విహెచ్‌పీ తిరుపతి జిల్లా కార్యదర్శిగా ఉమాపతి

జిల్లా కార్యదర్శిగా బాణావారము ఉమాపతి

విశ్వహిందూ పరిషత్ తిరుపతి

తిరుపతి(నేటి ధాత్రి:

 

విశ్వహిందూ పరిషత్ దక్షిణాది ప్రాంతమైన కర్నూలు జిల్లాలో జరిగిన సమావేశంలో తిరుపతి జిల్లా నుంచి బాణావారము ఉమాపతి కి జిల్లా కార్యదర్శిగా దక్షిణాది ప్రాంత అధ్యక్షులు నంది రెడ్డి సాయి రెడ్డి నియమించారని తెలిపారు . ఈనెల 11వ తేదీ కర్నూలు కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సమావేశంలో తిరుపతి నుంచి పలువురు కార్యకర్తలు పాల్గొన్నారని అందులో బాణావారము ఉమాపతిని తిరుపతి జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు ఈ సమావేశంలో ఉపాధ్యక్షురాలు శ్రీమతి దాసరి మురళమ్మ , దక్షిణాది ప్రాంత కార్యదర్శి పర్రె కోటేశ్వరరావు మరియు ఇతర ప్రాంత పలువురు పదాధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ప్రసాదాలు

°శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
శ్రీవారి ధనుర్మాస ప్రసాదాలు..

*భక్తులకు ప్రతి శనివారం భోజనాలు…

తిరుపతి(నేటిధాత్రి:

 

ధనుర్మాసోత్సవాలలో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఇచ్చేటువంటి ధనుర్మాస ప్రసాదాలను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం శ్రీవారి భక్తులు జగన్నాథం మిత్ర బృందం ప్రసాదాలను పంచిపెట్టారు. శనివారం శ్రీ కోదండరాముల వారి గుడి వెనక ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మందిరం వద్ద ప్రతి శనివారం శ్రీవారి భక్తులు జగన్నాథం దూడల జయగోపాల్ ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ శనివారం దాతగా డాక్టర్ రామబాన రమేష్ స్వామి అన్న ప్రసాదాలను పంచిపెట్టారు . ఈ సందర్భంగా టిడిపి బీసీ నాయకులు సాధికార కమిటీ రాష్ట్ర సభ్యులు మరియు శ్రీవారి భక్తులు జగన్నాథం మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పదమైన రోజున శనివారం రోజున శ్రీవారి ఆలయం నుంచి ధనుర్మాస ప్రసాదాలను తెప్పించి భక్తులకు పంచిపెట్టామని శ్రీవారి పాదాల చెంత ఉన్న భక్తులందరూ ఆకలితో ఉండకూడదని ఈ ఒక్క రోజైనా అందరికీ భోజనాలు అందించడం ఆ దేవుని అనుగ్రహంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ గోవింద నామాలను జపిస్తూ ఆనందంగా అన్న ప్రసాదాలను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జగన్నాథం మిత్రబృందం ప్రముఖ కళాకారులు శ్యాంబోల హరి, వారాహి డెవలపర్స్ ఏ.సునీల్ కుమార్ , శివాజీ , తదితరులు పాల్గొన్నారు .

*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…

*సంఘసంస్కర్త, స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే…

*సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష..

తిరుపతి (నేటిధాత్రి)

 

భారత దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు బలహీన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే గారని తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ…సంఘసంస్కర్త పోరాటయోధురాలు.
వర్తమాన కాలంలో కూడా మహిళల అభివృద్ధికి అనేక ఆటంకాలు చూస్తున్నాము. అలాంటిది దాదాపు 200 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర లాంటి ఆధిపత్య వర్గాల పెత్తనం ఉన్న రోజులలో జన్మించిన సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యంగా మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించడమే కాకుండా తాను నమ్మిన ఆశయాల సాధన కోసం భర్తతో కలిసి పోరాటం చేశారు.
ఉపాధ్యాయులే కాకుండా వారు రచయిత్రికూడా. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషిc చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేశారు. చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. అందుకే ఆమె మనందరికి స్పూర్తి ప్రదాత*

*మహిళా విద్యాలయాల మధ్య తొలి మహిళ ఉపాధ్యాయురాలు విగ్రహం సముచితం…

సామాజిక మార్పు కోసం ప్రయత్నిస్తున్న పెద్దల కృషి పలితంగా నేడు మహిళాయూనివర్సిటి సమీపంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి విగ్రహం ప్రారంభం అవుతుండటం సంతోషించ దగ్గ విషయం మాత్రమే కాదు సముచితమైనది కూడా… ఎందుకంటే సావిత్రీబాయి పూలే మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సంఘసంస్కర్త భారత దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు. మహిళా యూనివర్సిటీ ఒక వైపు
ఎస్ పి డబ్యూ,
డిగ్రీ, జూనియర్ మరియు పాలటెక్నికల్ కళాశాలలు మధ్య విగ్రహం ఏర్పాటు చేశారు. వేలాది మంది విద్యార్థినులు విద్యనభ్యసించి అటు వైపుగా సంచరించే ప్రాంతంలో సావిత్రిబాయి పూలే గారి విగ్రహం ఉంటే మొత్తం మహిళలకు స్ఫూర్తిని ఇస్తుంది. సావిత్రిబాయి పూలే విద్య ద్వారానే మహిళా సాధికారిత వస్తుంది అని నమ్మడమే కాదు తొలి పాఠశాలను ప్రారంభించారు. ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి కళాశాలలో చదువుకుని పూలే గారి విగ్రహాన్ని చూస్తే తమ కర్తవ్యం గుర్తుకు తెచ్చుకుంటారు. తాము అభివృద్ధి చెందటంతో పాటు తోటి మహిళా చైతన్యానికి ప్రయత్నం చేయాలి అందుకు ప్రేరణగా సావిత్రిబాయి పూలే విగ్రహం దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను…

*పూలే ఆలోచనలే జగన్ గారి పాలనా ప్రాధాన్యతలు…

మహిళా సాధికారిత కోసం జీవితాంతం పరితపించిన సావిత్రిబాయి పూలే గారి ఆలోచనలకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేసింది. ఆర్ధిక స్వతంత్ర్యం ఆడబిడ్డకు అవసరం అని గుర్తించి అమ్మవడి పథకం, 32 లక్షల ఇల్లస్టలాలు రాష్ట్రంలో మంజులు చేస్తే వాటిని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. రాజకీయ పదవులలో 50 శాతం తగ్గకుండా బలహీన వర్గాలు , మహిళలలను నియమించారు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ప్రతి పథకం మహిళ కేంద్రంగా ఉండే విధంగా ఆలోచనలు చేసి అమలు చేశారు.. వారి రాజకీయ సంకల్పం వల్ల అనేక మంది రాజకీయ పదవులలో రాణిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి రాజకీయ సంకల్పానికి నేను ఒక ఉదాహరణ కావడం నాకు లభించిన గౌరవం…
సంఘసంస్కర్త స్పూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించిన డాక్టర్ శిరీష వారి స్పూర్తితో బలహీన వర్గాల మరియు మహిళల అభ్యున్నతికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు తిరుపతి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం,తదితరులు ప్రజాప్రతినిధులు , సీనియర్ నాయకులు, బీసీ సంఘర్షణ సమితి నేతలు పాల్గొన్నారు.

తిరుపతిలో హెల్మెట్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన తుడా చైర్మన్…

*గరుడ టూ వీలర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించిన….

+తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి..

