గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో జూన్ ఒకటవ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు వేణుగోపాల చార్యుల తో బోనాల రాజమౌళి దంపతులు హనుమాన్ విగ్రహానికి చందనంతో జిల్లేడు మాలతో తమలపాకుల పండ్లు తో కలిపి పూజ కార్యక్రమం జరిపిన తర్వాత గుడి ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమాన్ని అన్నదాత బోనాల రాజమౌళి ఉమారాణి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ మహా అన్నదాన కార్యక్రమానికి హనుమాన్ స్వాములు గ్రామం లోని ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు
ములుగు జిల్లాలో మాత శిశు మరణాలు జరగకుండా చూడాలని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లం అప్పయ్య అన్నారు ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించారు ఆసుపత్రిలో ప్రతి మంగళ గురు వారాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమo వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న సేవలు రోగుల ద్వారా ఆరా తీశారు. అనంతరం వైద్యులు సూపర్వైజర్లు సిబ్బందితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు కొత్తగా జనవరి 2024 నుండి నూతనంగా నిర్వహిస్తున్న బాలింతల ఆరోగ్య సంరక్షణ మరియు శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా మాతా శిశు మరణాలు రేటును తగ్గించాలని కమిషనర్ ఆదేశించినట్లు తెలిపారు ప్రసవం అనంతరం తల్లి బిడ్డలను 45 రోజులు కనీసం 6 నుంచి 7 సార్లు సందర్శించి, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని ఉన్నతాధికారులకు తెలియజేస్తూ స్టేట్ పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక బాలింత మరణం సంభవించిందని రాబోయే రోజుల్లో ఇలాంటి మరణాలు జరగకుండా వైద్యులు సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన చేయాలని సూచించారు. మండల కేంద్ర ంలోని ఇద్దరు బాలింతల ఇంటికి వెళ్లి వారి యొక్క తల్లి బిడ్డల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు సూచనలు చేసి మందులను అందజేశారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాతా శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ చీర్ల శ్రీకాంత్, స్థానిక వైద్యాధికారులు డాక్టర్ రిషిత, డాక్టర్ భవ్య, హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కర్, పిహెచ్ఎన్ఓ శోభ, ఏఎన్ఎంలు స్వప్న, కనకలక్ష్మి, ఆశా కార్యకర్తలు సరోజన, మాధవి, సౌజన్య, శోభ, కవిత, సంపూర్ణ ,ఇందిర తదితరులు పాల్గొన్నారు.
జాన్ 2న జేరి గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఘన oగా నిర్వహిం చే o దు కు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.నగేష్ అధికారులను కోరారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం అదనపు కలెక్టర్ యం. నగేష్ తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో ఆవిర్భావ దినోత్సవ వేడుకల సన్నద్ధత పై సమీక్ష నిర్వహించారు.అధికారులకు అప్పగించిన బాధ్యతలు నిబద్ధతతో పూర్తి చేయాలని ఏర్పాట్లలో పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు.
జమ్మికుంట (టౌన్) నేటి ధాత్రి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మహమ్మద్ అంకూస్*
ప్రజల్లో ఉనికిని కోల్పోతున్న ప్రతిసారి కెసిఆర్ ప్రజలను రెచ్చగొట్టి, చిచ్చు పెట్టి దుమారం రేపడం అలవాటు, ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎటువంటి పిలుపునిచ్చిన తెలంగాణ ప్రజలు నమ్మిళ్లు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన తర్వాత కెసిఆర్ వైఖరి తేటతెల్లమైపోయింది. రాష్ట్రాన్ని విపరీతమైనటువంటి ధోరణిలో వివిధ రూపాల్లో దోచుకొని రాష్ట్ర ప్రజల బాగోగులు పట్టించుకోకుండా దొరల పాలన కుటుంబ పాలన కొనసాగించి లక్షల కోట్ల దోచుకొని మళ్లీ నేడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను కవులను కళాకారులను మేధావులను పట్టించుకోని కేసీఆర్ ఇవాళ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ విషయంలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టడం అనేది తన వైఖరికి నిదర్శనం. తాను అధికారంలో ఉన్నప్పుడు తన కూతురు కవిత బతుకమ్మ పాటకు రహమాన్ తో సంగీతం సమకూర్చితే ఏమీ లేదు, ఆంధ్రవాళ్ళైనా మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పజెప్పితే ఏమీ లేదు, చిన్న జీయర్ ట్రస్టుకు విరాళంగా 12కోట్ల భూమి ని ఇవ్వటం, విశాఖ శారదా పీఠం కి 2కోట్ల భూమి విరాళం ఇస్తే ఏమీ లేదు, ఆనంద్ సాయి తో యాదాద్రి టెంపుల్ కి డిజైన్ చేయింస్తే ఏమిలేదు, హీరోయిన్ సమంత ని బ్రాండ్ అంబాసిడర్ గా పెడితే తప్పు లేదు,జై తెలంగాణ అనని నాయకులను తన క్యాబినెట్ లో చేర్చుకొని మంత్రి పదవులు ఇస్తే ఏమీ లేదు, రాష్ట్రం వచ్చేంతవరకే ఆంధ్ర,తెలంగాణ వచ్చింది కాబట్టి మనమంతా ఒక్కటే, తెలుగు వారమంతా ఒకటే అని శుద్ధపూస ముచ్చట్లు చెప్పిన కేసీఆర్ “తాను చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం”అన్నట్టుగా నేడు జయ జయహే తెలంగాణ పాటకు సంబంధించి కీరవాణిని సంగీత దర్శకునిగా పెట్టుకుంటే ఆంధ్ర వాడిని సంగీత దర్శకుడుగా పెట్టుకుంటారా…? అనేటువంటి విషయాన్ని ప్రజల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మరి విజ్ఞులమైనటువంటి మనము ఆలోచించాలి కదా పది సంవత్సరాల్లో తెలంగాణలో ఉన్నటువంటి కవులను, కళాకారులను పట్టించుకోలేదు, రాష్ట్ర గీతాన్ని పట్టించుకోలేదు ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ప్రజలను రెచ్చగొడుతుంటే తెలంగాణ ప్రజలం గొర్రెలము కాదు పిచ్చోళ్ళం కాదు కాబట్టి విజ్నులమైనటువంటి ప్రజలు గుర్తించి సెంటిమెంటు రాజకీయాలు చేసి బ్రతకాలనుకునే వారికి బుద్ధి చెప్పి విజ్ఞులుగా ఆలోచిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని గమనించాలి. కెసిఆర్ ఫ్యామిలీకి కావాల్సింది రాజకీయం ప్రజలను రెచ్చగొట్టడం.