వర్తక సంఘం అద్యరములో హోలీ వేడుకలు వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు వేడుకలు ఘనంగా జరుపుకున్నామని వర్తక సంఘం అధ్యక్షులు పాలాభి సుమన్ విలేకరులకు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తక సంగం కిరాణా వ్యాపారాలు ఏజెన్సీ డీలర్లు ఆర్యవైశ్యలు అధిక సంఖ్యలో హోలీ సంబరాల్లో పాల్గొని అనంతరం సోమశిల లో కృష్ణా నదిలో నది స్నానం చేసి సోమశిల సోమేశ్వర దేవాలయంలో శివున్ని దర్శించుకుంటామని చెప్పారు అనంతరం సింగోటం లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నామని చెప్పారు వర్తక సంఘం సభ్యులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు ఏజెన్సీ డీలర్లకు ఆర్యవైశ్యలకు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని సుమన్ తెలిపారు హోలీ వేడుకలలో వర్తక సంఘం సంఘం గౌరవ అధ్యక్షులు న్యాయవాది కొట్ర రామకృష్ణ మాజీ ఉపాధ్యక్షుడు పిన్నం నరేందర్ గుప్తా నేతలు కొండ కిషోర్ కొండ మహేష్ గార వంశి దోమశివ వై వెంకటేష్ కొండ ప్రశాంత్ కల్వ భూపేష్ కుమార్ దాచ శివ కందికొండ సాయిరాం సంబురవి బచ్చు వెంకటేష్ నూకల హరి బొడ్డు శంకర్ సీనియర్ వర్తక సంఘం నేతలు కలకొండ బాబు గార రామలింగం కొండ బాలకృష్ణ లగిశెట్టి సాయి ప్రసాద్ కొత్తకోట భాస్కర్ లగిశెట్టి స్వామి హెచ్ఎంటి రవీంద్ర ప్రసాద్ కాలూరు భాస్కర్ శెట్టి కాలూరి శ్రీనివాసులుశెట్టి మిర్చి పాండు కొంపల సురేష్ కొంపల రమేష్ కిరాణా వ్యాపారులు వర్తక సంఘం సభ్యులు హోలీ సెల్ వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుమన్ చెప్పారు
ఝరాసంగం : గ్రామీణ ప్రాంతాల్లో సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం సందర్భాల్లో కొన్ని ప్రత్యేక ఆచారాలు పాటించడం ఆనవాయితీగా ఉంది. గ్రహణ సమయంలో ఇత్తడి తాంబూలం (లేదా పళ్లెం)లో నీళ్లు పోసి, అందులో రోకలిబండను నిలబెట్టడాన్ని “గ్రహణ రోకలి” అని పిలుస్తారు. గ్రహణం పట్టే ముందు ఇత్తడి పళ్లెంలో నీరు పోసి, ఆ నీటిలో రోకలిబండను నిలబెట్టడం ద్వారా గ్రహణం ప్రారంభమైందని గుర్తిస్తారని పెద్దలు చెబుతారు. అలాగే, గ్రహణం విడిచే సమయంలో రోకలి బండ కిందపడిపోతుందని ఒక నమ్మకం ఉంది. మంగళవారం జరిగిన చంద్రగ్రహణం సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో పలువురు ఈ “గ్రహణ రోకలి” ఆచారాన్ని పాటించడం కనిపించింది. బర్దిపూర్ తో పాటు కుప్పానగర్, మాచునూర్, కృష్ణాపూర్ పొట్టిపల్లి తదితర గ్రామాల్లో ఈ విధంగా గ్రహణాన్ని వీక్షించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఇప్పటికీ కొనసాగడం గమనార్హం
ఝరాసంగం: గ్రామంలో బుదవారం రంగుల కేళిలో మునిగిపోయింది. అందమైన రంగులమయమైన హోలీ పండుగను గ్రామస్తులు పార్టీలకు,కుల మత భేదాలకు అతీతంగా, ఏకతాటిపై నిలబడి అత్యంత ఉత్సాహంగా,ఘనంగా జరుపుకున్నారు,ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది,చిన్నారుల నుండి పెద్దల వరకు, ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకలో భాగమయ్యారు.
ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ,నవ్వులు పంచుకుంటూ గ్రామం మొత్తం ఉల్లాసంగా గడిపారు,చిన్నారులు నీళ్ల రంగులతో ఆటలాడుకుంటే,యువత డప్పుల సప్పుళ్లతో నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళలు ప్రత్యేక వంటకాలు తయారుచేసి పండుగ శోభను మరింత పెంచారు,ఈ వేడుకలు కేవలం వినోదం మాత్రమే కాకుండా,గ్రామస్తుల మధ్య ఉన్న ఐక్యతను, పరస్పర అభిమానాన్ని చాటి చెప్పాయి,ఒక పండుగ అందరినీ ఏకం చేసి,సంతోషాన్ని పంచడం ఎంత గొప్ప విషయమో రుద్రగూడెం హోలీ సంబరాలు నిరూపించాయి. ఈ ఐక్యతా సందేశం అందరినీ ఆకట్టుకుని,మరిన్ని సంవత్సరాలు ఈ పండుగను కలిసి జరుపుకోవాలనే స్ఫూర్తిని నిలిపిందన్నారు,
రాజ్యసభ ఎంపీగా దొమ్మటి సాంబయ్యకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకులు అల్లం కార్తీక్ కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలతో మమేకమై సేవలందించారని పేర్కొన్నారు.అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకుడని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సాంబన్న అని అన్నారు.రాజ్యసభలో ప్రజల గొంతుకగా నిలబడగల సామర్థ్యం సాంబన్నకు ఉందన్నారు.పేదలు,రైతులు, కార్మికుల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావించగల ధైర్యం ఆయనకు ఉందని రాజకీయ అనుభవం,ప్రజాదరణ రెండూ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.అలాంటి సమయంలో సాంబన్నకు అవకాశం ఇవ్వడం సముచితమని సమాజంలోని వివిధ వర్గాల మద్దతు సాంబన్నకు ఉందని తెలిపారు. పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని పరిగణించి అవకాశం ఇవ్వాలని కోరారు.
హోలీ వేడుకల్లో పూర్వ విద్యార్థులు 1992-93 పదో తరగతి పూర్వ విద్యార్థుల హోలీ సంబరాలు మెట్ పల్లి మార్చి 3 నేటి ధాత్రి
మెట్ పల్లి లో పదవ తరగతి ( 1992-93 ) పూర్వ బ్యాచ్ విద్యార్థులు మంగళవారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని పదవ తరగతి (1992-93) బ్యాచ్ వారు తమ సన్నిహితులకు ఒకరినొకరు రంగులను చల్లుకుని ఆనందంలో మునిగితేలారు. ఆత్మీయ మిత్రులతో హోలీ పండుగ సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో ఒకరినొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అత్యంతం హోలీ వేడుకతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అత్మీయ మిత్రులు, పూర్వ విద్యార్థులు మహమ్మద్ ఆజీమ్, సుధాకర్, సంతోష్, , వెంకటేష్, బద్రి వేణు భుమేశ్వర్, మహేష్ సత్యనారాయణ, వేణుగోపాల్, అన్నం నాగరాజ్, ప్రవీణ్, ప్రసాద్, అలీ తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్స్ కల్చర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు మెట్ పల్లి మార్చి 3 నేటి ధాత్రి
ఫ్రెండ్స్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పర్వదినం సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులను కలుస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ వేడుకల్లో హిందూ ముస్లింల మధ్య స్నేహభావాన్ని పెంచేందుకు. ముస్లిం సోదరులతో కలిసి హోలీ ఆడారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, ఫ్రెండ్స్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు బిట్లుగు కార్తిక్, సభ్యులు కమటం భరత్, అల్లకట్టు సత్యనారయణ,చిట్యాల అరుణ్, సోగాల అంజి, వాల్గోట్ నరేష్, కట్ట లక్ష్మణ్, బోలుమల్ల సుమన్, కోట రాజేందర్, సొగల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ ప్రెస్ క్లబ్ గత34 సంవత్సరాలుగా1992 నుండి నిర్వహిస్తున్న హోళి వసంత కేళి రంగుల మహోత్సాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. దేశంలో ఏ ప్రెస్ క్లబ్ నిర్వహించని ఈ వేడుకలను కేవలం వరంగల్ ప్రెస్ క్లబ్ మాత్రమే నిర్వహించడం గొప్ప విశేషం.. నాడు ప్రెస్ క్లబ్ పెద్దలు అటు అధికారుల ఇటు ప్రజా ప్రతినిధుల మధ్య పరిచయమే వారధిగా చిన్న పెద్ద జర్నలిస్టు అనే తేడా లేకుండా ఈ కార్యక్రమానికి నాంది పలికింది…. అదే సాంప్రదాయం కొనసాగిస్తూ ప్రస్తుత నిర్వహక మండలి మంగళవారంనాడు హోలీ పండుగ వేల యూనియన్లకు అతీతంగా భాగస్వామ్యం అయ్యి సప్తవర్ణ రంగుల కలయిక ఇంద్రధనస్సును తలపింపచేసింది…
డిజె సౌండు మధ్య ఉదయమే కలం కార్మికమిత్రులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ హోళీ వేడుక నిర్వహించారు.. అనంతరం అల్పాహార కార్యక్రమం అనంతరం రేన్ డాన్స్ కార్యక్రమంలో ప్రతి జర్నలిస్టు అత్యంత వైభవంగా తమ న్రుత్య శైలిని చాటారు..జర్నలిస్టు సోదరుల పిల్లలు మనలో మమేకమైనారు. ఈ కార్యక్రమంలో పూర్వ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల పి.వి.మదన్ మోహన్,ప్రధాన కార్యదర్శి సదయ్య,కోశాధికారి అమర్, ఉపాధ్యక్షులు గోకరపు శ్యామ్, బోడిగ శ్రీనివాస్, కోడిపెల్లి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ లు పెద్దపల్లి వరప్రసాద్, సంపేట సుధాకర్, వలిశెట్టి సుధాకర్, పొడి శెట్టి విష్ణువర్ధన్, సీనియర్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, వీర గొని హరీష్, జనగాని ఆంజనేయులు, దొమ్మటి శ్రీకాంత్, నన్నపనేని భరత్,మురళి హరి,శ్యాం,విష్ణు, , షఫీ, వంశీ,క్రిష్ణ,బుచ్చి రెడ్డి,కిషన్, రోజనాల సీను,రవీందర్ రెడ్డి, హరీష్,వెంకన్న, భాస్కర్, ప్రముఖులు పాల్గొన్నారు.
`కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతోంది!
`ప్రభుత్వాన్ని అబసుపాలు చేయాలని చుస్తోంది!
`ప్రజలకు పదేళ్లు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆగం చేసింది బీఆరఎస్?
`బీఆరఎస్ చేస్తున్న అసత్య ప్రచారంలో వాస్తవం లేదు!
`మసిబూసి మారేడుకాయ చేయాలని బీఆరఎస్ చూస్తోంది.
`ప్రజల మీద రాజకీయం కోసం లేని ప్రేమ ను ఒలకబోస్తోంది!
`బీఆరఎస్ పార్టీ మోసపు మాటలు నమ్మకండి.
————————————
`ఈ పరిస్థితికి కారణం బీఆరఎస్ పార్టీ నాయకులే!
`పెద్ద ప్రజలను వంచించి మోసం చేసింది బీఆరఎస్ నాయకులు.
`ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
`పదేళ్ల నుంచి వారికి పట్టాలెందుకు ఇవ్వలేదు?
`కనీసం మిషన్ భగీరథ మంచి నీళ్లు ఎందుకివ్వలేదు?
`ఇంతవరకు ఇంటి నెంబర్లు ఎందుకివ్వలేదు?
`సంవత్సరాల తరబడి కరంట్ ఎందుకివ్వలేదు?
`గుడిసెలు వేసుకున్న వారి నుంచి ఎంతెంత వసూలు చేసారో బాధితులే చెబుతున్నారు!
`బీఆరఎస్ నాయకుల దొంగ నాటకాలు అందరికీ తెలుసు?
`బాధితుల సానుభూతి కోసం బీఆరఎస్ కొంగ జపాలు ఎవరు నమ్మరు?
`కలెక్టర్ కార్యాలయం ప్రారంభం రోజున డేరాలెందుకు కట్టారు?
`గతంలోనే నోటీసులు ఇచ్చిందెవరు?
`అప్పుడు ప్రభుత్వ భూములు అని నోటీసులు ఇచ్చింది బీఆరఎస్ కాదా?
హైదరాబాద్, నేటిధాత్రి:
అధికారంలో వున్నంత కాలం పేదల ముఖం చూడని బిఆరఎస్ పార్టీకి ప్రజల మీద పుటుక్కున ప్రేమ పుట్టుకొచ్చింది. రెండున్నరేళ్ల కాలమైనా కాంగ్రెస్ సర్కారు మీద పోరాటం చేసే వీలు కావడంలేదు. ఎక్కడా ఎలాంటి సందర్భం దొకడం లేదు. వెలుగు మ{్ట ఘటన కొట్టుకుపోతున్న బిఆరఎస్‌కు గోదారిలో గడ్డిపరక అనుకుంటున్నారు. రాజకీయం చేయాలని చూస్తున్నారని రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బిఆరఎస్ సాగిస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తిప్పికొట్టారు. బిఆరఎస్‌కు నిజంగా చిత్త శుద్ధి వుంటే ప్రజలు తిరస్కరించేవారు కాదు. ఆ సోయి కూడా ఇంకా బిఆరఎస్ నాయకులకు రావడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. గతంలో బిఆరఎస్ వాళ్లు చేసిన పాపం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పదేళ్లు బిఆరఎస్ నాయకులు చేసిన అన్యాయాలు, అకత్యాలు, అక్రమాలు ఇంకా ప్రజల మనసులోనుంచి తొలగిపోలేదు. అందుకే ఏ ఎన్నికలొచ్చినా బిఆరఎస్ ప్రజలు తిప్పికొడుతున్నారు. తిరస్కరిస్తున్నారు. అయినా బిఆరఎస్ నాయకులకు, ఆ పార్టీ పెద్దలకు బుద్ది రావడం లేదు. ఇప్ప్పుడు తగుదునమ్మా అని చెప్పి ఖమ్మం జిల్లాలో వెలుగు మట్లలో ఏదో జరిగిపోతోందని గాయి, గాయి చేసేందుకు కట్టగట్టుకొని బయలుదేరుతున్నారు. ప్రజల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. బిఆరఎస్ నాయకులు ఎన్ని నాటకాలాడినా, ఎంత వెదవ వేషాలు వేసినా జనం నమ్మరు. అది ఖమ్మం జిల్లాలో బిఆరఎస్ నాయకులు చేసిన దుర్మార్గాలు మర్చిపోరు. వెలుగు మట్ల ప్రాంత పజలను కడుపులో పెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారిని కాపాడుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారిని పునరావాసం కల్పించేంది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారి ఆత్మాభిమానాన్ని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారి ఆత్మ గౌరవం నిలిపేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పదేళ్ల పాటు బిఆరఎస్ చేసిందేమీ లేదు. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్ప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చి, లేనిపోని రాద్దాంతం చేస్తే ప్రజలు కూడా నమ్మడం లేదు. వారిని ఆదరించడం లేదు. పైగా పదేళ్లు అధికారంలో వుండి చేయలేని పని వచ్చే ఎన్నికల్లో గెలిచి చేస్తామని చెప్పడమంత రాజకీయ దివాళాకోరు తనం మరొకటి వుండదు. అందుకే వెలుగు మట్ల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో వున్నారు. వారికి మంచి స్ధలాలను చూసి పదిహేను పట్టాలిస్తాం. వారు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు కూడా చెల్లిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజానికి వెలుగుమట్లలో ఏం జరిగిందో ఖమ్మం ప్రజలందరికీ తెలుసు. అక్కడ నిజమైన బాదితులు కేవలం 140 మంది మాత్రమే అన్నది అందిరికీ తెలుసు. ఇతరులు అక్కడికి రావడానికి, గుడిసెలు వేసుకోవడానికి, అక్రమంగా ఇండ్లు కట్టుకోవడానికి కారణం బిఆరఎస్ నాయకులు కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఎంత మంది ఎన్ని లక్షలు తీసుకొని వారిని మోసం చేసి ఇండ్లు కట్టుకోమని చెప్పారో అక్కడి ప్రజలే చెబుతారు. ఆ విషయాలు వదిలేసి మసిబూసి మారేడు కాయ చేయాలని బిఆరఎస్ నాయకులు చూస్తున్నారు. ముఖ్యంగా గతంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ చేసిన అక్రమాలు జనానికి తెలియనివా? ఇలా ఇండ్ల పేరు చెప్పి లక్షలు వసూలు చేసింది పువ్యాడ అజయ్ కుమార్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆరఎస్ నాయకుడు పువ్వాడ అనుచరులకు అక్కడ గుడిసెలు వేసుకున్న వారు లక్షల రూపాయలు ఇచ్చిన వారిని మంత్రి మీడియా ముఖంగా హజరుపర్చారు. ఇలా అమాయకులైన పేద ప్రజలు నుంచి డబ్బులు వసూలు చేసి వారిని జీవితాలు ఆగమయ్యేందుకు కారణమైంది బిఆరఎస్ నాయకులు కాదా? ఈ విషయం ఆనాడే పార్టీ పెద్దలకు తెలిసినా ఎందుకు ఉపేక్షించారు? ఆనాడే ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెలుగుమట్లలో గుడిసెలు వేసుకున్నవారికి బిఆరఎస్ ప్రభుత్వం ఎందుకు మౌళిక సదుపాయాలు కల్పించలేదు. వారికి కరంటు సరఫరా ఎందుకు చేయలేదు. ఇంటి నెంబర్లు ఎందుకు ఇవ్వలేదు. రోడ్లెందుకు వేయలేదు. మురికి కాల్వలు ఎందుకు నిర్మాణం చేపట్టలేదు. పారిశుద్య పనులు ఎందుకు నిర్వహించలేదు. వారికి కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బిఆరఎస్ పార్టీ వద్ద సమాధానం లేదు. కాని రాజకీయం చేయాలన్న కుతంత్రంతో వస్తున్నారు. ప్రజల మీద ఎంతో ప్రేమ వున్నట్లు నాటకాలాడుతున్నారు. ఆనాడే డబుల్ బెడ్‌రూంలు ఎందుకివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే తెలంగాణ మొత్తం సుమారు 5లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తున్నాం. బిఆరఎస్ పార్టీ నాయకల కళ్లకు కనిపించడం లేదా? వెలుగుమట్లలో నిజమైన బాదితులకు ప్రభుత్వం నూరు శాతం న్యాయం చేస్తుందని మంత్రి పొంగులేటి అభయమిస్తున్నారు. పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎప్ప్పుడూ రాజకీయాల కోసం వాడుకోదు. అవసరం తీరగానే మర్చిపోదు. అందుకే బాదితులకు మంచి స్ధలంలో పట్టాలిస్తాం. వారిని అన్ని విదాలా ఆదుకుంటామని మంత్రి తెలియజేస్తున్నారు. అర్హులందరికీ ప్రత్యామ్నాం