సీకేఎం కాలేజీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు…

సీకేఎం కాలేజీలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు

వరంగల్, నేటిధాత్రి.

వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. పదవ బెటాలియన్ ఎన్‌సీసీ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ సీఐ సుజాత, షీ టీం ఎస్సై శ్వేత, ముఖ్య అతిథులుగా హాజరై సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందమే షీ టీమ్ అని తెలిపారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఈవ్‌టీజింగ్, స్టాకింగ్ వంటి సమస్యలను అరికట్టడంలో షీ టీమ్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కళాశాలలు, పాఠశాలలు మరియు సమాజంలో మహిళల భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా మహిళల గౌరవాన్ని కాపాడడంతో పాటు వేధింపులను నిరోధించవచ్చని అన్నారు.

ట్రాఫిక్ సీఐ సుజాత మాట్లాడుతూ.. మహిళలు ఎదుర్కొనే సమస్యలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ హెల్ప్‌లైన్ 100, షీ టీమ్ నెంబర్ 1930కు ఫోన్ చేయవచ్చని లేదా తెలంగాణ పోలీస్ సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఒకే బండిపై ముగ్గురు ప్రయాణించరాదని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని తెలిపారు. యువత రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు అనేకం ఉన్నాయని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరో ముఖ్య అతిథి ఎస్సై స్వాతి మరియు హెడ్ కానిస్టేబుల్ నారాయణ మాట్లాడుతూ షీ టీమ్ నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు సమాజంలో మహిళలకు భద్రత కల్పించడంలో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా యువతులు తమ వాట్సాప్ డీపీలు, స్టేటస్‌లలో వ్యక్తిగత వివరాలు లేదా ఫోటోలు పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వరప్రసాద్, విజయ్ పాల్ రెడ్డి, ఎన్‌సీసీ కెప్టెన్ డాక్టర్ సతీష్, లైబ్రేరియన్ అనిల్, ఆయేషా, కానిస్టేబుల్ పూర్ణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, పా షా, జ్ఞానేశ్వర్, స్రవంతి, హరిబాబు, వెంకట్, సుమన్, చంద్రమోహన్ తదితర బోధనా, బోధనేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ మరియు ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు.

ఉపాధి’ కూలీలకు ‘యాప్‌’ తిప్పలు….!

ఉపాధి’ కూలీలకు ‘యాప్‌’ తిప్పలు….!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది’ అనే సామెతలాగా ఉంది ఉపాధి హామీ (ఈజీఎస్‌) పథకం తీరు. పథకాల అమలులో పారదర్శకత కోసం ఒక కొత్త ఆవిష్కరణ తెచ్చినా.. వాటిల్లో ఉత్పన్నమయ్యే లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. కానీ, ఈజీఎస్‌ పథకంలో అలా కన్పించడం లేదు. సాంకేతికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు.. ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని నీరుగార్చే విధంగా కనిపిస్తున్నాయి.

◆-: రెండు పూటలా కూలీల ‘ఫొటో స్కానింగ్‌’ నిబంధనలు

◆-: నెట్‌ సిగ్నల్‌, యాప్‌ పనిచేయక అప్‌లోడ్‌ కాని ఫొటోలు

◆-: రోజంతా పని చేసినా హాజరు నమోదుగాక ఇబ్బందులు

‘కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది’ అనే సామెతలాగా ఉంది ఉపాధి హామీ (ఈజీఎస్‌) పథకం తీరు. పథకాల అమలులో పారదర్శకత కోసం ఒక కొత్త ఆవిష్కరణ తెచ్చినా.. వాటిల్లో ఉత్పన్నమయ్యే లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందుకుసాగాల్సి ఉంటుంది. కానీ, ఈజీఎస్‌ పథకంలో అలా కన్పించడం లేదు. సాంకేతికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు.. ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని నీరుగార్చే విధంగా కనిపిస్తున్నాయి.

ఈజీఎస్‌ పనుల్లో నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ యాప్‌ ద్వారా కూలీల హాజరు నమోదు ప్రక్రియను కేంద్రం అమలుచేస్తోంది. అయితే, ఈ విధానం కూలీలకు తలనొప్పిగా మారింది. సాంకేతిక సమస్యలతో తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. కూలీలు చేసే పని ప్రదేశంలో ఇంటర్నెట్‌, సర్వర్‌ సమస్యలతో ఫోన్లో ఫొటో స్కాన్‌ కావడం లేదు. దీంతో కూలీల హాజరు నమోదుగాక వారు వేతనాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఫొటో స్కాన్‌ కోసం కూలీలు గంటల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. రోజంతా పనిచేసినప్పటికీ యాప్‌లో ఫొటో అప్‌లోడ్‌ కాకపోవడంతో హాజరు నమోదు కావడంతో దీంతో కూలీలు నిరాశతో ఇంటిబాట పడుతున్నారు. నూతన యాప్‌ లింక్‌ విధానంతో గత కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉపాధి పనుల వద్ద కూలీలు పడ్తున్న ఇబ్బందులపై ‘నమస్తే తెలంగాణ’ కథనం.

పనిలేని పేదలకు ఏడాదిలో కనీసం వంద రోజులపాటు పని కల్పించాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) చట్టాన్ని 2006లో అప్పటి కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, తాజాగా ఈ పథకం పేరును ‘జీ రామ్‌ జీ’గా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మార్చింది. దాంతోపాటు ఈ చట్టంలోని సరికొత్త మార్పులను కూడా తెచ్చింది. పని ప్రదేశంలో ఉదయం ఒకసారి, పని పూర్తయిన తరువాత అక్కడే మరోసారి కూలీల ఫొటోలను లింక్‌ యాప్‌లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆప్‌లోడ్‌తో చేయాలనే విధానాన్ని తీసుకొచ్చింది. ఈ నూతన యాప్‌ కారణంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిర్దేశించిన మేరకు పనులను చేయించలేక కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయడానికే పరిమితమవుతున్నారు.

దీంతో అసలు ఈ పథకం ఉద్దేశం పూర్తిగా నీరుగాతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం కూలీల ఫొటోలు ఉదయం, సాయంత్రం కలిపి రెండు పూటలా యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సమస్యల కారణంగా ఫొటోలు అప్‌లోడ్‌ కాకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోజంతా కష్టపడి పని చేసినా యాప్‌లో ఫొటో అప్‌లోడ్‌ కాకపోవడంతో వారి హాజరు నమోదు కావడం లేదు. దీంతో కూలి పనిని ఎలా లెక్కిస్తారని, ఆ మేరకు నగదును తమ ఖాతాలో ఎలా జమ చేస్తారని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు యాప్‌లో సదరు కూలీ ఫొటో విజయవంతంగా అప్‌లోడ్‌ అయితేనే హాజరు నమోదు అయినట్లుగా ఫీల్డ్‌ అసిస్టెంట్‌ చెబుతున్నాడని అంటున్నారు. అనేకమందికి ఈ ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు.

“ఎంజీఎం” లో జూనియర్ డాక్టర్ల తీరుపై విమర్శలు..

“ఎంజీఎం” లో జూనియర్ డాక్టర్ల తీరుపై విమర్శలు..!

రిపోర్టర్లపై బెదిరింపులు? వాట్సాప్ గ్రూపుల్లో ఆరోపణలు?

