చిన్న లింగాపూర్ గ్రామంలో బోరు మోటర్ ప్రారంభం….

చిన్న లింగాపూర్ గ్రామంలో బోరు మోటర్ ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో స్థానిక ఆరో వార్డులో బోరు మోటర్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఒక లక్ష 60 వేల రూపాయల నిధులతో చిన్న లింగాపూర్ గ్రామంలోని ఆరో వార్డులో మాజీ ఎంపిటిసి .బైరీనేని రాము .ఆధ్వర్యంలో గ్రామ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం అభివృద్ధిలో భాగంగా ఒక లక్ష అరవై వేల రూపాయల.నిధులతో బోరు మోటర్ ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ జక్కుల రవి. వార్డు సభ్యులు.అయి లాపురం.చిరంజీవి. ఎల్లయ్య. బాల.మల్లు.రాజశేఖర్. మురళి .గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రైతులకు మద్దతు తెలిపి నీరు వచ్చే విధంగా పోరాటం చేస్తామని తెలిపిన తీన్మార్ మల్లన్న….

రైతులకు మద్దతు తెలిపి నీరు వచ్చే విధంగా పోరాటం చేస్తామని తెలిపిన తీన్మార్ మల్లన్న….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండలంలో దీక్ష చేస్తున్న రైతులకు .అండగా.టిఆర్పి పార్టీ అధినేత ఎమ్మెల్సీ.తీన్మార్ మల్లన్న. వారికి అండగా ఉండి వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే దిశగా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం అలాగే పెద్ద లింగాపూర్ గ్రామం తో పాటు. తంగళ్ళపల్లి మండలం నుండి 12 .గ్రామాలు .రైతులు సాగునీటి. కల నెర. వేరుకపోవడంతో. రైతులు అందరు ఏకమై దీక్షకు చేయడం ప్రారంభించారు రైతులందరూ నీరు అందక పంట పొలాలు సాగులోకి రావడం లేదని ఏండ్ల.తరబడి అసంపూర్తిగా పంటలు ఎండిపోయి. సాగులోకి మిగిలిపోయిందని.కాలేశ్వరం ప్యాకేజీ కింద.11/.6. లో భాగంగా. జరుగుతున్న కాల్వ పనులు కేవలం ఒక కిలోమీటర్ వద్ద ఆగిపోవడంతో 15 గ్రామాల రైతులు అన్నదాతలు ఆశలు అడియాశలు అయ్యాయని. పెద్ద లింగాపూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన మల్లన్న నిలిచిపోయిన కాలువ పనులను పరిశీలించారు అలాగే కాల్వ పనులు పూర్తి చేయాలని 12 గ్రామాల రైతుల ఏర్పాటు చేసిన దీక్ష శిబిరాన్ని సందర్శించడంతోపాటు. రైతులు ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న .సమస్యలను విన్న.వించుకుంటూ అనంతరం. అన్నదాతల కన్నీళ్ళకు .వెలకట్టలేము కేవలం ఒక్క కిలోమీటర్ల పనులు ఆపి 12 గ్రామా రైతులు ఇబ్బంది పెట్టడం సోచ.నియమని .కాలువల పనులుపూర్తిచేయిoచి రైతులకు నిరంధించే.బాధ్యతను. నేనే స్వయంగా తీసుకుంటానని. తెలియజేస్తూ వెంటనే. నీటి పారుదల.శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫోన్ చేసి రైతుల సమస్యలను వివరించారు సానుకూలంగా స్పందించిన. మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడిన కాలువల పనులుపూర్తి చేస్తామని హామీ ఇచ్చి. పనుల జాప్యం చేస్తూ రైతులకు సాగునీటి హక్కును కాల రాస్తే సహించేది లేదని అధికారులను ఫోన్లో హెచ్చరించారు సంవత్సరాల.తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలపై మల్లన్న స్పందించిన తీరు పట్ల. పెద్ద లింగాపూర్ మరియు చుట్టుపక్కల .12. గ్రామాల రైతులు .హర్షం వ్యక్తం చేశారు మాట ఇవ్వడమే.కాదు పనులు పూర్తి చేయిస్తానని మల్లన్న ఇచ్చిన భరోసాతో రైతులకు కొత్త ఆశలు చిగురించాయి మరి కొద్ది రోజుల్లోనే . కాలువ పనులు పూర్తయి .12. గ్రామాలకు చెందిన దాదాపు పదివేల ఎకరాల పొలాల నీరు అందించి సస్యశ్యామలం చేయిస్తానని.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రజిని కుమార్ యాదవ్. ప్రధాన కార్యదర్శి.వట్టే.జానయ్య యాదవ్. క్రమశిక్షణ కమిటీ చైర్మన్.బందారపు నరసయ్య గౌడ్. రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్. ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్. జిల్లా అధ్యక్షులు మల్లేశం. గీత మధు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బిక్షపతి. జిల్లా నాయకులు కార్యకర్తలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పట్టుదల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.

జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి.

విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.

జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రత్యేక అధికారులు సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.

బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కాగా డైట్ మెనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు.

ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని, గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు.

ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసతిగృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు.

కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, స్పెషల్ అధికారినీ సోమలక్ష్మిని పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, స్థానిక తహసిల్దార్ వివేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కోహిర్ మున్సిపాలిటీకి కమీషనర్ గారిని నియమించాలి…

కోహిర్ మున్సిపాలిటీకి కమీషనర్ గారిని నియమించాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహిర్ నూతన మున్సిపాలిటీకి కమీషనర్ లేక సంబంధిత మున్సిపల్ అధికారులు లేక ప్రజలు నాన అవస్థలు పడుతున్నారని తక్షనమే కోహిర్ మున్సిపాలిటీ కి కమీషనర్ గారిని నియమించాలని కోహిర్ కౌన్సిలర్లు మరియు ప్రజా ప్రతినిధులు కోహిర్ మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద దర్న చేయడం జరిగింది

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్..

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్

భూపాలపల్లి నేటిధాత్రి

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) టీచర్స్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) పథకం 2004లో భారత ప్రభుత్వంచే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసి మైనార్టీ వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల బాలికలకు 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన నివాస విద్యను అందించడానికి ప్రారంభించబడింది. అది సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా కొనసాగుతూ బాలికల అక్షరాస్యతా పెంపునకు దోహదపడాలి. కానీ, ఆచరణలో నేడు కేజీబివిలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల నుండి మొదలు, అందులో పని చేసే అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పేరుకే అవి నాణ్యమైన విద్యనందించే నిలయాలు అని చెప్తున్నప్పటికీ అందులో పని చేసే సిబ్బందికి అవి పెట్టి చాకిరి నిలయాలుగా మారాయి. 2004 నుండి ప్రారంభమైన ఈ పాఠశాలల్లో ‘సమాన పనికి సమాన వేతనం” అమలు చేయకుండా అతి తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమను రక్షణ లేకుండా చేయిస్తున్నారు. కేజీబివిలలో పని చేసే టీచర్లు అందరు మహిళ టీచర్లే, కానీ, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని పంచాయితీరాజ్ టీచర్లతో పోల్చినపుడు అన్ని విషయాలలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. కేజీబివిలలో పని చేస్తున్న మహిళా టీచర్ల వేతనాలు SOల నెల వేతనం రూ.32,500.00, పేజీసిఆర్టీలకు రూ.29,700.00, సిఆర్జీలకు 26,000.00 వేతనాలు చెల్లిస్తున్నారు. అదే విధంగా సెలవులు కూడా మహిళా టీచర్లకు సాధారణ సెలవులు అకాడమిక్ సంవత్సరానికి 20 మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్ మహిళా టీచర్లకు 27 ఇస్తున్నారు. ఇంత తేడా ఎందుకు? అనే దానికి సమాధానం లేదు. ఈ 20 సాధారణ సెలవులు కూడా ప్రతి నెల 2 మాత్రమే వాడుకోవాలి. వాడుకోకపోతే ఆ రెండు సెలవులు కోల్పోవాల్సిందే. రెగ్యులర్ టీచర్లు మాత్రము సంవత్సరంలో అవసరం ఉన్నప్పుడు వాడుకొనే అవకాశం కల్పించారు. కేజీబివి టీచర్లకు శిశు సంరక్షణ సెలవులు లేవు. అర కొర వేతనంతో పని చేస్తున్నందుకు, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించడం లేదు. పంచాయితీరాజ్ పాఠశాలలకు కల్పించే 5 ఐచ్చిక సెలవులు, 3 స్థానిక సెలవులు గాని కేజీబివి పాఠశాలలకు లేవు. ప్రతి కేజీబివి రెసిడెన్సిల్ పాఠశాలగా నడుస్తుంది. కాని అందులో హాస్టల్ వార్డెన్ నియమాకం లేదు. అదే విధంగా కేర్ టేకర్ పోస్టు నియమాకం లేదు. ఈ బాధ్యతలన్నీ అందులోనే SO లతో పాటు ఆ టీచర్లే బాధ్యత తీసుకోవాలి. ప్రతి రోజు ఒక టీచర్ నైట్ డ్యూటీ చేయాలి. అ టీచరే మరుసటి రోజు మధ్యాహ్నం’ వరకు ఉండి రిలీవ్ కావాలి. ఈ పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణిస్తే కనీస ఆర్థిక సహాయం లేదు. ప్రమాద బీమా లేదు. వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి
సుదర్శన్ రాష్ట్ర కోఆర్డినేషన్ వీరేశం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ కేజీబీపీ టీచర్స్ చైతన్య రాధిక సులోచన జ్యోతి రాణి స్రవంతి కవిత సుధా రవళి రజిత తదితరులు పాల్గొన్నారు

