ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి.

‘ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి’

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ-జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మ్యాతారి మహేందర్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్రతి 30 మందికి ఒక బస్సు ఏర్పాటు చేసి స్కూలుకు తీసుకెళ్లాల్సిందిగా కోరారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎఫ్ డిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు.గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.మార్త నాగరాజు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న విద్యాసంస్థల్లో సమస్యలు పేరుకుపోయాయని,విద్యాశాఖ అధికారులు , ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు.డివిజన్ కేంద్రంలో ఉన్న ఎస్సి,ఎస్టీ,బీసీ మైనారిటీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గర్ల్స్ కన్వీనర్ గణిపాక బిందు,జిల్లా కమిటీ సభ్యులు సాగర్ ,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి .

పెండింగ్ స్కాలర్ షిప్స్ చెల్లించాలి

జైపూర్,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ఫీజు రియంబర్మెంట్లు స్కాలర్షిషిపులు విడుదల కొరకు పిడి ఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేయడం జరిగింది.ఈ సందర్భంగా పిడి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలోని గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్మేంట్,స్కాలర్షిప్ 7200 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.విద్యార్థులు పై చదువులు చదవాలంటే కార్పొరేట్ కళాశాలలోని ఫీజులు కట్టాలని యాజమాన్యం ఒత్తిడి గురి చేయడం వల్ల విద్యార్థులు చదువులని మానేసే పరిస్థితి నెలకొంటుంది.విద్యార్థులకు రావలసిన బకాయిలు తక్షణమే విడుదల చేసి వారికి న్యాయం చేయాలని కోరారు.జైపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చుట్టూ ప్రహరి గోడ లేకపోవడం వల్ల మహిళ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ దీనిపై తక్షణమే ప్రభుత్వం,ఎమ్మెల్యే స్పందించి జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించాలని ప్రగశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పి డి ఎస్ యు) ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్,అన్వేష్,సుమంత్, వైష్ణవి,రోజా,మేఘన విద్యార్థులు పాల్గొన్నారు.

కార్మికులను బానిసలుగా చేస్తున్న బిజెపి

కార్మికులను బానిసలుగా చేస్తున్న బిజెపి మోడీ ప్రభుత్వాలు

కార్మికులను బానిసలు చేయడంలో బిజెపి మోడీ ప్రభుత్వం అడుగులకు మడుగులొత్తుతున్న కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

కార్మికుల పని గంటలు పెంచడమంటే కార్మికుల స్వేచ్ఛ జీవితాలను హరించడమే

పని గంటలు పెంచుతు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలి.

సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో జీవో ప్రతుల దగ్దం.

దూలం శ్రీనివాస్
సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు.

మందమర్రి నేటి ధాత్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులతో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని విడుదల చేసిన జీవో నెం 282 ను వెంటనే రద్దు చేయాలని 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జీవో ప్రతులను దగ్దం చేయడం జరిగింది.అనంతరం దూలం శ్రీనివాస్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…

 

 

కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ సంకీర్ణ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తు కార్మిక వర్గానికి ఉన్న 49 చట్టాల నుంచి 29 చట్టాలను రద్దు చేసి 4 లెబర్ కోడ్ ల రూపంలో దాడి చేస్తుంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతాం అంటునే బిజెపి ప్రభుత్వం కంటే ముందే ఒక అడుగు ముందుకు వేసి 10 నుంచి 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జీవోను విడుదల చేయడమంటే,బడాపెట్టుబడిదారులకు కార్మిక వర్గాన్ని బానిసలను చేసే కుతుహలం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఎక్కువ ఉన్నట్లు ఉంది. కార్మికుల వేతనాలు పెంచండి మహాప్రభో అంటు కార్మిక వర్గం ముక్త కఠంతో వేడుకుంటున్న పట్టించుకోకుండా ఇలా పని గంటలు పెంచడం దుర్మార్గం. పని గంటల పెంపుతో కార్మికుని వ్యక్తిగత స్వేచ్ఛ, జీవితాన్ని హరించడమే. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 282 ను రద్దు చేయాలని కార్మికుల వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని లేని యేడల బిజెపి మోడీ ప్రభుత్వంపై కార్మికవర్గం ఏలాంటి పోరాటం చేస్తుందో ఐక్యంగా, ఆ పోరాటాలను రాష్ట్ర ప్రభుత్వంపై కూడా చేయడానికి కార్మిక వర్గం వెనకడదని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు మందమర్రి అధ్యక్ష కార్యదర్శులు జి. ఐలయ్య, యం. నర్సయ్య, నాయకులు రాజశేఖర్, సంగి పోషం , దుర్గయ్య, లక్ష్మణ్, పోసు, శంకరమ్మ, మల్లమ్మ, రజిత,కళావతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ .!

