ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.

ప్రజా ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం

– సకాలంలో రైతులకు చేయూత.

– ప్రజాహిత సంక్షేమాలతో ప్రజలు సంతోషం.

– డిప్యూటీ స్పీకర్ డా. రామచంద్రనాయక్

– మరిపెడ పట్టణ కేంద్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, వ్యవసాయ మంత్రి, ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం.

మరిపెడ:నేటిధాత్రి.

 

 

 

 

 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగిస్తుందని, కాంగ్రెస్ రైతుల పక్షపాతి అని రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్ అన్నారు. సాగుకు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోస సకాలంలో వేసిన సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ ఆర్ అండ్ బి అతిధి గృహం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజాహిత సంక్షేమాలు ప్రవేశపెట్టి నిరుపేదలకు ఆసరాగా నిలుస్తోందన్నారు. మండలంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రూ. 500 సిలిండర్, 21లక్షల మంది రైతుల రుణ మాఫీ చేసింది, సన్న వడ్లు కు బోనస్, భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం, అర్హులైన రైతులకు ఎకరాకు రూ.6వేల రైతు భరోసా లబ్ధిదారులకు అందించిందన్నారు. తాజాగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు మొదటి విడతగా 4000వేల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించి ప్రజా ప్రభుత్వంగా ప్రజల మన్ననలు పొందుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అన్ని విధాల బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానుగోతు రామ్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి నాయక్, నాయకులు బోర గంగయ్య, కొండం దశరథ, గుండగాని వెంకన్న, సురబోయిన ఉప్పలయ్య, కుడితి నరసింహారెడ్డి, కారంపుడి ఉపేందర్, రవికాంత్, దూగుంట్ల వెంకన్న, బోడ రమేష్, తొట్టిగౌతం, యాకుబ్ పాషా, బోడ రవి, వల్లేపు లింగయ్య, గంధసిరి సోమన్న, గౌస్, సోమ చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా.

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్…

నేటి ధాత్రి మహబూబాబాద్:

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి వేగంగా వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు.మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ,ఆసుపత్రిలోని మెడికల్,ఫీవర్,క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ కేర్, పిరియాడిటిక్ , జనరల్ సర్జికల్ వార్డు, మెడికల్ స్టోర్, డయాలసిస్, తదితర వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు.ఆలన కేంద్రం లో క్యాన్సర్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్, హోమ్ కేర్ లు తదితరులతో మాట్లాడుతూ,వారికి అందుతున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలో కావలసిన అన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం సానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు.నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ స్థితిగతులను తెలుసుకున్నారు.పనులను వేగంగా పూర్తి చేయాలని అందుకు ప్రతినిత్యం కాంట్రాక్టర్లు సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.రోగులకు నిత్యం వైద్య సేవలు అందిస్తూ షిఫ్టులవారీగా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వైద్య సేవలలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని సూచించారు.కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు..

తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయం దండుగ కాదు…పండగ

◆ రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్న

◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

 

 

న్యాలకల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద నిర్వహించిన రైతు నేస్తం,రైతు భరోసా విజయోత్సవ సభలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద నిధులు రైతుల ఖాతాలో విడుదల చేసిన శుభ సందర్భన్నీ పురస్కరించుకుని మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మండలంలోని రైతులు మరియు పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగుంది.అనంతరం రైతులందరు ప్రజా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తంచేశారు, మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కేవలం18 నేలలో రైతు రుణమాఫీ,రైతు భరోసా,రైతు బోనస్లు అందించిన ఏకైక ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ డీసీసీ ప్రధాన కార్యదర్శి.భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సామెల్,pacs చైర్మన్లు.సిద్దిలింగయ్య స్వామి,జగ్గానాథ్ రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ.గౌసోద్దీన్,మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం.

చిట్యాల నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ కోడపాక రఘుపతి, ఎస్సై -2 ఈశ్వరయ్య, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఘనంగా యోగా దినోత్సవం ను నిర్వహించారు. ఎంఈఓ రఘుపతి మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప విధానమని దీని ద్వారా విద్యార్థులు ఏకాగ్రతను, శారీరక మానసిక వికాసాన్ని సాధించవచ్చని చెప్పారు. ఎస్సై -2 ఈశ్వరయ్య స్వయంగా కొన్ని యోగాసనాలు వేసి విద్యార్థులతో చేయించాడు. యోగాతో శారీరక అనారోగ్యాలను తొలగించుకోవచ్చని విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆదర్శవంతమైన పౌరులుగా మారాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు బుర్ర సదయ్య విద్యార్థుల చే యోగాసనాలు వేయించారు. హాస్టల్ వార్డెన్లు వేణు సింగ్, అరుణలు పాల్గొని విద్యార్థులకు మొలకలు, రాగి జావా అందించి ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, సరళ దేవి, నీలిమారెడ్డి రామనారాయణ కల్పన,శంకర్, మౌనిక, ఉస్మాన్ అలీ,బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

పైడిపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..!

నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే, ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం?

ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న ఎల్లావుల కుమార్ యాదవ్ పై రౌడీషీట్ ఓపెన్ చేయాలి :_ సంఘీ ఎలేందర్, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు.

పైడిపల్లి, నేటిధాత్రి.

 

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పైడిపల్లి గ్రామ శివారు సర్వే నెంబరు 264లో ఎల్లావుల కుమార్ యాదవ్ ప్రభుత్వ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్న విషయం తెలుసుకొని, దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సంఘీ ఎలేందర్, జన్ను రవి లు అట్టి ప్రభుత్వ భూమిని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ ఎల్లవుల కుమార్ యాదవ్ సర్వేనెంబర్ 263లో రిజిస్ట్రేషన్ చూపించి సర్వే నంబర్ 264 భూములను అమ్మినాడని, ఇట్టి విషయంపై గత కొన్ని ఏళ్లుగా పోరాటం చేయుచుండగా, వరంగల్ తహశీల్దార్ ఇట్టి భూమిలో, ఇది ప్రభుత్వ భూమి ఎవరు అక్రమించరాదని బోర్డు పెట్టడం జరిగినది అని, అయినా కానీ తన వైఖరి మార్చుకోకుండా కొందరి రాజకీయ నాయకుల పేర్లు చెప్పి, అక్కడున్న గుడిసె వాసులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కావున ఎల్లవుల కుమార్ యాదవ్ పై నమోదైన కేసుల సంఖ్యలు పరిశీలించి వరంగల్ పోలీస్ కమిషనర్ అతడిపై రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని కోరడమైనది. నగరంలో బండి కుమారస్వామి కబ్జా విషయం ఇంకా కనుమరుగక ముందే ఎల్లవుల కుమార్ యాదవ్ కబ్జాకు ప్రయత్నం చేయడం వరంగల్ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందని భూకబ్జాదారులను వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ కట్టడి చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో
సిపిఐ నాయకులు ఆరే రాజు, మాస్కే సుదీర్, బెజ్జంకి యాకంబ్రచారి, రాచర్ల రాజేందర్, మంద నవీన్ లు పాల్గొన్నారు.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్.

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి:

దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.
గురువారం ఐడిఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అలింకో వారి సహాయంతో
దివ్యాంగులకు సహాయ ఉపకరణముల పంపిణి
శిభిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు డిడబ్ల్యూఓ మల్లేశ్వరి ప్రారంభించారు అనంతరం దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలని దివ్యాంగులకు అద్భుతమైన తెలివి తేటలు, ప్రతిభా పాఠవాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కోట ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా బలపడేందుకు తోడ్పడతామని అన్నారు. జైపాల్ రెడ్డి దివ్యాన్ గుడు అయినప్పటికి సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నాయకుడుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు. లోకల్ బాడి ఎన్నికల్లో సైతం దివ్యాంగుల ప్రజాసేవలో భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు.
అలీంకో సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా 204 భూపాలపల్లి నియోజక వర్గంలో 154 దివ్యాంగులకు 21 రకాల వివిధ సహాయ ఉపకరణాలు అందించడం జరుగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ అమృతం పథకం ద్వారా జిల్లాలో 8640 మంది 14 నుండి 18 సంవత్సరాల వయసు గల కిషోర బాలికలను గుర్తించి వారిని రక్త హీనత నుండి కాపాడడి, సంపూర్ణ ఆరోగ్య వంతులుగా తయారు చేసేందుకు పల్లి పట్టీలు, మిల్లెట్ పట్టీలు, నెలకు రెండుసార్లు అందించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆరోగ్య పరిరక్షణ లి భాగంగా ప్రభుత్వం ఇందిరమ్మ అమృతం కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం దివ్యాన్గులకు ఉప కరణాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,
విజయలక్ష్మీ,
డిడబ్ల్యూఓ మల్లేశ్వరి, ఆలిం కో ప్రోస్టేటిక్ అండ్ ఆర్థోటిస్ట్ రష్మీ రాజన్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం.

