ఘనంగా ఫ్రొ.కోదండరాం జన్మదిన వేడుకలు
అభినందనలు తెలిపిన పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి
హైదారాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు,ప్రజా ఉద్యమనేత ఫ్రొపెసర్ కోదండరాం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ఆ పార్టీ
పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రధానకార్యదర్శి చల్లా కిరణ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లోని ఫ్రొపెసర్ కోదండరాం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిన రథసారధి ఫ్రొపెసర్ కోదండరాం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అభివర్ణించారు.
