*మొగుడంపల్లి మండలంలోనీ పాఠశాలల ఆకస్మికజిల్లా అధికారుల తనిఖీ.*
జహీరాబాద్ నేటి ధాత్రి:
ప్రాథమిక పాఠశాల ఖాoజమల్ పూర్ మరియు గోడిగ్యార్ పల్లి పాఠశాలలో ఈ రోజు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, జిల్లా టీం మెంబర్స్ యం,డి వాహబోదీన్, నిమ్మల కిష్టయ్య, పాఠశాలలకు అకస్మాత్తుగా వెళ్లి రికార్డులు తనిఖీ చేయడం జరిగింది. పాఠశాలలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఎఫ్, ఎల్, ఎన్. సి. సి. ఇ. పేరెంట్స్ మీటింగ్, మధ్యాహ్న భోజనo, టాయిలెట్స్, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి నమోదు రికార్డులను, తరగతి ఉపాధ్యాయుల పరిశీలన, తరగతి టీ,ఎల్,యం లకు సంబంధించిన
రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
వివిధ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్, తెలుగులో కొంతమంది విద్యార్థులు ధారాళంగా చదవడం, గణితం లో చతుర్విధ ప్రక్రియలు చేయడంలో విద్యార్థులు ప్రతిభ కనబరిచారని, జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు సంతృప్తి వ్యక్తపరిచారు.
వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జిల్లా ఇన్స్పెక్షన్ టీం అధికారులు, తరగతి గదిలో టీ,ఎల్,ఎమ్ ప్రదర్శించి, హ్యాండ్ బుక్ ను ఉపయోగించి బోధించాలని, తాగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.
