తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా శుక్రవారం రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో మంగలి నర్సమ్మ ఇంటి నిర్మాణానికి టీ పి సి సి కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదు అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ఈ అవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో , మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, చింతల స్వామి, ప్రసన్నకుమార్, వార్డు ఆఫీసర్ శంకర్ , శరత్, మంగలి సత్యం మేస్త్రి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మహాదేవపూర్ నేటిధాత్రి
దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు, ఇతర ఉపకరణాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
దివ్యాన్గులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి చేస్తుందన్నారు.
మహదేవ్ పూర్ మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించడం జరిగిందని వారిలో మొదటి విడతలో 50 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్ళు, సాధారణ ట్రై సైకిళ్ళు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్ లు వారి వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామని ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు.
అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు.
నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు.
అనంతరం మహదేవ్ పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు 90 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డా బి.ఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, కూడా చైర్మెన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి లతో కలిసి ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపిఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ నుప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి.
తహసిల్దార్ ఇమాం బాబా షేక్.
చిట్యాల నేటిధాత్రి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల తహశీల్దార్ ఇమామ్ బాబా షేకు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ స్కీ మ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి స్కీం లో మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కుటుంబంలో ఎవరైనా పెద్ద ఏదైనా కారణం చేత మరణించిన చో అతని వయసు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉండవలెను మరియు మరణ ధ్రువీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువచ్చి రెవెన్యూ కార్యాలయంలో ఇవ్వగలరు దీని ద్వారా 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందని చిట్యాల తహసిల్దారు తెలియజేశారు అవకాశాన్ని చిట్యాల మండల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
#ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో వరంగల్ విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ కి వినతి పత్రం.
హన్మకొండ నేటిధాత్రి:
అనంతరం ఏ బి ఎస్ ఎఫ్ బోట్ల నరేష్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యాశాఖ అధికారి కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న మంచినీటి సమస్య, మరుగుదొడ్ల మరమ్మతు మరియు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ అమలు చేసే విధంగా అధికారులు నిరంతరం పర్యవేక్షించి విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలతో పాటు కస్తూర్బా గురుకుల పాఠశాలలో అదనపు సెక్షన్లు ఏర్పాటు చేయాల్సిందిగా వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి కోరునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ బన్నీ తదితరులు పాల్గొన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్చార్జిగా వస్కుల ప్రవీణ్ కుమార్
హన్మకొండ, నేటిధాత్రి:
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యుక్షులు మంద ప్రభాకర్ బి.యస్.పి వరంగల్ ఇంచార్జ్ గా వస్కుల ప్రవీణ్ కూమార్ ని నియమించారు ఈ సందర్భంగా వస్కుల ప్రవీణ్ కూమార్ మాట్లడుతూ బహుజన ఉద్యమాన్ని మరింత నిబ్బద్దతో నిర్వహిస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రామంలో రాష్ట్ర నాయకులు ఉపేంద్ర సహు,శనిగరపు రాజు ,జిల్లా నాయకులు ,తదితర బహుజన నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై సీఎం తో చర్చిస్తాం ప్రొ.కోదండరాం
మంచిర్యాల నేటి ధాత్రి:
తెలంగాణ ఉద్యమకారుడు,ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మంచిర్యాల జిల్లా రెవిన్యూ డివిజనల్ ఆఫీసుకు విచ్చేసిన సందర్భంగా వారికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జి.శ్రీనివాసరావు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి శుక్రవారం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగినది.ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తో ఉద్యోగ,ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.ప్రస్తుత స్థితిగతులను,పరిస్థితులను వివరంగా ప్రొఫెసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.వారు సానుకూలంగా స్పందిస్తూ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ,ఆర్డిఓ ఆఫీస్ పరిపాలన అధికారి బి.