వరంగల్, నేటిధాత్రి.

 

 

ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎంజీఎం హాస్పిటల్‌లో ఇటీవల జరిగిన ఒక ఘటన నేపథ్యంలో కొందరు జూనియర్ డాక్టర్ల వ్యవహార శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సంఘటనకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఒక సీనియర్ రిపోర్టర్ పేరు ప్రస్తావిస్తూ మెసేజ్‌లు షేర్ అయినట్లు సమాచారం వెలువడటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

సమాచారం ప్రకారం ఇటీవల ఎమర్జెన్సీ విభాగంలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి “ఒక సీనియర్ రిపోర్టర్‌కు సంబంధించిన వ్యక్తులు వచ్చి డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు” అనే విధంగా కొందరు జూనియర్ డాక్టర్లు తమ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టినట్లు తెలిసింది.

అయితే సంఘటనపై పూర్తి వివరాలు తెలియకుండానే ఒక రిపోర్టర్ పేరు ప్రస్తావిస్తూ ప్రచారం జరగడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ఇక ఆ రోజు జరిగిన సంఘటనపై మరో కోణం కూడా వినిపిస్తోంది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఒక సీనియర్ రిపోర్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందిందని, తనకు తెలిసిన వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచ్చారని, అక్కడ సరైన స్పందన లేదని చెప్పడంతో ఆయన ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలిసింది. ఆ సమయంలో అక్కడ నెలకొన్న గొడవ పరిస్థితులను వీడియోగా చిత్రీకరించినట్లు సమాచారం.
ఈ విషయాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే ఆ తరువాత కొందరు జూనియర్ డాక్టర్ల వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన సంభాషణలకు సంబంధించిన కొన్ని స్క్రీన్‌షాట్‌లు బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వరంగల్‌కు చెందిన కొందరు రిపోర్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇక మరోవైపు ఎంజీఎం ఆసుపత్రిలో రిపోర్టర్లు ఫోటోలు, వీడియోలు తీయకుండా కొందరు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో జరిగిన రివ్యూ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రభుత్వ గుర్తింపు కార్డు (అక్రిడిటేషన్) కలిగిన రిపోర్టర్లు ప్రజలకు సంబంధించిన అంశాలను కవర్ చేయడానికి ఆసుపత్రిలో ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చని పేర్కొన్న విషయం గుర్తుచేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో జరిగిన ఘటనపై స్పష్టత రావాలని, వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇలాంటి వివాదాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్థానిక వర్గాలు సూచిస్తున్నాయి.

అయితే ఈ ఆరోపణలపై జూనియర్ డాక్టర్ల స్పందన తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై సమగ్రంగా పరిశీలించి వాస్తవాలు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత…

‘సర్పంచ్ చేతుల మీదుగా పేదింటి వివాహానికి ఆర్థిక సహాయం అందజేత

జహీరాబాద్ నేతి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం, హుగ్గేల్లీ గ్రామానికి చెందిన మర్పల్లి గొల్ల యాదమ్మ-మల్లయ్య దంపతుల కుమార్తె పూజ (శిరీష) వివాహం బుధవారం దిగ్వాల్లోని నేషనల్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హుగ్గేల్లీ సర్పంచ్ పట్లోళ్ళ విమల శ్రీనివాస్ డ్డి ముఖ్య అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సహాయం చేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా వధువు కుటుంబానికి వివాహ కానుకగా ₹11,000 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

వినియోగదారులకు విద్యుత్ సేవలందించడంలో లైన్మెన్ ల పాత్ర అత్యంత కీలకం..

వినియోగదారులకు విద్యుత్ సేవలందించడంలో లైన్మెన్ ల పాత్ర అత్యంత కీలకం

-మొగుళ్ళపల్లి విద్యుత్ ట్రాన్స్ కో ఇంచార్జీ ఏఈ సంజయ్
మొగుళ్లపల్లి నేటి ధాత్రి

వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సేవలు అందించడంలో లైన్మెన్ ల పాత్ర అత్యంత కీలకమని మొగుళ్ళపల్లి విద్యుత్ ట్రాన్స్ కో ఇంచార్జీ ఏఈ సంజయ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ ఉపకేంద్రంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డీఈ పాపిరెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ ట్రాన్స్ కో ఇంచార్జీ ఏఈ సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ లైన్మెన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి అంకితభావంతో పనిచేస్తున్న లైన్మెన్ లకు జాతీయ లైన్మెన్ దివాస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు, వినియోగదారులకు 24 గంటల పాటు విద్యుత్ సేవలందించేందుకు లైన్మెన్ ల పాత్ర ఎంతో కీలకమని, చలి, ఎండ, వాన కాలాలను లెక్క చేయకుండా..వినియోగదారులకు నిరంతర విద్యుత్ సేవలందించడమే వారు లక్ష్యంగా పనిచేస్తారన్నారు. అనంతరం లైన్మెన్ లను , ఏఎల్ఎంలను , ఆర్టిజన్ కార్మికులను , అన్ మ్యాన్డ్ కార్మికులను , స్పాట్ బిల్డర్లను శాలువాలతో ఘనంగా సత్కరించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోర్ మెన్ యాదగిరి, లైన్ ఇన్స్పెక్టర్లు గుగులోతు శ్రీనివాస్ నాయక్, దశరథం, లైన్మెన్లు మచ్చ సత్యం, రేణికుంట్ల శ్రీనివాస్, అనిల్, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ…

ప్రజా బాటలో భాగంగా ఎలక్ట్రికల్ ఏఈ

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

‘ప్రజా బాట’ కార్యక్రమంలో భాగంగా ఝరాసంగం మండలం మేడపల్లి గ్రామంలో ఎలక్ట్రికల్‌ ఏఈ సరళ, సబ్‌ ఇంజినీర్‌ హస్నౌద్దీన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ షాదుల్లా, ఏఎల్‌ఎం శేఖర్‌ పర్యటించారు. గ్రామ సర్పంచ్ కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు యువ నాయకుడు అభిలాష్ రెడ్డి, ఉప సర్పంచ్ మజార్ అహ్మద్ గ్రామంలోని విద్యుత్ సమస్యలను వారికి వివరించారు. దీనికి స్పందించిన ఏఈ మేడమ్ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అనుమతులేకుండా…ఆరంతస్థులు…

అనుమతులేకుండా…ఆరంతస్థులు

* అనుమతికి మించి భారీ బహుళ అంతస్తులు
* సెట్‌బ్యాక్‌వదలకుండా..డొమెస్టిక్‌ పర్మిషన్‌తో జోరుగా కమర్షియల్‌ నిర్మాణాలు
* పంచాయతీ ఆదాయానికి గండికొడుతున్న వైనం
* మెండుగా అధికార పార్టీ నేతల అండదండలు
* నోటీసులతోనే సరిపెడుతున్న పంచాయతీ అధికారులు
* అక్రమాలు అధికారుకు కాసులు కురిపిస్తున్నాయన్న విమర్శలు.