మనకు కావలసింది రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రజల పాలన, కెసిఆర్ పాలన రాచరికం, కుటుంబ పాలన మనం చూసాం ఇంకా వారి సెంటిమెంట్ ముచ్చట్లు నమ్మి మనం సపోర్ట్ చేస్తే “నమ్మి నానపెడితే పుచ్చి బుర్రలైనట్లు”గా ఉంటది మన పరిస్థితి కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా తెలంగాణను సర్వనాశనం చేసి లక్షల కోట్లు దోచుకున్న వారు చెబితే మనం వినే పరిస్థితుల్లో లేము అనేటువంటి విషయాన్ని గ్రహించాలని వేడుకుంటున్నాం.
గురువారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలసి మహముత్తారం మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి పాఠశాలల్లో జరుగుతున్నమరమ్మతు పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిధిలా వస్థలో ఉన్న ప్రభుత్వ బడులు ఆధునికతను సంతరించుకొని విద్యార్థులకు ఆహ్లాదకరంగా తయారు చేయడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అనుకూలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ముందుగా మహముత్తారం మండలం కోనంపేట గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 3.94 లక్షల రూపాయలతో చేపట్టిన మరమ్మతులను, కొత్త ముత్తారం గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో 3. 84 లక్షలతో చేపట్టిన పనులు, మహముత్తారం గ్రామంలోని కెజిబివి పాఠశాలలో 6.30 లక్షలతో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేపట్టిన గ్రామ సమాఖ్యలతో మాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనులను జూన్ 5 వ తేదీ వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. ముందస్తుగా 25 శాతం నిధులు మంజూరు చేశామని, చేపట్టిన పనులకు నిధులు సరిపోకుంటే ప్రతిపాదనలు పంపాలని, అదనపు నిధులు మంజూరు చేస్తామని అన్నారు. పాఠశాలలు పున: ప్రారంభానికి ముందు పూర్తిస్థాయిలో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వివో లను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పనుల్లో వేగం పెంచి నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పనులు పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. మహముత్తారం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్న డాక్టర్ క్వాటర్స్ ను సందర్శించి ఆగస్టు 15 లోపు భవన నిర్మాణం పూర్తి అవ్వాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం మహముత్తారం లో గల రైతు వేదికలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతి మరియు పనులు పూర్తి చేసే గడువును మండలంలోని ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు, కాంట్రాక్టు పనులు చేపట్టిన వివో లతో సమీక్ష నిర్వహించి పెండింగులో ఉన్న పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి వారం రోజుల ముందే పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. మహముత్తారం మండలంలో మొత్తం 30 పాఠశాలలకు గాను 1.60 లక్షల డెబ్భై వేలు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు రైతు వేదిక ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా కుట్టించిన స్కూలు యూనిఫామ్స్ ధరించిన చిన్నారులు జిల్లా కలెక్టర్ కు పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టిన మహిళలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ నరేష్, సెక్టోరియల్ అధికారి కిషన్ రావు, తహసిల్దార్ శ్రీనివాస్, ఎం పి డి ఓ శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ డి ఈ శేషగిరిరావు, ఏ ఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలల పై చర్యలు తీసుకోవాలి
ప్రైవేటు విద్యాసంస్థలను తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలాచుడాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి లద్దునూరి విష్ణు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఉన్న ప్రైవేటు విద్యాసంస్థలను ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి ప్రభుత్వ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పర్మిషన్ లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను గుర్తించి సీజ్ చేయాలని అలాగే ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి (ఏఐఎస్ఎఫ్) పక్షాన డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టే విధంగా ఫ్రీజర్ నియంతను చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగా బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగేల కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు,యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటిలు, ల్యాప్ టాప్స్, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని, ఫీజుల పేరిట ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టాలని , ప్రభుత్వం విద్యాశాఖ ఫీజులు నియంత్రణకి కఠిన చట్టాలు అమలు చేసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని లద్దునూరి విష్ణు డిమాండ్ చేశారు.
