మత ప్రచారం చేస్తున్న విద్యాసంస్థలపై జిల్లా విద్యాశాఖ అధికారి చర్య తీసుకోవాలి
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట (నేటిధాత్రి):
వర్ధన్నపేట మండల కేంద్రంలోని పుస్కోస్ ప్రైవేట్ పాఠశాలపై మండల మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు పాఠశాలల్లో మత ప్రచారాన్ని నిర్వహిస్తూ విద్యార్థుల పై ఇతర మత పుస్తకాలను బలవంతంగా రుద్దుతూ చర్చి లో పనిచేస్తున్న మత ప్రచారకులైన ఫాదర్స్ తో విద్యార్థులకు వాటిని నేర్పించేందుకు ప్రయత్నం చేస్తున్న పాఠశాలపై చర్య తీసుకొని ఆ పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని మహేందర్ రెడ్డి పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు. లేదంటే ఆ పాఠశాల పై చర్య తీసుకునే విధంగా పై అధికారులకు తెలియజేసి పోరాటం చేస్తామని తెలిపారు.