నేటిధాత్రి, చేవెళ్ల :

షాబాద్ మండలంలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని.. అనుమతులు లేకుండా మరికొన్ని అడ్డూఅదుపు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మండలంలో అక్రమనిర్మాణాలు కొనసాగుతుంటే .. నిద్రవస్థలో జోగుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు. జీపీలలో ఇండ్ల నిర్మాణాలు, అనుమతులను గ్రామపంచాయతీ మానిటర్‌ చేస్తుంది. పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునే వారే కరువయ్యారంటే గ్రామపంచాయతీలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పర్యటించి అనుమతుల మేరకే నిర్మాణాలు కొనసాగుతున్నాయా లేదా అని అధికారులు పరిశీలించడం లేదు. ఇక అనేకచోట్ల భవనాలు పూర్తయినా అధికారులు అసెస్‌మెంట్‌ చేసి.. ఇంటి నంబర్లు కేటాయించడం లేదు. అక్రమ కట్టడాలు గుర్తించకపోవడం, పూర్తయిన నిర్మాణాలకు అస్సెస్‌మెంట్‌ చేయకపోవడంతో గ్రామపంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. కొన్ని సందర్భాల్లో గ్రామపంచాయతీలలో అధికారులకు ఫిర్యాదులు వెళ్లగానే కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారు. ఆ తర్వాత పట్టించుకోకుండా నిద్ర నటిస్తున్నారు.

అనుమతులు జి+2 నిర్మాణం 6అంతస్తులు

గ్రామపంచాయతీ నిబంధనలను పాతరేసి 6 అంతస్తుల భవన నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామపంచాయతీ నిబంధనలు ఉల్లంఘించి నాగరగూడ ప్రధాన చౌరస్థలో గ్రామపంచాయతీ కార్యాలయానికి కనుచూపు మేరలో 6అంతస్తుల భారీ భవన నిర్మాణం జరుగుతుంది. బిల్డింగ్ పూర్తి దశకు చేరుకున్నాక నోటీసులు ఇచ్చామని చెపుతున్న అధికారులు, అయినా యతేచ్చగా పనులు సాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తుంది. నాగరగూడ పంచాయతీ పరిధిలో రాజకీయ అండదండలతో ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్దంగా సెల్లార్ నిర్మాణం తో పాటు,
6 అంతస్థుల భారీ భవన నిర్మాణం చెపుడుతున్నారు . విషయం తెలిసి కూడా గ్రామ సెక్రటరీ కనీసం చర్యలు చెప్పటకపోవటం గమనార్హం. సామాన్యుడు చిన్న నిర్మాణం చేసిన పంచాయతీనుండి హుటా హుటిన పరుగులు తీసే అధికారులు, ఇంత భారీ భవన అక్రమనిర్మాణం జరుగుతుంటే అధికారుల ఆదేశాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. అయితే వారు హెచ్ ఎం డి ఏ నుండి అనుమతులు తీసుకున్నామని చెపుతున్నారని స్పష్టం చేశారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే నోటీసులు ఇచ్చామని చెప్పి నెలరోజులు గడుస్తున్నా
, బిల్డింగ్ పనులు సజావుగా సాగుతున్నాయి. అక్రమనిర్మాణలపై పంచాయతీ సిబ్బంది, అధికారులు
నిద్రవస్థ వీడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి

[అక్రమ నిర్మాణాలపై నాగరగూడ పంచాయతీ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. సెక్రటరీ వైఖరీపై నాగరగూడ గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదైన పని ఉంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరని, కార్యాలయానికి వెళ్తే అందుబాటులో ఉండరని, అతనిపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.]

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ…

కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణ

-రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం

-దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకోలు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమట్ల గ్రామానికి చెందిన పసునూటి బాలకృష్ణ గత ఆరు సంవత్సరాల నుండి కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతుండేవాడు. రూ.10 లక్షల వరకు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఖర్చు పెట్టుకున్నప్పటికీ..ఆ వ్యాధి నయం కాకుండా మంచాన పడ్డాడు. దీంతో విధి వక్రీకరించిన ఆ కుటుంబం వీధిన పడ్డట్లయ్యింది. పసునూటి బాలకృష్ణకు భార్య స్రవంతి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, విష్ణు ప్రియలున్నారు. రోజువారి కూలి పనులు చేసుకుంటూ..భార్య శిరీష కుటుంబ జీవనాన్ని వెల్లదీస్తుంది. దీనికి తోడు కండరాల క్షీణిత వ్యాధితో మంచాన పడ్డ పసునూటి బాలకృష్ణకు నెలకు రూ. 20వేల వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అలాగే అదే వ్యాధితో పసునూటి బాలకృష్ణ సోదరీమణులు బాధపడుతున్నారు. కండరాల క్షీణిత వ్యాధి నుంచి బాధపడుతున్న వీరిని రక్షించేందుకు మానవత్వం కలిగి ఉన్న దాతలు స్పందించి..రెక్కాడితే గానీ డొక్కాడని ఆ నిరుపేదల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆ కుటుంబాలకు విరాళాలు ఇచ్చి..బాధిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు వచ్చే దాతలు ఫోన్ పే నెంబర్ 8309029249, గూగుల్ పే నెంబర్ 9666321300 లకు విరాళాలు ఇవ్వాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విచారణ చేపట్టిన డిఎస్పి….

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విచారణ చేపట్టిన డిఎస్పి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు కాగా భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు బుధవారం విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించి. మొగుళ్లపల్లి మండలంలోని కొరికిషాల గ్రామానికి చెందిన మాల కులానికి చెందిన ఈత ఓదమ్మ,వృత్తి కూలి, . 2.మార్చి .2026 న మా గ్రామంలో ఉపాధి హామీ కరువు పని నిమిత్తం పోయి పని చేస్తూ ఉండగా అక్కడ నాతోపాటుగా కరువు పనికి వచ్చిన ఆరె కులానికి చెందిన లింగంపల్లి సునీత, మాల కులం పేరుతో బూతులు తిడుతూ నన్ను అకారణంగా బూతులు తిట్టగా , నేను ఆమె జోలికి పోకుండా ఊరుకున్నాను. తేదీ 3 మార్చి 2026 రోజున ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయాన నీను మా గ్రామ పెద్ద మనుషుల సమక్షంలో విషయాన్ని తెలుపుతుండగా సదరు సునీత ఆమె భర్త లింగంపల్లి రాయమల్లు ఆగయ్య దంపతులు ఇద్దరు కలిసి పచ్చి బూతులతో పలుసార్లు కులం పేరుతో దూషిస్తూ సునీత, రాయమల్లు వారు కాళ్లకు వేసుకునే చెప్పులతో నన్ను కొట్టి కొట్టి, కిందపడేసి చేతులతో కొట్టి, కాళ్లతో తన్నినారని కులం పేరుతో దూషిస్తూ కొట్టిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని నాకు తగిన న్యాయం చేయగలరని దరఖాస్తు రాగా మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్ కేసు నమోదు చేయగా భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు బుధవారం కొరికిశాల గ్రామంలో విచారణ చేపట్టారు.

బతుకు.. బండి..

