త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం
◆:- యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
స్థానిక సంస్థ ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి గారికి యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్ వినతిపత్రం త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ కోరారు. సంగారెడ్డి పట్టణంలోని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ, ఎంపీటీసీ జెడ్పీటీసీ తో పాటు మున్సిపల్ ఎన్నికలలో 20శాతం కోట యువతకు కేటాయించాలన్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో యువత క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. నిర్మల రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. వివిధ నియోజకవర్గం అధ్యక్షులు నవీన్, నాగిరెడ్డి, వెంకట్ జింగ, సిద్ధారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ యాదవ్, వసిం, ప్రధాన కార్యదర్శులు అక్బర్, శ్రీహరి గౌడ్, గోవర్ధన్ రెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.