చదివిన పాఠశాలపై మమకారంతో.!

చదివిన పాఠశాలపై మమకారంతో..తన కుమారునికి అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచిన తల్లి

-తల్లిని సన్మానించిన ఉపాధ్యాయ బృందం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

తాను పేదింటి కుటుంబంలో పుట్టినప్పటికీ..ప్రైవేట్ చదువులను చదివించలేని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం మిరిపూరి నాగరాణి అందరికీ ఆదర్శంగా నిలిచిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామానికి చెందిన మిరిపూరి మంజుల-సమ్మయ్య దంపతుల కుమార్తె నాగరాణి నిరుపేద కుటుంబంలో పుట్టింది. పేదరికం చదువుకు అడ్డం కాదనే విషయాన్ని ప్రపంచానికి చాటింది. చిన్నప్పటినుండి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత విద్యనభ్యసించింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొందింది. ప్రస్తుతం తాను చిన్నప్పుడు చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన కుమారునికి అడ్మిషన్ ఇప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే క్రమశిక్షణకు నిలయాలని, మనం కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని మిరిపూరి నాగరాణి నిరూపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం మిరిపూరి నాగరాణిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తోటపల్లి మహేష్, ఉపాధ్యాయులు నాగేందర్, సురేందర్, శ్రీధర్, సునీతా దేవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.

టీబి ముక్త్ భారత్ అభియాన్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి

★డాక్టర్ రమ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగగం: గురువారం రోజు టీబి ముక్త్ భారత్ అభియాన్‌ను వాస్తవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఝరాసంగం మండల వైద్యాధికారి రమ్య మాట్లాడుతూ, ‘టీబి-ముక్త్ భారత్ అభియాన్’ కు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మరియు ఈ ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడం అన్ని పౌరుల విధి అని అన్నారు. ఎందుకంటే మన దేశంలోని అన్ని ఇతర అంటు వ్యాధుల కంటే టిబి అత్యధిక మరణాలకు కారణమవుతుంది. ప్రపంచ జనాభాలో భారతదేశంలో 20 శాతం కంటే కొంచెం తక్కువ మంది ఉన్నారని, కానీ ప్రపంచంలోని మొత్తం టిబి రోగులలో 25 శాతానికి పైగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. 

citizens

ఇది ఆందోళన కలిగించే విషయం. టిబి బారిన పడిన వారిలో ఎక్కువ మంది సమాజంలోని పేద వర్గాల నుండి వచ్చారని కూడా ఆమె గుర్తించారు..టిబి ముక్తి కార్యక్రమం కింద, జీర్లపల్లి, తుమ్మనపల్లి, కప్పాడ్ మరియు నర్సాపూర్ గ్రామాల నుండి అనుమానిత టీబి కేసులను 102 మరియు ఆర్ బి ఎస్ కే వాహనంలో ఛాతీ ఎక్స్ రే కోసం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు అన్నారు.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ.

అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ రమేష్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

గురువారం అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని
జిల్లా కేంద్రంలో ని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణం నుండి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మత్తు పదార్థాల నివారణ ర్యాలీ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే
తదితరులు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ భూతాన్ని సమాజం నుండి తరిమేయాలని పిలుపునిచ్చారు.
తల్లి దండ్రులు పిల్లల అలవాట్లును నిశితంగా గమనించాలని, డ్రగ్స్ కు అలవాటుపడ్డ వారిలో వచ్చే మార్పులను గుర్తించడం సులువైన పని అని అన్నారు. ఇంటి నుండే మార్పు మొదలవ్వాలని తెలిపారు. డ్రగ్స్ భూతాన్ని తరిమేయడంలో సహాయం కావాల్సిన వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థను కానీ పోలీసు శాఖను సంప్రదించాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ డ్రగ్స్ ను తరిమేయడంలో ప్రతి ఒక్కరి బాగస్వామ్యం అవసరమని అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలన కోసం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దిలీప్ కుమార్ నాయక్, అడీషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల, అడీషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి , అడీషనల్ ఎస్పి నరేష్ కుమార్, సింగరేణి జి.ఎం.రాజేశ్వర్ రెడ్డి, సంక్షేమ అధికారి మల్లీశ్వరి , ఎక్సయిజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ , విద్యా శాఖ అధికారి రాజేందర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రావు, డి.ఎస్పి సంపత్ రావు, సూర్యనారాయణ, విద్యార్థులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి జిల్లా ఎస్పీ

