సుపరిపాలనే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
బిజెపి చిట్యాల మండల అధ్యక్షుడు బుర వెంకటేష్ గౌడ్.
చిట్యాల, నేటిధాత్రి ;
స్వతంత్రం భారతంలో వచ్చిన విప్లవాత్మక పన్ను సంస్కరణలు నిత్యావసరాలు ఆహార పదార్థాల పై పన్ను 18%,12% నుంచి 5% 0% తగ్గింపు తీసుకురావడం అనేది గొప్ప ఆశించదగ్గ విషయమని చిట్యాల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ అన్నారు, అనంతరం ఆయన మాట్లాడుతూవ్యవసాయ యంత్రాలు , స్ప్రే పార్ట్స్, ఎరువుల పై 18% 12% నుంచి 5% కి తగ్గింపు*ఆరోగ్య భీమా, జీవిత భీమా ప్రీమియం పై పన్ను 18% నుండి 0% కి తగ్గింపు*దేశ ప్రజలకు దసరా దీపావళి కానుకగా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి* ప్రధానమంత్రి మోదీ ఆగస్ట్ 15 న స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో సూచనప్రాయంగా జి ఎస్ టి సంస్కరణల గురించి మాట్లాడటం జరిగింది. కానీ ప్రజలు ఊహించిన దానికంటే తొందరగా ఊహించిన దానికంటే గొప్పగా జి ఎస్ టి పన్ను తగ్గింపులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం అని ,ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన ఈ పన్ను తగ్గింపులు స్వతంత్ర భారతంలో వచ్చిన గొప్ప పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలబడుతుంది. గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు కూడా మధ్యతరగతి వేతన జీవులకు ఒక వరం లాంటిదనీ ఈ పన్ను సంస్కరణల వల్ల వచ్చే 5-6 నెలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో కొంత కోత పడినా ఆ మొత్తం ప్రజలకు ఆదా అయి ఇతర అవసరాల కోసం వెచ్చించే అవకాశం ఉంటుందనీ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం తద్వారా దేశంలో తయారీ రంగాన్ని , వ్యవసాయ రంగాన్ని, నిర్మాణ రంగాలను బలపరిచే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ పన్ను సంస్కరణలు దేశ ఆర్ధిక వృద్ధికి దోహద పడతాయనడంలో సందేహం లేదనీ,ఈ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోడీ గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు ,ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య గజనాల రవీందర్ మార్తా అశోక్ పెరుమాండ్ల రాజు అనుప మహేష్ చింతల రాజేందర్ కేంసారపుప్రభాకర్ తీగల వంశీ సేనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ వద్దిరాజు ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు Date 05/09/2025
నేటిధాత్రి:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని, కుమారుడు నిఖిల్ చంద్రలు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఎంపీ రవిచంద్ర నివాసం వద్ద వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.నిమజ్జనానికి బయలుదేరడానికి ముందు వినాయకుడికి శుక్రవారం విజయలక్ష్మీ, నిఖిల్ చంద్రలు పూలమాల వేసి,హారతినిచ్చి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.
Vigneshwara
ఈ సందర్భంగా గంగాభవాని తన కుమారులు సౌరవ్,సనవ్ లతో కలిసి గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి గోత్ర నామంతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారికి ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
Vigneshwara
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు ముడ్డంగుల కృష్ణ,గగులోతు నవీన్ నాయక్,యరగాని పృథ్వీ గౌడ్,ముకుంద అనిల్ పటేల్,అనంతుల శ్రీనివాస్ గౌడ్, మల్యాల శేఖర్, నాగిరెడ్డి, ముకరా దుర్గాప్రసాద్, దండు రాజు ధూదిగామ సాత్విక్,జ్యోతి, సంతోష్ తదితరులు విజయలక్ష్మీ, గంగాభవాని, నిఖిల్ చంద్ర, స్థానిక ప్రముఖులను శాలువాలతో సత్కరించి వినాయకుడి చిత్రపటాలను బహుకరించారు.