రామచందర్ రావు,కార్యాలయ సిబ్బంది పద్మశ్రీ,అరుణ,లక్ష్మి ,రవి కిషోర్,జనార్ధన్,సతీష్,మహేందర్,సదయ్య,స్వప్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లోటిజి సెట్ పాలిటెక్నిక్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ లో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మరియు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ స్టేట్ 9వ ర్యాంక్ సాధించి జేఎన్టీయూ హైదరాబాదులో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు సంపాదించిన మా పాఠశాల పూర్వ విద్యార్థి గోల్కొండ నిఖిల్ కౌశిక్ ను పాఠశాల అధ్యాపక బృందం శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ చిన్నప్పటినుండి నిఖిల్ కౌశిక్ చదువులో చురుకుగా ఉండేవాడు కష్టపడి చదవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులకు పాఠశాలకు మా మండలానికి పేరు తీసుకొచ్చి హైదరాబాదులోని జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ లో సీటు పొందినందుకు సంతోషిస్తూ ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది ఇంకా మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు దేశ విదేశాలలో సాఫ్ట్వేర్లుగా ప్రభుత్వ ఉద్యోగులుగా సేవ చేస్తూ సమాజానికి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తెస్తున్నందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉన్నదని తెలియజేశారు ఈ విధంగా విద్యార్థులు కష్టపడి చదివి నిఖిల్ కౌశిక్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ సమావేశంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వర్షాకాల వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్యాధికారి సమీక్ష
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు మరియు మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్(MLHP) లకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమీక్ష సమావేశంలో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధుల నివారణ కార్యక్రమంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా జ్వరాల పై దోమలు పుట్టకుండా కు ట్ట కుండ పరిసరాల పరిశుభ్రత పై మరియు కేంద్ర ఆరోగ్య పథకాల లో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆరోగ్య శిబిరం ప్రగతి నివేదిక, డయేరియా నివారణ కార్యక్రమం రోజువారి నివేదిక, మాతా శిశు సంరక్షణ కార్యక్రమం సాధారణ ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమీక్షించినారు.
Medical Officer Review.
ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ నహీం మరియు ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లు పాల్గొన్నారు.
ఓల్డ్ బొంబాయి రోడ్డు విస్తరణ స్థానిక వ్యాపారుల ఆందోళన
శేరిలింగంపల్లి నేటి ధాత్రి:
చందానగర్‌లోని ఓల్డ్ బొంబాయి రోడ్డు విస్తరణతో స్థానికంగా ద్విచక్ర వాహనల వ్యాపారస్తులకు ఆ రోడ్డు లో ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ఆధారపడి జివనం సాగిస్తున్న కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..చందానగర్ ఆటో కన్సల్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్, ఐటీ పరిశ్రమల శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి కలిసి వినతి పత్రం అందజేశారు..దశాబ్దాలుగా ఓల్డ్ బొంబాయి రోడ్డులోని 200 మీటర్ల వెడల్పున ద్విచక్ర వాహనాల మార్కెట్ నడుస్తుంది..పాత వాహనాలను కోనుగోలు చేయడానికి సంగారెడ్డి శంకర్ పల్లి సదాశివపేట వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి ద్విచక్ర వాహనాలు కోనుగోలు చేస్తారని తేలిపారు..చందానగర్ నుంచి అమిన పుర్ వరకు రోడ్డు విస్తరణ వల్ల ద్విచక్ర వాహనాల మార్కెట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న దాదాపు 500 లకు పైగా కుటుంబాల ఉపాధి దేబ్బతిటుందని అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు…ఈ మార్కెట్ స్థానిక వాణిజ్యానికి కేంద్రమని, ఇక్కడ చిన్న వ్యాపారులు, దుకాణ యజమానులు, ఉద్యోగులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఈ రోడ్డు విస్తరణలో ఇక్కడ ఉన్న ద్విచక్ర వాహనాల మార్కెట్ ను తరలించేలా చేస్తుందని, ఇది వారి వ్యాపారానికి,ప్రధాన ఆదాయ వనరుకు తీవ్ర ఆటంకం కలిగిస్తుందని వారు తెలిపారు..”సుమారు 500 కుటుంబాలు రోజూ ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రతిపాదిత రోడ్డు విస్తరణ వారి పనిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. వారిలో చాలా మందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు,” అని అసోసియేషన్ తెలిపింది. ప్రాజెక్టులు నగర అభివృద్ధికి ముఖ్యమైనవని తాము గుర్తించినప్పటికీ,సామాజిక, ఆర్థిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆటో కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.. ప్రభుత్వం ద్విచక్ర వాహనాల కుటుంబాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని రోడ్డు విస్తరణ ఓల్డ్ బొంబాయి రోడ్డు కాకుండా ప్రత్యమ్నాయా మార్గం చుడాలని అభ్యర్థించారు..గతంలో చందానగర్ నగర్ జాతియ రహదారి నాల నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ఆలోచన చేసిందని అదే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేపడితే తమకు ఎటువంటి సమస్యలు ఉండవని అభిప్రాయం వ్యక్తం చేశారు..ఈ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్న ప్రజల జీవనోపాధిని పునఃపరిశీలించి, పరిష్కారం కనుగొనాలని వారు ప్రభుత్వాన్ని కోరారు..ఈ కీలకమైన అంశంపై దృష్టి సారించి న్యాయం చేయడానికి ప్రభుత్వం వ్యవహరించాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది..