పాడైన రోడ్డు పట్టించుకోని ప్రభుత్వం..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్- బడం పేట్ మార్గమధ్యలో గల రోడ్డు కోత్తూర్, ఖానాపూర్ సమీపంలో పూర్తిగా పాడైపోయిన కారణంగా ఆసుపత్రి, పాఠశాలకు మండల కేంద్రమైన కోహీర్ కు రాకపోకలు సాగించడానికి తీవ్ర అవస్థకు గురౌతున్నామని, కోత్తూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన పలువురు స్థానికులు శనివారం సాయంత్రం విడుదల చేసిన
సంయుక్త పత్రికా ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

“ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్నామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వారి కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ లాంటి వాటికి కళాశాలలో శిక్షణ ఇస్తారని ఉన్నతంగా విద్యార్థులను అధ్యాపకులు తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివుకున్న విద్యార్థులకు ఎంసెట్ లక్ష ర్యాంకు వరకు ఉచితంగా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నజిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలో గల చిన్న బోనాల ,పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ఆరోగ్య ఉపకేంద్రములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డిఐఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రికార్డులను పరిశీలించి 0-5 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇచ్చిన తర్వాత రెండు గంటలు పాటు టీకాలు వేసిన ప్రాంతంలోనే అబ్జర్వేషన్ లో ఉంచుకొని మరో రెండు రోజులపాటు సంబంధిత ఏ.ఎ.న్ఎం మరియు ఆశ వర్కర్లు టీకాలు వేసిన పిల్లల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తూ, సకాలంలో విధులు నిర్వర్తించవలసిందిగా లేనియెడల సి.సి.ఏ. రూల్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నహీం జహన్ మరియు సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు.

మరిపెడ నేటిధాత్రి:

 

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందు కున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు, బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లోనే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం ప్రాథమిక పాఠశాలలో 30 నూతన అడ్మిషన్లు రావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్ తెలిపారు కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలో 18 మంది విద్యార్థులు, 2 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 3 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 4 వ తరగతి లో 1, 5 వ తరగతి లో 1 చొప్పున మొత్తం 30 మంది విద్యార్థులు నూతన అడ్మిషన్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు అయితే, ఇంకా కొంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది అని వారు తెలిపారు, ఈ నెల 12 నుంచి 2025-26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.

ఫలితాలిస్తున్న సర్కారు నిర్ణయాలు.

ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా పదివేల కు పైగా టీచర్లను నియమించగా, ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చింది. దీనికితోడు 1.10లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికితోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి అన్నారు,మరోపక్క బడులు తెరిచిన రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు యూని ఫామ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గువ్వడి లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి, గణేష్,ఎస్ఎంసి చైర్ పర్సన్ పసుపులేటి శోభ,విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ సింబల్‌బోర్డ్‌లో ఉర్దూ భాష విస్మరి విస్మరిస్తున్న ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

shine junior college

జహీరాబాద్‌లోని ఈద్గా ముందు ఉన్న కొత్త ఫ్లైఓవర్ వంతెన పైన ఉన్న సైన్ బోర్డుపై ఉర్దూలో ఎలాంటి రాతలు లేవు. AIMIM జహీరాబాద్ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ ఈ విషయం గురించి సమాచారం అందుకున్న వెంటనే, జమాత్ ప్రతినిధులు మా ఫ్లైఓవర్ వంతెన వద్దకు చేరుకుని, మొదట ఆ పనిని నిలిపివేసి, తెలంగాణ రాష్ట్ర రెండవ ప్రభుత్వం ఉర్దూలో మాట్లాడుతున్నప్పటికీ, ఉర్దూను విస్మరించారని మరియు R&B శాఖ ప్రతినిధులు వచ్చి ఈ సమస్యను పరిష్కరించే వరకు,అతను జహీరాబాద్ RDO సిబ్బంది తో R&B గురించి మాట్లాడాడని నోటీసు జారీ చేశాడు. 