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..

పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల పరిధిలోనీ పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశారు. గ్రామాల్లోసీసీ రోడ్లు, వీవో మహిళా సమాఖ్య భవనాలు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్య క్రమం ఘనంగా నిర్వహించ బడింది.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సంబంధిత అభి వృద్ధి శాఖ అధికారుల సమక్షంలో పనుల శంకు స్థాపన పలకలు ఆవి ష్కరణ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.గ్రామాల్లో రహదారి సౌకర్యాల మెరుగు దల, మహిళా సంఘాల బలోపేతం మరియు విద్యా ర్థులకు సురక్షిత విద్యా వాతా వరణం కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారు లు సమన్వయంతో పనిచే యాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ,మండల ముఖ్య నాయకులు , సర్పంచులు, ఉపసర్పంచ్ లు , గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు,మాజీ ప్రజాప్రతినిధులు మరియు సంబంధితశాఖ అధికారు లు ,కార్యకర్తలు పాల్గొన్నారు

రేణుక ఎల్లమ్మ తల్లి నాటక ప్రదర్శన ఉత్సవాలు ప్రారంభం…

రేణుక ఎల్లమ్మ తల్లి నాటక ప్రదర్శన ఉత్సవాలు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, రాయికోడ్ మండలంలోని కుస్నూర్ గ్రామ శివారు చిన్నాపూర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి నాటక ప్రదర్శన ఉత్సవాలు మార్చి 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల వాల్ పోస్టర్ ను బుధవారం సిద్దాపూర్ గ్రామంలో నాటక మండలి సభ్యులతో కలిసి రిపోర్టార్ సంగమేష్ ఆవిష్కరించారు. ఈ నాటక ప్రదర్శనలు రేణుక ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపించనున్నాయి.

న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు…

న్యాల్కల్ లో దేశభక్తితో హోలీ సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండల కేంద్రంలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. స్థానిక హనుమాన్ మందిరం వద్ద యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈసారి సినీ గీతాలకు బదులుగా యువత దేశభక్తి పాటలతో వేడుకలను నిర్వహించి వినూత్న సందేశం ఇచ్చారు. గ్రామీణ వాతావరణంలో సంప్రదాయబద్ధంగా, ఐక్యంగా జరిగిన ఈ సంబరాలు గ్రామీణ సంస్కృతికి, జాతీయతకు ప్రతీకగా నిలిచాయి. న్యాల్కల్ గ్రామ సంస్కృతి వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.

దిగ్వల్ లో హోలీ సంబరాలు: రంగుల పండుగతో యువత ఉత్సాహం

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహిర్ మండలం దిగ్వల్ గ్రామంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వసంత కాలపు తొలి వేడుకగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా గ్రామ యువత ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. ధనిక, పేద తారతమ్యం మరచి, రాధాకృష్ణుల ప్రేమ గీతాల నడుమ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చలికి వీడ్కోలు పలుకుతూ హోళికా దహన కాంతులతో ప్రారంభమైన ఈ వేడుకలు గ్రామంలో ప్రత్యేక సందడిని నింపాయి. ఈ పండుగను పురస్కరించుకుని గ్రామస్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.

చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…

చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టమయింది…

రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులా..? విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులా..,?

