కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్..

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసిన కేజీవీబీ టీచర్స్

భూపాలపల్లి నేటిధాత్రి

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) టీచర్స్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబివి) పథకం 2004లో భారత ప్రభుత్వంచే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసి మైనార్టీ వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాల బాలికలకు 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన నివాస విద్యను అందించడానికి ప్రారంభించబడింది. అది సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా కొనసాగుతూ బాలికల అక్షరాస్యతా పెంపునకు దోహదపడాలి. కానీ, ఆచరణలో నేడు కేజీబివిలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థినుల నుండి మొదలు, అందులో పని చేసే అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వరకు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. పేరుకే అవి నాణ్యమైన విద్యనందించే నిలయాలు అని చెప్తున్నప్పటికీ అందులో పని చేసే సిబ్బందికి అవి పెట్టి చాకిరి నిలయాలుగా మారాయి. 2004 నుండి ప్రారంభమైన ఈ పాఠశాలల్లో ‘సమాన పనికి సమాన వేతనం” అమలు చేయకుండా అతి తక్కువ వేతనంతో ఎక్కువ శ్రమను రక్షణ లేకుండా చేయిస్తున్నారు. కేజీబివిలలో పని చేసే టీచర్లు అందరు మహిళ టీచర్లే, కానీ, రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోని పంచాయితీరాజ్ టీచర్లతో పోల్చినపుడు అన్ని విషయాలలో చాలా వ్యత్యాసం కనబడుతుంది. కేజీబివిలలో పని చేస్తున్న మహిళా టీచర్ల వేతనాలు SOల నెల వేతనం రూ.32,500.00, పేజీసిఆర్టీలకు రూ.29,700.00, సిఆర్జీలకు 26,000.00 వేతనాలు చెల్లిస్తున్నారు. అదే విధంగా సెలవులు కూడా మహిళా టీచర్లకు సాధారణ సెలవులు అకాడమిక్ సంవత్సరానికి 20 మాత్రమే ఇస్తున్నారు. రెగ్యులర్ మహిళా టీచర్లకు 27 ఇస్తున్నారు. ఇంత తేడా ఎందుకు? అనే దానికి సమాధానం లేదు. ఈ 20 సాధారణ సెలవులు కూడా ప్రతి నెల 2 మాత్రమే వాడుకోవాలి. వాడుకోకపోతే ఆ రెండు సెలవులు కోల్పోవాల్సిందే. రెగ్యులర్ టీచర్లు మాత్రము సంవత్సరంలో అవసరం ఉన్నప్పుడు వాడుకొనే అవకాశం కల్పించారు. కేజీబివి టీచర్లకు శిశు సంరక్షణ సెలవులు లేవు. అర కొర వేతనంతో పని చేస్తున్నందుకు, కనీసం వైద్య సదుపాయం కూడా కల్పించడం లేదు. పంచాయితీరాజ్ పాఠశాలలకు కల్పించే 5 ఐచ్చిక సెలవులు, 3 స్థానిక సెలవులు గాని కేజీబివి పాఠశాలలకు లేవు. ప్రతి కేజీబివి రెసిడెన్సిల్ పాఠశాలగా నడుస్తుంది. కాని అందులో హాస్టల్ వార్డెన్ నియమాకం లేదు. అదే విధంగా కేర్ టేకర్ పోస్టు నియమాకం లేదు. ఈ బాధ్యతలన్నీ అందులోనే SO లతో పాటు ఆ టీచర్లే బాధ్యత తీసుకోవాలి. ప్రతి రోజు ఒక టీచర్ నైట్ డ్యూటీ చేయాలి. అ టీచరే మరుసటి రోజు మధ్యాహ్నం’ వరకు ఉండి రిలీవ్ కావాలి. ఈ పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణిస్తే కనీస ఆర్థిక సహాయం లేదు. ప్రమాద బీమా లేదు. వారు అన్నారు ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి
సుదర్శన్ రాష్ట్ర కోఆర్డినేషన్ వీరేశం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ కేజీబీపీ టీచర్స్ చైతన్య రాధిక సులోచన జ్యోతి రాణి స్రవంతి కవిత సుధా రవళి రజిత తదితరులు పాల్గొన్నారు

టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్..

టిఎన్జివిఏ జిల్లా అధ్యక్షులుగా గిరిధర్ రావ్

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలో భాగంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ననువాల గిరిధర్ రావు, కార్యదర్శిగా జడ కమలాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశువైద్య పశుసంవర్థక అధికారి డా.లింగారెడ్డి, జిల్లా టిఎన్జివోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి, టిఎన్జివిఏ రాష్ట్ర అధ్యక్షులు బింగి సురేష్ లు హాజరై మాట్లాడుతూ సంఘ సభ్యుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించి, నూతన కార్యావర్గానికి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈకార్యక్రమంలో డా.వినోద్ కుమార్, అభిషేక్ రెడ్డి, సంగెం లక్ష్మణ్ రావు, రాగి శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, హార్మిందర్ సింగ్, కిరణ్, రాజేష్ భరద్వాజ్, చిరంజీవి, భాగ్య, వేణుగోపాల్ రెడ్డి, రఫీయుల్లా, తోట రాజు, విజయలక్ష్మి, బి.రాజు, శ్రీనివాస్, మమత, ప్రణయ్, క్రాంతి, రాము, సత్యలక్ష్మి, రజిత, అనిత, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version