వనపర్తి నెటిదాత్రి :

 

 

 

వనపర్తి జిల్లాలో నిషా కొరకు ఎవరైనా డ్రగ్స్ గంజాయి వాడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు 100 1908 పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే డ్రగ్స్ గాన్ oజాయ్ వాడే వారిపై చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు . యువకులు విద్యార్థులు డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు వాడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన కోరారు . విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో వారిని చదివించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారి నమ్మకాలను దుర్వినియోగం చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విద్యార్థులకు సూచించారు మరక ద్రవ్యాలు వాడరాదని ర్యాలీ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా ఎస్పీ రావుల గరీధర్ పోలీస్ డి సి ఆర్ సి ఉమా మహేశ్వరరావు వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు సీఐ కృష్ణయ్య కొత్తకోట సీఐ రాంబాబు జిల్లా అధికారులు సుధీర్ రెడ్డి సుధారాణి క్రీడల అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే.

నర్సంపేట పట్టణంలో చినుకు పడితే చిత్తడే..

నాళాలు ఆక్రమణతో రోడ్ల పైన వర్షపు నీరు..

చిన్న వానపడితే చాలు చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు

నర్సంపేట నేటిధాత్రి:

 

నర్సంపేట పట్టణంలో ప్రధాన రహదారులు చినుకు పడితే చిత్తడిగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న దుకాణ యాజమానులు ఎక్కడికక్కడ నాళాలు ఆక్రమించడంతో చిన్న వానకే రోడ్ల పైన నీళ్ళు నిలిచి చెరువులను తలపించే పరిస్థితి నెలకొన్నది. మున్సిపాలిటీ అధికారుల కలిసన్నల్లో కడుతున్న నూతన భవనాల పట్ల చర్యలు తీసుకోకపోవడం వలన నాళాలు ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైతూ వర్షం పడితే చాలు చెరువులను తలపించే విధంగా నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారులు మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ కి వెళ్లే రోడ్డు, బస్ స్టేషన్ నుండి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు, అంబేద్కర్ సెంటర్ నుండి మల్లంపల్లి వైపు వెళ్లే జాతీయ రహదారి, ఎక్కడ ఎక్కడ నాళాలు ఆక్రమించడంతో రోడ్లపై వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయని పట్టణ ప్రజలు బాటసారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అక్కడ నాలాలను కూల్చివేసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

జిల్లాలోని ఈవీఎం, వివి ప్యాట్ గోదామును జిల్లా ఎన్నికల అధికారి అండ్ కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం పరిశీలించారు.
భద్రతా ఏర్పాట్లు, గోదాం నిర్వహణ, సీసీ కెమెరాల పనితీరు, రౌండ్ ది క్లాక్ మానిటరింగ్ తదితర అంశాలను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గోదాములో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, అన్ని చర్యలు సక్రమంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈవీఎంల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పటిష్ట పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు
అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు
ఈ తనిఖీలో ఎన్నికల విభాగం డిటి అబ్బాస్, ఐటి పర్సన్ నవీన్
రాజకీయ పార్టీల ప్రతినిధులు బీజేపీ నుండి మునీందర్, సీపీఎం నుండి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మత్తు వద్దు భవితే ముద్దు.

మత్తు వద్దు భవితే ముద్దు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జహీరాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ సైదా నాయక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ సేవ్ టు లైఫ్ మత్తు పదార్థాలను సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా న్యాయమూర్తి గంటా కవితా దేవి మాట్లాడుతూ మత్తుకోసం నిండు జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

మృతదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లోని చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కంచర్ల రాంబాబు గారి తండ్రి (కంచర్ల పోశాలు) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్నిగురువారం చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్* పరామర్శించి వారి ఆత్మకు మనస్పూర్తిగా శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి వెంట స్థానిక కాంగ్రెస్ సీనియర్ మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం.