“ఐ లవ్ యూ” మంత్రి వివేక్.. కావాలనే బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

*చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

మున్సిపల్ ఎన్నిక కాకుండా చూస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే…

ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మమ్మల్ని బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఐ లవ్ యూ మంత్రి వివేక్ అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.ప్రజలంతా క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల తీరును గమనిస్తున్నారని
పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు దిగలేదని, అందరినీ కలుపుకుపోయామే తప్ప కక్ష సాధింపు చర్యలకు ఏనాడూ దిగలేదని మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన అనంతరం క్యాతన్ పల్లి లోని బాల్క సుమన్ తన నివాసానికి చేరుకున్న సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మూల రాజిరెడ్డి లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.అనంతరం వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రమంతటా పరిస్థితి దారుణంగా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ లు బిఆర్ఎస్, సిపిఐ పార్టీల 14 మంది కౌన్సిలర్లను కొనే ప్రయత్నం చేశారని అన్నారు. బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఆఫర్లు చేశారని అయినా సరే తమ కౌన్సిలర్లు తలొగ్గ లేదన్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ లు మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మెన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్ల కు మందు తాగించి తమ మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారని మండిపడ్డారు. ప్రజా తీర్పును మంత్రి వివేక్ గౌరవించడం లేదని విమర్శించారు. క్యాతనపల్లి లో గొడవ సందర్భంగా రాళ్ళు విసిరినోళ్ల మీద కేసులో బుక్ కాలేదని, మా పార్టీకి చెందిన 25 మంది మీద కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా క్యాతన్ పల్లి మున్సిపల్ ఆఫీస్ కి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. మంత్రి వివేక్ కాన్వాయ్ ను ఎలా పంపించారని అడిగితే పోలీసులు తమపై లాఠీ ఛార్జ్ చేశారని పేర్కొన్నారు. వాళ్లు దాడి చేస్తే మాపైనే రివర్స్ లో కేసు పెట్టారని మండిపడ్డారు. క్యాతన్ పల్లి లో కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. జిల్లాలోని కలెక్టర్ నుండి ఎమ్మార్వో వరకు ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగులుగా కాకుండా విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. జైలు లోపల కూడా తమని ఇబ్బంది పెట్టారని తెలిపారు. జైలులో ఉండగా రామకృష్ణాపూర్ ఎస్సై నా ఇంటిని ఏ విధంగా సోదా చేస్తారో తెలపాలని సుమన్ ప్రశ్నించారు.అక్రమంగా నన్ను జైల్లో పెట్టారని ఇప్పుడు వారి కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నానని అన్నారు. సిపిఐ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్నాయని ,పొత్తు ధర్మాన్ని విస్మరించే ప్రసక్తే లేదని , భవిష్యత్తులో కూడా పొత్తుతోనే వెళ్తామని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య స్పష్టం చేశారు.క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన…

మొగిలిపేట్ గ్రామంలో పుష్కర ఘాట్ పరిశీలన
మల్లాపూర్ మార్చి 4 నేటి ధాత్రి

మొగిలిపేట గ్రామంలో గోదావరి పుష్కరాలలో భాగంగా మొగిలిపేట తీరంలో పుష్కర ఘాట్ పరిశీలన నిమిత్తం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పి రాములు మల్లాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మొగిలిపేట గ్రామ సర్పంచ్ గోల్కొండ కళా రమేష్ ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. మొగిలిపేట గ్రామపంచాయతీ కార్యదర్శి సౌజన్య , వార్డు సభ్యులు తిప్పని మునీందర్ గ్రామ ప్రజలు దరిపెల్లి అశోక్. మాసుల బుచ్చి రెడ్డి. నైనేని రాజేందర్ పాల్గొనడం జరిగింది

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు….

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా హోలీ వేడుకలు.

కల్వకుర్తి/నేటి దాత్రి:

కల్వకుర్తి పట్టణంలో స్థానిక వాసవి మాత దేవాలయం లో కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో హోలి వేడుకలు ఘనంగా నిర్వహించారు వాసవీ మాత దేవాలయం నుండి బైక్ ర్యాలీ ప్రారంభించి కల్వకుర్తి పట్టణ ప్రధాన రహదారుల గుండా తిరుగుతూ హొలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవీ క్లబ్ వనితా క్లబ్ ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ప్రభుత్వం రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలి…

ప్రభుత్వం రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలి

యూరియా యాప్ వల్ల రైతులకు ఇబ్బందులు

యాప్ కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలి..

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

రైతుబంధు డబ్బులు పడక జిల్లాలో రైతాంగమంతా ఇబ్బంది పడుతున్నారని వెంటనే ప్రభుత్వం రైతుబంధు డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గురుజపల్లి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. యాసంగి సాగు కు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితి దాపురించిందని, రైతులు మళ్లీ వడ్డీ వ్యాపారులను సంప్రదించవలసిన దుస్థితి నెలకొన్నది అన్నారు. రైతులకు యూరియా సరఫరా లో యూరియా యాప్ తో అనేక ఇబ్బందులు పడుతున్నారని, రైతులందరికీ ఈ యాప్ మీద అవగాహన ఉండ దని, ఈ యూరియా సప్లై ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి రైతులకు సకాలంలో యూరియా అందించాలని కోరారు. అట్లాగే ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ 500 ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే సన్న వడ్ల బోనస్ కూడా రైతు ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు మాతాంగి రామచందర్, కరిముల్లా, దోర్నాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ విద్యా కమిషన్ పై మాట్లాడడం బిడ్డూరంగ ఉంది…

కేంద్రమంత్రి బండి సంజయ్ విద్యా కమిషన్ పై మాట్లాడడం బిడ్డూరంగ ఉంది

బౌతు విజయ్ కుమార్ నేతకానీ, మహర్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర
ఉపాధ్యక్షులు

భూపాలపల్లి నేటిధాత్రి

విద్య శాఖ కమిషన్ రిపోర్ట్ పైన, కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి &కమిషన్ సభ్యుల పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి హరీష్ రావు మతి బ్రమించి మాట్లాడుతున్నారని
బౌతు విజయ్ కుమార్ నేతకానీ, మహర్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ
స్టేట్ ఉపాధ్యక్షులు, ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

దేశం లో గొప్ప ఐఏఎస్ అధికారి ప్రస్తుత విద్య శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిని యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ అర్బన్ నక్షలైట్ అనడం ఒక హేనమైన చర్య.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండ గడితే అర్బన్ నక్షలైట్ అవుతారా?
కనీసము విద్య పైన, విద్య వ్యవస్థ పైన అవగాహనా లేని మీరు విద్య కమిషన్ రిపోర్ట్ ను చెత్త బుట్టలో పడేయాలి అనడం చూస్తుంటే మీరు దేశంలో విద్య వ్యవస్థ నాశనం కావాలి అని కోరుకుంటూ ఉన్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజల పిల్లలకి వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి దీటుగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి అని ఆలోచన చేసి విద్య వంతుడు నిజాయితీ పరుడు
భూపాలపల్లి జిల్లాలో
పీపుల్స్ కలెక్టర్ గా పేరు తెచ్చుకొని.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం జగన్ గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ అడ్వైసర్ గా మంచి పేరు తెచ్చుకున్న మురళి నెత్రుత్వం లో 2024 సెప్టెంబర్ 4 ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి మురళి ని చైర్మన్ గా నియమించి
ప్రపంచంలో నే తెలంగాణ ఎడ్యుకేషన్ మోడల్ కావాలి అని ఇంటర్నేషనల్ మోడర్న్ ఫెసిలిటీస్ తో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉండాలి అని గొప్ప ఆలోచన చేసి సీఎం కమిషన్ ఏర్పాటు చేస్తే చూసి జీర్ణించు కోలేని మీరు అసూయా తో మతి బ్రమించి మాట్లాడుతున్నారు.

గుడులు, గోపురాలు మసీద్,చర్చి కూల్చడం పేల్చడం మీ సిద్ధాంతం మీ బీజేపీ డిక్షనరీ లో పదాలు.
అలాంటి మీరు విద్య వ్యవస్థ పైన సీఎం రేవంత్ రెడ్డి పైన విద్య శాఖ కమిషన్ చైర్మన్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది

ప్రవీణ్ కుమార్ ఐపీస్ ని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గా నియమించారు ఐఏఎస్ క్యాడర్ ఉన్నావారిని కార్యదర్శి గా నియమించవల్సిన శాఖకి ఐపీస్ అధికారిని ఎలా సెక్రటరీ గా నియమించారు?

హరీష్ రావు ఆర్థిక శాఖ, ఇరిగేషన్ మంత్రి గా పనిచేసారు కదా మీకు
ఉన్న అనుభవం విద్యార్హతలు ఏమిటి?

 

గత పది ఏండ్ల లో ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసి కొన్ని వేల స్కూల్ మూసివేసిన మీరు ఈరోజు విద్య శాఖ కమిషన్ రిపోర్ట్ గురించి మాట్లాడడం హాస్య స్పదం.
సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రపంచంతో పోటీ పడేలా అన్ని హంగులతో అన్ని నూతన ప్రమాణాలతో ప్రభుత్వ పాఠశాల తీర్చి దిద్దు తుంటే చూసి ఓర్వలేక మీరు విద్య శాఖ కమిషన్ పైన విషం చిమ్ముతూ కమిటీ సభ్యులని కించ పరిచే విధంగా మాట్లాడుతున్నారు.

