సీజ్…. తీశారా?? తొలగించారా??
-అధికారుల ప్రమేయం తోటే తొలగించారని విద్యార్థి సంఘాల ఆరోపణ
సీజ్ వేయడం వరకే మా బాధ్యత–మండల విద్యాధికారి
ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటిధాత్రి
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యొక్క బుక్స్ ని ఎలాంటి పర్మిషన్ లేకుండా అత్యధిక రేట్లకు అమ్ముతున్నారని 25 జూలై 2025 రోజున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి సీజ్ చేయించారు. కానీ సీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే దానిమీద మరొక తాళం వచ్చింది. దీనిపై ఎంఈఓ ని సంప్రదించగా వారు కాపలా ఉండలేం కదా. మా బాధ్యత సీజ్ వేయడం వరకే అనే సమాధానం పొంతన లేకుండా ఉన్నదని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. ఇప్పుడు అసలు సీజ్ చేసినట్లు ఆనవాలు కూడా లేకుండా చేశారు. స్థానిక మండల విద్యాధికారి ప్రైవేటు పాఠశాలలకు ఎలాంటి పర్మిషన్ లేకున్నా పుస్తకాల నమ్ముతున్నారని అప్పట్లో ఫిర్యాదు చేసిన కొన్ని పాఠశాలలను పట్టించుకోలేదని, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాల పుస్తకాలను సీజ్ చేపిస్తే నేడు ఆ సీజ్ కనపడ పోవడంతో దీనిలో మండల విద్యాధికారి పాత్ర ఉందని విద్యార్థి సంఘాల ఆరోపిస్తున్నాయి. శ్రీ చైతన్య పాఠశాల పైన మరియు మండల విద్యాధికారి పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కలుస్తామని విద్యార్థి సంఘాలు తెలిపాయి.
మండల విద్యాధికారి వివరణ కోరగా….
రెండవ తాళం ఎవరు వేశారు అనేది మాకు తెలియదు.
సీజ్ వేయడం వరకే మా బాధ్యత. దానికి కాపాల మేము ఉండలేము కదా. వర్షాలు, గాలికి సీజ్ పోయి ఉండొచ్చు. ఒకవేళ ఫీజ్ ఎవరైనా తీస్తే పై అధికారికి కంప్లైంట్ చేస్తాం.