చూపిస్తామన్నారు. పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలందరికీ తెలుసు. బిఆరఎస్ బూటకపు మాటలు జనం వినరు. వారి మాటలు మరో జన్మఎత్తినా వినరు అని మంత్రి బిఆరఎస్ నాయకులకు చురకలంటించారు. కాంగ్రెస్ ఫ్రభుత్వం చేస్తున్న అభివద్దిని చూసి ఓర్వలేకపోతోంది. అందుకే ఉడుగడుగునా అభివద్దిని అడ్డుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలతో సంతోషంగా వున్నారు. ప్రజలు చల్లగా వుండడం బిఆరఎస్ నాయకులకు నచ్చడం లేదు. ప్రజలు ఆనందంగా వుంటే బిఆరఎస్ నాయకులు కళ్లలో నిప్ప్పులు పోసుకుంటున్నారు. ఏదో హడావుడి చేసేందకు, గాయిగాయి చేసేందుకు ఒక్క రోజు వచ్చిన రాజకీయం చేశారు. ఇప్ప్పుడెక్కడున్నారు. మంత్రిగా వుంటూ నేను అదే ప్రజల మధ్య వున్నారు. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. వారికి ప్రత్యామ్నాయం చూపేందుకు కసరత్తు చేస్తున్నాను అని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజం చెప్పాలంటే బిఆరఎస్ చేస్తున్న అసత్య ప్రచారంలో సున్నా శాతం కూడా నిజం లేదు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు బిఆరఎస్ నాయకులు చేసే కపట వేశాలు ప్రజలకు తెలియంది కాదు. అందుకే బిఆరఎస్ నాయకులు కంటి తుడుపు చర్యల కోసం, రాజకీయ మైలేజీ కోసం వచ్చారన్న సంగతి ప్రజలకు కూడా తెలుసు. అందుకే బిఆరఎస్ నాయకులు వచ్చినా వారిని ప్రజలే పట్టించుకోలేదు. అందుకే ముఖం చెల్లక అక్కడి నుంచి జారుకొని, హైదారాబాద్ నుంచి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంతే తప్ప బిఆరఎస్ నాయకులకు పేదలంటే ఎప్ప్పుడూ ప్రేమ లేదు. వారికి పేదలకు మేలు జరగాలన్న చిత్తశుద్ది అసలే లేదని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేద ప్రజలను బిఆరఎస్ నాయకులు వంచించింది చాలనే వారిని ఖమ్మం నుంచి ప్రజలు తరిమేశారని మంత్రి అన్నారు. ఇంకా బిఆరఎస్ నాయకులకు బుద్ది రావడంలేదన్నారు. ఎల్లకాలం రాజకీయాలే చేయాలని చూస్తే మరోసారి బిఆరఎస్‌కు గుణపాఠం తప్పదు. కాంగ్రెస్ చేతిలో మరోసారి బిఆరఎస్‌కు ఓటమి తప్పదన్నారు. ఇప్పటికైనా నిజం మాట్లాడడం బిఆరఎస్ నేతలు నేర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. పదేళ్ల నుంచి పట్టాలివ్వకుండా మోసం చేసి ఇప్ప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ వెలుగుమట్లలో పట్టాలివ్వడం సాధ్యం కాదని బిఆరఎస్ నాయకులకు తెలుసు. పైగా లంచాలు తీసుకొని పట్టాలివ్వడం ప్రజలను మభ్యపెట్టినంత సులువు కాదని బిఆరఎస్ నాయకులకు తెలియంది కాదు. ఎంత కాలం ప్రజలను మోసం చేయాలని చూస్తారు? ప్రజలు బిఆరఎస్ నాయకులను చీ కొడుతున్నా వారికి సిగ్గు రావడం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. గుడిసెలు వేసుకున్న వారి నుంచి ఎంతెంత వసూలు చేశారో ప్రజలకు తెలుసు. ఇంకా ఎందుకీ దొంగనాటకాలు అని మంత్రి నిలదీశారు. బాధితుల సానుభూతి కోసం బిఆరఎస్ నాయకులు ఎన్ని కొంగజపాలు చేసినా జనం నమ్మరని మంత్రి ఎద్దేవా చేశారు. గతంలోనే వెలుగు మట్ల ప్రజలకు నోటీసులు ఇచ్చిన బిఆరఎస్ పార్టీకి బాధితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి చురకలంటించారు. పేదలకు ఎప్ప్పుడు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ కాదని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు.