కమిషన్ రిపోర్ట్ మొదటి పేజీ చదువని మీరు, గత పది ఏండ్ల పాలనలో ఒక రివ్యూ మీటింగ్ కూడ విద్య పైన పెట్టని మీరు
ఈ రోజు విద్య వ్యవస్థ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.

సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు అన్ని హంగులతో అన్ని ప్రమాణాలు సౌకర్యాలతో తెలంగాణ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయి విద్యావ్యవస్థగా తీర్చిదిద్దుతుంటే చూసి ఓర్వలేక మీరు మతిభ్రమించి మాట్లాడుతున్నారు.
ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకుంటే ప్రజలే మీకు మీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు.
కమిషన్ ఇచ్చిన రిపోర్టులో మొదటి పేజీ కూడా పూర్తిగా చదవకుండా తమరు కమిషన్ రిపోర్ట్ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. వారు బౌద్ధ విజయ్ కుమార్ అన్నారు

జహీరాబాద్ స్మార్ట్ సిటీకి రంగం సిద్ధం…

జహీరాబాద్ స్మార్ట్ సిటీకి రంగం సిద్ధం…

◆-: పట్టణంలో రహదారుల విస్తూర్ణం మారబోతున్న జహీరాబాద్ రూపురేఖలు

 

మాస్టర్లోన్తో మారనున్న పట్టణ రూపురేఖలు అమృత్ 2.0 నిధులతో రోడ్లు, నాలాల విస్తరణకు కార్యాచరణ మున్సిపల్ యంత్రాంగం సిద్ధం.. ఈ ఏడాది పూర్తిచేయాలని లక్ష్యం

జహీరాబాద్, నేటి ధాత్రి:

ఏడు దశాబ్దాల చరిత్ర కలి గిన జహీరాబాద్ పట్టణం అన్ని రంగాల్లో విస్తరిస్తున్నప్పటికీ, మౌలిక వసతుల కల్పనలో మాత్రం ఎంతో వెనుకబడి ఉంది. పట్టణం 12 వార్డుల నుంచి 37 వార్డులకు చేరు కుని, 21.13 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించినా, దశాబ్దాల క్రితం నాటి ఇరుకైన రోడ్లే ఉండటంతో నేటికీ ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన కార ణంగా మారుతున్నాయి. ఏ రోడ్డు చూసినా ఇరుకుగా ఉండటం, నిర్మాణాలు, సెబ్బ్యాక్ లు లేని రోడ్లపైనే పార్కింగ్లు.. వెరసి వాహనదారులకు, స్థానికులకు నిత్యం నరకప్రాయంగా మారింది. అయితే, తాజాగా అమృత్ 2.0 పథకం జహీరాబాద్ అభివృద్ధికి కొత్త ఆశలను చిగు రింపజేస్తోంది.

అమృత్ 2.0తో అభివృద్ధి వేగం

పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2021 లోనే అమృత్ 20 పథకం కింద రూ.18 కోట్ల నిధు లను మంజూరు చేసింది. పలు కారణాల వల్ల

ప్రజల సహకారం అవసరం

జహీరాబాద్ అభివృద్ధికి మాస్టర్న్ అత్య వసరం. ఇది పూర్తిస్థాయిలో అమలైతే జహీరా బాద్ రూపురేఖలు మారి అద్భుతంగా అభి వృద్ధి చెందుతుంది. ఇందుకు సంబంధించిన పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. పెండింగ్లో ఉన్న పన్ను బకాయిలను చెల్లించి ప్రజలు అభివృద్ధికి సహకరించాలి.

