సొంతంటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం
పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు బుడగ జంగాల కాలనీలో కొండపల్లి మంగ చందులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లుకు పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ,పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్ లు ముగ్గు పోయడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నామని సొంత ఇంటి కళ నెరవేర్చుతున్న ప్రజా ప్రభుత్వనికి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెరుగు శ్రీనివాస్,సమన్వయ కమిటీ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,నల్లెల అనిల్ కుమార్,ఏకు రాజు,దార్నా వేణు,నాయకులు సాదు రఘువీర్,సిరిగిరి మల్లేష్,రెండ్ల సంపత్ కుమార్,బొచ్చు శ్రీను,మౌటం గణేష్,మౌటo చందు,పాస్టర్ సిల్వన్,పాస్టర్ సమ్మయ్య(పాల్),తెలకలపల్లి సోమేశ్వర్,లక్ష్మీ,రమణ, శివకృష్ణ సమ్మక్క,కవిత, శారదా కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.