పేదవారి కళను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో
ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. పేదవారి సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన నిరుపేదల అందరికీ అందే
విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, ఎంపిడిఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటి సబ్యులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పరకాలలో కార్మికుల ర్యాలీ

సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పరకాలలో కార్మికుల ర్యాలీ

పరకాల నేటిధాత్రి
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు డి.తిరుపతి డిమాండ్ చేశారు.గురువారం పరకాల పట్టణంలోని దేశవ్యాప్త కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని,కనీస వేతనం నెలకు 26,000 చెల్లించాలనీ,కాంట్రాక్ట్ కార్మికులను,స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలనీ,ఇ.పి.ఎఫ్ పెన్షన్ కనీసం 9000 చెల్లించాలని,వ్యవసాయ కార్మికులతో సహా అన్ని వర్గాల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలన్నారు.గిగ్ వర్కర్లు,మత్స్యకారులు,గృహ కార్మికులు,అతిథి కార్మికులు,స్కీమ్ వర్కర్లు, పోర్టర్లు,దుకాణదారులు, మోటారు కార్మికులు,నిర్మాణ కార్మికులు,భద్రతా కార్మికులు, హౌస్ కీపింగ్ కార్మికులు మొదలైన వారికి వైద్య సహాయం,క్రమబద్ధమైన ఆదాయం,పెన్షన్ ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు.

బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఎన్నో సంవత్సరాల క్రితం పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను తొలగించే కోసం కుట్ర చేస్తుందని లేబర్ కోడ్ లను అమలు చేయాలని చూస్తుందని,వాటిని వెంటనే రద్దు చేయాలని లేకుంటే దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్,కార్మిక సంఘాల నాయకులు ఐఎన్టియుసి మున్సిపాలిటీ పరకాల పట్టణ అధ్యక్షులు బొచ్చు ఐలయ్య, ఉపాధ్యక్షులు మంద మహేష్,కార్యదర్శి పసుల సారయ్య, గుర్రం సరోజన,హమాలి సంఘం అధ్యక్షులు ఆదాం, బొచ్చు సంపత్,రమేష్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘ నాయకులు పోతిరెడ్డి సమ్మక్క,మేకల రాధ,జి. లింగా స్వామి,రాజయ్య
డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరంజీవి,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ లు పాల్గొన్నారు.

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ర్యాలీ

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ర్యాలీ.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూకాంటాక్ట్ కార్మికుల కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి అని,కార్మికులను బానిస తత్వంలోకి నెట్టే 4 లేబర్ రద్దు చేయాలిఅని,కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు అని ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు, ఈ ర్యాలీలో ఆశ వర్కర్లు రైతు కూలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సమాజ సేవలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర కీలకం.

*సమాజ సేవలో స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర కీలకం..

*పేదల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది..

*అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తోంది..

*చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..

బంగారు పాళెం,(చిత్తూరు(నేటి ధాత్రి)

