న్యాల్కల్ లో పర్యటించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచ్ ఎన్నికల సందర్భంగా న్యాల్కల్ మండలం షంషీలపూర్,వడ్డీ, తాట్ పల్లి,చినిగేపల్లి ,ఇబ్రహీంపూర్,న్యాల్కల్ ,హద్నూరగ్రామాలలో పర్యటించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ గారి సహకారంతో నియోజకవర్గ గ్రామాలు.
ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది నేడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు వాళ్ళ జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి మాత్రం శూన్యం.
మళ్లీ గ్రామలు అభివృద్ధి చెందాలంటే .బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిలను ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలి అని కోరారు
ఎమ్మెల్యే గారితో పాటుగా మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్, మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్ ,దీపక్ ,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఇప్ప పల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల్లో మామిడిగి కవిత 57 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ఇప్ప పల్లి గ్రామంలో మామిడిగి కవిత ఘన విజయాన్ని సూచిస్తున్నాయి.
– ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు – 98 కేసులలో 1525 లీటర్ల మద్యం సిజ్
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీత
సిరిసిల్ల(నేటి ధాత్రి):
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ను కఠినంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 11 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే అక్రమ మద్యం విక్రయం,రవాణాపై నిఘా ఉంచి ఆకస్మిక దాడులు నిర్వహించి 98 కేసుల్లో 1525 లీటర్ల అక్రమ మద్యంను సీజ్, రూ. 23,28,500/- నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నవారు,గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిని 224 కేసుల్లో 782 మందిని బైండోవర్ చేయడం జరిగిందన్నారు.ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రజలు తప్పనిసరిగా పాటించాలని, పోలీసులకు పూర్తి సహకారం అందిస్తూ స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వినోద బాలరాజ్ మరియు 6 వార్డులలో విజయం సాధించింది. సర్పంచ్ అభ్యర్థి వినోద బాలరాజ్ 4 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 6 వార్డులకు పరిమితమైంది గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఆయన గ్రామ ప్రజలకు కార్యకర్తలకు కృతజ్ఞతలు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కాంగ్రెస్ పార్టీ తన అంచు కోట అని 60 సంవత్సరాలుగా పరిపాలించిన ఝరాసంగం గ్రామాన్ని బిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది సర్పంచ్ అభ్యర్థి వినోద బాలరాజ్ జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు గ్రామ మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ గ్రామ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ మాజీ ఉప్పసర్పంచ్ సంగన్న ప్రెసిడెంట్ ఎజాస్ బాబా నాగన్న పటేల్ సజ్జన్ నాగేశ్వరరావు మరియు షేక్ రబ్బానికి కార్యకర్తలకు సహాయం చేసిన గ్రామ ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు,
రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికలు దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం,గీసుకొండ మండలాల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 88.11శాతం ఓటింగ్ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారి,వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. దుగ్గొండి మండలం 89.88 శాతం అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా గీసుకొండ మండలం 85.83 శాతం ఓట్లతో జిల్లాలో తక్కువ శాతం పోలింగ్ అయ్యింది.సంగెం మండలంలో 89.44 శాతం ఓట్లు పోలింగ్ కాగా నల్లబెల్లి మండలంలో 86.36 శాతం ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా పరిధిలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దుగ్గొండి, నల్లబెల్లి,సంగెం,గీసుకొండ మండలాల పరిదిలో 66467 పురుషులు,69722 మహిళలు ఇతరులు ఇద్దరు కాగా మొత్తం 136191ఓటర్లు ఉండగా అందులో 58688 మంది పురుషులు 61311 మహిళలు ఇతరులు ఇద్దరు మొత్తం 120001మంది ఓటర్లు వారి వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల పరిశీలకులు బాల మాయాదేవి వరంగల్ జిల్లాలోని సంగెం,గీసుగొండ, దుగ్గొండి,నల్లబెల్లి మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా గీసుగొండ, సంగెం, నందిగామ, దేశాయిపల్లె, నల్లబెల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ్రీన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు
చేశారు.నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల కమిషన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.జిఎం ఇండస్ట్రియల్ నరసింహమూర్తి తదితరులు వారివెంట ఉన్నారు.
నేరేడుపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటన
సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించాలని పిలుపు
శాయంపేట, నేటిధాత్రి:
గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరముందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం ఆయన శాయంపేట మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసింగారం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యనాయక్ తండా, గంగిరేణిగూడెం, వసంతాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి, ఇతర నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు అయ్యాయి. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలపరచడం ద్వారా ఈ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది,” అని పేర్కొన్నారు. ప్రజల పాలనలో ప్రజల భాగస్వామ్యమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక నాయకులు పార్టీ విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన..,
నేరేడుపల్లి గ్రామంలో ప్రజలకు “సీరియల్ నంబర్ 5లో ఉన్న లేడి పర్సు గుర్తుకు ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థి మడికొండ ఇందిరా రాజును గెలిపించండి” అని గ్రామస్థులను కోరారు.
గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పాలన అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ నేపథ్యంలో వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం గీసుకొండ మండలంలోని గీసుకొండ, గంగాదేవిపల్లి పోలింగ్ కేంద్రాలు,దుగ్గొండి మండలంలోని వెంకటాపూర్, దేశాయిపల్లి పోలింగ్ కేంద్రాలు, నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి సుమంగళి ఫంక్షన్ హాల్, నందిగామ పోలింగ్ కేంద్రాలు,సంగెం మండలం సంగెం జడ్పీ హై స్కూల్, మొండ్రాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన హరిత ( గ్రీన్) పోలింగ్ కేంద్రాలతో పాటు పలు పోలింగ్ కేంద్రాలలో ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, సిబ్బంది డ్యూటీల అమలు, పోలింగ్ సాగుతున్న విధానం, భద్రతా చర్యలు వంటి అంశాలను వివరంగా పరిశీలించారు.
సమర్థవంతమైన పోలింగ్ నిర్వహణకు సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఏ విధమైన నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని, ప్రతి ఓటరికి సౌకర్యవంతమైన, అంతరాయం లేని వాతావరణం కల్పించడం సిబ్బందిపైనున్న ప్రధాన బాధ్యతఅని అన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పరిష్కరించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, పారదర్శకత, నిబంధనల ఖచ్చితమైన అమలు అత్యంత ఔచిత్యం కలదని కలెక్టర్ స్పష్టం చేశారు.ఓటింగ్ శాతం పెంచాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఎన్నికల సూచనల మేరకు జిల్లాలోని నాలుగు మండలాల్లో నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి మండలానికి రెండు చొప్పున హరిత (గ్రీన్) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొదటి విడత లో హరిత పోలింగ్ కేంద్రాలలో మిగతా పోలింగ్ కేంద్రాల కంటే 2 నుండి 3 శాతం పోలింగ్ పెరిగిందని కలెక్టర్ తెలిపారు. రెండవ విడతలో ప్రశాంతంగా ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని, 82 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎప్పటికపుడు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుండి కౌటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా వార్డుల కౌంటింగ్ , తర్వాత గ్రామపంచాయతీ లో సర్పంచ్ కౌంటింగ్ జరుగుతుందని వారన్నారు మేజర్ గ్రామపంచాయతీలలో త్వరగా ఫలితాలు వచ్చేలా ఎక్కువ టేబుల్స్ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్వోలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.మొదటి విడతలో 585 వార్డ్ స్థానాలుండగా,ప్రస్తుతం రెండవ విడతలో 906 వార్డు స్థానాలను ఉన్నాయని, కౌంటింగ్ ఫలితాలు త్వరితంగా ఇచ్చుటకు ప్రణాళికలు సిద్ధం చేశామని.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మరియు కౌంటింగ్ జరుగుటకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు.కలక్టర్ వెంట ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాం రెడ్డి, ఆర్డీఓ సుమా, నోడల్ అధికారులు, ఎంపిడీవోలు, తహశీల్దార్లు, ఇతర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘింస్తే చర్యలు తప్పవు: సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం రవాణా,విక్రయాలు,కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా.
ఎన్నికల సందర్భంగా హోల్‌సేల్ రూపంలో భారీగా మద్యం ఆమ్మిన వారిపై,కొనుగోలు చేసిన వారిపై కేసులు నమోదు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి 90 కేసుల్లో 1337 లీటర్ల అక్రమ మద్యం సీజ్.
సిరిసిల్ల(నేటి ధాత్రి):
గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అక్రమ మద్యం రవాణా,విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని,ఎన్నికల సమయంలో హోల్‌సేల్ రూపంలో భారీగా మద్యం ఆమ్మిన వారిపై ,కొనుగోలు చేసిన వారిపై నిఘా కఠినతరం చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా డిఎస్పీ హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 90 కేసుల్లో 1337 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు వెల్లడించారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేస్తున్నామని,ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలని , ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటామని,ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరికీ బాధ్యత అన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామపంచాయతీ సర్పంచి బరిలో ఉన్నత విద్యావంతురాలు రాయికోటి వినోద నిలిచారు. ఝరాసంగం మండల కేంద్రమైన ఝరాసంగం కి చెందిన, రాయికోటి బల్ రాజ్ ఆమె వివాహమాడారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఝరాసంగం గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో గ్రామస్తుల సహకా రంతో సర్పంచి బరిలో నిలిచింది. విద్యావంతురాలు అయిన తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించిన అదనపు కలెక్టర్ వనపర్తి నేటిదాత్రి .
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, నిబంధనల ప్రకారం నిర్వహించాలని వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం అదనపు కలెక్టర్ పెబ్బేరు మండలంలోని రంగాపూర్, సూగూరు, జనుంపల్లి మరియు శాఖాపురం క్లస్టర్లను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు నామినేషన్లను స్వీకరించే ప్రక్రియ పూర్తయిన వెంటనే, నిర్ణీత గడువులోగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పెబ్బేరు తహసీల్దార్ మురళి క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవు…..!