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, మొయిజ్,షేక్ జలీల్,సయ్యద్ జావీద్, షేక్ ఖలీల్, సంగ మహేష్, సయ్యద్ మజీద్, షేక్ మొహమ్మద్, మహమ్మద్ సిరాజ్, అన్వర్. తదితరులు పాల్గొన్నారు..
స్త్రీకి పురుషునితోపాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి…
వరకట్న పిశాచానికి బలైపోతున్న మహిళలను కాపాడాలి…
మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:
వరకట్నం సమాజానికి ఒక చెడు అలవాటు. వరకట్నాన్ని పూర్తిగా నిషేధించాలి. వరకట్నం కారణంగా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
వరకట్నం అనేది మహిళల గౌరవానికి భంగం కలిగిస్తుంది.వరకట్నం ఇవ్వడం,తీసుకోవడం నేరం అని చట్టాలు చెబుతున్నప్పటికీ అది ఇంకా కొనసాగుతుంది.వరకట్నం అనే దురాచారాన్ని రూపుమాపడానికి ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.
దేశవ్యాప్తంగా వరకట్న నిషేధిత చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలి, మరియు చట్టాలను ఉల్లంఘించిన వారికి తగిన శిక్ష విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరకట్నం వలన కలిగే నష్టాల గురించి ప్రజలకు గ్రామస్థాయిలలో అవగాహన కల్పించాలి.
వరకట్నం ఒక సామాజిక రుగ్మత, కాబట్టి దీన్ని రూపుమాపడానికి సామాజిక మార్పు అవసరం. వరకట్నానికి వ్యతిరేకంగా పోరాడటం అంటే మహిళల హక్కుల కోసం పోరాడటం.
ఇది సమాజంలో మార్పును తీసుకురావడానికి మరియు మహిళలకు మరింత సురక్షితమైన,గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి ఒక ముఖ్యమైన అడుగు.
వరకట్నం అనేది పెళ్లికూతురు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు తల్లిదండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సాంప్రదాయం.యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడసాగాడు.
ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం,భార్యను హింసించడం,భార్యలు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. స్త్రీ సాధికారత అభివృద్ధి పథంలో పయనిస్తున్న వరకట్న ఆచారం ఇంకా ఉంటూనే ఉంది.
వరకట్న వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గృహహింస, వరకట్న వేధింపులను సాక్షాలతో నిరూపించగలిగితేనే భర్తకు, అత్తమామలకు, ఆడపడుచులకు శిక్ష పడుతుంది.
అయితే దీన్ని అణువుగా చేసుకొని చాలామంది భర్తలు వారి భార్యలను మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తూ పరోక్షంగా వారి పుట్టింటి నుంచి ధనాన్ని రాబట్టుకోవడం చేస్తున్నారు.