Ε.Ε మరియు A E తో ఫోన్‌లో మాట్లాడి, ఈ బోర్డుపై ఉర్దూ రాయడం పూర్తి చేయని వరకు,ఈ బోర్డును అమర్చడానికి మేము అనుమతించబోమని డిమాండ్ చేశాడు. దీనిపై, టౌన్ S.I వినయ్ కుమార్ R&B శాఖ ప్రతినిధులతో మాట్లాడి A.E సంధ్య ను ఫోన్ చేసి, వారిద్దరూ కలిసి 24 గంటల్లో దానిపై ఉర్దూ రాత పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం జాయింట్‌ సెక్రటరీ మొహియుద్దీన్‌ గౌరీ సాహబ్‌, అమీర్‌ బిన్‌ అబ్దుల్లా,షేక్‌ ఇలియాస్‌, వార్డెన్స్‌ అందగాడు షేక్‌ సద్దాం,మహమ్మద్‌ ముజీబ్‌ జమాత్‌ నాయకులు మహ్మద్‌ అలీం,మహ్మద్‌ ఫరూఖ్‌,మహమ్మద్‌ సమీర్‌, మహ్మద్‌ అజీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిఆర్పి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.

సిఆర్పి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

– ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

తొర్రూరు (డివిజన్) నేటి ధాత్రి

 

shine junior college

 

 

తొర్రూరు మండలంలోని చర్లపాలెం కాంప్లెక్స్ పరిధిలో సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ) లో సి ఆర్ పి గా విధులు నిర్వహిస్తూ శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సర్వి రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్ఎస్ఎ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం తొర్రూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేసి మృతుడు రమేష్ కు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెల్తూరి మల్లేశం ,CRP ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుల సహదేవ్ , మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మారగోని జానకిరామ్ , షేక్ ఖాదర్ పాషా మాట్లాడుతూ ఎస్ఎస్ఏ లో గత 13 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్ట్ పద్ధతిలో సిఆర్పి గా పని చేసిన రమేష్ అకాల మరణం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా అందించడంతో పాటు మృతుని భార్యకు ఉద్యోగం కల్పించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ బుచ్చయ్య, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సిఆర్పి రమేష్ మృతికి సంఘీభావం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఉపాధ్యాయులు తమ వంతు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎంఈఓ బుచ్చయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు రమేష్ అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో crp ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహబూబ్ పాషా, రాష్ట్ర కోశాధికారి కంచర్ల మహేందర్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మహంకాళి వీరన్న, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ , ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబులాల్,రు ,సంతోష్ ,కల్పన, ఉదయ్,రమేష్ పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, లక్ష్మణ్, నాగరాజు, రవి, వెంకటేశ్వర్లు, కరుణ పద్మావతి. తది తరులు పాల్గొన్నారు,

అమ్మ మాట అంగన్వాడి బాట .

అమ్మ మాట అంగన్వాడి బాట

నడికూడ,నేటిధాత్రి:

 

shine junior college

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని నర్సక్కపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్ ఒకటి నందు ఐసిడిఎస్ సూపర్వైజర్ హేమలత ఆధ్వర్యంలో ఫ్రీ స్కూల్ సంబంధించిన పిల్లల అసెన్మెంట్ కార్డులను ప్రదర్శించి వాటిపైన అవగాహన కల్పించారు.ఇ సిసిఇపై అమ్మమ్మ తాతలకు సెంటర్లో టీచర్లు మరియు పిల్లలు తయారు చేసిన మెటీరియల్స్ మరియు ఐసిడిఎస్ వారు అందించిన సామాగ్రిని ప్రదర్శించి అవగాహన కల్పించారు పిల్లల మేధో శక్తిని పెంచి ఆటలు పాటలు సృజనాత్మకత వారు గీసిన బొమ్మలు అన్ని తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పి.సరిత, కోడెపాక సుప్రియ, పి రజిని కుమార్, ఎం లక్ష్మి, ఆయాలు రాధ, వనజ,ముత్యాలు,రమ పిల్లల తల్లులు, పిల్లల గర్భిణీ బాలింతలు, గ్రామస్తులు హాజరై విజయవంతం చేశారు.

ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత

జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్ రెడ్డి

కేసముద్రం/ నేటి దాత్రి

 

shine junior college

 

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువల యందు
జిల్లా విద్యశాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించబడినది.

ఈ కార్యక్రమానికి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కేసముద్రం అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవ రెడ్డి, మరియు జిల్లా విద్యశాఖ అధికారి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు.

ప్రభుత్వ బడులు సామాజిక వారసత్వ సంపదను పెంపొందిస్తాయని, పేర్కొన్నారు.

ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందుతుందని, పైసా ఖర్చు లేకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ మరియు నోట్ పుస్తకాలు అందించడం జరుగుతుందని, తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అలాంటి ఊరుబడిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వము అందించే ఉచిత పథకాలను ఆదరించిన విధంగానే ప్రభుత్వ బడులను కూడా ఆదరించాలని, ప్రజలందరూ తమ పిల్లలను ఊరి పాఠశాలలోనూ చేర్పించాలని కోరారు. కలువల ప్రాథమిక పాఠశాలలో తమ పిల్లవాణ్ణి చేర్పించిన యుపిఎస్ నరసింహుల గూడెం ఉపాధ్యాయులు ఎస్ కే సయ్యద్ను ఘనంగా సన్మానించడం జరిగింది.అదేవిధంగా కలవల ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్స్, కే తేజస్విని, వై వెన్నెల మరియు జి శివాని లను కూడా అభినందించారు. గణితంలో వందకు వంద మార్కులు సాధించిన
వై వెన్నెలకు పాఠశాల గణిత ఉపాధ్యాయులు తండా సదానందం వెయ్యి రూపాయల నగదు బహుమతిని అందజేయగా, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, 3016 రూపాయలు అందజేశారు. తర్వాత ప్రాథమిక పాఠశాలలో 65 అడ్మిషన్లు చేసిన ప్రధానోపాధ్యాయులు వీరారెడ్డి, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ ను, మిగతా ఉపాధ్యాయులను డిఇఓ రవీందర్ రెడ్డి ,సంజీవరెడ్డి ఘనంగా సత్కరించారు. అనంతరం, బడిబాట ర్యాలీ తీయడం జరిగింది. గ్రామ కూడలిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు గిద్దె రాం నరసయ్య మరియు బండ వెంకన్నల బృందం ఆటపాట కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు ఆజాద్, అప్పారావు మండల విద్యాధికారి కాలేరు యాదగిరి, ఉపాధ్యాయులు ఏకాంబరం, తండా సదానందం, ఎం యాకాంబరం, ఆర్ బిక్షపతి బాలషౌరెడ్డి , వి రాజేంద్ర చారి, కే రాములు, మార్గం శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్ ,
వి రాము, కే పార్వతి, ఎండి జుబేర్ అలీ,
జి నాగరాజు,ఏ లింగయ్య,.,గోపి ..స్వరూప, శ్రీదేవి, హరికృష్ణ, కృష్ణ, మోహనకృష్ణ సిఆర్పి ఉదయ్, రాధ..నవీన్ మరియు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు మునికుంట్ల ఐలేష్, ఎం భరత్, పరమేష్, బి .యాద గిరి, డప్పు యుగంధర్, వంగూరి శ్రీనివాసరావు, దేశెట్టి ప్రవీణ్ కుమార్ , అశ్విని, అనిల్, కవిత తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించాలి…

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జెసికి రీప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ కు భూపాలపల్లి టౌన్ పరిధిలోని బాల బాలికలకు వాహన సౌకర్యాలు కల్పిస్తే నీరు పేదలు అనగారిన కులాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చెందిన పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుందని జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
దీనిని ఉద్యేసించి జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ తెలిపారు ప్రైవేట్ స్కూల్లో విచ్చలవిడిగా తల్లిదండ్రుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు కూలినాటి చేసుకునే నిరుపేద కుటుంబాలకు వాళ్లకు పిల్లలు చదువుకునే కళ నెరవేరకపోగా పైసలు కట్టలేక అనేక రకాల ఇబ్బందులకు గురై ఆ పిల్లలు చదువుకు దూరమై అనేక రకాల వ్యసనాలకు బానిసవుతున్నారు వీటి నుంచి దూరం కావాలంటే ఇప్పుడే స్టార్టింగ్ స్కూలు ప్రారంభ దశలో ఉంది గనుక పిల్లలందరికీ వాహన సౌకర్యం కల్పిస్తే ఖచ్చితంగా స్కూలుకు వస్తారు ప్రభుత్వ స్కూళ్లలో మంచి చదువుకొని గొప్పవాళ్ళు అవుతారు భూపాలపల్లి టౌన్ లో వివిధ కాలనీలకు ప్రభుత్వ స్కూలు తరఫున వాహన సౌకర్యం గనుక కల్పిస్తే ఖచ్చితంగా బడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మా దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీనికి కలెక్టర్ ఎమ్మెల్యే సురవ తీసుకొని కచ్చితంగా వాహన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తునాం
ఈ కార్యక్రమం జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్ మందా రమేష్ పుల్ల అశోక్ జన్నే లక్ష్మణ్ పంగ మహేష్ చిర్ర శ్రీకాంత్ రవీందర్ పాల్గొన్నారు

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పరకాల నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

మున్సిపాలిటీ పరిధిలోని రెండోవార్డ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొచ్చు అనూష దశ్వంత్ రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించారు.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన కొనసాగించినదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు l మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు, మడికొండ లలిత,బొచ్చు అనిల్,కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,ఏం డి,హాజీ చుక్క శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ భూమిలో ఇండ్లపట్టాలు ఇవ్వాలి.