సమాజ సేవలో
స్వచ్ఛంద సేవా సంస్థల పాత్ర చాలా కీలకమని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు.
ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన రోప్స్, సాయిల్ గ్రీన్, ఎన్.వై.కే.సంస్థలు గిరిజనులకు అండగా నిలవడం అభినందనీయ
మాని ఆయన
అన్నారు,
బుధవారం పూతలపట్టు నియోజకవర్గంబంగారు పాళెం మండలం, మొగిలి వారి పల్లి గ్రామం, జయంతి ఎస్.టి కాలనీలో నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారుఅంతకు ముందు
జయంతి యస్.టి.కాలనీకి చేరుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళకు బంగారు పాళెం మండలం టీడీపీ సీనియర్ నేత జయప్రకాష్, తెలుగు దేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, బంగారు పాళెం మండలాధ్యక్షుడు ధరణి, రోప్స్ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ శ్రీలత, జపాన్ కు చెందిన ఎన్.వై.కే సంస్థ సభ్యులు, స్థానిక టిడిపి శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
అతిథుల జ్యోతి ప్రజ్వలనతో సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారుముందుగా ఎన్నో ఏళ్లుగా వెట్టిచాకిరిలో మగ్గి విముక్తి పొందిన ఎస్టీ కార్మికులకు చిత్తూరు పార్లమెంటు సభ్యులు విముక్తి పత్రాలను అందజేశారు. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులతో కలిసి వారికి బియ్యాన్ని, నిత్యవసరాలను పంపిణీ చేశారు. వారితోపాటు గిరిజన విద్యార్థులు, ప్రజలకు బియ్యం, దుస్తులు, పుస్తకాలు, దుప్పట్లును అందజేశారు. గిరిజనుల దుస్థితిని గుర్తించి,వారికి బాసటగా నిలిచిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలైన రోప్స్, సాయిల్ గ్రీన్, ఎన్.వై.కే.సంస్థల సేవా నిరతిని ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రశంసించారు. సామాజిక సేవే పరమావధిగా పనిచేస్తున్న ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు సమాజానికి అవసరమన్నారు.కూటమి ప్రభుత్వం కూడా ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని ఆయన తెలిపారు. మరి ముఖ్యంగా గిరిజన ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలను చేరువ చేసి వారి జీవితాలలో వెలుగులు నింపుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సునీల్ చౌదరి, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాటిభట్ల శేఖర్ బాబు,రోప్స్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూళ్ల లో మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ స్కూళ్ల లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు

రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలో అమలు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల గీతానగర్ బడిలో మొదలు

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 458 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసేందుకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్టు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ జెడ్పి.హెచ్.ఎస్ లో మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. విద్యార్థులకు కట్టెల పొయ్యి పై ఆహార పదార్థాలు సిద్ధం చేయవద్దని సూచించారు. దీంతో వాతావరణ కాలుష్యం, ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. జిల్లాలోని 458 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం
గ్యాస్ స్టౌ పై సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధముగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ లపై సిద్దం చేయనున్నారు. ఇందులో భాగంగా ముందుగా సిరిసిల్ల లోని గీతా నగర్ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పినచ్చాలి

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పినచ్చాలి

పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో సకాలం లో అందజేయాలి

విద్య హక్కు చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి

కార్పొరేట్, ప్రైవేటు విద్య సంస్థల ఫీజు దోపిడీని అరికట్టాలి

విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలి

గుండాల మండల కార్యదర్శి గడ్డం వరుణ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

మండల లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలికవసతులు కల్పించాలని,ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఫీజు దోపిడీని అరికట్టాలినీ, విద్యాసంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలినీ డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఏంఈఓ కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కార్యదర్శి వరుణ్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం పున ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నసందంగా కనిపించడం బాధాకరం అని అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాలు యూనిఫాంలో విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కొన్నిచోట్ల అరకొర వసతులు మాత్రమే ఉన్నాయని సరిపడ గదులు లేక విద్యార్థుల అవస్థలు పడుతున్నారని . ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో తరుణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

కాకతీయ హైస్కూల్లో వన మహోత్సవం.

కాకతీయ హైస్కూల్లో వన మహోత్సవం.

