ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్ల అందజేత
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఏక్ పెడ్ మాకే నామ్ సర్టిఫికెట్లను తల్లిదండ్రుల సమావేశంలో మొక్కలు నాటిన తల్లులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏక్ పేడ్ మాకేనాం (అమ్మ కోసం ఒక చెట్టు) అనే కార్యక్రమాన్ని తీసుకొని విద్యార్థులలో చెట్ల పెంపకానికి ఉన్న ప్రాధాన్యతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.మొక్క తల్లితో సమానమని విద్యార్థులు అమ్మని ఎలాగైతే ఇష్టపడతారో అలాగే మొక్కను నాటి ఇష్టపడి ఆ మొక్కను కాపాడుతూ ఉండాలని విద్యార్థులను భాగస్వామ్యం చేయడం జరిగిందని అన్నారు.చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థులు అందరూ తమ తల్లులతో మొక్కలు నాటి తమ ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినందుకు గాను మరి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను అప్రిషియేట్ చేస్తూ సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగిందనీ ఆ సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసి విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం పాఠశాలలో బతుకమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పటు చేసి బతుకమ్మలతో వచ్చి ఆడి పాడిన తల్లులకు ప్రథమ, ద్వితీయ,తృతీయ బహుమతులుగా చీరలను ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్కవత్ దేవా,కంచ రాజకుమార్,మేకల సత్యపాల్,పుల్లూరి రామకృష్ణ,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కందికట్ల రమ,అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ, నందిపాటి సంధ్య మరియు తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.