శ్రీరంగాపురం గ్రామంలో వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని శ్రీరంగాపురం గ్రామంలో డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య శిబిరం నిర్వహించే వ్యాధులతో బాధపడుతున్నవారు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరిగింది గ్రామంలో ముందస్తు జాగ్రత్తగా శానిటేషన్, నీటి నిల్వలు ఆయిల్ బాల్స్ రిలీజ్ , బ్లీచింగ్ చల్లించడం పంచాయితీ కార్యదర్శి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్ కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని కాచి చల్లార్చి నీళ్లు మాత్రమే తాగాలని హారపదార్ధాలు వెచ్చగా ఉన్నప్పుడు తినాలని తెలిపారు. జ్వరం ఉన్న ప్రతి ఒక్కరు రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు .ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, కరకగూడెం పి హెచ్ సి. హెచ్ ఈ ఓ కృష్ణయ్య, మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ అరుణ్ బాబు, ఎం పి హెచ్ ఏ ఎం నరసింహారావు, సుజాత, ఆశాలు, హెల్త్ సూపర్వైజర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం.

యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గితే, అధికారులు

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. (యాంటీ డ్రగ్ డే )సందర్భంగా మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే, విద్యార్థులు, పోలీస్ అధికారులతో కలిసి గురువారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తీశారు.

ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింపచేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం–మనందరిబాధ్యత డ్రగ్స్‌కి నో చెప్పండి,ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్, నినాదాలు చేశారు.

డ్రగ్స్,గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్,గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు,యువతకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ..

విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి  పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.

డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు.

డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని రాను రాను ఆరోగ్యం  క్షీణిస్తుందని వివరించారు.

డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు.

విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.

డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Students as part of Anti-Drug Day.

అనంతరం ఎస్పీ మహేష్ బి.గితే మాట్లాడుతూ విద్యార్థులు, యువత తమ పరిసరాలు, విద్యాలయాలు ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా.. తరలించనా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు.

విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారాలని ఆకాంక్షించారు.

యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన ఇతర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలను కలెక్టర్, ఎస్పి తదితరులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులు అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను పరిశీలించారు.

విద్యార్థులు గీసిన చిత్రాలు..

 

Students as part of Anti-Drug Day.

 

 

తయారు చేసిన పెయింటింగ్ లను చూసి కలెక్టర్, ఎస్పీ వారిని అభినందించారు.

అలాగే  యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ పై కలెక్టర్, ఎస్పీ, అధికారులు సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి,అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, సి.ఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నతేష్,మధుకర్, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు రమేష్, మధుకర్, యాదగిరి, ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోలో బుధవారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోత్క పల్లి – కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందన్న సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పై దికొండ రమేష్ నేతృత్వంలో (బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సబ్ స్టాన్స్ అబూస్ ఆర్ వన్ బ్యాడ్ ఛాయిస్ కాన్ చేంజ్ ఏ లైఫ్) అనే నినాదాలతో స్థానిక జడ్.పి. హెచ్.ఎస్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మాబ్ (నృత్య ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రదర్శన పొత్కపల్లి సెంటర్లో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. అవగాహన సభలో ఎస్పై రమేష్ మాట్లాడుతూ, “డ్రగ్స్ వాడకాన్ని యువత ఫ్యాషన్గా తీసుకోవడం ప్రమాదకరం. ఇది భవిష్యత్తును నాశనం చేస్తుంది. మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, నేరాలకు దారి తీస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు మార్గనిర్దేశం చేయాలి,” అని అన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విద్యార్థులు మధక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.

విద్యార్థులు మధక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోహిర్ మండల విద్యాధికారి జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిరి మండలం జిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అన్నర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రవీందర్ పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జాతీయ రహదారిపై నాసిరకం పనులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

నారాయణఖేడ్ మీదుగా బీదర్, జహీరాబాద్ వైపు వెళ్తున్న జాతీయ రహదారి పనులను కాంట్రాక్టర్ నాసిరకంగా చేపట్టడంతో వాహదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని పిప్రి వద్ద రహదారిపై నాణ్యమైన మట్టి కాకుండా నల్లమట్టి వేయడం వల్ల బుధవారం రాత్రి కురిసిన చిరుజల్లులకే బురదమయంగా మారడంతో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా వెళ్తున్న రోడ్డుపై వాహనం జారి పడిపోతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఇక అంతే సంగతి అని వాపోతున్నారు.

చదువు చారెడు,ఫీజులు బారెడు…

చదువు చారెడు,ఫీజులు బారెడు…

ప్రైవేటు విద్య,ర్యాంకులు మిద్య…

ప్రచారం ఆకాశం,చదువులో అధ్వాహ్నం…

తల్లిదండ్రుల బలహీనత పెట్టు’బడి’…

ప్రైవేటు విద్యా సంస్థల అడ్డగోలు ఆగడాలు…

ఫీజుల దోపిడే ప్రైవేటుకు రాబడి…

తల్లిదండ్రులలో నెలకొంటున్న గందరగోళం…

దశాబ్దాలుగా ఇదే తీరు… విద్యాశాఖలో మార్పు రాదు…

ప్రైవేటు విద్యా సంస్థల యూ ట్యూబ్ ప్రసారాలు…

ప్రైవేటుకు వచ్చేది పదుల ర్యాంకులే…

నిబంధనలు పట్టించుకోని ప్రవేట్ విద్యాసంస్థలు…

అధిక ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు విలవిల…

చేష్టలుడిగిన విద్యాశాఖ…

మార్గదర్శకాలు పాటించని పాఠశాలపై చర్య శూన్యం…

పాఠశాలలో కానరాని ఫీజుల పట్టిక…

యదేచ్చగా పుస్తకాలు యూనిఫామ్ అమ్మకాలు…

యజమాన్యాల అధిక వసులతో ప్రవేట్ పాఠశాల దోపిడి…

తల్లితండ్రులపై అధిక భారం…

ఇంతటి అరాచకంపై నోరు మెదుపుని జిల్లా విద్యాధికారి…

ప్రైవేట్ యజమాన్యం కి నేనున్న అంటున్న విద్యాధికారులు…

ప్రైవేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతున్న విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి…

నేటి ధాత్రి మహబూబాబాద్ -గార్ల :-

 

 

 

 

 

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు నియమ నిబంధ నలను పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.

కనీస మార్గదర్శ కాలు పాటించడం లేదు.

అధిక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరిట వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి.

ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నిబంద నలను పాటించకుండా అనేక పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు.

పర్యవసానంగా విద్యాహక్కు చట్టం అనేది కేవలం కాగితాలకే పరిమితమైంది.

విద్యార్థుల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు కార్పొరేట్ స్కూళ్లకు దాసోహం అయిపోతున్నాయి.

మహబూబాబాద్ జిల్లా పరిధిలోని అనేక ప్రైవేటు విద్యాలయాలు విద్యాహక్కు చట్టాన్ని అనుసరించకుండా ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నప్పటికీ వారిని నిలువరించే చర్యలు మాత్రం కానరావడం లేదు.

కనీస నిబంధనలను పాటించకుండా నిర్ణీతవసతులు కల్పించకుండా స్థాపించిన పాఠశాలల్లో ఫీజులు మాత్రం లక్షల్లోకి చేరిపోయాయి.

నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాల పేరిట, స్కూల్ యూనిఫాంల పేరిట వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఆ దిశగా కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు.

ఈ విషయమై అనేక ఫిర్యాదులు అందుతున్నప్పటికీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న విద్యాలయాలపై చర్యలు చేపట్టని,అధికారుల తీరు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

Private Education.

 

 

పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ విద్యాశాఖ ఉన్నాత అధికారులు ఎలాంటి తనిఖీలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది.