◆- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి
◆:- ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: ఝరాసంగం, ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా సోషల్ మీడియాలో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తీసుకుం టామని ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరైనా ప్రజా శాంతికి భంగం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పోస్టులు పెట్టిన రాజకీయ దూషణలో జరిపిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండలంలోని ప్రజలు ఎన్నికల కోడ్ ను దృష్టిలో ఉంచుకొని శాంతియుత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కేంద్రం పరిశీలించిన అదనపు కలెక్టర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మండలం, హోతి బి గ్రామ శివారులోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చెంద్రశేఖర్ శనివారం మధ్యాహ్నం స్వయంగా సందర్శించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డిఓ మహేందర్ రెడ్డి, తహశీల్దార్ దశరథ్, ఎంపీ ఓ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ను అనుసరిస్తూ కరీంనగర్ జిల్లాలో తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు గురువారం నోటిఫికేషన్లు జారీ చేశారు. తొలి విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లోని తోంబైరెండు సర్పంచ్, ఎనిమిది వందల అరవై ఆరు వార్డు మెంబర్ల స్థానాలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. ఈనేపథ్యంలో రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయంలో వెదిర, వెలిచాల గ్రామాల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలో సదుపాయాలు పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లు గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో రామడుగు తహసిల్దార్ రాజేశ్వరి, మండల ప్రత్యేక అధికారి అనిల్ ప్రకాష్, స్థానిక అధికారులు, తదితరులున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ముత్తారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ ఎం. రమేష్
ముత్తారం :- నేటి ధాత్రి
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ముత్తారం పోలీస్ స్టేషన్ ను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ తనిఖీ చేశారు. తనిఖీ లో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్ పరిశీలించారు, కే డి, డీ సి, సస్పెక్ట్ షీట్ లు పరిశీలించారు వారి ప్రస్తుత చర్యల గురించి తెలుసుకున్నారు, స్టేషన్ వెర్టికల్స్, ఎఫ్ ఐ ఆర్ ఇండెక్స్ మొదలైన రికార్డ్స్ తనిఖీ చేశారు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండ చూసుకోవాలని సూచించారు. నిరంతం పోలీసులు పెట్రొలింగ్ నిర్వహించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమం లో మంథని సీఐ బి. రాజు ముత్తారం ఎస్ ఐ రవి కుమార్ పోలీస్ సిబ్బంది ఉన్నారు
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం 10.30 గంటల లోపు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలని అన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు జాబితా కూడా ప్రదర్శింపజేయాలని సూచించారు. నామినేషన్లు ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని ఈనెల 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. 30వ తేదీన నామినేషన్లు పరీశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2వ తేదీన డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్లు స్వీకరణకు 25 మంది 25 రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. నామినేషన్ లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమ సంఖ్య నమోదు చేయాలని సూచించారు. నామినేషన్లలో అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదకుని సంతకం ఉండాలని తెలిపారు. మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారి విధులు చాలా కీలకమని ఎన్నికలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల విదులపై పవర్ పాయింట్ ద్వారా అవగహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి , డిపిఓ శ్రీలత ఎంపీడీవోలు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం
◆:- యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థ ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి గారికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ వినతిపత్రం త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ కోరారు. సంగారెడ్డి పట్టణంలోని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ తో పాటు మున్సిపల్ ఎన్నికలలో 20శాతం కోట యువతకు కేటాయించాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నిర్మల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. వివిధ నియోజకవర్గం అధ్యక్షులు నవీన్, నాగిరెడ్డి, వెంకట్ జింగ, సిద్ధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, వసిం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురణ
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెప్టెంబర్ 2న గ్రామ పంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్, పోలింగ్ కేంద్రాల లిస్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా అప్ డేట్ చేయడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 12 మండలాల పరిధిలో 260 గ్రామ పంచాయతీ లలోని 2268 వార్డులలో 3,52,134 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఆగస్టు 28న విడుదల చేసి గ్రామపంచాయతీ కార్యాలయాలలో అంటించడం జరిగిందని అన్నారు.
District Collector Sandeep Kumar Jha
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 30 లోపు తెలియజేయాలని , ఆగస్టు 31 లోపు వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని అన్నారు.ప్రతి మండలం పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు 2268 డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా ఎంపీడీవో ఆగస్టు 28న తయారు చేశారని, వీటిపై అభ్యంతరాలను ఆగస్టు 30 లోపు ఎంపిడిఓ కార్యాలయంలోఅందించాలని అన్నారు. సెప్టెంబర్ 2న తుది పోలింగ్ కేంద్రాల జాబితా తయారు చేయడం జరుగుతుందని అన్నారు. 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేస్తున్నామని ,జిల్లాలో ఎక్కడైనా అదనపు పోలింగ్ కేంద్రం అవసరమంటే వివరాలు అందిస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి షరీపుద్దిన్, డివిజనల్ పంచాయతీ అధికారి నరేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.