* ప్రభుత్వ రాజముద్రలో చార్మినార్ మరియు ఓరుగల్లు చిన్హన్ని మార్పు చేయటం సిగ్గుమాలిన పని అని అన్నారు ** *వాహన రిజిస్ట్రేషన్ లో టీఎస్ కు బదులు టీజీగా మార్పు చేయడం తప్ప ఒరగబెట్టింది ఏమీ లేదని అన్నారు* రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు* *జమ్మికుంట పట్టణంలోని జెడ్పిటిసి కార్యాలయంలో పత్రిక సమావేశంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ప్రజా వ్యతిరేక కొనసాగుతుందని, ఈ సందర్భంగా జమ్మికుంట జడ్పిటిసి,డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా కాంగ్రెస్ పాలన ప్రజలకు ఎంతగానో మేలు చేసిందని భావించిన తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పాలన మొండి చేయి చూసిందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రూపొందించిన. ఏఒక్క అంశం కార్యచరణ దాల్చలేదని వారు గుర్తు చేశారు. కేవలం మహిళలకు ఉచిత బాసు ప్రయాణం తప్ప, మరి ఏదీ కూడా కార్యచరణ దాల్చలేదని వారు గుర్తు చేశారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం రోడ్డు రవాణాకు వాహనాలల సంబంధించిన టీఎస్ నుండి టీజీ మార్చడం తప్ప వారు చేసింది ఏది లేదని దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వారి సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెలంగాణ అధికారం ముద్ర ఏర్పాటు చేసిన పది సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు కూడా దానిపైన అభ్యంతరం చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రాజముద్రలో మార్పులు చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని వారు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాలయాపన చేయడానికి ఇవి ఒక కారణాలుగా చూయించి సమయాన్ని వృధా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని వారు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికల కోడ్ అనంతరం ప్రజా సమస్యల పైన నిరంతరం పాలన చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం వానకాల సీజన్ రాబోతున్న సందర్భంలో విత్తనాలు,ఎరువుల కొరత రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన కూడా తెలంగాణ ద్రోహులు చెప్పిన విధంగానే పనిచేస్తుందని వారి సందర్భంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలన పిచ్చి తుగ్లపాలన తలపిస్తుందని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని వారు గుర్తు చేశారు.
ఈరోజు భద్రాచలం కునవరం రోడ్ నందు కరకట్ట నిర్మణ పనులు జరుగుతుండగా పంట పొలాలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతుండగా వారికి నష్ట పరిహారం చెల్లించాలని కోరగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హైదరాబాద్ లో ఉన్నారు. వారి సమస్యలను స్థానిక నాయకులు రత్నం రమాకాంత్ ఫోన్ ద్వారా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సంఘటన స్థలానికి పర్యవేక్షరించమని తెలియజేశారు. అధికారులు ఫోన్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు కి రైతుల సమస్యలను వివరించగా స్థానిక శాసనసభ్యులు రెండు రోజుల్లో భద్రాచలం చేరుకొని సంఘటనా స్థలానికి వచ్చి వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. దీనితో రైతులు వారి పనులు ప్రారంభించుకోమని కరకట్ట నిర్మాణ కాంట్రాక్టర్ వారికి తెలియజేశారు. వెంటనే స్పందించిన తెల్లం వెంకట్రావు కి సంబంధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రత్నం రమాకాంత్, చిట్టిబాబు, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు…
వనపర్తి నేటిదాత్రి – వనపర్తి పట్టణంలో 15వ వార్డు లో పెండింగ్ లో ఉన్న రోడ్ల విస్తరణ పనులు ప్రారంభించినందుకు 15వ వార్డు ప్రజల తరఫున అధికారులకు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డికి నేటి ధాత్రి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు వర్షం వస్తే ఒక సైడు బీటీ రోడ్డు వెయ్యనందుకు ప్రమాదకరంగా ఉండడంతో 15 అవార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ నేటి ధాత్రి దినపత్రిక దృష్టికి తీసుకపోవడంతో అధికారులు ఎమ్మెల్యే స్పందించి విస్తరణ పనులు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు బండారు మాట్లాడుతూ జెర్రిపోతుల మైసమ్మ నుండి రామా టాకీస్ కొరకు 45 కోట్లతో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి నిధులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేయంచారని అట్టి నిధులతో రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయని అన్నారు . ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర డివైడర్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు రామా టాకీస్ ఎదురుగా శ్రీ సాయి ఎలక్ట్రికల్ నుండి ఓల్డ్ యూకో బ్యాంకు క్రాసింగ్ వరక