– జైత్రం నాయక్, మున్సిపల్ కమిషనర్-జహీరాబాద్

జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయం

ఆలస్యమైనా 2023 నుంచి అధికారులు ఈ ప్రాజెక్టును వేగవంతం చేశారు. ఈ పథకం ద్వారా రోడ్ల వెడల్పు, మాస్టర్న్ అమలు, మంచి నీటి సర ఫరా, అండర్ గ్రౌండ్ డైక్రేజీ వ్యవస్థ, ప్రభుత్వ భూముల్లో కార్యాలయాల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టనున్నారు. ఈ పనులన్నీ పూర్తి చేయడానికి 2026 మార్చి గడువుగా ఉంది. దీని కోసం మొత్తం 24 శాఖల నుంచి సమాచారం సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 13 శాఖల నుంచి డేటాను అధికారులు సేకరించారు. మున్సిపల్ ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమైనప్పటికీ, కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో పక్కాగా అమలు చేయా లని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించాలని, లేనిపక్షంలో యంత్రాంగమే కూల్చివేతలకు సిద్ధమని అధికా రులు హెచ్చరిస్తున్నారు. మాస్టర్హౌన్ పూర్తిగా అమలయితే జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తా మని పేర్కొంటున్నారు.

ప్రాధాన్యత క్రమంలో రోడ్ల విస్తరణ

పట్టణంలో ఉన్న 15 ఇరుకైన రోడ్లను అధికా రులు గుర్తించగా, ఇందులో ఐదు రోడ్లను

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డ లో…

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డ లో “ఊయల మరియు జారుడు బల్ల” ప్రారంభించిన సర్పంచ్ దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి

చందుర్తి, నేటిధాత్రి:

ఈ రోజు మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన “ఊయల మరియు జారుడు బల్ల” ను గ్రామ సర్పంచ్ శ్రీమతి దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.స్థానిక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీ ఆకుల గంగనర్సయ్య దీనిని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతి రావు మాట్లడుచు చిన్నారుల కొరకు వీటిని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని,పాఠశాల అవసరాలు తీర్చడంలో ఉపాధ్యాయులు కూడా తమ వంతు సహకారం అందిస్తారనడానికి నిదర్శనం ఈ ఊయలలు అని అన్నారు.అనంతరం దాత ఆకుల గంగనర్సయ్య కు మరియు బదిలీలలో చందుర్తి పాఠశాలకు వెళ్లిన గుర్రం బాలకిషన్ కి సర్పంచ్, చందుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లచ్చిరెడ్డి,ఉపసర్పంచ్,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు షకీరా మరియు ఉపాధ్యాయ బృందం చే సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో చందుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్ఛిరెడ్డి, స్థానిక ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,వార్డు సభ్యులు,
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బండ శంకర్,కీర్తి,ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అడ్డంగా వాహనాలు.. కాలనీవాసుల ఆవేదన…

అడ్డంగా వాహనాలు.. కాలనీవాసుల ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్లోని ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాల రద్దీతో రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లడం కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై కాలనీవాసులు సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వెంటనే స్పందించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించి, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు…

జైనులకాలం నాటి విగ్రహలను అమ్మేందుకు ప్రయత్నం -ప్రజలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లి గ్రామంలో 2018 మరియు 2020లో జైనులకాలం నాటి పార్శానాథుడు, వృషభనాథుడు విగ్రహాలు బయటపడ్డయి. అప్పటి జిల్లా కలెక్టర్ మరియు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి వాటిని అక్కడి గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ పంచాయితీ ఆదినంలో భద్రపరచవల్సిందిగా తెలిపారు. కాని ఇప్పుడు వాటికి సరైనా భద్రత కలిపించక పోవడంతో ఇదే అదునుగా భావించిన కొంతమంది గ్రామానికి చెందిన వ్యక్తులు ప్రయివేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో ప్రభుత్వ అధికారులు తక్షణం స్పందించి గ్రామ పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఆలయం నిర్మించి, భద్రత పెంచవల్సిందిగా గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ, మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్

ఆరోగ్య శాఖ మంత్రి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ, మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజానర్సింహా గారిని నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్మన్గా ఇటీవల ఎన్నికైన నాగేష్ శెట్కార్ గారు, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ గారితో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఖేడ్ మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా మున్సిపల్ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి గారిని కోరారు.మంత్రి సమస్యలను శ్రద్ధగా విని, సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం…

ప్రగతి ప్రణాళిక అభివృద్ది కాదు దోచుకోవడం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం

మీడియా సెల్ ఇంచార్జి అశోక్

వనపర్తి నేటిదాత్రి .