తిరుపతి (నేటి ధాత్రి)

 

తిరుపతి గరుడ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ను తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యుల విన్నపం మేరకు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో బాలాజీ కాలనీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన హెల్మెట్ అవగాహన ర్యాలీ”* ని ఆయన పోలీసు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.
ప్రాణ రక్షణకు హెల్మెట్ ఒక కవచంలా పనిచేస్తుందని, కుటుంబ సభ్యుల క్షేమం కోరి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
గరుడ టూ వీలర్ అసోసియేషన్ సభ్యులు కేవలం వృత్తికే పరిమితం కాకుండా,ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.
నగరంలోని ప్రధాన కూడళ్లలో గుండా సాగిన ఈ ర్యాలీలో పోలీస్ సిబ్బంది,మెకానిక్ సోదరులు హెల్మెట్లు ధరించి, భద్రతా నిబంధనలపై ప్లకార్డులతో ప్రజలకు అవగాహన కల్పించారు.
అంతకముందు బాలాజీ కాలనీ కూడలి వద్దకు చేరుకున్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారికి అసోసియేషన్ సభ్యులు దుశ్శలావతో సత్కరించి, క్యాలెండర్ ప్రతిని అందించారు. ​
ఈ కార్యక్రమంలో గరుడ టూ వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి, పోలీస్ అధికారులు ఇతర కార్యవర్గ సభ్యులు మరియు మెకానిక్ సోదరులు పాల్గొన్నారు

తుమ్మనపల్లి సర్పంచ్ నజియా అంజుమ్ షేక్ సోహెల్ ని సన్మానించిన ఎమ్మెల్యే…

తుమ్మనపల్లి సర్పంచ్ నజియా అంజుమ్ షేక్ సోహెల్ ని సన్మానించిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి విజయం సాధించిన ఝరాసంగం మండల్ తుమ్మనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ నజియా అంజుమ్ షేక్ సోహెల్ ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు ఎమ్మెల్యే మాణిక్ రావు ను మర్యాద పూర్వకంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ లను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఎం వెంకటేశం గ్రామ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఎక్స్ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి జనార్దన్ రెడ్డి రమేష్ ,గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభు ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతారు…

ప్రభు ప్రతి ఒక్కరికి ప్రేమను పంచుతారు

క్రైస్తవులందరూ అదేవిధంగా ప్రేమను పంచాలి – డాక్టర్ ప్రవీణ్

తిరుపతి( నేటిధాత్రి)

 

ఏసుప్రభు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను పంచాడని అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేమని పంచాలని అప్పుడే నిజమైన క్రైస్తవులని ముఖ్య ప్రసంగీకులుగా పాల్గొన్న డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ అని తెలిపారు. శనివారం ఉదయం విజయనగరం జిల్లా వేపాడ మండలం, నల్లబెల్లి సీయోను ప్రార్ధన మందిరం నందు నిస్సి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పాస్టర్ గొర్లె టైటాస్ అధ్యక్షతన క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకలుగా డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ విచ్చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఏ మనిషికైనా ఈ లోకజ్ఞానం వ్యర్ధమని దేవుని జ్ఞానమే నిజమైన జ్ఞానమని అటువంటి వారికే దైవ గ్రంథం లోని మర్మాలు అర్థమవుతాయని ఆ విధంగా నడుచుకున్న వారికే అత్యున్నత స్థానాన్ని దేవుడు అనుగ్రహించి ఆయన చేతులతో, ఆయన పనికి వాడబడుతారని అన్నారు. ఏసుప్రభు వారు ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమని పంచాడని అదేవిధంగా క్రైస్తవులందరూ ప్రతి ఒక్కరికి అటువంటి ప్రేమని పంచాలని అన్నారు. ముఖ్య అతిధి టీవీఎస్ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ మధు ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి వారి పిల్లల్ని ప్రేమగా పెంచాలని ప్రేమగానే వారికి విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పించాలని అన్నారు. ఆనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి దైవ సేవకులకు నూతన వస్త్రాలు అందించారు
ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ లాజరస్, పాస్టర్ దావీదు, పాస్టర్ డేనియల్ పాల్, పాస్టర్ దేవకుమార్ ,కరుణాకర్ రచన దంపతులు, గ్రేస్ టైటస్, పాస్టర్, సంఘ పెద్దలు, యూత్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version