చిట్యాల, నేటిధాత్రి :

తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో వన మహోత్సవ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది అందులో భాగంగా చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో విద్యార్థులచే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ వృక్షో రక్షితి రక్షిత చెట్లను మనం రక్షించినట్లయితే చెట్లు మనలను రక్షిస్తాయి చెట్లు నాటడం వలన పర్యావరణం సమతుల్యంగా ఉండి సకాలంలో వర్షాలు పడి నీటి ఎద్దడి ఉండదు చెట్లు మానవుని మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి చెట్లు కార్బన్డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ప్రాణవాయువుని ఇచ్చి ఆయుష్షును పెంచే విధంగా చేస్తాయి చెట్లు అనేక జీవులకు నివాసం కల్పించి మనకు పండ్లు వేసవికాలంలో నీడనిచ్చి సేద తీరుస్తాయి అందుకే విద్యార్థులు మీ ఇంటి ముందు గానీ ఖాళీ ప్రదేశాలున్నచోట మొక్కలు నాటాలని కోరారు ఈ సమావేశంలో పాఠశాల డైరెక్టర్ మహమ్మద్ ఆఫీస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

నల్లా ఓదెలు ఆరోగ్యంగా తిరిగివచ్చినందుకు.!

నల్లా ఓదెలు ఆరోగ్యంగా తిరిగివచ్చినందుకు మొక్కుబడి తీర్చుకున్న వేటూరి సత్యనారాయణ

మందమర్రి నేటి ధాత్రి

మాజీ ప్రభుత్వ విప్, మందమర్రి నేత నల్లా ఓదెలు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా స్వస్థలమైన మందమర్రికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఓదెలు త్వరగా కోలుకోవాలని కోరాగట్టు అంజనేయ స్వామికి మొక్కుబడి పెట్టిన వేటూరి సత్యనారాయణ తన మొక్కుబడిని నెరవేర్చుకున్నారు. ఓదెలు ఆరోగ్యంగా తిరిగి వచ్చారని తెలుసుకున్న వెంటనే, వేటూరి సత్యనారాయణ మంగళవారం రోజున కోరగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో “ఓదెన్న ” పేరిట ప్రత్యేక అర్చనలు నిర్వహించి మొక్కుబడి తీర్చుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, “మనసారా మొక్కుకున్న మొక్కుబడి తీర్చుకోవడం అనేది భక్తికి నిదర్శనం. ఓదెలు గారు శీఘ్రంగా కోలుకోవడంలో ఆంజనేయ స్వామి కరుణ ఉందని నేను నమ్ముతాను,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వెల్టూరు సత్యనారాయణ. నారా లింగన్న. ముంజం నరసయ్య. జెర్రీగల రవి బండారు సత్యనారాయణ. . వాసాల శంకరి సంఘీ సంతోష్ ఏర్పుల రవి ఆగునూరి పోశం తుంగపిండి శంకర్. తదితరులు పాల్గొన్నారు

లాభాల బాటలో.. ఉద్యాన పంటలు……!

లాభాల బాటలో.. ఉద్యాన పంటలు……!

లాభాల బాటలో.. ఉద్యాన పంటలు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మెండుగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నలకు తరచుగా ఏదో ఒక రూపంలో నష్టం వస్తోంది. పంటలకు సరిపడా వర్షాలు కురవకపోయినా, పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు కురిసిన రైతులు నష్ట పోతారు. ఈ పరిస్థితుల్లో, ఉద్యానవన శాఖ ఆధి కారులు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మల్లెల రైతులను ప్రోత్సహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝురాసంగం మండలంలోని వివిధ గ్రామాల రైతులు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
బర్దిపూర్, ఏల్గోయ్, కుప్పా నగర్, పొట్టిపల్లి, జీర్లపల్లి, చిలేపల్లి, వసంపల్లి, ఝరాసంగం, సంగం (కే), ఏడాకులపల్లి, గుంత మర్పల్లి, బోరేగావ్, అనంతసాగర్, గినియార్ పల్లి, కృష్ణాపూర్, చిల్మేప ల్లి, మాచ్నూర్ తదితర గ్రామాల రైతులు ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపుతూ లాభాల బాట పడుతున్నారు. వివిధ గ్రామాల రైతులు కూరగాయలు, పండ్ల, పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ పంటలు పండిస్తూ లాభాల బాటలో పయని స్తున్నారు.

 

 

 

 

పూలతోటల సాగు వైపు..

బద్దిపూర్ గ్రామానికి చెందిన కోట ఆశన్న, కుమ్మరి వేణు, మహమ్మద్ షేర్, న్యాలకంటి సుధాకర్, వడ్డ సంగమేశ్వర్లు లిల్లీ, గులాబి, బంతి, పూల తోటలను సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుఐ డితో 6 నెలల లోపే పంట చేతికొచ్చి మార్కెట్ కు తరలిస్తు న్నారు. ప్రతిరోజు 2నుంచి3 వేల రూపాయల ఆదాయం వస్తుంది పువ్వులను సమీపంలోని జహీరాబాద్. మార్కెట్కు లేదా ఎక్కువ మొత్తం పూలు లేదా హైదరాబాద్ను తరలిస్తు న్నారు.

 

 

ఫామాయిల్ సాగు వైపు అడుగులు..

కుప్పా నగర్, కు చెందిన బి. చంద్రమ్మ, మల్లికార్జున్ పాటిల్, పండరినాథ్, సంగన్న లతో పాటు ఇతర గ్రామాల్లో సైతం పామాయిల్ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంటసాగు రెండు సంవత్సరాలు కావొస్తుం ది మరో రెండు సంవత్సరాలుపంట చేతికొచ్చే అవకా శం ఉంది. వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి 90శాతం సబ్సిడీ కింద మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.4200 చొప్పున 4 సంవత్సరాల వరకు సాగు ప్రోత్సాహకాలు అంద జేస్తారు. నాలుగేళ్ల తర్వాత పంట 35 సంవత్సరాల వరకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా 1225 ఎకరా లలో సాగు చేస్తున్నారు.

 

 

 

కూరగాయల సాగు వైపు రైతు..

మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వాణిజ్య పంటలతో పాటు తక్కువగా వ్యవధిలో చేతికొచ్చే కూరగాయల పంట సాగు వైపు రైతులు అడుగులు వేస్తున్నారు. బర్దిపూర్ కు చెందిన వద్ద సంగమేశ్వర్, కుప్ప నగర్ కు చెందిన ముల్ల చాందు, గొల్ల యాదప్ప, రాములు, భీమన్న, గైబు, ఎల్లోయి, ఝరాసంగం, సంగం (కే), గుంత మరిపల్లి, ఈదులపల్లి, కక్కెర వాడ, బొప్పనపల్లి, నర్సాపూర్, మేడపల్లి తదితర టమాట, బెండ, వంకాయ, చిక్కుడుకాయ, బీర, పాలకూర తదితర కూరగాయలను సాగు చేస్తూ లాభాల బాటలో పయ నిస్తున్నారు.

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కై రేవంత్ రెడ్డి ఇల్లు

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ కై రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించిన పి డి ఎస్ యు రాష్ట్ర కార్యవర్గం

ప్రభుత్వము స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను మానుకోవాలి

అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలి

 

 

 

ఈరోజు పిడిఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి అన్ని తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు పి డి ఎస్ యు నాయకులు ముట్టడించడం జరిగింది.

 

 

 

 

ఈ సందర్భంగా పి డి ఎస్ యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీలలో డొనేషన్ పేరిట ప్రైవేట్ కళాశాలలు పేద విద్యార్థుల నుండి ఎక్కువ మొత్తము ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు రక్తం తాగుతున్నారని తక్షణమే డొనేషన్ పేరు మీద జరుగుతున్న దోపిడీని అరికట్టాలని వర్షపుతాను డిమాండ్ చేశారు.అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు.

 

 

ఈరోజు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయడం లేదని పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం ఈ ప్రభుత్వాలకు తగదని పేద విద్యార్థులు పైతరగతిలకు వెళ్లడానికి కాలేజీలకి సర్టిఫికెట్ కోసం వెళితే ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజు కట్టమని పీడిస్తున్నారు ఇందువలన ఫీజు కట్టలేని పేద విద్యార్థులు తక్కువ స్థాయి చదువులకే పరిమితమై విద్యకు దూరమైతున్నారు .

 

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పూనుకుంటున్నదని తన వైఖరిని మార్చుకొని తక్షణమే పెండింగ్ లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రివర్స్మెంట్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నది .లేనియెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పి డి ఎస్ యూ అలుపెరగని ఉద్యమాలకు పండుకుంటుందని ఏ విద్యార్థులైతే బి ఆర్ ఎస్ ను గద్దదింపారు ఆ విద్యార్థులే మీ పతనానికి పూనుకుంటారని హెచ్చరిస్తున్నాం అన్నారు.

