మరియు కాపిల్ల నరేష్ లు పాల్గొని, సన్మానం పొందిన ఉపాధ్యాయినిలను అభినందించారు. అలాగే సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా ముగిసింది.

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు…

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
* మహిళ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 3 :

 

ఆధునిక భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విద్యకు ఆద్యురాలైన మహనీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్‌లో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమీడి జైపాల్ రెడ్డి, రామాలయం మాజీ ధర్మకర్త పట్నం నర్సింహా రెడ్డిలు ఉపాధ్యాయులతో కలసి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అపూర్వమని, ఆమె స్థాపించిన మొదటి మహిళా పాఠశాల దేశంలో మహిళా విద్యకు బాటలు వేసిందని అన్నారు. సమాజాభివృద్ధికి మహిళా విద్య అత్యంత కీలకమని, ప్రతి బాలిక విద్య పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి గత సంవత్సరం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి, ఉపాధ్యాయులు యమ్ శశిరేఖ, బి హేమలత, ఎల్ మంజులత, పి నిర్మల, పివియస్ నాగలక్ష్మి, వి జ్యోతి, వైష్ణవి, లలిత, శివలక్ష్మి, రాఖీ, మమత గార్లను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ చంద్ర, ప్రశాంత్ నాయక్, రవీందర్ చారి గార్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version