Vigneshwara
వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు అందజేసిన విఘ్నేశ్వరుడి లడ్డూ ప్రసాదాన్ని నిఖిల్ చంద్ర భక్తిప్రపత్తులతో స్వీకరించి తలపై పెట్టుకుని తన నివాసంలోకి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్ సభ్యులు”జై గణేశ జైజై గణేశ” అంటూ నినాదాలు చేశారు.
వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు మరియు వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు అన్ని రకాల చేయూత పెన్షన్లు రూ 4 వేలకు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 8న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చిట్యాల మండల అధ్యక్షుడు దొడ్డే శంకర్ మాదిగ అన్నారు. శుక్రవారం ఆయన చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికలాంగుల పెన్షన్ రూ 6 వేలకు పెంచి ఇస్తున్నాడు కానీ తెలంగాణలో రూ 6 వేలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాకు మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మహాధర్నకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. పెంచిన పింఛన్లు అమలు చేసేంతవరకు ఎంతటి పోరాటానికైనా ఎమ్మార్పీఎస్ వెనుకాడదని తెలియజేశారు.
సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
సిరిసిల్లలో శనివారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే పలు శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడారు. వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
వినాయక నిమజ్జన స్థలం వద్ద విద్యుత్ దీపాల ఏర్పాటు, ఇతర సౌకర్యాల విషయంలో పక్కా ప్రణాళికతో ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వినాయక విగ్రహాలు వచ్చే, వెళ్లే దారిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, స్టేజ్, కూర్చునేందుకు కుర్చీలు వేయించాలని, క్రేన్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. కళాకారులతో ప్రదర్శన ఏర్పాటు చేయించాలని ఆదేశించారు.ఇక్కడ సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఆయా శాఖల అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో మల్టీ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న జల్లంపల్లి గట్టయ్య గణేష్ నవరాత్రి లో భాగంగా తన కుమారుడితో మూడున్నర ఫీట్ల గణపతి విగ్రహం తయారు చేపించి తొమ్మిది రోజులు మట్టి గణపతికి అంగరంగ వైభవంగా పూజలు జరిపించారు.అలాగే గణపతి వద్ద అన్నదాత కార్యక్రమం నిర్వహించారు.అనేక రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం వెదజల్లి పర్యావరణం కలుషితం అవుతుందని అన్నారు.మట్టి గణేష్ విగ్రహాన్ని తయారు చేసుకొని పూజలు చేయడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.
రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నాయకులని డిమాండ్
◆:- బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ అంతట కూడా నిమజ్జనం రేపు ఉండడం జరుగుతుంది. అలాగే మన జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నిమజ్జనం రేపు ఉండడంతో, కాంగ్రెస్ నాయకులు రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని జ్యోతి పండాల్ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆఫీసులో నిద్రపోకుండా ఏర్పాట్లని దగ్గరుండి సమకూర్చాలని పర్యవేక్షించాలని జ్యోతి పండాల్ సూచించడం జరిగింది.
అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ని, మహిళా కానిస్టేబుల్స్ ని, మహిళా ఆఫీసర్స్ ని కూడా డిప్లాయ్ చేయాలని పోలీస్ శాఖ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం కోసం వచ్చిన అమ్మాయిలని పోకిరీలు, ఆకతాయిలు వేధిస్తున్నందుకు, 7 రోజుల వ్యవధిలో 930 మందిని మఫ్టీలో షీ టీం వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ 930 మందిలో మైనర్లు, 20 సంవత్సరాలు ఉన్న అబ్బాయిలు మరియు 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవాళ్ళు వేధించడం జరుగుతుందని షీ టీమ్స్ ఇన్చార్జ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు వయసు ఉన్న మగవారు కూడా అమ్మాయిలని ఏడిపిస్తున్నారంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్న వాళ్లు రోజురోజుకీ పెరుగుతిన్నారని మహిళలు గమనించాలి మరియు జాగ్రత్త వహించాలి.