శ్రీవాణిది ప్రభుత్వ హత్యే

శ్రీవాణిది ప్రభుత్వ హత్యే

సంతాపసభలో పాల్గొన్న డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి
వరంగల్ ఉమ్మడి జిల్లా స్వేరోస్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని స్వర్ణ గార్డెన్స్ లో స్వేరో పలకరింపు,సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది.మండలంలోని మల్లక్కపేట గ్రామ శివారులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి స్మరణ సభలో

 

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.అనంతరం బస్టాండ్ కూడలి నుండి ర్యాలీతో ఏకు శ్రీవాణి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.అనంతరం శ్రీవాణి మృతి ప్రభుత్వ హత్యే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అంబేద్కర్ సెంటర్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సభా ప్రాంగణానికి చేరుకుని మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి తదుపరి శ్రీవాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపసభను కొనసాగించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్వేరోస్ నాయకులు,నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలకు సన్నాహాలు.

స్థానిక ఎన్నికలకు సన్నాహాలు…స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం…..!!!!

◆:- పంచాయతీ ఎన్నికల నిర్వహణ

◆:-గుర్తులు సిద్ధం ఎటూ తేల్చని ప్రభుత్వం

◆:-రిజర్వేషన్లపై సందిగ్ధం

◆:-మూడు నెలల్లో స్థానిక సమరం

◆:-సెప్టెంబరు 30లోగా నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

◆:-ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం

◆:-పాలకవర్గాలు లేకపోవడంతో గాడితప్పిన స్థానిక పాలన

◆:-ఎన్నికలు వస్తే సత్తా చాటేందుకు నాయకుల తహతహ

◆:-పంచాయతీలతో పాటే పరిషత్‌లకూ ఎన్నికలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక ఎన్ని కలకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తు న్నది. మరో రెండు నెలల్లో పంచాయతీ ఎన్ని కలు జరుగుతాయనే ప్రచారం జరుగుతున్న వేళ జిల్లా అధికారులు ఎన్నికల నిర్వహణ కోసం. సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 4692 గ్రామ పంచాయతీలు, 1220 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 524,471 మంది ఓటర్లు ఈ పంచాయితీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు విని యోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. న్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,52,319 మంది మహిళా ఓటర్లు 2,72143 మంది ఉన్నారు. తొమ్మిది మంది ఇతరులు కూడా ఓట రుగా నమోదు చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్ధులకు కేటాయించే గుర్తులను సిద్ధం చేసింది. 5వేల మంది పోలింగ్ సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.

 

రిజర్వేషన్లు తేలితేనే!

రిజర్వేషన్ల లెక్కలు తేలితేనే పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతుంది. అన్ని వర్గాలకు జరాభా నిష్పత్తి ప్రకారం స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. గత ఎన్నికల సమయంలో వెల్లడించిన రిజర్వేషన్ల
ఈసారి కూడా అమలులో ఉంటాయని అప్పట్లో పేర్కొన్నారు. కానీ, ప్రభుత్వం మారడంతో పాత విధానాన్ని కొనసాగిస్తారా? నూతన రిజర్వేషన్లు అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉన్నది. రిజర్వే షన్లు ఖరారు అయిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. జనాభా గణాంకాల ఆధారంగానే పంపిణీ జరగనుంది.

వెంటాడుతున్న ‘జమిలి’ భయం

జమిలీ ఎన్నికల చర్చ సాగుతున్న వేళ.. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపైనా పడు తోంది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిం చాలనేది జమిలీ ఎన్నికల ప్రధాన లక్ష్యం 90 రోజుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు వెళ్తే మరో రెండేళ్లలోనే మరోసారి ఎన్నికలు ఎదుర్కొవాల్సి వస్తుందని భయపడుతున్నారు.

వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం.

