`అన్ని విధాలా బాధితులను ఆదుకుంటాం..
`అర్హులందరికీ ప్రత్యామ్నాయం చూపిస్తాం!

`అర్హులందరికీ జాగలిస్తాం..5 లక్షలు ఇస్తాం?
`పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీ మాత్రమే!
`పేదల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే!
——————————-
`బీఆరఎస్ జూటా రాజకీయాలు జనం నమ్మరు.
`పదేళ్లలో బీఆరఎస్ పేదలకు చేసిందేమీ లేదు.
`కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతోంది!
`ప్రభుత్వాన్ని అబసుపాలు చేయాలని చుస్తోంది!
`ప్రజలకు పదేళ్లు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆగం చేసింది బీఆరఎస్?
`బీఆరఎస్ చేస్తున్న అసత్య ప్రచారంలో వాస్తవం లేదు!
`మసిబూసి మారేడుకాయ చేయాలని బీఆరఎస్ చూస్తోంది.
`ప్రజల మీద రాజకీయం కోసం లేని ప్రేమ ను ఒలకబోస్తోంది!
`బీఆరఎస్ పార్టీ మోసపు మాటలు నమ్మకండి.
————————————
`ఈ పరిస్థితికి కారణం బీఆరఎస్ పార్టీ నాయకులే!
`పెద్ద ప్రజలను వంచించి మోసం చేసింది బీఆరఎస్ నాయకులు.
`ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు.
`పదేళ్ల నుంచి వారికి పట్టాలెందుకు ఇవ్వలేదు?
`కనీసం మిషన్ భగీరథ మంచి నీళ్లు ఎందుకివ్వలేదు?
`ఇంతవరకు ఇంటి నెంబర్లు ఎందుకివ్వలేదు?
`సంవత్సరాల తరబడి కరంట్ ఎందుకివ్వలేదు?
`గుడిసెలు వేసుకున్న వారి నుంచి ఎంతెంత వసూలు చేసారో బాధితులే చెబుతున్నారు!
`బీఆరఎస్ నాయకుల దొంగ నాటకాలు అందరికీ తెలుసు?
`బాధితుల సానుభూతి కోసం బీఆరఎస్ కొంగ జపాలు ఎవరు నమ్మరు?
`కలెక్టర్ కార్యాలయం ప్రారంభం రోజున డేరాలెందుకు కట్టారు?
`గతంలోనే నోటీసులు ఇచ్చిందెవరు?
`అప్పుడు ప్రభుత్వ భూములు అని నోటీసులు ఇచ్చింది బీఆరఎస్ కాదా?
హైదరాబాద్, నేటిధాత్రి:
అధికారంలో వున్నంత కాలం పేదల ముఖం చూడని బిఆరఎస్ పార్టీకి ప్రజల మీద పుటుక్కున ప్రేమ పుట్టుకొచ్చింది. రెండున్నరేళ్ల కాలమైనా కాంగ్రెస్ సర్కారు మీద పోరాటం చేసే వీలు కావడంలేదు. ఎక్కడా ఎలాంటి సందర్భం దొకడం లేదు. వెలుగు మ{్ట ఘటన కొట్టుకుపోతున్న బిఆరఎస్‌కు గోదారిలో గడ్డిపరక అనుకుంటున్నారు. రాజకీయం చేయాలని చూస్తున్నారని రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. బిఆరఎస్ సాగిస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తిప్పికొట్టారు. బిఆరఎస్‌కు నిజంగా చిత్త శుద్ధి వుంటే ప్రజలు తిరస్కరించేవారు కాదు. ఆ సోయి కూడా ఇంకా బిఆరఎస్ నాయకులకు రావడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. గతంలో బిఆరఎస్ వాళ్లు చేసిన పాపం ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పదేళ్లు బిఆరఎస్ నాయకులు చేసిన అన్యాయాలు, అకత్యాలు, అక్రమాలు ఇంకా ప్రజల మనసులోనుంచి తొలగిపోలేదు. అందుకే ఏ ఎన్నికలొచ్చినా బిఆరఎస్ ప్రజలు తిప్పికొడుతున్నారు. తిరస్కరిస్తున్నారు. అయినా బిఆరఎస్ నాయకులకు, ఆ పార్టీ పెద్దలకు బుద్ది రావడం లేదు. ఇప్ప్పుడు తగుదునమ్మా అని చెప్పి ఖమ్మం జిల్లాలో వెలుగు మట్లలో ఏదో జరిగిపోతోందని గాయి, గాయి చేసేందుకు కట్టగట్టుకొని బయలుదేరుతున్నారు. ప్రజల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారు. బిఆరఎస్ నాయకులు ఎన్ని నాటకాలాడినా, ఎంత వెదవ వేషాలు వేసినా జనం నమ్మరు. అది ఖమ్మం జిల్లాలో బిఆరఎస్ నాయకులు చేసిన దుర్మార్గాలు మర్చిపోరు. వెలుగు మట్ల ప్రాంత పజలను కడుపులో పెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారిని కాపాడుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారిని పునరావాసం కల్పించేంది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారి ఆత్మాభిమానాన్ని కాపాడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. వారి ఆత్మ గౌరవం నిలిపేది కాంగ్రెస్ ప్రభుత్వమే. పదేళ్ల పాటు బిఆరఎస్ చేసిందేమీ లేదు. ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్ప్పుడు తగుదునమ్మా అంటూ వచ్చి, లేనిపోని రాద్దాంతం చేస్తే ప్రజలు కూడా నమ్మడం లేదు. వారిని ఆదరించడం లేదు. పైగా పదేళ్లు అధికారంలో వుండి చేయలేని పని వచ్చే ఎన్నికల్లో గెలిచి చేస్తామని చెప్పడమంత రాజకీయ దివాళాకోరు తనం మరొకటి వుండదు. అందుకే వెలుగు మట్ల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసంతో వున్నారు. వారికి మంచి స్ధలాలను చూసి పదిహేను పట్టాలిస్తాం. వారు ఇల్లు కట్టుకోవడానికి రూ.5లక్షలు కూడా చెల్లిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజానికి వెలుగుమట్లలో ఏం జరిగిందో ఖమ్మం ప్రజలందరికీ తెలుసు. అక్కడ నిజమైన బాదితులు కేవలం 140 మంది మాత్రమే అన్నది అందిరికీ తెలుసు. ఇతరులు అక్కడికి రావడానికి, గుడిసెలు వేసుకోవడానికి, అక్రమంగా ఇండ్లు కట్టుకోవడానికి కారణం బిఆరఎస్ నాయకులు కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఎంత మంది ఎన్ని లక్షలు తీసుకొని వారిని మోసం చేసి ఇండ్లు కట్టుకోమని చెప్పారో అక్కడి ప్రజలే చెబుతారు. ఆ విషయాలు వదిలేసి మసిబూసి మారేడు కాయ చేయాలని బిఆరఎస్ నాయకులు చూస్తున్నారు. ముఖ్యంగా గతంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ చేసిన అక్రమాలు జనానికి తెలియనివా? ఇలా ఇండ్ల పేరు చెప్పి లక్షలు వసూలు చేసింది పువ్యాడ అజయ్ కుమార్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. బిఆరఎస్ నాయకుడు పువ్వాడ అనుచరులకు అక్కడ గుడిసెలు వేసుకున్న వారు లక్షల రూపాయలు ఇచ్చిన వారిని మంత్రి మీడియా ముఖంగా హజరుపర్చారు. ఇలా అమాయకులైన పేద ప్రజలు నుంచి డబ్బులు వసూలు చేసి వారిని జీవితాలు ఆగమయ్యేందుకు కారణమైంది బిఆరఎస్ నాయకులు కాదా? ఈ విషయం ఆనాడే పార్టీ పెద్దలకు తెలిసినా ఎందుకు ఉపేక్షించారు? ఆనాడే ఎందుకు చర్యలు తీసుకోలేదు? వెలుగుమట్లలో గుడిసెలు వేసుకున్నవారికి బిఆరఎస్ ప్రభుత్వం ఎందుకు మౌళిక సదుపాయాలు కల్పించలేదు. వారికి కరంటు సరఫరా ఎందుకు చేయలేదు. ఇంటి నెంబర్లు ఎందుకు ఇవ్వలేదు. రోడ్లెందుకు వేయలేదు. మురికి కాల్వలు ఎందుకు నిర్మాణం చేపట్టలేదు. పారిశుద్య పనులు ఎందుకు నిర్వహించలేదు. వారికి కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఎందుకు ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బిఆరఎస్ పార్టీ వద్ద సమాధానం లేదు. కాని రాజకీయం చేయాలన్న కుతంత్రంతో వస్తున్నారు. ప్రజల మీద ఎంతో ప్రేమ వున్నట్లు నాటకాలాడుతున్నారు. ఆనాడే డబుల్ బెడ్‌రూంలు ఎందుకివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఏడాదిలోనే తెలంగాణ మొత్తం సుమారు 5లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తున్నాం. బిఆరఎస్ పార్టీ నాయకల కళ్లకు కనిపించడం లేదా? వెలుగుమట్లలో నిజమైన బాదితులకు ప్రభుత్వం నూరు శాతం న్యాయం చేస్తుందని మంత్రి పొంగులేటి అభయమిస్తున్నారు. పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎప్ప్పుడూ రాజకీయాల కోసం వాడుకోదు. అవసరం తీరగానే మర్చిపోదు. అందుకే బాదితులకు మంచి స్ధలంలో పట్టాలిస్తాం. వారిని