బతుకు.. బండి..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా లోని నారాయణఖేడ్,కంగ్జి, వాసర, మనూర్ మండలాల నుంచి జహీరాబాద్ ప్రాంతంలోని ఝరాసంగం, న్యాల్ కల్, కోహిర్, మొగుడంపల్లి, జహీరాబాద్ తదితర ప్రాంతాలకు చెరుకు తరలింపు పనుల కోసం నాలుగు నెలల క్రితం వలస వచ్చారు. చెరుకు పనులు ముగియడంతో ఎడ్లబండ్లపై తమ స్వగ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. గురువారం ఉదయం ఝరాసంగం మండలం మాచ్నూర్ నుంచి బర్దిపూర్కు వెళ్లే నిన్జ్ రహదారిపై ఎడ్లబండ్లపై కూలీలు వెళ్తుండటం కనిపించింది. “దిశ” వారిని పలకరించగా, నవంబర్ నెలలో కాంగ్జి నుంచి చెరుకు పనుల నిమిత్తం వచ్చామని, ప్రస్తుతం పనులు ముగియడంతో తిరిగి తమ గ్రామాలకు వెళ్తున్నామని తెలిపారు.

2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు…

2,00,000/- రూపాయల ఎల్ఓసి ని అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జహీరాబాద్ పట్టణం ఫరీద్ నగర్ కాలనీ కి చెందిన బాను బీ గారికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,00,000/-(రెండు లక్షల రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించి , లబ్ధిదారురాలి కుటుంబసభ్యులకు అందజేసిన జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా లబ్ధిదారురాలు & వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే గారికి, కౌన్సిలర్ పర్వీన్ జహాన్ – యాకూబ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు .

భార్య కనిపించడం లేదని భర్త పిర్యాదు…

భార్య కనిపించడం లేదని భర్త పిర్యాదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా కోహిర్ పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని భర్త పిర్యాదు పై కేసు నమోదు అయినట్లు కోహిర్ ఎస్సై నరేష్ పత్రిక ప్రకటనలో తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన కవంపల్లి రాచయ్య తండ్రి చంద్రయ్య అనె వ్యక్తి భార్య అయిన కవంపల్లి కృష్ణవేణి వయస్సు 30 సంవత్సరలు మహిళా వెంకటాపూర్ గ్రామం నుండి గత నెల 25వ తేదిన ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయిందని తన భార్య గురించి బంధువులు చుట్టుపక్కల, స్నేహితుల వద్ద ఎంత వెతికినా ఆమె జాడ లేదని ఆమె ఆచూకీ కొరకు బుధవారం స్టేషన్ వచ్చి పిర్యాదు చేసాడని అ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌…

రెండు రోజులు నీటి సరఫరా బంద్‌

వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు.

మెదక్‌: వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారీకి చర్యలు తీసుకున్నట్లు మిషన్‌ భగీరథ ఏఈ నాగభూషణం ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా పెద్దరెడ్డిపేట వద్ద పైప్‌లైన్‌ లీకేజీ మరమ్మతులు, రాయిపహాడ్‌ వద్ద స్లూయి్‌సవాల్స్‌ రిపేర్లు, సివిల్‌ పనులు, సంపులు శుభ్రపరచడం తదితర నిర్వహణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తిచేయడం కోసం సింగూరు(Singoor) నుంచి జిల్లాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు.

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్…

ఇరాన్‌పై అమెరికా దాడులు.. ఆ వ్యాఖ్యలను ఖండించిన భారత్

 

ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నౌకాదళం భారత పోర్టులను వినియోగిస్తున్నదన్న వార్తలను కేంద్రం ఖండించింది. ఇలాంటి ఆరోపణలు నిరాధారం, కల్పితమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రాచ్యంలో కొన్ని రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా నావికాదళం భారత నౌకలను ఉపయోగిస్తోందంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాలను కేంద్రం ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమని కేంద్ర విదేశాంగ శాఖ(MEA) స్పష్టం చేసింది.

అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై ఒత్తిడి పెరగడంతో మా నావల్ బేస్‌లు ధ్వంసమయ్యాయి. మా నౌకాశ్రయ సదుపాయాలూ ధ్వంసమయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము భారత్, ఆ దేశానికి చెందిన నౌకాశ్రయాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇది సరైన మార్గం కాదు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం కారణంగా అలా చేయక తప్పడం లేదు’ అని మాక్‌గ్రెగర్ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్ర విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్ విభాగం.. ఆ వ్యాఖ్యలను పూర్తిగా ఖండించింది. ‘భారత పోర్టులు అమెరికా దాడులకు ఉపయోగిస్తున్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. నిర్ధారణ లేని సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించింది.

రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను సదుపాయం కల్పించాలి

 

· స్వాతంత్య్రోద్యమానికి, ఆధునిక జర్నలిజానికి మధ్య తరం ఇది

· సైద్ధాంతిక నిబద్ధతే సర్వంగా పనిచేసిన నిస్వార్థ జర్నలిస్టుల తరం ఇది

· నెమ్మదిగా పశ్చిమాద్రికి చేరుతున్న భానుడితో నడుస్తున్న తరం

· పేద, మధ్యతరగతి వారి సమస్యలతో ప్రభుత్వాన్ని మేý£్కల్పిన తరం

· పదునైన అక్షర చురకత్తులతో సామాజిక మార్పుకోసం పోరాటిన వైనం

· “తండ్రి”లా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపిన తరం

· “బిడ్డలా” వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

· ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు “నేటిధాత్రి” దినపత్రిక విజ్ఞప్తి 

హైదరాబాద్, నేటిధాత్రి: 

స్వాతంత్య్రోద్యమ కాలంలో తమ సర్వస్వస్వం ఉద్యమం కోసం త్యాగం చేసిన వెలుగులోకి రాని మహానుభావులెందరో! అదేవిధంగా నాటి ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది జర్నలిజమే! నాటి తొలితరం కాంగ్రెస్ నాయకుల్లో అత్యధికులు తమ రచనలు, వ్యాసాల ద్వారానే ప్రజల్లో చైతన్యాన్ని ఉద్దీప్తం చేయగలిగారు. కేవలం జర్నలిజం మాత్రమే నాటి 19వ శతాబ్దంలో సతీసహగమనాన్ని రూపుమాపడానికి, 20వ శతాబ్దంలో వితంతు పునర్వివాహాల వంటి సంస్కరణోద్యమాలకు మూల స్తంభంగా నిలిచింది, సమాజాన్ని గెలిపించింది. నాటి స్వాతంత్య్రోద్యమ త్యాగాల ప్రేరణతో, స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి కాలంనుంచి నేటి ఆధునిక జర్నలిజం పోకడలకు మధ్య “స్ఫూర్తిదాయక జర్నలిజాన్ని” నెరపి సమాజ హితానికి ఒక తరం జర్నలిస్టులు కషిచేసారనేదానికంటే పో రాటం చేసారని చెప్పడమే సముచితం. “సిద్ధాంతమే” ఈ జర్నలిస్టుల పోరాటానికి స్ఫూర్తి. ఆకలే ఆయుధం, పేదల వెతýను వెలుగులోకి తెచ్చి వారి బతుకులను బాగుచేయడమే లక్ష్యంగా తమ అక్షరాలను చురకత్తులుగా మలచిన గొప్పతరం అది! దళితులు, స్త్రీలు, బలహీనులకోసం వివిధ పంథాలలో పోరాటం చేసి సామాజిక మార్పు అనే “అరుణోదయం కోసం” కషిచేసిన ని స్వార్థ సైద్ధాంతిక నిబద్ధ జర్నలిజం నెరపిన జర్నలిస్టుల తరం, ఇప్పుడు తన ఒడిలోకి రమ్మని ఆ ప్యాయంగా పిలుస్తున్న “పశ్చిమాద్రి ఆరుణకాంతుల” వైపునకు నిశ్శబ్దంగా పయనిస్తోంది. ఆకలికి అన్నం, వేదనకు ఔషదం ఎట్లాగో… క్షుద్బాధను, వ్యాధుల బాధను, నిత్యజీవితంలో సర్వ సమస్యలకు “సిద్ధాంతమే” ఔషధంగా పనిచేసిన త్యాగమయ స్ఫూర్తిదాయక జర్నలిజం నెరపిన తరం ఇది. 

కమ్యూనికేషన్ రంగంలో నేటి వేగం, నేటి సాంకేతికత నాడు లేవు. ఎలక్ట్రానిక్ మీడియా లేని కాలంలో కేవలం ప్రింట్ మీడియా మాత్రమే వుండేది. వార్తను సేకరించి కార్యాలయానికి పంపి అది ప్రచురితమైన తర్వాత, దానికి వచ్చిన సానుకూల స్పందన, సమస్యకు పరిష్కారం లభించిన సంతప్తే ఎనలేని సంపదగా భావించిన తరం అది. అయితే అప్పటికీ ఇప్పటికీ వ్యవస్థలో కని పించే సారూప్య లక్షణం తమ రక్షణ కోసం పనిచేసే పోలీస్ స్టేషన్ గడప తొక్కడానికి నేటికీ సామాన్యులు భయపడే పరిస్థితి నెలకొనడం! ‘పి’ అంటే పొలైట్‌నెస్, ‘ఓ’ అంటే ఒబీడియన్సీ, ‘ఎల’అంటే లాయల్టీ, ‘ఐ’ అంటే ఇంటిగ్రిటీ, ‘సి’ అంటే కర్టసీ, ‘ఈ’ అంటే ఎఫిసియన్సీ అనే నిర్వచనాన్ని అప్పట్లో కొన్ని పోలీస్‌స్టేషన్ల ముందు రాసి వుండేది. రాజకీయ నాయకులు, పలుకుబడి, సంపన్నుల అండ వున్నవారు మాత్రమే పోలీస్‌స్టేషన్ గడపతొక్కే పరిస్థితి నేటికీ కొనసాగుతోంది. విషయమేంటంటే పైన పేర్కొన్న నిర్వచనంలో ఏ ఒక్కటీ సరిగ్గా పాటించని పోలీసుల వద్దకు వెళ్ల డానికి జంకే జనానికి తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో వుండేది “జర్నలిస్టు” మాత్రమే. ఒక సామాజిక సమస్యను లేదా సామాన్యులకు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులో కి తేగల ఒకే ఒక సాధకుడు జర్నలిస్టు. నేటి పరిస్థితి మాట ఎట్లా వున్నా నాటి జర్నలిస్టులు సామాన్యులకు, బలహీనులకు అండగా నిలిచి, తన పరిస్థితిని కూడా పట్టించుకోకుండా వారికి న్యాయం జరిగేవరకు పట్టువదలని విక్రమార్కుల మాదిరిగా పనిచేసిన వెలుగులోకి రాని జర్నలిస్టులుఎందరో! ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వుండే ఆధిపత్య ధోరణులను సమర్థవంతంగా ఎదిరించింది కూడా ఆ తరం జర్నలిస్టులే! అందుకనే అప్పట్లో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్య “వైరభక్తి” కొనసాగేది. 

సాధారణంగా మిగిలిన డాక్టర్లు, ఉపాధ్యాయులు, సైంటిస్టులు, వ్యాపారులు, ప్రొఫెసర్లు…ఈవి ధంగా రకరకాల వత్తుల్లో పనిచేసినవారికి ఆర్థిక భద్రత వుండటం వల్ల వారి కుటుంబ సంక్షే మానికి ఎటువంటి ఢోకా వుండదు. అందువల్ల వారిది ‘వత్తిధర్మం’. కానీ జర్నలిస్టులు పాటించేది “సష్టి ధర్మం”. అంటే సకల జీవులు తమ సంతానాన్ని నిస్వార్థంగా పెంచి, అవి స్వయంగా జీవించే స్థాయికి ఎదిగిన తర్వాత తమను వదలి వెళుతున్నప్పుడు తమ ధర్మాన్ని పాటించామన్న ఆనందంతో ఆనంద భాష్పాలు కారుస్తాయి. ఇదే సష్టిధర్మం అంటే! నానా కష్టాలు పడుతున్న కుటుంబానికి తగిన న్యాయం చేయలేక పోతున్నాన్న తొలిచేస్తున్న బాధను “అక్షరాగ్నిగా” మలచి సమస్యల పరిష్కారం కోసం తాను “నాటిన (రాసిన)అక్షర విత్తనాలు” ప్రచురితమై పరిష్కారం రూపంలో ఫలించినప్పుడు కంటివెంట జలజల రాలిన “ఆనందాశవుýనే” తాగి దప్పిక తీర్చుకున్న స్ఫూర్తిదాయక, సైద్ధాంతిక నిబద్ధత కలిగిన తరం అది. ఇదే సష్టి ధర్మం!! అటువంటి జర్నలిస్టుల జీవితానికి ఎటువంటి భద్రత లేదు. తగిన వేతనం, సామాజిక భద్రత లేదు. ఇంటికెళితే ని త్యావసరాలకు కూడావెతుక్కునే దుస్థితే. పిల్లల చదువుల, కుటుంబ పోషణకోసం తగిన ఆర్థిక దన్ను వుండేది కాదు. కానీ తాము నమ్ముకున్న సిద్ధాంతం, అక్షర నిబద్ధత వారిలో దైహిక జీవితం పై ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించి ముందుకు నడిపేవి. ఇప్పుడు ఆతరం క్రమంగా కనుమరుగైపోతున్నది. ఆరు దశకాల వయస్సు దాటి, గతంలో తాము సాధించిన విజయాల స్మతుల ఆనందం ఇస్తున్న బలంతో మాత్రమే జీవిస్తున్న ఆ తరం జర్నలిస్టులను ఆదరించడం ప్రభుత్వం కర్త వ్యం. 

తల్లిదండ్రులను సరిగ్గా చూడని సంతానం జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి, ఆ తల్లిదండ్రులకు అందించాలని ఆలోచించే ప్రభుత్వం, తన బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తుచేసి, అన్నివర్గాల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేసేందుకు ప్రభుత్వానికి ఆయా వర్గాల సమస్యలను తెలిపి, న్యాయంచేసేలా దిక్సూచిలా “తండ్రి బాధ్యతను” పోషించిన నాటి ‘వయోవద్ధ జర్నలిస్టులకు’ నేటి ప్రభుత్వం “బిడ్డ” పాత్ర పోషించి ఆదుకోవడం కనీస బాధ్యత. 

అటువంటి జర్నలిస్టుల సేవలను మరువకుండా, సామాజిక బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులకు వివిధ రాష్ట్రాలు పింఛను రూపంలో నెలవారీగా కొంత మొత్తం చెల్లిస్తున్నాయి కూడా. ఉదాహరణకు అస్సాం (రూ.8వేలు), బిహార్ (రూ.15వేలు), హర్యానా (రూ.10వేలు), ఝార్ఖండ్ (రూ.7500), తమిళనాడు (రూ.12వేలు, జర్నలిస్టు మరణం తర్వాత భార్యకు నెలకు రూ.2వేలు), గోవా (రూ.7500), పుదుచ్చేరి (రూ.6వేలు) చొప్పున పింఛన్లు చెల్లిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం “శ్రద్ధానిధి” లేదా “సమ్మాన్ నిధి” పేరుతో రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు రూ.20వేలు గౌరవవేతనంగా చెల్లిస్తోంది. అంతేకాదు 65 సంవత్స రాలు దాటిన జర్నలిస్టులు, వారి భార్యలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ జర్నలిస్టులు, తమకు గతంలో అమలు చేసిన పింఛను స్కీమ్‌ను తిరిగి అమల్లోకి తీ సుకురావాలని ప్ర భుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కూడా జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విధంగా ఆ యా ప్రభుత్వాలు రిటైర్డ్ జర్నలిస్టులకోసం పింఛను సదుపాయాన్ని కల్పిస్తూ, సంక్షేమా కార్యక్ర మాలను అమలు చేస్తుండగా ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసి సాధకబాధకాలు తెలిసిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, సమాచార శాఖను నిర్వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు తెలంగాణ జ ర్నలిస్టులకు పింఛను చెల్లించడానికి తగిన సానుకూల నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలకు సంక్షేమం ఒకవైపు అభివద్ధి మరోవైపు లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి కొద్దిమంది రిటైర్డ్ జ ర్నలిస్టుల సంక్షేమం కోసం పింఛను సదుపాయం కల్పించడం అసలు భారమే కాదు. దీన్ని తన కనీస బాధ్యతగా గుర్తించాలి. ప్రభుత్వం ఏ వర్గాల అభ్యున్నతికోసం కషిచేస్తున్నదో వారికోసమేఈ జర్నలిస్టులు కూడా పనిచేశారు. వారి కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు ప్రభుత్వ దష్టికి తెచ్చి “కొవ్వొత్తి” మాదిరిగా వెలుగులు పంచి తాము కరిగిపోయారు. సామాజిక సేవారంగమైన ‘జర్నలి జంలో’ పనిచేసినవారిని పట్టించుకోవడం ప్రభుత్వం వారి సేవలకు ఇచ్చే కనీస గుర్తింపు! తెలంగాణలో “ప్రజా పాలన` ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రభుత్వం మార్చి 6వ తేదీనుంచి ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు పరిశీలన, గడపగడపకు వెళ్లి సమస్యలను తెలుసుకునే కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగానే “వయోవద్ధ పాత్రికేయుల” (రిటైర్డ్ జర్నలిస్టుల) పింఛను చెల్లింపు కూడా సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అమలు చేయాలని “నేటిధాత్రి” దినపత్రిక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ, సమాచార శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేస్తోంది.

యూనియన్ సమావేశంలో నాయకులు మాట్లాడిన విషయాలు.. “తోట”నోట”తొండిమాట”? ఎపిసోడ్-1

వసూళ్లు వదిలేసి..అప్పులా?

బకాయిలు వదిలేసి..రుణాలా!?

ప్రభుత్వానికి సవాల్ విసిరిన రైస్ మిల్ యూనియన్ నాయకులు?

మిలర్ల బకాయిలు వసూలు చేయక పోవడానికి కారణమేమిటి?

80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని మిలర్లే చెబుతున్నారు?

`అధికారులకు వినిపించడం లేదా?

`వసూలు చేయడానికి బద్ధకమా?

`అధికారులు లెక్కలు వదిలేస్తున్నారా?

`నాయకులు చెప్పిన దానిని బట్టి 24 వేల కోట్ల మిల్లర్ల వద్ద ఉన్నట్లే?

`అధికార వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా వుందా?

`ఇప్పటికే 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కాపాడలేక పోతున్నాం అంటున్న యూనియన్ నాయకులు?

`వచ్చే రబిలో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కడ నిలువ చేస్తారని నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు?

`ప్రభుత్వానికి వినపడుతోందా? అధికారులు నిద్ర పోతున్నారా?

`యూనియన్ నాయకులు విసురుతున్న సవాళ్లు అధికారులకు వినిపించడం లేదా?

`నాయకులు ధాన్యం ఉందని చెబుతుంటే, ధాన్యం లేదని మిల్లర్ల మీద కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారు?

`ఎవరి లాభం కోసం అధికారులు దాడులు చేస్తున్నట్లు?

`నిజానిజాలు కమిషనర్ కు తెలుసా? ఆయనను కూడా అధికారులు మోసం చేస్తున్నారా?

`అధికారులు పంచుకు తినడం కోసం ప్రభుత్వాన్ని ఆగం చేస్తున్నారా?

`నాయకులు చెప్పిన విధంగా మిలర్ల వద్ద వున్న ధాన్యం అమ్మితే 24 వేల కోట్లు వస్తాయి?

`వాటిని వసూలు చేయక పోవడానికి కారణం ఎవరు?

`మిలర్ల బకాయిలు వసూలుకు అలసత్వమెందుకు?

`రైస్ మిల్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసేదాకా తెస్తున్న దెవరు?

హైదరాబాద్, నేటిధాత్రి:

నీతి తప్పిన వారు నిజాయితీ గురించి మాట్లాడితే అసహ్యంగా వుంటుంది. అలాగే తాము అన్యాయమైపోతున్నామని మిల్లర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతుంటే కూడా అలాగే వుంది. ఆశ్చర్యమనిపిస్తుంది. మిల్లర్ల నాయకులు తొండి, మొండి, గండి మాటలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏ వ్యవస్ధలో పెద్దలుగా చెలామణి అయ్యే వారెవరైనా సరే అలాగే మాట్లాడుకుంటారని సమర్ధించుకుంటే సరిపోదు. మిల్లర్ల వ్యవస్ధ అనేది చిన్నది కాదు. సామాన్యమైంది అసలే కాదు. అది ఒక పెద్ద ఇండస్ట్రీ. దానిలో సభ్యులై, నాయకులైన వారు మాట్లాడే సుద్దులు వింటే విచిత్రమనిపిస్తోంది. ఇటీవల మిల్లర్ల నాయకులంతా ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో వేశంలో తమకు అన్యాయం జరిగిపోతున్నట్లు మొసలి కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశారు. ఆ సమావేశంలో తోట సంపత్ అనే యూనియన్ నాయకుడు మాట్లాడిన మాటలు వింతగానూ, విడ్డూరంగా వున్నాయి. అసలు మిల్లర్ల వద్ద వున్న ధాన్యం ఎంతో కూడా ఆయనకు అవగాహన వుండి మాట్లాడారో..లేదో అనేది నిజమైన మిల్లర్లు చెప్పాలి. ఎందుకంటే మిల్లర్ల యూనియన్‌లో చెలమణి అయ్యేవాళ్లలో చాల మందికి మిల్లులు లేవు. ఒకప్ప్పుడు మిల్లులు వున్నా ఇప్ప్పుడు నడవడం లేదు. ఆ వ్యాపారంలో వాళ్లు బాగస్వాములు కాదు. కాని నాయకులుగా చెలామణి అవుతుంటారు. మిల్లర్ల సమస్యలపై ముందుకొస్తుంటారు. మిల్లర్లు అంటే మేమే అనేంతగా కలరింగ్ ఇస్తుంటారు. మిల్లర్లను దోపిడీ చేసుకుంటూ బతుకుతుంటారు. అలాంటి ఓ నాయకుడుగా పేరున్న తోట సంపత్ అనే నాయకుడు ఆ సమవేశంలో తొండి మాటలు కొన్ని మాట్లాడారు. వాటిని మిల్లర్లే సహించడం లేదు. ఎందుకంటే ఓ నలుగురు నాయకులు ఓ గదిలో కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకొని మిల్లర్ల తరుపున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడినంత మాత్రాన వాటి ద్వారా మిల్లర్లకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాని ఆ నాయకులకు మాత్రం ఎంతో ఉపయోగకరం అనేది తేలిపోయింది. అసలు మిల్లే లేని తోట సంపత్ మాటలు చాలా విచిత్రంగానూ, విడ్డూరంగానూ వున్నాయి. ప్రస్తుతం మిల్లర్ల అందరి వద్ద సుమారు 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుందంటూ లెక్కచెప్పారు. ఈ లెక్కను ఎవరు తేల్చాలి? నిజంగానే మిల్లర్ల వద్ద అంత ధాన్యం వుందా? వుంటే అధికారులు మిల్లుల మీద ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తోట సంపత్ చెప్పాలి. చాలా మంది మిల్లర్లు వున్న బకాయిల కోసం అధికారులు మిల్లుల తనిఖీకోసం వెళ్లినప్ప్పుడు అక్కడ ఒక్క బస్తా కూడా లేకపోవడంతోనే కేసులు నమోదు చేస్తున్నారు. మరి మిల్లర్ల వద్ద మొత్తం 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుందని తోట సంపత్ ఎలా చెప్పారు? ఆ ధాన్యం తీసుకోకుండా ప్రభుత్వమే తాత్సారం చేస్తుందనే అర్దం వచ్చేలా తోట సంపత్ మాట్లాడడం జరిగింది. నిజానికి తోట సంతప్ చెప్పినట్లు 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ ఎంత కాదన్నా సుమారు 25వేల కోట్ల రూపాయల విలువైంది. ఈ విషయాన్ని ఎవరో కాదు, ఏకంగా మిల్లర్ల నాయకుడు తోట సంపత్ చెప్పేస్తున్నారు. దానిని ఒక్కసారి అదికారులు అనుసరిస్తే అసలు విషయం తేలుతుంది. ఓ వైపు తెలంగాణ వ్యాప్తంగా మిల్లర్ల అందరి వద్దా పెద్ద ఎత్తున దాన్యం వుందంటూనే మరో వైపు మిల్లర్లను వేదించొద్దంటారు. ఈ రెండు విషయాలల్లో ఏది దేనికి పొంత లేదు. మిల్లర్ల వద్ద ఇంత ధాన్యం వున్నప్ప్పుడు అదికారులు 25శాతం పెనాల్టీ వేయాల్సిన అసవరం లేదు. 12శాతం వడ్డీ వసూలు చేయాల్సిన అవసరమే రాదు. కాని తోట సంపత్ మాత్రం ఇంతకు భిన్నంగా చెబుతున్నారు. uకాయిలు వున్న మిల్లర్ల నుంచి 25శాతం పెనాల్టీలు, 12 శాతం వడ్డీలు వసూలు చేడయం సరైంది కాదంటారు. ఇందులో ఏది నిజమని ప్రజలు నమ్మాలి. ప్రభుత్వం విశ్వసించాలి. మరో పక్క మిల్లర్లు అనేక అవస్ధలు పడుతున్నారంటారు. మిల్లర్లు చితికిపోతున్నారని అంటారు. మిల్లింగ్ ఇండ్రస్త్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తోట సంపత్ చెబుతున్నారు. ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా దిగుబడి సాధించిన ధాన్యం మొత్తం తమ మిల్లర్ల వద్దే వుందని అంటున్నాడు. మిల్లర్లు సమస్యలుఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ఈ రెండింటీకీ ఎలాంటి పొంతన లేకుండాపోతోంది. అంత దాన్యం మిల్లర్ల వద్ద వుందంటే ప్రభుత్వానికి బకాయిలు వున్నట్లే కదా! ఆ బకాయిలు ఇంత కాలం ఎందుకున్నట్లు అనేదానికి మాత్రం తోట సంపత్ సమాదానం చెప్పలేదు. పైగా రైతులు, ప్రభుత్వం రెండు బాగానే వున్నాయి కాని, మిల్లర్లే అవస్ధలు పడుతున్నారని అంటున్నారు. సుమారు 80లక్షల టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద వున్న తర్వాత మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యే ఉత్పన్నం కాదు. కాని ఎందుకు ఇలా తిమ్మిని బమ్మిని చేసే మా{లు మాట్లాడుతున్నారు? అనేదానికి సమాదానం రావాల్సి వుంది. ఓ వైపు ఇప్పటికే తమ వద్ద 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుంది? వాటిని కాపాడేందుకే మిల్లర్ల వద్ద వున్న స్ధలం సరిపోవడం లేదు. రబి సీజన్ రానున్నది. అప్ప్పుడు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతోంది. దానిని ఎక్కడ దాచాలన్నదానిపై ప్రభుత్వమే ఒక మార్గం చూపాలంటున్నారు. ఇలా తిరకాసు పనులు చేస్తూ, ప్రభుత్వాన్ని ఆటాడించే పరిస్దితికి మిల్లర్ల యూనియన్ నాయకులు చేరుకున్నారన్నది స్పష్టమౌతోంది. మిల్లర్ల యూనియన్ నాయకులకు బాద్యత లేదా? ప్రభుత్వం తమ సమస్యలు, గొంతెమ్మ కోరికలు తీర్చాలని అనుకుంటున్నప్ప్పుడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్న ఆలోచన లేదా? ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్దాయి దష్టిపెట్టాలి. మిల్లింగ్ యూనియన్ నాయకులే స్వయంగా ప్రకటిస్తున్నారు. తమ వద్ద వున్న ధాన్యం విలువ ఎంతో చెప్పేస్తున్నారు. ఆ బకాయిలు వసూలు చేయకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది? అదికారులు ఏం చేస్తున్నారు. అలా వేల కోట్ల రూపాయల బకాయిలు మిల్లర్ల మీద వదిలేసి, మళ్లీ వచ్చే సీజన్ కోసం సుమారు 22వేల కోట్ల రూపాయలు రుణం తీసుకోవాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంటోంది? ఈ విషయాలు, వివరాలు సిఎం. రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి, కమీషనర్ కు తెలియదా? వారి దాకా ఈ వివరాలు వెళ్లడంలేదా? అదికారులు ఏం చేస్తున్నారు? యూనియన్ నాయకులే ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసే దాక వెళ్తున్నారు. ఓ వైపు మిల్లర్ల వద్ద ధాన్యం వుండగా, మళ్లీ మేమెలా దాన్యం తీసుకోవాలి? ఎక్కడ భద్ర పరచాలని ప్రభుత్వాన్నే యూనియన్ నాయకులు ప్రశ్నిస్తున్నారంటే ప్రభుత్వానికి అసలు నిజమేమిటో తెలియడం లేదా? అసలు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున మిల్లర్ల యూనియన్ నాయకుల వద్ద పేరుకుపోయిన బకాయిలు ఎందుకు వసూలు చేయడం లేదు? అదికారులు ఏం చేస్తున్నారు? తూతూ మంత్రంగా పనిచేస్తున్నారా? లేక మిల్లర్లు, యూనియన్ నాయకులే అదికారులు సహకరిస్తున్నారా? పైగా మిలర్ల అసోసియేషన్ ప్రభుత్వాన్ని నిందించే దాకా వెళ్తుంటే ఏం చేస్తున్నారు? మిల్లర్లు చెబుతున్న మాట అదికారుల చెవికెక్కడం లేదా? లేక వినిపించుకునే తీరిక అదికారులకు లేదా? బకాయిలు వసూలు చేసే శక్తి అదికారులకు సరిపోవడంలేదా? వసూలు చేయడానికి బద్దకమా? లేక అదికారులే లెక్కలు వదిలేస్తున్నారా? యూనియన్ నాయకులు చెప్పిన దానిని బట్టి వారి వద్ద 25వేల కోట్ల రూపాయలు వున్నట్లే లెక్క. ప్రభుత్వానికి మిల్లర్ల యాజమానులు వినపడడం లేదా? అదికారులు మొద్దు నిద్ర పోతున్నారా? ప్రభుత్వానికే మిల్లర్ల యూనియన్‌లు సవాళు చేస్తున్నారన్న సంగతి అర్దం కావడం లేదా? కుక్కను తోక ఆడిస్తుందా? లేక తోక కుక్కను ఆడిస్తుందా? అనే అనుమానం అదికారులకు రావడంలేదా? ఎవరి లాభం కోసం అదికారులు పనిచేస్తున్నారు? ఎవరి మేలు కోసం అదికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారు? బకాయిలు వసూలు చేసే శక్తి అదికారులకు సరిపోవడం లేదా? అదికారులు లాలూచీ పడి లొంగిపోతున్నారా? మిల్లర్ల నాయకులకు భయపడుతున్నారా? బహిరంగంగా యూనియన్ నాయకులు తమ వద్ద అంత దాన్యం వుందని చెబుతున్నా ఎందుకు వసూలు కావడం లేదన్నదానికి ఎవరు సమాధానం చెప్పాలి??? ఇవే కాదు, మిగతా నాయకులు కూడా ఏం మాట్లాడారన్నదానిపై కూడ నేటిధాత్రి వరస కథనాలు..

