జైపూర్ ఎస్టిపిపి లో జరుగుతున్న అంతర్గత యుద్ధం…

జైపూర్ ఎస్టిపిపి లో జరుగుతున్న అంతర్గత యుద్ధం

కోవర్టులుగా వ్యవహరిస్తున్న ఎస్టిపిపి అధికారులు

జైపూర్,నేటి ధాత్రి’

 

జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టిపిపి ఉన్నత అధికారుల మధ్య కోల్డ్ వార్ కాస్త ప్లాంట్ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కియి.ప్లాంట్ ఈడి పై ప్రింట్ మీడియాలో జరుగుతున్న కథనాలే దీనికి సాక్ష్యం.నిష్పక్షపాతంగా పనిచేస్తున్న ప్లాంట్ ఈడిపై తప్పుడు ప్రచారం సరికాదని కొందరు అంటున్నారు.సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న సమయంలో ఉన్నత అధికారిపై సంస్థలోని చీడపురుగుల లోపాయ ఒప్పందాల ద్వారా విషపూరిత ప్రచారం చేయడం సముచిత అభిప్రాయం కాదని మరికొందరు అంటున్నారు.వృత్తిపరమైన విభేదాలు ఏమైనా ఉంటే సంస్థ ద్వారా ఎదుర్కోవాలని సింగరేణిలోని ఉన్నత అధికారులు కొందరు సూచిస్తూ…అబద్ధపు కథలను సృష్టించడం మంచిది కాదని హితవు పలికారు.ఒక ప్రధాన ప్రింట్ మీడియా… ఇలా అనవసరపు కథనాలు ప్రచురితం చేయడం పట్ల ఆవేదన పడుతున్నారు.ఇది మంచి సంస్కృతి కాదని ఇలాంటి తప్పుడు కథనాలను సృష్టించిన వ్యక్తులను మీడియా ప్రోత్సహించ వద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.జైపూర్ ఎస్టిపిపి లో గత పది నెలల కిందట ప్లాంట్ ఈడిగా నూతన అధికారి బాధ్యతలు చేపట్టారు.విధి నిర్వహణలో సంస్థ అభివృద్ధి కోసం తను అమలుపరిచే కఠినమైన ప్రవర్తనా నియమావళి కొంతమంది అధికారులకు ఇబ్బందికరంగా మారింది.అసలు విషయం ఏమిటంటే కొందరు అధికారులు పవర్ ప్లాంట్ లో దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్నారు.ఇంకేముంది స్థానిక రాజకీయ నాయకుల పరిచయాలు,మీడియా ప్రతినిధుల పరిచయాలను ఆసరాగా చేసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ… వారి కన్నా పై అధికారి ఈడి మీద ఆజమాయిషి చెలయించాలని కుట్రలు పన్నుతున్నారని నమ్మ తగిన సమాచారం.ఈ క్రమంగానే తప్పుడు అభియోగాలు మోపుతూ… ఈడి స్థాయి అధికారి ఆధార్ కార్డు తో సహా అనవసరపు వివరాలు బయటకు తీసుకవచ్చి ఓ ప్రధాన ప్రింట్ మీడియాలో సృష్టించిన కథనమే సాక్ష్యం.దీనివలన సింగరేణి సంస్థ పరువును రచ్చ కీడుస్తున్నారని మండల వ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతుంది.సంస్థ అభివృద్ధికి తోడ్పడవలసిన ఉన్నత అధికారులు సైతం దిగజారిపోయి సింగరేణి సంస్థ ప్రతిష్టకు అంభంగం కలిగించినందుకు,సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకొని వారిపై ఎలాంటి చర్యలు చేపడుతుందా.అని వేచి చూడాల్సిందే!. మండలం మొత్తం ప్రశ్నించే ప్రశ్న ఏమిటంటే ప్లాంట్ ఈడి స్థాయి అధికారి నియామకానికి సంబంధిత విద్యార్హత,అనుభవం,నాయకత్వ నైపుణ్యం,ప్రాజెక్టు మేనేజ్మెంట్ నైపుణ్యం, నిర్ణయాధికారం,పూర్తిస్థాయి బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ వివిధ అంశాలను చూడకుండా ప్లాంటుకు అధిపతిగా నియమిస్తారా?.ఇలాంటి తప్పుడు కథలు అల్లుతున్న అధికారులకు సంస్థపరంగా తగిన శిక్ష ఖాయమని కొందరు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.ప్లాంట్ లోని కొందరి అధికారుల కుట్రలు, కుతంత్రాలు,వారి చీకటి బాగోతాలు అతి త్వరలో వెలుగులోకి రానున్నాయని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version