గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించిన అదనపు కలెక్టర్..

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ను పరిశీలించిన అదనపు కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .

గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, నిబంధనల ప్రకారం నిర్వహించాలని వనపర్తి అదనపు కలెక్టర్ రెవెన్యూఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు.
బుధవారం అదనపు కలెక్టర్ పెబ్బేరు మండలంలోని రంగాపూర్, సూగూరు, జనుంపల్లి మరియు శాఖాపురం క్లస్టర్లను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు నామినేషన్లను స్వీకరించే ప్రక్రియ పూర్తయిన వెంటనే, నిర్ణీత గడువులోగా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.పెబ్బేరు తహసీల్దార్ మురళి క్లస్టర్ల రిటర్నింగ్ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు

పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన..

పెబ్బేర్ లో రైస్ మిల్లును తనిఖీ చేసిన

అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

వనపర్తి నేటిదాత్రి

 

బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వనపర్తి, పెబ్బేరు మండలాల్లో విస్తృతంగా పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, గోదాములను తనిఖీ చేశారు. వనపర్తి మండలంలోని నాచహళ్లి ఐకేపీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించార అదనపు కలెక్టర్ రైతులతో మాట్లాడారు. వడ్లు తాలు, పొల్లు లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించారు.
పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి వెళ్ళిన అదనపు కలెక్టర్, అక్కడ ఏఈఓ జారీ చేస్తున్న టోకెన్లను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, సీరియల్ పద్ధతిలో వరుస క్రమంలో టోకెన్లు జారీ చేయాలని ఏఈఓను ఆదేశించారు. పెబ్బేరు మండలంలోని సూగురు గ్రామంలోని ఎస్.డబ్ల్యూ.సి గోదామును సందర్శించి,అక్కడ డెలివరీ అవుతున్న సీఎంఆర్ బియ్యం నాణ్యతను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేని బియ్యం వస్తే వెంటనే తిరస్కరించాలనివాటిని సంబంధిత మిల్లుకు వెనక్కి పంపాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చివరగా పెబ్బేరు మండలంలోని సత్యసాయి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.మిల్లు యజమానితో మాట్లాడి, యాసంగి 2024-25 సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ డెలివరీలను ఎటువంటి జాప్యం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని మిల్లు యజమానిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జగన్ పెబ్బేరు తహసీల్దార్ మురళి అధికారులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version