కొంత భాగం డాం బర్ రోడ్డు వేయకుండా వదిలి వేశారని ఇట్టి రోడ్డును పూర్తిచేయాలని బండారు అధికారులను ఎమ్మెల్యేను కోరారు గురువారం నాడు రోడ్ల విస్తరణ పనులను మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పరిశీలించార ఈ కార్యక్రమంలో న్యాయవాది అయిత కృష్ణ మోహన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చీర్ల శ్రీనివాసులు ఠాగూర్ పాపిశెట్టి శ్రీనివాసులు బండారు రాజు వార్డు ప్రజలు ఉన్నారు
జమ్మికుంట (టౌన్) నేటిదాత్రి *కార్యకర్తల మధ్య కేక్ కట్ చేయడం జరిగింది ఈరోజు జమ్మికుంట పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొలుగూరి సదయ్య గారి ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో శివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని మరియు వారికి ఆయురారోగ్యాలు దేవుడు ఇవ్వాలని శివాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు, దేశిని కోటేశ్వర్, రాచపల్లి రమేష్, మొలుగూరి పద్మావతి, కౌన్సిలర్ వీరన్న గౌడ్ దొగ్గల భాస్కర్ ,తిరుపతి శ్రీనివాసు గుల్లి జపాన్, మొలుగూరి సతీష్ చాంద్ పాషా, పోతిరెడ్డి మల్లయ్య, మాధవరావు, శ్రీనివాసు, రాచపల్లి శ్రీనివాస్ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బలగం సినిమా దర్శకుడు వెల్దండ వేణు గ్రామంలోని గరిపెల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మొదటి సినిమా బలగం క్లాప్ ఇదే ఆలయం వద్ద మొదలు పెట్టాననిగుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలందరూ నాకు ఎంతో సహకరించారనిఅందరి గ్రామస్తులతోముచ్చటిస్తూ తన తీపి గుర్తులు గుర్తు చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఉడుతల తిరుపతి బొడ్డు శ్రీధర్ రాజు పృద్వి పరశురాం తదితరులు పాల్గొన్నారు
తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటుచేసిన పార్టీ లైజర్ సీడ్స్ దుకాణం ప్రారంభించిన ఎంపీపీ పడగల మానస రాజు. తంగళ్ళపల్లి మండలం అంక్సాపూర్ గ్రామానికి చెందిన సమనపల్లి వెంకటేష్ అనే యువకుడు నూతన దుకాణాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలు మందులు అందించాలని రైతులు చల్లగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి గంటలకు సంబంధించి ఎరువులు గాని మందులు గాని అందుబాటులో ఉంచుతూ వారి శ్రేష్కు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో ఏఎంసి మాజీ డైరెక్టర్ కుర్మా రాజయ్య సవన పెళ్లి బాలయ్య భాస్కర్ రెడ్డి పాక్స్ సీఈవో నరేష్ స్థానిక నేతలు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కోసుర్ పల్లి చిట్యాల ఫోర్త్ కేంద్రాలను గురువారం రోజున అంగన్వాడి సూపర్వైజర్ జయప్రద సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భవతుల బాలింతల గృహ సందర్శనలు చేసి తల్లులకి కుటుంబ సభ్యులందరికీ గర్భవతి దశ నుండి రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఇవ్వవలసిన ఆహార పదార్థాలు వ్యక్తిగత శుభ్రత త్రాగే నీరు ప్రతినెల ఆరోగ్య పరీక్షలు టీ కాలు బరువులు తీయించుకోవడం చేయడంవల్ల తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, అలాగే ప్రభుత్వాసుపత్రిలో డెలివరీ చేయించుకోవాలని సూచించి తల్లి పిల్లల బరువులు తీసి గ్రోత్ కార్డులను ఉపయోగించి పిల్లల ఆరోగ్యంగా ఉండడానికి మూడు సూచికల ద్వారా తెలుసుకోవాలని గ్రోత్ కార్డ్స్ పై అవగాహన కల్పించనైనది, ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సుజాత భాగ్యలక్ష్మి తల్లులు పాల్గొన్నారు
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని దేవన్నపేట లో గత 3 నెలల క్రితం గుండె పోటుతో మృతి చెందిన చుంచు సురేష్ కుటుంబానికి పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిరు పేదలకు ఏ కష్టం వచ్చిన అన్నా అంటే నేను ఉన్నానంటు ముందుకు అడుగు వేసె యువనేత సూరం రాజు జన్మదినం సందర్భంగా ఆటో డ్రైవర్ సురేష్ కుటుంబాన్ని పరామర్శించి వారి పిల్లల చదువుల నిమిత్తమై తన వంతు సహాయంగా 10000/- పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో సూరం రాజు తో పాటూ పలువురు పాల్గొన్నారు.
దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములు దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడితో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరారు.41 రోజుల మండల దీక్షలు నియమనిష్ఠలతో చెప్పట్టిన హనుమాన్ మాలధారణ స్వాములు గుజిలే రాము, తాటికొండ వెంకన్న చారి, ఐలాపురం శ్రీకాంత్ చారి, మనోజ్ చారి ముసుకు మధుకర్ లు గురువారం దీక్ష పూర్తిచేసుకొని ఇరుముడులతో సైకిల్ యాత్ర ద్వారా భద్రాచలం బయలుదేరినట్లు వారు పేర్కొన్నారు.వచ్చే నెల 1 న హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కల్గిన భద్రాచలం వెళ్లి ఇరుముడి సమర్పిస్తామని తెలిపారు.
తెలంగాణలోనే ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం,దక్షిణ కాశీగా పేరుగాంచిన వేముల వాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు రూ.10లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాల యాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా రూ.10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారంఈ మేరకు బుధవారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయ అధి కారులకు రూ.10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.
బ్లోయర్ తో మంటలు ఆర్పి వేసిన అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది
జైపూర్ , నేటి ధాత్రి:
మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ అటవీ ప్రాంతంలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో బుధవారం సాయంత్రం మందు బాబుల నిర్లక్ష్యం వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్లాంటేషన్ లో మంటలు చెలరేగి పొగలు వస్తున్నాయని జైపూర్ కు చెందిన స్థానికులు కొందరు అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ వాచర్ సాయికిరణ్ కు సమాచారం ఇచ్చారు.ఆ తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు వెంటనే మిగిలిన వాచర్ లను పిలిపించి సంఘటనా స్థలానికి వెళ్లి ఫైర్ బ్లోయర్ ల సహాయంతో మంటలను అర్పివేసి ప్లాంటేషన్ ను, అటవీ ప్రాంతాన్ని అగ్ని ప్రమాదం నుంచి రక్షించారు. ఈ సందర్బంగా అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేసిన వాచర్ లు శంకర్ సాయికిరణ్ లను అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారిణి సాగరిక లు అభినందిoచారు. వీరు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.అటవీ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మధ్యం సేవించిన మైకంలో సిగరెట్ లు తాగి నిర్లక్ష్యంగా పడేయడం వల్లనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని అన్నారు.
2024 మే 30 సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా , మెట్టుకొండ లక్ష్మి జండా ఆవిష్కరణ చేయగా,బందు సాయిలు అధ్యక్షతన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ మాట్లాడుతూ భారత కార్మిక ఉద్యమ చరిత్రలో సిఐటియు ఆవిర్భావం ఒక చారిత్రక అవసరఘట్టం. 1970 మే 30న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఆవిర్భవించింది. నేటికీ( 2024 మే 30 ) 54 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. జాతీయ కార్మిక ఉద్యమ నేతలు కామ్రేడ్ బి టి రణ దివే, కామ్రేడ్ పి రామ్మూర్తి తొలి అధ్యక్ష, కార్యదర్శులు. ముఖ్యమంత్రి కామ్రేడ్ జ్యోతిబసు ఉపాధ్యక్షులుగా ఉన్నారు.ఐక్యత పోరాటం నినాదంతో సిఐటియును దేశవ్యాప్త కార్మిక సంఘంగా స్థాపించి ముందుకు నడిపారు దేశంలో మతోన్మాద కార్పొరేట్ విధానాల సవాల్ నేపథ్యంలో వారి వారసత్వాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బృహత్తర బాధ్యత మనపై ఉంది. 2024 మే 30 సిఐడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని కార్మిక వర్గాన్ని మరింత చైతన్యం చేయాల్సి ఉన్నది. నాటి నుండి నేటి వరకు భారత కార్మికు ఉద్యమానికి పాలకవర్గాల నుండి అనేక సవాలు ఎదురయ్యాయి. వాటిని ఎదిరిస్తూ నేటికీ 22 దేశవ్యాప్త సమ్మెల్లో పోట్లాదిమంది కార్మిక వర్గాన్ని సమీకరిస్తూ కార్మికోద్యమం ముందుకు పోతున్నది. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల పేరిట దాడి. పెట్టుబడుల సేకరణ పేరిట పనుల తగ్గింపు నిబంధనల సడలింపు కార్మిక చట్టాలను సరళం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం. బిజెపి వాజ్పేయి కాలంలో ప్రైవేటీకరణ మరింత వేగం పెట్టుబడుల ఉపసంహరణ కోసం కమిటీ ఏర్పాటు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో 2021 నాటికి కార్పోరేటికరణ దూకుడుగా కొనసాగింది. ఎయిర్ ఇండియా బాల్కో సిఎంసి హిందుస్థాన్ జింకు హెచ్టిఎల్ మారుతి ఉద్యోగుల లిమిటెడ్ హిందుస్థాన్ యూనివర్స్, బిఎస్ఎన్ఎల్ ఇండియన్ పెట్రోల్ కెమికల్స్ ఐడిఎఫ్సి లాంటి అనేక సంస్థల్లో ప్రైవేటీకరణ కొనసాగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మూల స్తంభాలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కార్మికు ఉద్యమం మీద కార్మిక ఐక్యత పై తీవ్ర దాడి కొనసాగింది. కార్మిక చట్టాల సవరణలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం తీసుకువచ్చారు హైర్ అండ్ ఫైర్ సిస్టం (వాజ్పేయి కాలం నుండి ) 2024 నరేంద్ర మోడీ కార్మిక హక్కులపై మరింత దాడి. నాలుగు లేబర్ కోట్లు పార్లమెంటులో 2019 20లలో ఆమోదింప చేసుకున్నారు 29 కేంద్ర చట్టాలను రద్దు చేశారు. ఎనిమిది గంటల పని దినం కనీస వేతనం సంఘం పెట్టుకునే హక్కు సమ్మె హక్కును కార్మిక శాఖ పనితీరు, అసంఘటిత కార్మికుల హక్కులు స్కీం వర్కర్ల హక్కులు కాల రాయబడ్డాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు మరికొన్ని రాష్ట్రాల్లో కార్మిక చట్టాల సవరణలకు ప్రయత్నం.