డే-కేర్ సెంటర్ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ కు అప్పగించాలని విన్నపం

ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేత

సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ కు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య, రాష్ట్ర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జనపాల్ శంకరయ్య ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, కోశాధికారి దొంత దేవదాసు కార్యదర్శి గౌరిశెట్టి ఆనందం మరో కార్యదర్శి వికృతి ముత్తయ్య గౌడ్ , బుస దశరథం , చీకోటి శ్రీహరి, సీనియర్ సిటిజన్ వేములవాడ బాధ్యులు మొదలైన సీనియర్ సిటిజన్ ప్రతినిధులు కలిసి, ఆది శ్రీనివాస్ ని సత్కరించి వారి చేతుల మీదుగా సీనియర్ సిటిజన్ చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. వినతి పత్రాన్ని సమర్పించారు. తర్వాత ప్రభుత్వం తరఫునుండి మంజూరైన డీ-కేర్ సెంటర్ ను తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ నడుపుటకు సంసిద్ధంగా ఉన్నదని విన్నవించారు. వినతి పత్రం సమర్పించారు. సీనియర్ సిటిజనులకు సంబంధించినది కాబట్టి సీనియర్ సిటిజనులకు ఇచ్చినచో 100% సీనియర్ సిటిజనులకు న్యాయం జరుగుతుందని ప్రతినిధులు విన్నవించుకున్నారు.
దానికి గౌరవనీయులు ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని చెప్పడం జరిగినది.సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది.

15వ వార్డులో ప్రభుత్వ బోరున రిపేరు.!

15వ వార్డులో ప్రభుత్వ బోరున రిపేరు చేయించిన మాజి కౌన్సిలర్ బండారు

స్పందించిన మున్సిపల్ కమిషనర్ కు కృతజ్ఞతలు

వనపర్తి నేటిదాత్రి :,

వనపర్తి పట్టణంలో 15వ వార్డ్ నవత ట్రాన్స్ పోర్ట్ ప్రక్కన ప్రభుత్వ బోరు పని చేయకపోవడంతో 15 వార్డు ప్రజలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టికి తేవడంతో స్పందించిన మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్ కు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు స్పందించి బోరు రిపేరు చేయించారని బండారు కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు కొంపల రమేష్ కొంపల సురేష్ ఆర్ ఎంపీ డాక్టర్ డాక్టర్ డానియల్ పాపిశెట్టి శ్రీనివాసులు బండారు సురేందర్ చీర్ల శ్రీనివాసులు ఠాగూర్ మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్ మున్సిపల్ సిబ్బందికి వార్డు ప్రజల తరఫున బండారు కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు ఈసందర్భంగా బండార్ కృష్ణ మాట్లాడుతూ 15 వ వార్డులో వీధి లైట్లు డ్రైనేజ్ త్రాగునీటి సమస్య ఉన్నచో వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బండారు తెలిపారు

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య.

ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయం పేట మండలం, పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల రమేష్ సునీత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.బీటెక్ పూర్తి చేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యో గ పరీక్షలు రాస్తున్న తమ చిన్న కూతురు రావుల ప్రత్యూష (24)అతి తక్కువ మార్కుల తేడాతో పలు ప్రభుత్వ ఉద్యో గాలు కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి..

*మంచి ప్రభుత్వాన్ని ఆదరించండి..

*ప్రజా శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యం..

*వైసిపి నేతల విమర్శలను ప్రజలు నమ్మొద్దు..

*ఇంటింటికి టిడిపితో ప్రజా సమస్యల పరిష్కారం..

*సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి..

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 04:

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే సంక్షేమ మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. పలమనేరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు నందు సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సత్య గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారుఏడాది పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణి చేశారు. అదేవిధంగా ప్రజల వ్యక్తిగత మరియు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ఇలా ఉండగా వార్డులో అడుగడుగునా ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఏడాది పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా అర్ధరహిత విమర్శలు చేస్తున్నదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు పరచిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేసి మరోమారు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించు కుందన్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. ప్రజాభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కూటమి మంచి ప్రభుత్వమని ఇప్పటి వరకు తాము చేసిన మంచి పనులను ప్రజానికానికి వివరించేందుకే సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు.

MLA Amarnath Reddy

ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్. వి.బాలాజీ,ఆర్ బి సికుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు,బీఆర్శి కుమార్,కిరణ్, రూపేష్, సుదర్శన్ బాలాజీ, సురేష్ లతో పాటు జనసేన నాయకులు దిలీప్, హరీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version