కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం
ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.