టి పి టి ఎఫ్ నేతకు ఘనంగా పదవి విరమణ అభినందన సన్మానం

టి పి టి ఎఫ్ నేతకు ఘనంగా పదవి విరమణ అభినందన సన్మానం

కేసముద్రం/ నేటి ధాత్రి

సోమవారం జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత పాఠశాల కేసముద్రం విలేజ్ లో బయాలజీ స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న చీకటి వెంకట్రాం నర్సయ్య పదవీ విరమణ అభినందన, సన్మాన సమావేశం పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాధ్యాయులు, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా మరియు కేసముద్రం మండల శాఖలు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలపాటు విద్యార్థులకు అంకితభావంతో సేవలందించిన ఉపాధ్యాయులు చీకటి వెంకట్రాం నర్సయ్య అని, క్రమశిక్షణ, నిబద్ధత గల వ్యక్తి అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే కాకుండా, ఉపాధ్యాయ సంఘమైన టి పి టి ఎఫ్ (తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్) లో కూడా క్రియాశీల కార్యకర్తగా పని చేశారని, సంఘ నిర్మాణంలో చురుకుగా పాల్గొంటూ, పలుమార్లు మండల అధ్యక్షునిగా, జిల్లా శాఖ ఉపాధ్యక్షునిగా సేవలందించి, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు తన వంతు కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా
రిటైర్మెంట్ రోజునే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించే విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు నాగమణి, శ్రీనివాస్ రమేష్, సుధాకర్, శిరీష, పద్మ, లతో పాటు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి మైస శ్రీనివాసులు కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, , జిల్లా కార్యదర్శులు రాచకొండ ఉపేందర్, చీకటి ఉపేందర్, మండల శాఖ ఉపాధ్యక్షులు అంజన్న కార్యదర్శులు వీసం నర్సయ్య, ఊటుకూరి ప్రణయ్ కుమార్, మోహన కృష్ణ, కోడెం శ్రీనివాస్, మండల శాఖ ,అప్పాల నాగరాజులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి-ఎస్ఎఫ్ఐ…

భగత్ సింగ్ ఆశయాలను నెరవేర్చాలి-ఎస్ఎఫ్ఐ

పరకాల,నేటిధాత్రి

పట్టణంలోని గౌట్ బాయ్స్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం తమ నవయవ్వన జీవితాన్ని సైతం త్యాగం చేసిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవుల స్ఫూర్తితో విద్యార్థులు చదువులో రాణించాలని సమాజ రుగ్మతలు సమస్యలపై పోరాడాలని పేర్కొన్నారు.వారు తృణప్రాయంగా తమ ప్రాణాలను వదిలారని బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా వారి పోరాటమే మనకు స్ఫూర్తిదాయకమని మనస్పూర్తితో పెట్టుబడిదారీ విధానాలకు విద్యా ప్రవేటికనకు విద్యార్థులంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ సురేందర్,టీచర్స్,విద్యార్థులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్….

మహిళలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి-డాక్టర్ లతవిశ్వజన్

చొప్పదండి, నేటిధాత్రి:

 

జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ గ్రామంలోని అక్షయ పాఠశాలలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లతవిశ్వజన్ మాట్లాడుతూ మహిళలందరూ ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని, అదేవిధంగా మహిళలందరూ ఉన్నత విద్యను అభ్యసించి, అన్ని రంగాల్లో ముందుండాలన్నారు రానున్న రోజుల్లో మహిళలు అందరూ రాజకీయంగా ఎదగాలని ఉన్నత పదవులను అధిరోహించాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి పాఠశాల సిబ్బందికి సన్మానం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో అక్షయ పాఠశాల కరస్పాండెంట్ తమ్మిడి కనుకరాజు, ప్రిన్సిపాల్ శ్రీమతి, హుజురాబాద్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అక్షయ్, సిద్ధెంకి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version