బెల్లాపూర్ ఆశ్రమం నుంచి పాదయాత్ర హద్నూర్ చేరిక, భక్తితో స్వాగతం
జహీరాబాద్ నేటి ధాత్రి:
నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలం బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్ర, పల్లకీసేవ జహీరాబాద్ నియోజకవర్గ న్యాల్కల్ మండల హద్నూర్ గ్రామానికి చేరుకుంది. మార్చి 5న జరగనున్న 47వ వార్షిక అమరతిథి సందర్భంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు నిండుకుండలతో ఘన స్వాగతం పలికి, ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దత్తగిరి ఆశ్రమంలో భజనలు, కీర్తనలు, ప్రవచనాలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. ఈ పాదయాత్ర భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామంలో కులమతాలకు అతీతంగా,.పార్టీలకు అతీతంగా ఉదయం నుండి హొలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి.. స్థానిక ప్రజాప్రతినిధులు యూవకులు రంగులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హొలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటు హొలీ సంబరాలు జరుపుకుంటున్నారు.. ఈ హొలీ సంబరాల్లో గ్రామ నూతన సర్పంచ్ అమరేశ్వరి శివమణి గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి గ్రామ పెద్దలు నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు రంగులు పోసుకుంటూ స్థానిక యూవకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా గ్రామ నూతన సర్పంచ్ ఐక్యత, ఆనందం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయాలను పాటించారు.హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు,
హోలీ పండుగ శుభాకాంక్షలు
రంగుల పండుగ హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలపరచాలని, ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరీ శివమణి హోలీ సందర్భంగా చిన్న పిల్లలకు రంగుల ప్యాకెట్లు పంచి, ఆహ్వాదంగా పండుగను నిర్వహించారు.
ఇరాన్‌పై అమెరికా మరియు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బానీ వ్యతిరేకించారు. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖమేనీ మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇస్లామిక్ దేశాలపై నిరంతర దాడులను, ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని ఆయన ఏకగ్రీవంగా ఖండించారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఇతర దేశాలపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని ఆయన ఖండించారు. ఐక్యరాజ్యసమితి వెంటనే అమెరికా మరియు ఇజ్రాయెల్‌పై చర్యలు తీసుకొని ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆయన పేర్కొన్నారు.
చెడుపై మంచికి జయం..భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ
అంగన్వాడీ టీచర్ ఎల్దండి వెన్నెల మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కావని, అవి మన ఆత్మను, ఆచారాలను, ఆలోచనలను తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠాలుగా నిలుస్తాయని అంగన్వాడీ టీచర్ ఎల్దండి వెన్నెల అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో మంగళవారం అంగన్వాడీ టీచర్లు పిల్లలతో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని 4వ అంగన్వాడీ సెంటర్ లో నిర్వహించిన హోలీ వేడుకలను ఉద్దేశించి అంగన్వాడీ టీచర్ ఎల్దండి వెన్నెల మాట్లాడారు. హిందువులు జరుపుకునే మహోన్నత పండుగల్లో ‘హోలీ’ ఒకటని, శిశిర ఋతువుకు వీడ్కోలు పలుకుతూ..వసంతాన్ని ఆహ్వానించే ఈ రంగుల పండుగ, భారతీయ జీవన శైలిలో ఆనందం, ఐక్యత, భక్తి అనే విలువలను సమగ్రంగా ప్రతిబింబిస్తుందన్నారు. హోలీ పండుగకు ఆధారం ప్రహ్లాద-హిరణ్యకశిపుడు-హోలిక పురాణ గాథ అని తెలిపారు. అహంకారానికి ప్రతీకగా నిలిచిన హిరణ్యకశిపుడి దురహంకారాన్ని, భక్తి, శక్తి ఎలా జయించిందో ఈ కథ తెలియజేస్తుందన్నారు. హోలిక దహనం ద్వారా చెడుపై మంచికి జయమనే సందేశం తరతరాలకు అందుతోందన్నారు. ఈ గాథ భక్తి పరాక్రమాన్ని మాత్రమే కాకుండా, అధికార దుర్వినియోగం ఎంత శక్తివంతమైనదైనా సత్యం ముందు నిలబడలేదనే నైతిక బోధనను కూడా ఇస్తుందన్నారు. హోలీ అంటే రంగులని, కానీ ఆ రంగుల వెనుక ప్రకృతి సోయగం దాగి ఉందని, పసుపు పూలు, గులాబీలు, చెర్రీ పుష్పాలు, నీలి ఆకాశం ప్రకృతి ఇచ్చిన ఈ వర్ణాలను మనం పరస్పరం పంచుకోవడం అంటే ప్రకృతితో మన అనుబంధాన్ని పునరుద్ఘాటించడమని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సహజ వనరులతో తయారైన రంగులనే వినియోగించడం పర్యావరణ పరిరక్షణకు, ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తోందన్నారు. హోలీకి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవని, ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిందని, ఇది వైవిధ్యంలోని ఏకత్వాన్ని ప్రతిబింబించే పండుగగా నిలుస్తోందన్నారు. నేటి కాలంలో సామాజిక మాధ్యమాల కారణంగా విభేదాలు పెరుగుతున్న సందర్భంలో హోలీ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుందన్నారు. రంగులు కలిసినప్పుడే అందం పెరుగుతుందని, మనుషులు కలిసినప్పుడే దేశం బలపడుతుందన్నారు. నాగరీకరణ, వేగవంతమైన జీవనశైలి మధ్య మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడని, అలాంటి పరిస్థితుల్లో హోలీ ఒక సామాజిక థెరపీలా పనిచేస్తుందన్నారు. “హ్యాపీ హోలీ” అంటూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం, చిన్న, చిన్న విభేదాలను మరిచి క్షమాపణలు కోరుకోవడం, ఇవన్నీ మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయన్నారు. అయితే రసాయన రంగుల అధిక వినియోగం, నీటి వృథా, అసభ్య ప్రవర్తన వంటి ప్రతికూల అంశాలు హోలీ అసలైన ఆత్మను దెబ్బతీస్తున్నాయన్నారు. అందుకే సహజ రంగులతో, సుస్థిర విధానాలతో హోలీని జరుపుకోవాలన్నారు. భారతదేశం వైవిధ్యానికి ప్రతీకని, భాషలు, సంప్రదాయాలు, వేషాలు భిన్నమైనా మనం ఒకటే అన్న భావనను బలపరిచే పండుగ హోలీ అని, ఇది కేవలం రంగుల సంబరం కాదని, భక్తి, భ్రాతృత్వం, భవిష్యత్తుపై ఆశ అనే మూడు విలువల సమ్మేళనమన్నారు. ఈ హోలీ మనకు కేవలం ఆనందాన్నే కాదు, ఆలోచననూ అందించాలన్నారు. చెడును దహనం చేసి మంచిని ఆహ్వానిద్దామని, సహజ రంగులతో ప్రకృతిని కాపాడుదామని, విభేదాలను మరిచి హృదయాలను కలుపుదామని, ఎందుకంటే హోలీ అంటే కేవలం రంగుల ఆట కాదు..మనసుల కలయిక అని, హోలీ అంటే సంబరం మాత్రమే కాదు-సంస్కృతి సజీవతని, రంగుల పండుగ మన దేశానికి రంగుల భవిష్యత్తును అందించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయా అంగన్వాడీ టీచర్లు మోటే రజిత, బత్తిని లావణ్య తదితరులు పాల్గొన్నారు.
చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముసివేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
2026 మార్చి 3న చంద్రగ్రహణం సందర్బంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం గ్రామంలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు (సుమారుగా ఉదయం 9:00 నుండి సాయంత్రం 7:30 వరకు) ఆలయ తలుపులు మూసివేయబడతాయి మరియు శుద్ధి ఆచారాల తర్వాత మాత్రమే తెరవబడతాయి.
హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన నూతన గ్రామ సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ నూతన సర్పంచ్ నాజియా అంజూమ్ షైక్ సోహైల్ హోలీ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ ఆనందం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు.రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోలీ మన జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.సమాజంలో ప్రేమాభిమానాలు పెంపొందించే ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ప్రజలతో కలిసి ప్రతి ఆనంద క్షణాన్ని పంచుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి తెప్పల సమ్మిరెడ్డికి చెందిన ఇల్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.వివరాల్లోకి వెళితే ప్రమాదం సంభవించిన ఇంట్లో దూరికే శారదా (భర్త పోచన్న),అంజలి (భర్త సమ్మయ్య) అనే ఇద్దరు మహిళలు అద్దెకు ఉంటున్నారు.వీరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వివరాలు వెల్లడించారు.తిప్పల సమ్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.ప్రాథమిక విచారణ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దహనమై ఉంటుందని ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.
జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టిపిపి ఉన్నత అధికారుల మధ్య కోల్డ్ వార్ కాస్త ప్లాంట్ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కియి.ప్లాంట్ ఈడి పై ప్రింట్ మీడియాలో జరుగుతున్న కథనాలే దీనికి సాక్ష్యం.నిష్పక్షపాతంగా పనిచేస్తున్న ప్లాంట్ ఈడిపై తప్పుడు ప్రచారం సరికాదని కొందరు అంటున్నారు.సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సమయంలో ఉన్నత అధికారిపై సంస్థలోని చీడపురుగుల లోపాయ ఒప్పందాల ద్వారా విషపూరిత ప్రచారం చేయడం సముచిత అభిప్రాయం కాదని మరికొందరు అంటున్నారు.వృత్తిపరమైన విభేదాలు ఏమైనా ఉంటే సంస్థ ద్వారా ఎదుర్కోవాలని సింగరేణిలోని ఉన్నత అధికారులు కొందరు సూచిస్తూ…అబద్ధపు కథలను సృష్టించడం మంచిది కాదని హితవు పలికారు.ఒక ప్రధాన ప్రింట్ మీడియా… ఇలా అనవసరపు కథనాలు ప్రచురితం చేయడం పట్ల ఆవేదన పడుతున్నారు.