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర. ఎఫ్ టి ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టం తీసుకువచ్చారు. 30% అప్రెంటీసులను అనుమతించారు. మోడీ కాలంలో ప్రభుత్వ సంస్థలపై దాడి మరింత ఉధృతం చేశారు. కులం మతం మస్తిత్వ భావజాలంతో కష్టజీవులు ఐక్యతను భంగం చేసి భావోద్వేగా రాజకీయాలు కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి బిజెపి రాజకీయ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి కుటిల యత్నాలు. మతాన్ని రాజకీయాలకు వాడుకుంటూ మతతత్వాన్ని రెచ్చగొడుతున్నది. రాజ్యాంగం కల్పించిన హక్కుల పై దాడి చేస్తున్నది. ఉదాహరణ వాక్ స్వాతంత్రం, పత్రిక స్వేచ్ఛ, రిజర్వేషన్స్ కోల్పోవడం. సి ఏ ఏ, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ లను తీసుకువచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్, సిఐటియు సీనియర్ నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఐద్వా జిల్లా కార్యదర్శి వంగాల విజయలక్ష్మి, ఎన్ పి ఆర్ డి జిల్లా కార్యదర్శి శేఖర్, మరియు తదితర కార్మికులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ. మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రీధర్ బాబు ఎనలేని కృషి చేశారని, అధికారం చేపట్టాక రాష్ట్ర మంత్రిగా ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటి రంగాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లూరి సమ్మయ్య, కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, చల్ల రేణుక, కొరిమిళ్ళ రజిత శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల మల్లేష్ గౌడ్, పైడిపల్లి రమేష్, సహదేవ్, లక్ష్మారెడ్డి, కెవి అశోక్, సమ్మయ్య,మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు మరియు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
-తెలంగాణ ఆకలిని ఎగతాలి చేసిన వారి చేతుల్లో పెట్టడమెందుకు!
-ఒక్కటైన తెలంగాణ సమాజంలో కొత్త అలజడెందుకు?
-మన హృదయాలలో పదిలంగా ఉన్న పాటకు గాయాలెందుకు?
-జనగీతాన్ని నడి బజారులో నిలబెట్టి నాటకాలెందుకు?
-జయజయహే అని పాడుకున్న నోటికి కొత్త నొప్పులు లెందుకు?
-పాటకు మళ్ళీ పురిటినొప్పులెందుకు?
-ఉద్యమ కాలంలో ఎగిరిన పతాకకు ఈ మరకలెందుకు!
-ఉద్యమాన్ని జీవితం చేసిన పాట కొత్తగా పట్టమెందుకు!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ సమాజం దేనినైనా సహిస్తుంది. కాని ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడదు. ఆకలినైనా ఎదిరిస్తుంది. అంతస్తులను లెక్క చేయదు. కాని ఆత్మ స్ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోదు. అది తరతరాలుగా వస్తున్నది. ఆ గర్వం, దైర్యం, ఆ ఆత్మాభిమానం ఈ మట్టిలోనే వున్నాయేమో? అనిపిస్తుంది. తెలంగాణకు ఆత్మగౌరవం ఎక్కువ…పాటల దాహమెక్కువ. ప్రపంచంలో తెలంగాణకు మించిన సాహిత్యాధారాలు మరే ప్రాంతానికి లేవు. ఏ ప్రాంతంలో తెలంగాణలో వున్నన్ని జనపదాలు లేవు. తెలంగాణలో పల్లె పాటలే కాదు, బతుకమ్మ పాటలున్నాయి. చైతన్యగీతాలున్నాయి. అందుకే తెలంగాణ పాట పుట్ట. సాహిత్యానికి గుట్ట. అవును తెలంగాణకు పాటే ప్రాణం. ఆ పాటే జీవం..జీవితం. ఆ మాట నుంచి వెలువడే శబ్దమే తెలంగాణకు ఊపిరి. ఆ పాట వింటూ కష్టం మర్చిపోతాడు. ఆ పాట వింటూ తనకు ఎదురైన కష్టం గురించి తెలుసుకుంటాడు. ఆ పాట వింటూ తనను ఎవరు మోసం చేశారో తెలుసుకుంటాడు. ఆ పాట వింటూనే తనకు అన్యాయం చేస్తున్న వారి మీద తిరగబడతాడు. ఇదీ తెలంగాణకు వున్న ప్రత్యేకమైన జీవన విధానం. ఇక్కడ ఆకలికి కూడా కోపమెక్కువ. ఆకలికి కూడా పాటలంటే మక్కువ. ఆకలి దహిస్తున్నా పాటతో కడుపునింపుకుంటాడు. కడుపు రగిలిపోతున్నా పాటే అందుకుంటాడు. ఇంతటి గొప్పగుణమున్న స్ధలం మన తెలంగాణ. అలాంటి తెలంగాణ పాటపై తెలంగాణ రగులుతోంది. పాట పరాయి గొంతులో పలికేందుకు తెలంగాణ సమాజం ఇష్టపడనంటోంది. తెలంగాణ పాట మనల్ని కాదన్న సమాజం నుంచి కొత్త బాణీలుతో కొత్త రూపు దిద్దుకోవడాన్ని తెలంగాణ సమాజం అడ్డుకుంటోంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఎదిరించడం, తెగించడం. తెలంగాణలో ఎదిరించని సందర్భం లేదు. తెగించని కాలం లేదు. రాజుల కాలంలో కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సారక్కలు తిరుగుబాటు కాలం చూశాం. ఇప్పటికీ ఆ వీర వనిత పౌరుషం తల్చుకుంటున్నాం. వారి వీరత్వానికి, అమరత్వాన్ని దైవత్వంగా కొలుస్తున్నాం. మనల్ని మనం స్పూర్తి పొందుతున్నాం. అంతటి గొప్ప గడ్డ మన తెలంగాణ.