భారతదేశంలోని ఉత్తర మరియు తూర్పు రాష్ట్రాల్లో వరకట్న సంబంధిత హింస రేట్లు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో మహిళలపై జరుగుతున్న హింసకు వరకట్నం ప్రధాన కారణమని భావిస్తారు.
వరకట్నం అనేది కాలక్రమేణా పిశాచిగా మారింది. చాలా సందర్భాలలో వివాహ సమయంలో వరుడి తరపు వారు లాంచనాలను తీర్చడానికి వధువు తరపు వారు తహతకు మించి చేసే ప్రయత్నంలో కుటుంబం ఆర్థికంగా చితికి పోతుంది.
దేశంలో వరకట్నం, వరకట్న సంబంధిత నేరాల కట్టడికి కఠిన చట్టాలను తీసుకువచ్చిన ఆ దురాచారాల వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం జరుగుతున్న దేశవ్యాప్తంగా అబలల అక్రందనలు మాత్రం ఆగడం లేదు.
ఆ తరహా హత్యలు నిరంతరం పెరుగుతుండటమే దానికి నిదర్శనం. వరకట్న పిశాచానికి బలైపోతున్న మహిళలను కాపాడాలి. మహిళలపై అత్యాచారాలు, లైంగిక హింస, హత్యలు, ఘోరాలు అరికట్టాలి.
యంత్ర నార్యంన్తు పూజ్యంతే తంత్ర దేవత అని ఆడవారిని గౌరవించాలని పుణ్యభూమిగా చెప్పుకుంటున్న భరత గడ్డపై వరకట్న బాధితురాళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేయని వారు లేరు.
ఆ గర్భ శ్రీమంతుల నుంచి పేద,మధ్యతరగతి వరకు ఏ ఒక్కరిని వదలని సమస్యయే వరకట్నం. ప్రస్తుతం దేశంలో జనాభా పెరుగుదల శాతానికి దాదాపు సమాన స్థాయిలో వరకట్న వేధింపు కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
వరకట్న నిషేధిత చట్టం దుర్వినియోగానికి పాల్పడుతుంది. వరకట్నం నిషేధించాలంటే సమాజంలో స్త్రీకి పురుషునితో పాటు సమానంగా ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు కల్పించాలి. వరకట్న నిషేధిత చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలి.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న యువత వరకట్న విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోతుంది.
యువత ఇప్పటికైనా మేల్కొని హోదా,ప్రతిష్ట ఇవన్నీ వదిలేస్తే వరకట్న దురాచారాన్ని పూర్తిగా అరికట్టవచ్చు. వరకట్నం దురాచారాన్ని కలిసికట్టుగా అంతమందించాలి.ఇందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
మందమర్రి 24 వ వార్డులో బోర్వెల్ను ప్రారంభించిన యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్. మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో ఈరోజు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానంద యాదవ్ నూతన బోర్వెల్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామికి పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణకు పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా బండి సదానంద్ యాదవ్ మాట్లాడుతూ 24వ వార్డు ప్రజలకు త్రాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూసి ఎమ్మెల్యే గనుల మంత్రి వివేక్ వెంకట స్వామికి చెప్పగా వెంటనే మందమర్రి మున్సిపల్ కమిషనర్ కు ఇంజనీర్ కు ఫోన్ చేసి బోర్వెల్ వేయించమని ఆదేశించగా.
Borewell.
ఈ వార్డులో బోర్వెల్ వేయడం ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. మందమర్రి పట్టణ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురైనా నేనున్నానంటూ అండగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకట స్వామికి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని గణపురం ఎంపీడీవో ఎల్ ,భాస్కర్, అనసూయ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి, పూజలు నిర్వహించారు. కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు నాగరాజు వారిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్,
నర్సంపేట నేటిధాత్రి:
కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు ,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు.శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు. సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.
గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ పోలీసులు బస్టాండ్ ఆవరణలో నిందితుడిని అదుపులోకి తీసుకొవడం జరిగింది. గూడూరు మండలం ఇప్పల తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అనే వ్యక్తి అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ తన ఊర్లో అమ్ముతుండేవాడు అదే క్రమంలో ఈరోజు మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యం వహించిన ఏఎస్ఐ రఘునారెడ్డి కానిస్టేబుల్ కరుణాకర్ ని సిఐ అభినందించారు.
న్యాల్కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ గ్రామ శివారులో అక్రమంగా ఎర్రరాయి తవ్వకాల దందా జోరుగా కొనసాగుతుంది. ఎర్రరాయి తవ్వకాల ను కట్టడి చేసేందుకు అధికారులు పలుమార్లు దాడులు చేసి అకక్రమార్కు లకు జరిమానాలు విధించినా గనుల్లో తవ్వకాలు మాత్రం ఆగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. పట్టుబడి నప్పుడు అక్రమార్కు లు జరిమానాలు కడుతూ మళ్లీ యధావిధిగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అక్రమంగా ఎర్రరాయిని తరలించే మాఫియా తమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. నిమ్స్ అసైన్మెంట్ భూముల్లో సైతం ఎర్రరాయి తవ్వకాలు తమ ఇష్టారాజ్యంగ జరుగుతున్నా. రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం గనుల్లో ఎర్రరాయిని తీసి ట్రాక్టర్లలో వందల సంఖ్యలో రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారే ఆరోపణలు కూడా ఉన్నాయి. గణేష్ పూర్ ఎర్రరాయిని అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా ఇక్కడి నుంచి దూరప్రాంతాలైన అందోల్, నారాయణ ఖేడ్, వట్టిపల్లి మండ లాలకు లారీల్లో అధిక లోడ్లతో తరలిస్తున్నా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున లారీల్లో ఎర్రరాయిని దూర ప్రాంతాలకు తరలిస్తుండడంతో రోడ్లు సైతం దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ అధికారులు చుట్టపు చూపుగా వచ్చి నామ మాత్రంగా దాడులు చేసి అసలైన నిందితులను వదిలేస్తూ తూతూ మంత్రంగా తనిఖీలు జరిపి నామ మాత్రానికి జరిమానాలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఎర్రరాయి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్టవేయ గలుగుతారా? లేదా యధావిధంగా కొనసాగుతుందా అనేది వేచి చూడాల్సిందే.
నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో గల బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్సిసి పదవ బెటాలియన్ సూచనల మేరకు ఎంఎస్ఎం ఈ డే 2025 ఉద్యమి భారత్ కార్యక్రమం పాఠశాల ఎన్సిసి థర్డ్ ఆఫీసర్ ఎం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ పాత్ర ఎంతో ప్రాముఖ్యమని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, ప్రభుత్వాలు సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి ద్రవ్యల్బణం తగ్గి ఆర్థికంగా ఎదుగుతారని దీంతో ఆత్మనిర్భర్ భారత లక్ష్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ రంగాన్ని మరింత బలంగా పోటీ తత్వంతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా దృష్టి సారించాలని కోరారు. ప్రతి విద్యార్థి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియాలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, రవీందర్ రెడ్డి ,రామ్మూర్తి ,రాజేష్ ,లక్ష్మణ్ మరియు ఎన్.సి.సి క్యాడెట్లు పాల్గొన్నారు.
పాన్ కార్డుకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా.. ఈ కీలక విషయం తెలుసుకోండి..
ప్రతి ఒక్కరికి పాన్ కార్డు తప్పకుండా ఉంటుంది. అయితే, పాన్ కార్డు గడువు ఎన్నేళ్లు? పాన్ కార్డు ఒక్కసారి తీసుకుంటే జీవితాంతం చెల్లుబాటు అవుతుందా? ఈ విషయంపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చెప్తోందో తెలుసుకుందాం..
PAN Card: పాన్ కార్డు (Permanent Account Number – PAN Card) అనేది ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేయబడిన 10-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది భారతదేశంలోని పన్ను చెల్లింపుదారులందరికీ కేటాయిస్తారు. ఇది ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వ్యక్తి లేదా సంస్థను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది బ్యాంకు ఖాతాలు తెరవడం, ఆస్తులు కొనుగోలు చేయడం వంటి అనేక ఆర్థిక కార్యకలాపాలకు అవసరం.