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
మహిళలకు 2500 ఫించన్ ,తులం,బంగారం ,4000ఆసరా పింఛన్లు పెంపు ఎక్కడ అని అధికారులను కాంగ్రెస్ పార్టీ ,నాయకులను నిలదీయాలని జిల్లా మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ వనపర్తి లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆగ్రహం వ్యక్తంచేశారు ప్రజా పాలన.ప్రగతి ప్రణాళికతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల ఆగ్రహం గురి కాక తప్పదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6నుండి జూన్ 12వరకు నిర్వహించ నున్న ప్రజా పాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్ర జల ముందర పరువు పోవడం తప్పదని బి. ఆర్. ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్ అన్నారు
పరిపాలన చేతకాక,ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమై రేవంత్ రెడ్డి రోజుకో నాటకాని తెరపైకి తెస్తున్నారని నందిమల్ల.అశోక్ తీవ్రంగా మండిపడ్డారు 420హామీలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం ఆయ్యారని విమర్శించారు బీ ఆర్ ఎస్ మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు కె.సి.ఆర్ కిట్టు,కంటి వెలుగు ఉచిత కంటి అద్దాలు ,రైతు బంధు ఎకరాకు 6000 వేలు వేశారని ప్రభుత్వ పాఠశాల లో విద్యార్థులకు నాణ్యమైన మద్యహాన్న భోజనం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో 5 రూపాయల భోజనం అమలు చేశారని అశోక్ ఆరోపించారు , రైతు బీమా,రైతు రుణ మాఫీ,24గంటల ఉచిత విద్యుత్,విద్యార్థులకు విద్యా బరోసా ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని విమర్శించారు
ప్రజా పాలన పేరిట గ్రామాలకు పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మా దగ్గరకు రావాలని నిలదీయాలని గ్రామల ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సమావేశములో యువత అధ్యక్షులు సూర్యవంశం.గిరి,మైనారిటీ అధ్యక్షులు జోహెబ్ హుస్సేన్,సీనియర్ నాయకులు వెంకట్ సాగర్ సయ్యద్.జమీల్,మంద.రాము,విజయ్,సాయికుమార్ తదితరులు ఉన్నారు

పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి…

పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలి :

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ * శామీర్ పేట్ పెద్దమ్మ కాలనిలో సిపిఐ నాయకుల పర్యటన మేడ్చల్

జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పెద్దమ్మ కాలనీలో ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) మండల కార్యదర్శి డి.జి.నరేందర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా శామీర్ పేట్ మండలంలోని పెద్దమ్మ కాలనీలో బుధవారం సిపిఐ నేతలు ప్రజా సమస్యలపై పర్యటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు అయినటువంటి మంచినీటి సరఫరా, వీధి దీపాలు, భూగర్భ మురికి నీటి పారుదల సౌకర్యం, బస్తీలోని రోడ్లు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నిత్యవసర వాడకానికి బోరు మోటరు మరమ్మత్తులు, ఇంటి నంబర్ల గుర్తింపు లేకపోవడం, చిన్నపిల్లలకు అంగన్వాడి కేంద్రంలోని నిర్వహణ కుగాను ప్రభుత్వ భవనం లేకపోవడం, ప్రభుత్వ వైద్యం సౌకర్యం మొదలగు సమస్యల పైన పెద్దమ్మ కాలనీవాసులు తీవ్ర ఆవేదన, అసంతృప్తి, దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాలనీ ఏర్పడిన నాటి నుండి ఇంకా కూడా కనీస సౌకర్యాలు లేవని సర్పంచులను, వార్డు మెంబర్లను, స్థానిక ఎమ్మెల్యేను కూడా విన్నవించుకున్నామని, అయినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉందన్నారు. ఎండాకాలం ఆరంభం అవుతున్న మార్చిలో త్రాగునీటి సమస్య, వాడుకోవడానికి బస్తీ నల్ల ద్వారా మూడు రోజులకు ఒకసారి కేవలం 50 లీటర్లు, 15 నిమిషాలు మాత్రమే వస్తున్నాయని, ఇంటింటికి నల్ల కనెక్షన్ ను ఇచ్చి, సమస్య ను గుర్తించి తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కీసర డిప్యూటీ కమిషనర్ వసంత రెడ్డి జిహెచ్ఎంసి 300వ వార్డు, శామీర్ పేట్ డివిజన్లోని, పెద్దమ్మ కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నపాన్ని తెలియజేస్తామని సమస్య పరిష్కరించే వరకు పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ కాలనీ పార్టీ నాయకురాలు మనమ్మ, జీవన్ ప్రధాన్, స్థానికులు జక్క్యాభి, సమీనా, కొప్పు స్వాతి, తూర్పాటి అంజమ్మ, పర్ధం మంగ, తూర్పాటి జ్యోతి, స్థానిక కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version