జ్యోతి పండాల్ తప్పు లేకుండా ఎవరిపైన నిరాధారంగా ఆధారాలు లేకుండా విమర్శించదు అన్న విషయం, జహీరాబాద్ లో ఉన్న నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గానీ తెలుసుకోవాలి. వాస్తవాలు మాట్లాడుతుంటే ఇక్కడున్న లీడర్లకి ఎందుకు బాధ అవుతుందో నాకు అర్థం అవడం లేదు. నిన్న అమ్మాయిల భద్రత కోసం మాట్లాడినందుకు లీడర్లకు జీర్ణం అవడం లేదు కానీ ఖైరతాబాద్ లో జరుగుతున్న ఈవిటీజింగ్ కేసులను చూస్తే మీకు అర్థమవుతుందని జ్యోతి పండాల్ అన్నారు.
వినాయక నిమజ్జనంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి కుటుంబం
నర్సంపేట,నేటిధాత్రి:
గణపతి నవరాత్రుల ఉత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో గణనాథున్ని ప్రతిష్ఠించుకొన్న కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు నిర్వహించారు.శుక్రవారం నిమజ్జన కార్యక్రమం చేపట్టగా గణనాథుడికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దంపతులు వీడ్కోలు పలికారు.కాగా ఎమ్మెల్యే దొంతి కుమార్తె అనన్యరెడ్డి హన్మకొండ పద్మాక్షమ్మగుట్ట వద్ద ఉన్న చెరువులో నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు నర్సంపేట నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గణనాథుడిని వేడుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండి
* సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి
చేవెళ్ల, నేటిధాత్రి:
ఈనెల 11 నుండి 17 వరకు జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి సత్తిరెడ్డి అధ్యక్షతన సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగిన సాయిధ రైతాంగం తిరుగుబాటు చేశారని అన్నారు. ఈ పోరాటంలో దాదాపు 4500 మంది తెలంగాణ రైతులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఈ పోరాటం ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్రంలోని భూస్వామ్య వ్యవస్థకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిందని తెలిపారు. నిజాం పాలనను అంతం చేసి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఈ పోరాటం దారితీసిందని, భూస్వాముల దోపిడీని నిలిపి రైతుల హక్కుల పరిరక్షణకు ఈ పోరాటం ఎంతో స్ఫూర్తినిచ్చిందనిఅన్నారు. ఈ స్ఫూర్తితోనే ఈనెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాదులోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ముగింపు సభ ఉంటుందని ఈ సభకు పార్టీ శ్రేణులు గ్రామ కార్యదర్శులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్, ఎన్ ఎఫ్ ఐ డబ్లు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం
17మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని అంకితభావంతో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అతిథులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. ఇందులో భాగంగా 11వేల టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని వివరించారు ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని వర్గాల విద్యార్థులకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని వెల్లడించారు. అలాగే ఏ.టి. సి సెంటర్లు మంజూరు చేసిందని దీంతో విద్యార్థులు యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యత అది పుచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న కాలానికి అణుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతిక, నైపుణ్యతను అందిపుచ్చుకోవాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేస్తారని వివరించారు. రాష్ట్రంలో జిల్లాను విద్యారంగంలో ఉన్న స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.