పాన్ కార్డు పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది ఆదాయపు పన్ను శాఖ ద్వారా జారీ చేయబడిన అధికారిక గుర్తింపు పత్రం. ఒక వ్యక్తి లేదా సంస్థకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. పాన్ కార్డు రుణాల కోసం దరఖాస్తు చేయడానికి, క్రెడిట్ కార్డులను పొందడానికి కూడా పాన్ కార్టు అవసరం ఉంటుంది.
పాన్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. పాన్ కార్డు జారీ చేసిన తర్వాత దానిని జీవితాంతం ఉపయోగించవచ్చు. కొత్త కార్డు తీసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ పాన్ కార్డు పోయినట్లయితే దాన్ని తిరిగి పొందడానికి మీరు డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, పాన్ నంబర్ అస్సలు మారదు.
ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డు మాత్రమే ఉండాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టవిరుద్ధం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే 10,000 రూపాయల జరిమానా ఉంటుంది. మీ దగ్గర ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే, వాటిని రద్దు చేయడానికి మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని NSDL సెంటర్‌లో సరెండర్ చేసేయాలి.
కంది విజయలక్ష్మి పార్థివ దేహం వద్ద నివాళులర్పించిన మంత్రి సీతక్క
ములుగు జిల్లా నేటిధాత్రి:
ఈ రోజు ములుగు మండలం జగ్గన్న పేట గ్రామానికి చెందిన డిప్యూటీ తహసీల్దార్ కంది మహేశ్వర్ రెడ్డి తల్లి కంది విజయ లక్ష్మి నిన్న రాత్రి అకాల మరణం చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి విజయ లక్ష్మి పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అదే విధంగా ఇదే గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన మంత్రి సీతక్క ఈ కార్యక్రమములో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పని చేస్తున్న హోం గార్డ్స్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డిజిపి కార్యాలయం నుండి వచ్చిన ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారికి అందజేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని,పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని,ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితులలో కూడా వివిధ బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు.
welfare
హోమ్ గార్డ్స్ అధికారులు,సిబ్బంది ఎవరికైన సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించవచ్చని,రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో ఉలెన్ జాకెట్స్ & రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని,క్రమశిక్షణ కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తూ నిబంధనలు ఉల్లగింస్తే భవిష్యత్తులో శాఖ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్, హోమ్ హార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే,మేయర్
#ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…
#31 డివిజన్ లో పర్యటించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ, నేటిధాత్రి :
పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా నేడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు,నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు,గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ గార్లతో కలిసి 31 వ డివిజన్ హంటర్ రోడ్డులో వాసవి కాలనీ మరియు గాయత్రి కాలనీ లలో రూ.88.73 లక్షలతో నూతన అంతర్గత రోడ్లు నిర్మాణ పనులకు. శంకుస్థాపన చేశారు.తొలుత ఎస్సీ కాలనీలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల చేతుల్లో అభివృద్ధికి నోచుకోని అన్ని ప్రాంతాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.గతంలో కూడా ఎన్నికల ముందు,ఎన్నికల తరువాత పర్యటించిన క్రమంలో నా దృష్టికి వచ్చిన అంతర్గత రోడ్లు,సైడ్ డ్రైనేజీ,విద్యుత్తు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అధికార యంత్రాంగం కలిసికట్టుగా ముందుకు వెళ్తుందని అన్నారు.ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు సకాలంలో పనులను ప్రారంభించుకోవాలని సూచించారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అట్టడుగు వర్గాలకు అండగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్,డివిజన్ అధ్యక్షుడు సురేందర్,నాయకులు సత్తు రమేష్,కృష్ణ,తాళ్లపల్లి రాజు,బింగి రమేష్ యాదవ్,మామిండ్ల సురేష్ మరియు మునిసిపల్ అధికారులు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.