క్రైస్తవుల సమాధుల కోసం రెండు ఎకరాల స్థలం కేటాయింపు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ఆర్కేపి పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు టి ప్రభుదాసు ఆద్వర్యంలో కార్మిక శాఖ మంత్రి చెన్నూరు శాసనసభ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామిని కలిసి క్రైస్తవుల సమాధుల స్థలం కోసం, కమ్యూనిటీ హాల్ కోసం మెమోరాండం ఇవ్వగా స్పందించిన కార్మిక శాఖ మంత్రి మంచిర్యాల జిల్లా కలెక్టర్ తో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ తో మాట్లాడి క్రైస్తవుల సమాధుల కోసం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డంపు యార్డు పక్కన కొద్ది దూరంలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు ఈ విషయమై వివరణ ఇస్తూ మన మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ 2 ఎకరాల సింగరేణి స్థలాన్ని క్యాతనపల్లి మున్సిపాలిటీ క్రైస్తవుల సమాధుల కోసం సరెండర్ చేశారని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యొక్క స్థలం చుట్టూ హద్దురాళ్లు ఏర్పాటు చేసి కంచె నిర్మిస్తామని అందులోనే భాగంగా లైటింగ్, నీటి సదుపాయం కల్పిస్తామని ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది కాబట్టి పనులు ఒకదాని తరువాత మరొకటి చేస్తామని అన్నారు.
ఆర్కేపి పాస్టర్ ఫెలోషిప్ వైస్ ప్రెసిడెంట్ బీమా సామ్యూల్, సెక్రెటరీ టి జాషువా,
ట్రెజరర్ రవి రఘుయెల్ మంత్రి ని కలుసుకొని క్రైస్తవ సమాజానికి కావలసిన కొన్ని అవసరాలను అడిగినప్పుడు మా కోరిక మేరకు సమాధుల స్థలమును ఏర్పాటు చేసినందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కి, క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గద్దె రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