ఈ మట్టిలోనే పౌరుషం వుంది. ఈ మట్టిలోనే పాట పుట్టింది. ఈ మట్టి పరిమళాన్నే పాట అద్దుకున్నది. ఈ మట్టిలోనే పాట పురుడుపోసుకొని ప్రపంచాన్ని ఏలింది. అంతగొప్పటి పాటలకు మన తెలంగాణ వేదికైంది. తెలంగాణ రైతంగా సాయుధ పోరాటంలో కొన్ని వేల పాటలు. నైజాం వ్యతిరేక పోరాటంలో కొన్ని వందల పాటలు. తెలంగాణ తొలి దశలో కొన్ని వేల పాటలు. తెలంగాణ మలిదశలోనూ మరెన్నొ పాటలు..ఆ పాటలే నేటి తెలంగాణ అస్దిత్వ ఆనావాలు. చరిత్రకు సాక్ష్యాలు. ముందుతరాలకు బాటలు. తెలంగాణలో పుట్టె పల్లె పదాల మట్టిపరిమళం అద్దుకున్నాయని చెప్పడానికి అనేక సాక్ష్యాలున్నాయి. గొర్రెల కాపరులు కూడా అప్పటికప్పుడు కైగట్టి పాటలు పాడుతుంటారు. అంతో రాగయుక్తంగా రక్తి కట్టిస్తుంటారు. అందుకే పాటల పోరాటాల గడ్డ మన తెలంగాణ. పాలకుల నిబద్దతను ప్రశ్నించే పాటలైనా, తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించే పాటలైన తెలంగాణకే సొంతం. భక్తికైనా, రక్తికైనా ఎదిరించే శక్తికైనా తెలంగాణ పాటే మూలం. గడ్డ పార మొన కూడా పాట పాడుతుంది. మట్టినెత్తే పార కూడా పాటల రాగం తీస్తుంది. అది శ్రమశక్తి నుంచి వచ్చే నినాదమై తెలంగాణను తట్టిలేపుతుంది. చీకటిని చీల్చే దివిటి కూడా వెలుగు పాట పాడుతుంది. అంతటి మహత్తు తెలంగాణ పాటకుంది. తెలంగాణ నేలకున్నది. ఈ గాలిలో, ఎండిన ఆకుల్లో, పారే ఏరులో, వాగులో వంకలో కూడా పాటను చూసే మనసున్న నేల మన తెలంగాణ. మాటకు పౌరుషం నింపేది తెలంగాణ పాట. సమాజాన్ని నిద్రలేపేది తెలంగాణ పాట. నిద్రానంలో వ్యవస్ధను తట్టిలేపేది తెలంగాణ పాట. మనకణకణాల్లో, నరనరాల్లో ఉరకలెత్తించి, ఉత్తేజాన్ని నింపేదే తెలంగాణ పాట. అది అమ్మ పాటైనా..తెలంగాణ తల్లి నేర్పే తిరుగుబావుటా పాటైనా తెలంగాణ పాటకే ఎక్కడైనా పట్టం. అదే తెలంగాణకు గొప్ప వరం.