ఉత్తమ అవార్డులు పొందిన టీచర్లను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ఉపాధ్యాయులు కూడా విశేష కృషి చేసి అవార్డులు స్వీకరించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక అవ్వాలి.జిల్లాలోని టీచర్లు జాతీయ, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక అవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా టీచర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని గుర్తు చేశారు. ఆయన సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు అందరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. రాధాకృష్ణన్ తనకు వచ్చే జీతంలో 75 శాతం పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలకు అందించే వారిని గుర్తు చేశారు. (హెల్ప్ ఏజ్ ఇండియా) సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగించారని, బ్రిటిష్ ఇండియా లో నైట్ హుడ్ అవార్డు స్వీకరించారని గుర్తు చేశారు.భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, విద్యావిధానం గొప్పదని తన రచనల్లో వివరించారని పేర్కొన్నారు. రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారని గుర్తు చేశారు. ఆయన సేవా గుణం, ఉపాధ్యాయ వృత్తిలో అందించిన విలువైన సేవలు ఆయనను ఇప్పటికీ నిలిచిపోయేలా చేశాయని పేర్కొన్నారు. తనది మద్రాస్ రాష్ట్రమైన కూడా కలకత్తా ఇతర ప్రాంతాల్లో సేవలందించారని తెలిపారు. ఉపాధ్యాయులకు బదిలీలు సహజమని గుర్తు చేశారు. ఎక్కడ ఉన్నా కూడా పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఉపాధ్యాయులు తాము బోధిస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషి చేయాలని, విద్యార్థులకు సులభమైన రీతిలో పాఠాలు బోధించాలని తెలిపారు. విలువలు, క్రమశిక్షణ పాటిస్తూ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పదో తరగతి ఫలితాల్లో మన జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానంలో నిలిచిందని, జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులందరూ అంకితభావంతో సేవలందిం చాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా బోధించాలని, విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు.. చకినాల శ్రీనివాస్, గుర్రం కృష్ణారెడ్డి, కైరి పద్మ, సీహెచ్ సత్తయ్య, గోలి రాధాకిషన్, అరుకాల బాల్ రెడ్డి, బోగారపు నవీన్, కట్ట రవీందర్, గోవులకొండ శ్రీనివాస్, ఎన్ దేవేందర్, నరహరి నాగమణి, జంగిటి రాజు, పీచు సుభాష్ రెడ్డి, గుండమనేని మహేందర్ రావు, దిడిగం స్రవంతి, బద్దం రవీందర్ ఓరుగంటి పద్మకళకు అవార్డులు అందజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూపారెడ్డి, రాజు, డీఈవో వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.
“సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ” అనే పోస్టర్‌ను ఆవిష్కరించిన బండి సంజయ్ కుమార్
కరీంనగర్, నేటిధాత్రి:
తెలుగు రాష్ట్రాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్ కు నివారణ అనే పోస్టర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈకార్యక్రమం సైబర్ సత్యాగ్రహ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి, ప్రతి పాఠశాలకు చేరాలన్నారు. అనంతరం గజ్జెల అశోక్ మాట్లాడుతూ “సైబర్ నేరాల నుండి రక్షణకు సామాన్య ప్రజలలో అవగాహనే ప్రధాన ఆయుధం యువత, మహిళలు, ఉద్యోగస్తులు ఇలా అందరికీ ఇది అవసరం. అందుకే ఈపోస్టర్ రూపంలో ప్రామాణికమైన సమాచారాన్ని పోతిరెడ్డి మాధవ రెడ్డి, సైబర్ వారియర్ సహకారంతో అందించేందుకు ముందుకువచ్చాం అని తెలిపారు. ఈకార్యక్రమంలో బిజేవైఎం జిల్లా కార్యదర్శి వేముండ్ల కుమార్, జేరిపోతుల పోచయ్య, జేరిపోతుల నర్సయ్య, జేరిపోతుల మహేష్, గజ్జెల నవీన్ కుమార్, అజయ్ జేరిపోతుల, వెంకటేష్ జేరిపోతుల, సతీష్ జేరిపోతుల, చందు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా లయన్స్ భవన్ లో ముగ్గురు ఉపాధ్యాయులైన భర్కత్ అలీ, నేరెళ్ల అజయ్, దాసరి అజయ్ లను సన్మానించిన అనంతరం లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ లు హన్మాండ్ల రాజిరెడ్డి, ఆనంతుల శివప్రసాద్ ల జన్మదినం సందర్బంగా గోపాలరావుపేట మార్కెట్ లో ప్లాస్టి రహిత సమాజం కోసం క్లాత్ బ్యాగ్ లను పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ పాకాల రాములు, కోశాధికారి గొడుగు అంజి యాదవ్, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ కర్ర శ్యాం సుందర్ రెడ్డి, డైరెక్టర్స్ ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, మూల అనంత రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
అభినందనలు తెలిపిన పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి
హైదారాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రజా ఉద్యమనేత ఫ్రొపెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆ పార్టీ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లోని ఫ్రొపెసర్ కోదండరాం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిన రథసారధి ఫ్రొపెసర్ కోదండరాం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అభివర్ణించారు.
మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు
◆:- షేక్ రబ్బాని
జహీరాబాద్ నేటి ధాత్రి:
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మంపై స్ఫూర్తి కలిగిస్తోందన్నారు. తోటివారికి విశ్వాసం, నమ్మకం, సంరక్షణ, కరుణతో సేవ చేసినప్పుడే ప్రవక్త లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో శాంతి తీసుకురావాలని ఆకాంక్షించారు. మహమ్మద్ ప్రవక్త జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సన్మార్గంలో నడుస్తూ ఆయన బోధనలను సార్థకం చేయాలని సూచించారు.
జహీరాబాద్ మండలం శేఖపూర్ గ్రామంలో ఈనెల 8 & 9వ తేదీలలో జరగబోయే ఉర్స్- ఈ – షరీఫ్ ఉత్సవాలకు శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించిన జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం పాక్స్ చైర్మన్ మచ్చెందర్ మాజి సర్పంచ్ చిన్న రెడ్డి నాయకులు బాబు ఖాన్ సాబ్ అజీమ్ అహ్మద్ గౌస్ఉదీన్ గ్రామ పెద్దలు నాయకులు తదితరులు ..
గల్లీ క గణేష్ ఉత్సవ కమిటీ గణనాథుడి లడ్డు వేలం పాట 210000.రూ
శేరిలింగంపల్లి నేటి ధాత్రి :-
గల్లిక గణేష్ ఉత్సవ కమిటీ నేతాజీ నగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన వినాయక నవరాత్రి పూజలు.ఇందులో భాగంగా నిన్న రాత్రి జరిగిన లడ్డు వేలంపాటలో గణేశుని లడ్డూ బారి దార పలికింధి. మొదటి లడ్డు గుంటి యాదగిరి సాగర్ 210000 దక్కించుకోగా రెండవ లడ్డు దయాకర్ సాగర్ 108000 కి కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు లడ్డును వారికి అందచేసి అభినందనలు తేలిపారు.అనంతరం వినాయక అనుగ్రహం వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా వుండలని ఆ దేవునికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు భక్తులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేసినందుకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తేలిపారు.
మండల కేంద్రంలోని పోస్టాఆఫీస్ వద్ద గణపతి మండపము నందు న్యూ మణికంఠ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు, పురోహితుడు గోపీనాథ్ గణనాధునికి ఘనంగా పూజలు చేసి గ్రామ ప్రజలందరూ అష్టెశ్వర్యాలతో,ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించారు.విగ్రహ ధాత నెవరు గొమ్ముల రమాదేవి-ప్రభాకర్ రావు.ఈ పూజా కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు తాళ్ల శ్యామ్ రాజ్,మీనయ్య,రంజిత్, రాకేష్,రిషికేష్,రాజేష్,గోనెల మహేష్ బాబు,వెంకటేష్, రాజేందర్,జంగిలి శ్రీకాంత్, గోపగాని విజయ్,మహేష్, ఆలేటి రాము,మండల హరీష్,తాళ్ళ పెద్ద శ్యామ్ రాజ్,రమేష్,నారగాని రాజు, తరిగొప్పుల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం ఉత్సవం
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు తెలంగాణ భవన్ లోని బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవం అంగరంగ వైభవంగా వెన్నంటింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మాట్లాడుతూ.. పది రోజులు ఎన్నో పూజలు అందుకున్నటువంటి వినాయకుడు ఈరోజు బీ.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం చేయడం ఎంతో సంతోషకరమని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లవేళలా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగినది తెలిపారు. అంతేకాకుండా టేస్కబ్ చైర్మన్ కొండూరు రవీందర్ మాట్లాడుతూ ఈరోజు బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందదాయమని అట్లాగే సిరిసిల్ల జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, అంతేకాకుండా రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరాలని దేవున్ని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, కుంభాల మల్ రెడ్డి, మరియు బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు యువకులు తదితరు నాయకులు పాల్గొన్నారు.