ఇది మంచి సంస్కృతి కాదని ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టించిన వ్యక్తులను మీడియా ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.జైపూర్ ఎస్టిపిపి లో గత పది నెలల కిందట ప్లాంట్ ఈడిగా నూతన అధికారి బాధ్యతలు చేపట్టారు.విధి నిర్వహణలో సంస్థ అభివృద్ధి కోసం తను అమలుపరిచే కఠినమైన ప్రవర్తనా నియమావళి కొంతమంది అధికారులకు ఇబ్బందికరంగా మారింది.అసలు విషయం ఏమిటంటే కొందరు అధికారులు పవర్ ప్లాంట్ లో దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్నారు.ఇంకేముంది స్థానిక రాజకీయ నాయకుల పరిచయాలు,మీడియా ప్రతినిధుల పరిచయాలను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ… వారి కన్నా పై అధికారి ఈడి మీద ఆజమాయిషి చెలయించాలని కుట్రలు పన్నుతున్నారని నమ్మ తగిన సమాచారం.ఈ క్రమంగానే తప్పుడు అభియోగాలు మోపుతూ… ఈడి స్థాయి అధికారి ఆధార్ కార్డు తో సహా అనవసరపు వివరాలు బయటకు తీసుకవచ్చి ఓ ప్రధాన ప్రింట్ మీడియాలో సృష్టించిన కథనమే సాక్ష్యం.దీనివలన సింగరేణి సంస్థ పరువును రచ్చ కీడుస్తున్నారని మండల వ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతుంది.సంస్థ అభివృద్ధికి తోడ్పడవలసిన ఉన్నత అధికారులు సైతం దిగజారిపోయి సింగరేణి సంస్థ ప్రతిష్టకు అంభంగం కలిగించినందుకు,సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకొని వారిపై ఎలాంటి చర్యలు చేపడుతుందా.అని వేచి చూడాల్సిందే!. మండలం మొత్తం ప్రశ్నించే ప్రశ్న ఏమిటంటే ప్లాంట్ ఈడి స్థాయి అధికారి నియామకానికి సంబంధిత విద్యార్హత,అనుభవం,నాయకత్వ నైపుణ్యం,ప్రాజెక్టు మేనేజ్మెంట్ నైపుణ్యం, నిర్ణయాధికారం,పూర్తిస్థాయి బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ వివిధ అంశాలను చూడకుండా ప్లాంటుకు అధిపతిగా నియమిస్తారా?.ఇలాంటి తప్పుడు కథలు అల్లుతున్న అధికారులకు సంస్థపరంగా తగిన శిక్ష ఖాయమని కొందరు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.ప్లాంట్ లోని కొందరి అధికారుల కుట్రలు, కుతంత్రాలు,వారి చీకటి బాగోతాలు అతి త్వరలో వెలుగులోకి రానున్నాయని తెలిపారు.
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మహేష్ బి.గితే ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు పోలీసు ఉద్యోగుల మధ్య జరుపుకోవడం జరిగినది. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మాట్లాడుతూ…
సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ హోలి శుభాకాంక్షలు తెలుపుతూ..
ప్రతి ఒకరు తమ స్నేహితుల మధ్య ఆనందాలతో సంతోషాలతో హోలీ పండుగ జరుపుకోవాలని అంతేకాకుండా ఎవరికి ఇబ్బంది తలపెట్టకుండా హోలీ జరుపుకోవాలని తెలిపారు. అంతేకాకుండా చిన్నపిల్లలు గాని యువకులు గాని చెరువులు కుంటలకు నది తీర ప్రాంతాలకు వెళ్లకూడదని దానివల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మూసివేత
మంగపేట :నేటిధాత్రి
మంగపేట మండలం లోని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామివారి ఆలయాన్ని చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం ఉదయం మూసివేశారు. బుధవారం ఉదయం సంప్రదాయబద్ధంగా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఉదయం 8.30 నుండి భక్తులకు దర్శనం కల్పించబడునని ఆలయ కార్యనిర్వాహణాధికారి ఆర్. మహేష్ తెలిపారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి గుర్కా మంగమ్మమంగళవారం చనిపోయిన విషయం తెలిసి వారి స్వగ్రామం కడ్తాల మండలం చెల్లంపల్లి గ్రామ పంచాయతీలో ఆమె మృతదేహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే గారితో పాటుగా వివిధ మండలాల ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
◆-: సావిత్రిబాయి పూలే మహిళా కార్మిక సంఘం అధ్యక్షురాలు పార్వతీ నేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
హోలీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ లో తోటి మహిళలతో కలిసి హోలీ పండుగను ఘనంగా జరుపుకున్న సావిత్రిబాయి పూలే మహిళా కార్మిక సంఘం అధ్యక్షురాలు పార్వతీనేత హోలీ పండుగను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా కార్మికులు అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ సుఖత సంతోషాలతో తమ జీవితాలలో రంగురంగుల ఇంద్రధనస్సును వెల్లివిరిసేలా ఉండాలని ముఖ్యంగా మహిళా సోదరీమణులు అందరూ సంఘటితంగా ఉంటూ ఇలాంటి పండగలు ఉన్నంతలోనే సంతోషంగా నిర్వహించుకోవాలని తెలియజేశారు తనతోపాటు వీధిలోని మహిళా సోదరిమణులు అందరూ పాల్గొన్నారు,
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.