ఇంత గొప్ప పాటలో ఒకటైన జయజయహే తెలంగాణ…అన్న అందెశ్రీ పాట ఒకటి. ఈ పాట ఒక్కటే తెలంగాణ కోసం కొట్లాడలే..ఈపాట ఒక్కటే తెలంగాణ తేలే..ఈ పాట ఒక్కటే తెలంగాణను ఉరకలెత్తించలేదు. కాకపోతే అందరూ నా పాట అనుకున్నారు. ఆ పాటను మనసులో నింపుకున్నారు. రాసిన అందెశ్రీని గుండెల్లో పెట్టుకున్నారు. కవిగా ఆయనకు గొప్ప స్దానమిచ్చారు. తెలంగాణ కాళిదాసుగా కీర్తిస్తున్నారు. మరి అలాంటి అందెశ్రీ ఇప్పుడు వివాదాలు మూట గట్టుకుంటున్నాడు. జయజయహే తెలంగాణ..అన్న పాట ఆయన రాసిందే అయినా, అది ప్రజల హృదాయాలలో ఎప్పుడో పదిలమైపోయింది. ఇప్పుడు ఆ పాట అందెశ్రీది కాదు..తెలంగాణ ప్రజలది. తెలంగాణ ఆత్మగౌరవానిది. తెలంగాణ ఆత్మది. ఏ కవి అయినా రాసే వరకే తన పాట. అది జనంలోకి వెళ్లిందంటే అదిజనం పాట…ఇప్పటికిప్పుడు ఆ పాట మరోసారి ఆవిష్కరించుకోవడం, తెలంగాణ గేయంగా ప్రకటించుకోవడాన్ని అందరం స్వాగతించాం. సంతోషించాం. ఎందుకంటే అందెశ్రీ రాసిన పాట జయజయహే తెలంగాణ పాట లేకుండా తెలంగాణ ఉద్యమం సాగలేదు. కాకపోతే ఈ ఒక్కపాటే తెలంగాణ ఉద్యమం కాదు. తెలంగాణ ఆత్మకు ఈ పాటొక్కటే అనడం సరైంది కాదు. గద్దర్ అమ్మా తెలంగాణమా..అన్నపాట తెలంగాణ సమాజాన్ని ఉరకలెత్తించింది. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా?..అన్న పాట తెలంగాణనే కాదు, ఆ పాట విన్న ప్రపంచాన్ని కన్నీటిసాగరం చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పాటలకు అంతులేదు. అంతం లేదు. అయినా అందెశ్రీ పాటకు ఎంతో గౌరవం దక్కింది. తెలంగాణ సమాజమే ఆ పాటను రాష్ట్ర గీతం కావాలని కోరుకున్నది. కాకపోతే దానిలోకొత్త బాణీల పేరుతో పొరుగు రాష్ట్ర సంగీత దర్శకుడుతో పాడిరచినా తెలంగాణ అభ్యంతరం చెప్పాలిన పనిలేదు. కాని తెలంగాణలో కీరవాణికన్నా గొప్ప సంగీత దర్శకుడు లేడని అందెశ్రీ అనడం యావత్ తెలంగాణ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఇలాంటి వ్యాఖ్య అందెశ్రీ నుంచి వుస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఇటీవలే పాట అమ్ముడుపోయిందంటూ ఓవేదిక మీద ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నతో పంచాయితీ పెట్టుకున్నంత పనిచేశాడు. తన అక్కసునంతా వేదిక మీద వెళ్లగక్కే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా ఇలాగే అందరి చేత తనమీద వున్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పైగా మరో ఆడియోలో అక్కమొగుడా..అమ్మ మొగుడా? అంటూ అందెశ్రీ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు తెలంగాణలో తన పాటకు కైగట్టే సంగీత పరిజ్ఞానే లేడన్నంత మాట్లాడిన అందెశ్రీ, మరో వివాదాన్ని తన తలకు చుట్టుకున్నాడు. ఏది ఏమైనా తెలంగాణలో అధ్భుతమైన గాయకులున్నారు. తెలంగాణ పాటకు ప్రాణం పోసిన వారున్నారు. పరాయి వాళ్లు పాడితే తెలంగాణ పాటకు జీవం వుండదా? అంటే వుండదు. అవును ఎందుకుంటే ఈనాడు రామోజీరావు తీసిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ అనే సినిమాలో ఊరు మనదిరా…ఈ వాడ మనదిరా! అనే పాట ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడారు. ఆయన కొన్ని వేల పాటలకు ప్రాణం పోశారు. కాని ఆయన పాడిన ఆ పాటలో జీవం లేదు. అదే పాటను ఎర్రసైన్యం సినిమాలో వందేమాతరం శ్రీనివాస్ పాడితే తెలంగాణ అంతా దద్దరిల్లింది. అదీ తెలంగాణ ఆత్మ…ఒకనాడు తెలంగాన సినిమాలో నటించేందుకు ఏ నటుడు ముందుకు రాలేదు. పాట పాడేందుకు ఏ గాయకుడు ముందుకు రాలేదు. తెలంగాణ ఉద్యమాన్నే ఆంద్రాకు చెందిన మేదావులు సహించలేదు. ఇప్పుడు వారి గొంతులో జీవం వుట్టిపడేలా గానం కోరుకోవడం మాత్రం తెలంగాణ సమాజం ఇష్టపడడం లేదు. ప్రభుత్వం కూడా అందెశ్రీ వ్యక్తిగత వివాదంలో అబాసు పాలు కావొద్దు. పాటకు గౌరవం ఇచ్చే దశలో ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల వ్యతిరేకతను మూట గట్టుకోవద్దు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.