ప్రభుత్వ భూమిలో ఇండ్లపట్టాలు ఇవ్వాలి..

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినతిపత్రం ఇచ్చిన పేదలు

అర్హులైన పేదలందరికీ పట్టాలిస్తాం… హామీ ఇచ్చిన ఎమ్మెల్యే

నర్సంపేట నేటిధాత్రి:

ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న ఇండ్లకు పట్టాలచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించి, కనీస సౌకర్యాలు కల్పించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ తెలిపారు.ఈ మేరకు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పేదలు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ
నర్సంపేట పట్టణంలోని 601/1 ప్రభుత్వ భూమిలో నిలువ నీడలేని పేదలు గత 5 సంవత్సరాలకు పైగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వీరికి నీళ్ల సౌకర్యం లేక ఇబ్బంది పడుతుంటే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే సహకారంతో గెలిచిన వెంటనే పేదలు నివాసం ఉండే ప్రాతంలో బోరువేయడం జరిగిందని అన్నారు.కనీస సౌకర్యాలైన మంచినీరు, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాము. వర్షాకాలం వచ్చిందంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. పాములు,కిటకాలుతో పేదలు సావాసం చేస్తున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులకు పట్టాల కోసం అనేక సార్లు దరఖాస్తలు చేసుకోవడం జరిగిందని,ఎమ్మెల్యే స్పందించి పేదలు వేసుకున్న ప్రాంతాలలో కనీస సౌకర్యాలు కల్పించి,ఇండ్ల పట్టాలు ఇప్పించి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించగలరని కోరినట్లు తెలిపారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నర్సంపేట స్థానికులైనా అర్హత గల పేదలందరికి పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు గడ్డమీది బాలకృష్ణ, కందికొండ రాజు, ఇప్ప సతీష్, కలకోట అనిల్,ఎండి ఫరిదా, వజ్జంతి విజయ, బిట్ర స్వప్న, ఉదయగిరి నాగమణి, జగన్నాధం కార్తీక్, దాసరి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శరవేగం

 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన

★ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

★ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో శాంతినగర్ మరియు డ్రైవర్ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹చంద్రశేఖర్ మాట్లాడుతూ అరుహులైన ఇల్లు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 ఐదు లక్షల రూపాయలు ఇవ్వనుంది.ఈ పథకం పేద ప్రజలకు నీడగా నిలవనుంది అని వారు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్,పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు,ఏయంసి.డైరెక్టర్ జఫ్ఫార్,మాజీ ఎంపీటీసీ అశోక్,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,శుక్లవర్ధన్ రెడ్డి,ఖాజా,తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి.

ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలి

గుండెపుడి, రాంపురం పాఠశాల లో సామూహిక అక్షరాభ్యాసం.

మరిపెడ నేటిధాత్రి:

విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయ శంకర్ బడిబాట కార్య క్రమాన్ని 2025 – 26 విద్యా సంవత్సరానికి ఈ నెల జూన్ 6 – 19వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాలతో నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్, గుండెపుడి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నామ చేతుల మీదుగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులతో పాటు నోట్ బుక్స్,మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు, పేద మధ్య తరగతి పిల్లలకు భారం కాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల లను బలోపేతం చేస్తుందన్నారు,సర్కారు బడుల్లోని వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు వివరించరు. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు,అమ్మ ఆదర్శ కమిటీలు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నామ, ఉపాధ్యాయులు నివేదిత, దోమల లింగన్న గౌడ్,మురళి, సునీత,మాధవి, రాంపురం పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి గణేష్, గ్రామ పెద్దలు, బందు పరశురాములు, బందు వీరన్న, ఎడ్ల ఉపేందర్, ఆశా వర్కర్లు బందు మంజుల, మమత, చింతపల్లి ఉమా,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version