అన్ని విదాలా ఆదుకుంటామని మంత్రి తెలియజేస్తున్నారు. అర్హులందరికీ ప్రత్యామ్నాం చూపిస్తామన్నారు. పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీయే అని ప్రజలందరికీ తెలుసు. బిఆరఎస్ బూటకపు మాటలు జనం వినరు. వారి మాటలు మరో జన్మఎత్తినా వినరు అని మంత్రి బిఆరఎస్ నాయకులకు చురకలంటించారు. కాంగ్రెస్ ఫ్రభుత్వం చేస్తున్న అభివద్దిని చూసి ఓర్వలేకపోతోంది. అందుకే ఉడుగడుగునా అభివద్దిని అడ్డుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ రెండున్నరేళ్ల కాలంలో ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అనేక సంక్షేమ పథకాలతో సంతోషంగా వున్నారు. ప్రజలు చల్లగా వుండడం బిఆరఎస్ నాయకులకు నచ్చడం లేదు. ప్రజలు ఆనందంగా వుంటే బిఆరఎస్ నాయకులు కళ్లలో నిప్ప్పులు పోసుకుంటున్నారు. ఏదో హడావుడి చేసేందకు, గాయిగాయి చేసేందుకు ఒక్క రోజు వచ్చిన రాజకీయం చేశారు. ఇప్ప్పుడెక్కడున్నారు. మంత్రిగా వుంటూ నేను అదే ప్రజల మధ్య వున్నారు. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. వారికి ప్రత్యామ్నాయం చూపేందుకు కసరత్తు చేస్తున్నాను అని మంత్రి పొంగులేటి చెప్పారు. నిజం చెప్పాలంటే బిఆరఎస్ చేస్తున్న అసత్య ప్రచారంలో సున్నా శాతం కూడా నిజం లేదు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లు బిఆరఎస్ నాయకులు చేసే కపట వేశాలు ప్రజలకు తెలియంది కాదు. అందుకే బిఆరఎస్ నాయకులు కంటి తుడుపు చర్యల కోసం, రాజకీయ మైలేజీ కోసం వచ్చారన్న సంగతి ప్రజలకు కూడా తెలుసు. అందుకే బిఆరఎస్ నాయకులు వచ్చినా వారిని ప్రజలే పట్టించుకోలేదు. అందుకే ముఖం చెల్లక అక్కడి నుంచి జారుకొని, హైదారాబాద్ నుంచి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంతే తప్ప బిఆరఎస్ నాయకులకు పేదలంటే ఎప్ప్పుడూ ప్రేమ లేదు. వారికి పేదలకు మేలు జరగాలన్న చిత్తశుద్ది అసలే లేదని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పేద ప్రజలను బిఆరఎస్ నాయకులు వంచించింది చాలనే వారిని ఖమ్మం నుంచి ప్రజలు తరిమేశారని మంత్రి అన్నారు. ఇంకా బిఆరఎస్ నాయకులకు బుద్ది రావడంలేదన్నారు. ఎల్లకాలం రాజకీయాలే చేయాలని చూస్తే మరోసారి బిఆరఎస్‌కు గుణపాఠం తప్పదు. కాంగ్రెస్ చేతిలో మరోసారి బిఆరఎస్‌కు ఓటమి తప్పదన్నారు. ఇప్పటికైనా నిజం మాట్లాడడం బిఆరఎస్ నేతలు నేర్చుకోవాలని మంత్రి హితవు పలికారు. పదేళ్ల నుంచి పట్టాలివ్వకుండా మోసం చేసి ఇప్ప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఆ వెలుగుమట్లలో పట్టాలివ్వడం సాధ్యం కాదని బిఆరఎస్ నాయకులకు తెలుసు. పైగా లంచాలు తీసుకొని పట్టాలివ్వడం ప్రజలను మభ్యపెట్టినంత సులువు కాదని బిఆరఎస్ నాయకులకు తెలియంది కాదు. ఎంత కాలం ప్రజలను మోసం చేయాలని చూస్తారు? ప్రజలు బిఆరఎస్ నాయకులను చీ కొడుతున్నా వారికి సిగ్గు రావడం లేదని మంత్రి పొంగులేటి అన్నారు. గుడిసెలు వేసుకున్న వారి నుంచి ఎంతెంత వసూలు చేశారో ప్రజలకు తెలుసు. ఇంకా ఎందుకీ దొంగనాటకాలు అని మంత్రి నిలదీశారు. బాధితుల సానుభూతి కోసం బిఆరఎస్ నాయకులు ఎన్ని కొంగజపాలు చేసినా జనం నమ్మరని మంత్రి ఎద్దేవా చేశారు. గతంలోనే వెలుగు మట్ల ప్రజలకు నోటీసులు ఇచ్చిన బిఆరఎస్ పార్టీకి బాధితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి చురకలంటించారు. పేదలకు ఎప్ప్పుడు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ కాదని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు.