ఫ్రెండ్స్ కల్చర్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు
మెట్ పల్లి మార్చి 3 నేటి ధాత్రి
ఫ్రెండ్స్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పర్వదినం సందర్భంగా పట్టణంలోని పలువురు ప్రముఖులను కలుస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ వేడుకల్లో హిందూ ముస్లింల మధ్య స్నేహభావాన్ని పెంచేందుకు. ముస్లిం సోదరులతో కలిసి హోలీ ఆడారు. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ఉపాధ్యక్షుడు జంగం విజయ్, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, ఫ్రెండ్స్ కల్చర్ అసోసియేషన్ అధ్యక్షుడు బిట్లుగు కార్తిక్, సభ్యులు కమటం భరత్, అల్లకట్టు సత్యనారయణ,చిట్యాల అరుణ్,
సోగాల అంజి, వాల్గోట్ నరేష్, కట్ట లక్ష్మణ్, బోలుమల్ల సుమన్, కోట రాజేందర్, సొగల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