అధ్యక్షులు సాగర్ల రామకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ మహారాజ్ వారికి 108 ప్రసాదాలు, 108 దీపాలతో పూజలు నిర్వహించిన భక్తులు
నస్పూర్ సెప్టెంబర్ 05,నేటి దాత్రి
నస్పూర్ ఇందిరమ్మ కాలనీ లోని శ్రీ సాయి గణేష్ మండలి వారి ఆధ్వర్యంలో స్వామి వారికి 108 ప్రసాదాలు 108 దీపాల తో అత్యంత భక్తి శ్రద్ధ లతో ఇందిరమ్మ కాలనీ మహిళలందరూ పాల్గొని విగ్నేశ్వరునీ పూజించారు,కమిటీ సభ్యులకు కాలనీ వాసులకు అందరికీ గణనాధుని కరుణా కటాక్షాలు అందించాలని వేడుకున్నారు ,
ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇందిరమ్మ కాలనీ ప్రజలందరూ పాల్గొని విగ్నేశ్వరునీ ప్రార్ధించారు
జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన జీపీవోల తరఫున రాజు మాట్లాడుతూ, ఐదవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను పునరుద్ధరిస్తూ ప్రజలకు చేరువ చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంకితభావంతో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నియామకాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశిస్తున్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా (సి.సా.స) ఆధ్వర్యంలో మాదిరెడ్డి అంజనా దేవికి సత్కారం
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మద్దిరెడ్డి అంజనా దేవి సిరిసిల్ల సాహితి సమితి వారు సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా (సి.సా.స) అధ్యక్షులు జనపాల శంకరయ్య మాట్లాడుతూ.. సమాజంలో గురువు అనే వ్యక్తి చీకటనే అంధకారాన్ని చీల్చి,జ్ఞానం అనే కాంతి వెలుగును ఎంతో ఎంతో ఆనందదాయకమని తెలిపారు అందించేటువంటి వారు గురువులు అలాంటి గురువులకు ఒకరోజుగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు మద్దిరెడ్డి అంజనా దేవి ని సత్కరించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. అంతేకాకుండా జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ.. విద్యార్థులను విజ్ఞానంతో వినయ విధేయతలతో, జీవిత పాఠాలు నేర్పించేదే గురువు అని అలాంటి గురువులను సన్మానించడం ఒక మంచి కార్యక్రమాన్ని అందుకు ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. (సి. సా. స ) ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంజనా దేవి ని సన్మానించడం మాకు ఎంతో గర్వకారణమని అలాంటి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిదద్ధి, వారిని అనేక రంగాల్లో విద్యాబుద్ధులుగా నిలిచినటువంటి అంజానా దేవి నీ సత్కరించడం మాకు ఎంతో గర్వకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి సాస పూర్వ గౌరవ అధ్యక్షులు కోడం నారాయణ, కవి రచయిత జూకంటి జగన్నాథం, ఏరెడ్డి వెంకట్ రెడ్డి, నాయని సత్యనారాయణ రెడ్డి, దొంత దేవదాస్, గూడూరి బాలరాజ్, అంకారపు రవి, కవులు రచయితలు,కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.