అన్నారం లో భారీ అగ్ని ప్రమాదం…

అన్నారం లో భారీ అగ్ని ప్రమాదం

అగ్నికి ఆహుతైన రెండు ఇండ్లు పూర్తిగా దగ్ధం

ఘటన స్థలాన్ని పరిశీలించిన కోటపల్లి ఎస్సై రాజశేఖర్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి తెప్పల సమ్మిరెడ్డికి చెందిన ఇల్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.వివరాల్లోకి వెళితే ప్రమాదం సంభవించిన ఇంట్లో దూరికే శారదా (భర్త పోచన్న),అంజలి (భర్త సమ్మయ్య) అనే ఇద్దరు మహిళలు అద్దెకు ఉంటున్నారు.వీరు కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు వివరాలు వెల్లడించారు.తిప్పల సమ్మిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.ప్రాథమిక విచారణ ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దహనమై ఉంటుందని ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version