నియమ నిబంధనల ప్రకారం ప్రతీ పాఠశాలలో వారి వార్షిక ఫీజులు తీసుకునే నిర్ణయం గవర్నింగ్ బాడీ పై ఆధారపడి ఉంటుంది.

ప్రతీ పాఠశాల ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని గవర్నింగ్ బాడీ ఆమోదం పొంది ఫీజ్ స్ట్రక్చర్ విద్యాశాఖ కార్యాలయంలో అప్పజెప్పి ప్రతీ పాఠశాలలో అందరికి కనిపించే లాగా నోటీసు బోర్డులో పెట్టాలి.

కానీ ఈ నియమనింధకలను ఎన్ని పాఠశాలు పాటిస్తున్నాయో మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ ఉన్నత అధిరులకు తెలియదంటే ఆశ్చర్యమే.

ఇలా అడ్డగోలుగా వార్షిక ఫీజులు, పుస్తకాల ఫీజులంటూ ఒక్కో విద్యార్థి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికైనా జిల్లా ఉన్నాత అధికారులు స్పందించి తనిఖీలు జరిపి స్కూల్ ఫీజ్ స్ట్రక్చర్ ను అనుసరించి ఫీజులు వసూలు చేయాలి.

ఇంగ్లీష్ మీడియం మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు.

దీంతో యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు.

భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి వస్తుండడంతో తల్లిదండ్రులు ఇబ్బందుల్లో పడుతున్నారు దీనికి తోడు పై తరగతులకు ప్రమోట్ చేయమని, బయటికెళ్తామంటే టీసీ ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

అధిక ఫీజులు చెల్లించడాన్ని ప్రశ్నిస్తే పలు స్కూలు యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని వాపోతున్నారు.

పాఠశాలల ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఫీజుల దోపిడీ,విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యావంతులు కోరుతున్నారు.

పేదరికం చిదిమేస్తున్న బాల్యం.

పేదరికం చిదిమేస్తున్న బాల్యం…

బాల కార్మిక వ్యవస్థ చిట్టి చేతులను చిత్రహింసలు పెడుతుంది…

భారమైన శ్రమకు బలైపోతున్న బాల బాలికల చేత పలక బలపం పట్టించాలి…

పిల్లల బంగారు భవిశ్యత్తు కు బాటలు వేద్దాం…

పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి…

చిన్న పిల్లలతో వెట్టి చాకిరీ చేయిస్తున్న యాజమాన్యం పై కేసులు నమోదు చేయాలి…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలి…

నేటి ధాత్రి:

మహబూబాబాద్-గార్ల:-ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి,కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు,పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే.పరిశ్రమలు, వ్యవసాయం, ఇటుక బట్టీలు,నిర్మాణ రంగం, కర్మాగారాలలో,హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్‌లు, బిక్షాటన, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు.వీరికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.పోటీతత్వంతో నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెనుకబడిపోతున్నారు.పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు.ఉపాధి మార్గాలు వెతుక్కునేందుకు సరైన మార్గదర్శనం,ఆర్థిక తోడ్పాటు లేకపోవడం, నైపుణ్యలేమి వంటి కారణాల వల్లే ఇలా మారుతున్నారు.నేటి బాలలే రేపటి పౌరులు,చిన్నారులే దేశ ప్రగతికి సోపానాలు,కానీ అభివృద్ధిలో పరుగులు పెడుతున్న నేటి హైటెక్ యుగంలోనూ ఇంకా వెట్టిచాకిరి వ్యవస్థ చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తోంది.బాలకార్మిక వ్యవస్థ చిట్టి చేతులను చిత్ర హింసలు పెడుతోంది.బాల కార్మిక వ్యవస్థ తీవ్రమైన మానవ హక్కుల సమస్య. బాలల శారీరక,మానసిక అభివృద్ధికి ఆటంకమై వారికి కనీస అక్షరాస్యతను, వినోదాన్ని కూడా పొందే అవకాశాన్ని ఇవ్వని పనిని, స్థితిని బాల కార్మిక వ్యవస్థ అంటాము.అక్షర జ్ఞానానికి నోచుకోకుండా భారమైన శ్రమకు బలైపోతున్న బాలల జీవితాలు మనం సాధించిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నాయి. బాల కార్మిక వ్యవస్థ ఒక్క భారతదేశ నికే పరిమితం కాలేదు.అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బాల కార్మికులు ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 2000 నాటికి 246 మిలియన్ల మంది బాల కార్మికులు ఉంటే, 2012 ముగిసే నాటికి 168 మిలియన్ల మంది ఉన్నారు. మొత్తం బాల బాలికల జనాభాలో పదకొండు శాతం మంది బాల కార్మికులే. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 77.7 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో బాల కార్మికుల సంఖ్య భారీగా ఉంది. అయితే సబ్ సహారన్ ఆఫ్రికాలో ప్రతి ఐదుగురు బాలబాలికల్లో ఒకరి కంటే ఎక్కువమంది బాల కార్మికులు ఉంటున్నారు. మొత్తం బాల కార్మికుల్లో 85 మిలియన్లు అంటే 5.4% మంది ప్రమాదకర పనుల్లో మగ్గుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ రంగంలోనే అత్యధిక శాతం మంది బాల కార్మికులు ఉన్నారు. ఈ రంగంలో అత్యధికంగా 98 మిలియన్ల మంది బాల కార్మికులు ఉన్నారు. ఆర్థిక మంద్యం, సంక్షోభం వల్ల బాల కార్మికుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావించారు. అయితే అందుకు విరుద్ధంగా బాల కార్మికుల సంఖ్య పతనమైంది. దీనికి కారణం బాల కార్మికులు అధికంగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక మంద్యం, సంక్షోభం ప్రభావాలు స్వల్పంగా ఉండటం ఒక కారణమైతే, మాంద్యం సమయంలో బాల కార్మికులకు ఉపాధి లభించకపోవడం మరో కారణం. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద 5 నుంచి 14 ఏళ్ల లోపు వయసులో ఉన్న 1.26 కోట్ల మంది బాల బాలికలు ఆర్థిక కార్యకలాపాల్లో బాల కార్మికులుగా ఉన్నారు. వీరిలో 12 లక్షల మంది ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు. 2009-10లో 5-14 ఏళ్ల వయసున్న బాల కార్మికుల సంఖ్య 49. 84 లక్షలు. ప్రతి పదిమంది బాల కార్మికుల్లో 9మంది వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమవుతున్నారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు శారీరక హింసకు గురవుతున్నారు. దాదాపు 50 శాతం మంది ఏదో ఒక రూపంలో భౌతికంగా వేధింపులకు బాధితులవుతున్నారు. బాల కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తారు. కాబట్టి వారికి హక్కులు, కనీస వసతులు మృగ్యమవుతాయి. తేలిగ్గా మోసానికి గురవుతారు. వారికి కష్టానికి తగ్గిన వేతనం లభించదు. శ్రమ దోపిడీకి గురవుతారు.నిర్దిష్ట పనిగంటలు లేవు. పరిశ్రమలు,హీనమైన, హెయమైన వాతావరణంలో బాల కార్మికులు పనిచేస్తున్నారు. ఎంతోమంది పిల్లలు హోటల్లో, దుకాణాలలో, గృహాలలోను సేవకులుగా పనిచేస్తున్నారు.వారి శక్తికి మించి అధిక గంటలు పని చేస్తూ అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇటుక బట్టీల్లో పనిచేసే పిల్లలు పెద్ద పెద్ద బరువులు మోస్తుంటారు. తరచుగా గాయపడుతుంటారు. కొంతకాలానికి పూర్తిగా శక్తిని కోల్పోతున్నారు. శ్వాస కోస వ్యాధులతో బాధపడుతున్నారు. తివాచీ పరిశ్రమల్లో పనిచేసే బాలలు కంటి చూపు కోల్పోతున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే బాలలు ప్రమాదాలకు గురవుతున్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడానికి ముందుగా ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవాలి. అందుకే విద్యను ప్రాథమిక హక్కుగా చేశారు. చట్టం అమల్లో భాగంగా బడి బయట ఉన్న పిల్లలు, మధ్యలో మానేసిన పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం సవాలుగా మారింది. బాల కార్మిక వ్యవస్థ సంక్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్య. దీన్ని నిర్మూలించడానికి స్థిరమైన దీర్ఘకాల కృషి అవసరం. చట్టాలు సమగ్రంగా ఉండేలా చూడాలి. ఈ చట్టాలు అమలుకు అవసరమైన పటిష్ట యంత్రాంగం ఉండాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానించాలి. భారమైన శ్రమకు బలైపోతున్న బాలబాలికల చేత పలక బలపం పట్టించాలి. బాల కార్మిక వ్యవస్థ బాలికల అక్రమ రవాణా,బాల్యవివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు సహకరించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలోని ప్రతి పౌరుడు ముందుండాలి,బాల కార్మికులకు విముక్తి కల్పించాలి.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన.

విలేకరిపై దాడి అనైతికం మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే పత్రిక విలేకరులపై దాడి చేయడం అనైతికమైన చర్య అని మండల జర్నలిస్టులు, విద్యావంతుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు రాదండి దేవేందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు కుమారస్వామి లు అన్నారు. తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డి పై మంగళవారం జరిగిన దాడులు నిరసిస్తూ మండల కేంద్రంలోనీ చౌరస్తాలో బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఒక భాగమని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే పత్రిక విలేకరులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం సరికాదన్నారు. సమాజ హితం కోసం విలేకరులు స్వేచ్ఛపూరిత వాతావరణంలో పని చేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శ్రీనివాస్, రవి, రామకృష్ణ, కుమార్, కిషోర్, మురళి, వెంకట్, రమేష్, విష్ణు, బాబు, శంకర్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు.

యూనియన్ బ్యాంకు లో స్టాఫ్ లేక ఖాతాదారుల కు ఇబ్బందులు

డి.ఎస్.పి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంక్ ను ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రదాన కార్యదర్శి కండె రవి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది ఈ బ్యాంకులో 80,000 మంది ఖాతాదారులు ఉండగా ముగ్గురు మాత్రమే సిబ్బంది వారికి తోడుగా ఒకరిద్దరు సహా సిబ్బంది ఉన్నారు రోజుకు మండలంలోని 17 గ్రామాలు కాకుండా పక్క గ్రామాలను కలుపుకొని 80,000 మంది ఖాతాదారులు ఉన్నారు వీరందరికీ సరిపడా స్టాఫ్ లేరు రైతు భరోసా పైసలు వడ్ల పైసలు ఏకకాలంలో పడడం వల్ల రైతులు ఖాతాదారులు బ్యాంకుకు వస్తున్నారు వారి డబ్బులను వారికి సకాలంలో చెల్లించడంలో ఈ ప్రభుత్వం మరియు బ్యాంకు విఫలమైంది గంటల తరబడి ఖాతాదారులంతా లోపల నిలబడుతున్నారు కనీస సౌకర్యాలు బ్యాంకులో లేవు బిపి షుగర్ ఉన్న పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కూర్చోడానికి కుర్చీలు లోపల ఉండవు మూత్రం పోదా పోద్దాం అంటే బయట టాయిలెట్ గది ఉండదు ఖాతాదారులకు అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పినప్పుడు ఒక్కొక్క రైతు చెప్పులు అరిగేలా ఎనిమిది రోజులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు ఒక పేద రైతుకు చెక్ బుకు ఎందుకు చెక్ బుక్ ల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు సరైన సెక్యూరిటీ లేక ప్రజలు గుంపులుగాడుతున్నారు స్థానిక ఎస్ఐ సహకరించాలని కోరుతున్నాం ఒక రెండు నెలలు ఈ సమస్య పైన బ్యాంకు మేనేజర్ స్థానిక ఎస్సై ఆర్ అశోక్ స్పందించాలని కోరుతున్నాం ఇది ప్రజా ప్రభుత్వం కాదు దళారి ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చని ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎట్లా అయితది అని ధర్మ సమాజ్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం ఇక ముందు ఇలా కొనసాగితే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాదారులు అందరితో కలిసి ధర్నా రాస్తారోకోలు చేస్తాం ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ గాంధీనగర్ గ్రామ అధ్యక్షులు ఇంజపల్లి విక్రమ్ నరసన్న మొగిలి వినయ్ శ్రీ కరణ్ బ్యాంకు ఖాతాదారులు  పాల్గొన్నారు

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన.

కబ్జాకు గురైన 70 ఎకరాల ప్రభుత్వ భూమిని వివరణ ఎమ్మార్వోను కోరిన టి ఆర్ హెచ్ ఎస్ ఎస్ అధ్యక్షుడు

◆ -సంగారెడ్డి జిల్లా టిఆర్ హెచ్ఎస్ఎస్ అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నెంబర్స్ 102, 103,ప్రభుత్వ భూమి 70 ఎకరాల గల భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని పత్రిక ప్రకటన చూసి స్పందించిన తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇంచార్జి తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు హక్కుల సాధన సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల ఒక వంద రెండు (102)ఒక వంద మూడు(103) సర్వే నంబర్లు గల 70 ఎకరాల భూమిని ప్రవేట్ వ్యక్తులు కబ్జా చేశారని వెంటనే చర్యలు చేపట్టి అట్టి ప్రభుత్వ భూమిని విచారణ చేపట్టి పేద ప్రజలకు ఆ ప్రభుత్వ భూమిని అందజేయాలని కోరినాడు. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడు చిట్టెంపల్లి బాలరాజ్ కోహిర్ మండల్ రైతు హక్కుల సాధన సమితి సభ్యులు, నాగిరెడ్డిపల్లి గ్రామస్తుడు మీద్ద్య మల్లేశం యాదవ్ తదితరులు పాల్గొన్నరు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోహిర్ మండలం పీచర్యాగడ్ గ్రామానికి చెందిన జి.శ్రీకాంత్,డి.సాయి హేమంత్ లను ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,పరామర్శించిన వారిలో చల్లా శ్రీనివాస్ రెడ్డి,శికారి గోపాల్,గాళ్ రెడ్డి,సి.యం.అశోక్ రెడ్డి,చిన్నా,దిలీప్, తదితరులు ఉన్నారు.

డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు.

డ్రాయింగ్ పరీక్షలో అర్హత సాధించిన ప్రభుత్వ విద్యార్థులు

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గీత నగర్ సిరిసిల్ల లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల నుండి దాదాపు లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ లో 25 బాలబాలికలు మరియు దాదాపు 25 మంది డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ లో బాలబాలికలు ఉత్తీర్ణు లైన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం అందజేసినటువంటి మెమోలు ఈరోజు ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యల్.శారద అందజేసినారు ఈ కార్యక్రమంలో డ్రాయింగ్ మాస్టర్ రుద్ర రమేష్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు రాయడానికి అర్హత కేవలం ఎనిమిదవ తరగతి చదివే పిల్లలనుండి డిగ్రీ పీజీ వరకు చదివే పిల్లలు వరకు అర్హులు భవిష్యత్తులో ఇట్టి పరీక్షలలో పాసైన వారు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగము హైదరాబాదు వారు నిర్వహించే డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ చేయడానికి అర్హులు అవుతారని ప్రధానోపాధ్యాయురాలు గారు చెప్పారు ఇట్టి టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత ప్రభుత్వ డ్రాయింగ్ మాస్టర్స్ గా ఉద్యోగం పొందడానికి అర్హులవుతారు మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ పరీక్షలు కూడా ఇట్టి నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు వారు కూడా క్రాఫ్ట్ టీచర్ గా ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులవుతారని చెప్పారు కాబట్టి ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి పరీక్షలకు అందరూ ఇట్టి సదా అవకాశాన్ని వినియోగించుకోగలరని మనవి చేశారు. ఈ పరీక్షలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు తో పాటు డిగ్రీ వరకు చదివే విద్యార్థులు అర్హులవుతారని చెప్పారు.

error: Content is protected !!
Exit mobile version