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

మోకిలా తాండ గ్రామ సర్పంచ్గా వర్త్య శాంతమ్మ రీజాయినింగ్

బాధ్యతలు అప్పగించాలంటూ అధికారులకు కోర్టు ఉత్తర్వులు

బూటకపు ఆరోపణలతో సస్పెండ్ చేయించారు : శాంతమ్మ

శంకరపల్లి, నేటిధాత్రి:

ఆరోపణలతో అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేదని మరోసారి రుజువైందంటూ మోకిలా తాండ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది చేసిన పనులకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. తిరిగి వర్య శాంతమ్మను పదవిలో కొనసాగాలని కోర్టు జిల్లా కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది. నిజ నిజాలు ప్రజలు గ్రహిస్తూనే ఉంటారని, బెదిరింపులు అసత్య ఆరోపణలతో ఏం చేయలేరని గ్రామస్తులు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల తండా గ్రామపంచాయతీ సర్పంచ్గా వర్త్య శాంతమ్మను తిరిగి పదవిలో కొనసాగాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వాస్తులకు నష్టం కలిగించడం, పంచాయతీ స్థలంలో మొక్కలను ధ్వంసం చేయడం వంటి ఆరోపణలతో సస్పెండ్ కాబడిన శాంతమ్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్ విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆమెను సర్పంచిగా బాధ్యతలు స్వీకరించాలని వెంటనే ఉపసర్పంచ్ నుంచి శాంతమ్మ సర్పంచ్ బాధ్యతలను తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా, మండల, గ్రామ అధికారులకు కోర్టు సూచించింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ నిజం ఎప్పటికైనా గెలుస్తుందని ఎల్లప్పుడూ తనను గెలిపించిన ప్రజల కోసం సేవ చేసేందుకు ముంటానన్నారు. గ్రామ ప్రజల తీర్పుతో గెలిచామని, వారి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకుసాగుతానన్నారు.

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎస్సై నరేష్……!

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అశోక్, ఎస్సై నరేష్……!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్:కోహిర్,రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు, ఆత్మీయ మతసామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్ అన్నారు.మంగళవారం కోహిర్ పట్టణంలో ఆటో యూనియన్ వారు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ముఖ్యఅతిథులుగా కోహిర్ మున్సిపల్ చైర్మన్ ఎం. అశోక్, కోహిర్ ఎస్సై ని ఆహ్వానించారు.సోదర భావానికి, మతసమారష్యానికి ప్రతీక ఈ ఇఫ్తార్ విందు అని కొనియాడారు ఎస్సై నరేష్ కుమార్, ఈ కార్యక్రమంలో కోహిర్ ఆటో యూనియన్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి ప్రశ్నాపత్రాల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం…

పదవ తరగతి ప్రశ్నాపత్రాల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం
సీలింగ్ చేసిన ఘటనలో బాధ్యులైన ఆఫీసర్లపై చర్య తీసుకోవాలి- మచ్చ రమేష్
  
కరీంనగర్, నేటిధాత్రి:
https://youtu.be/DuesHkaoMCM?si=82oykQbivkOKbBGV
కరీంనగర్ జిల్లాలో త్వరలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఇటీవల జిల్లా కలెక్టరేట్ కారిడార్ లో సీలింగ్ చేసి బాధ్యతరహిత్యం వ్యవహరించి నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ డిమాండ్ చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాల సీలింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా మచ్చ రమేష్ మాట్లాడుతూ అత్యంత పకడ్బందీగా, భద్రత మధ్య ఇతర వ్యక్తుల రాకపోకలకు అవకాశం లేకుండ ఏదైనా భవనంలో నాలుగు గోడల మధ్య నిర్వహించాల్సిన సీలింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 28న కలెక్టరేట్ కారిడార్ లో నిర్వహించడం అంటే అధికారుల నిరక్ష్యానికి నిదర్శనమని, ఈకారిడార్ ద్వారానే ఇతర శాఖల సిబ్బంది, వివిధ పనులపై కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి స్థలంలో సీలింగ్ ప్రక్రియ చేపట్టడం సంబంధిత ఆఫీసర్ల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. అటుగా వచ్చేవారు ప్రశ్నా పత్రాలను దృష్టి మరల్చి తీసుకెళ్లి పేపర్ లీకేజీకి పాల్పడే ప్రమాదముందనే విషయాన్ని మరిచి ఆఫీసర్లు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. 
ఈఘటనపై వెలుగు దినపత్రికలో మెయిన్ పేజీలో మార్చి 1న ఫొటో వార్త పబ్లిష్ అయింది. ఈవార్తకు స్పందనగా ‘స్థలాభావం కారణంగానే కారిడార్ లోకి ప్రశ్నాపత్రాలను సీలింగ్ చేశాం’ అని డీఈఓ ప్రకటించగా  ప్రశ్నాపత్రాల ట్రంక్ బాక్సులను డీటీఓ కార్యాలయం లోపలే సీలింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. కారిడార్ లోనే ప్రశ్నాపత్రాలు సీలింగ్ చేసినట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయినీ విష్ణు, నాయకులు సాయి, తదితరులు పాల్గొన్నారు.

మహీంద్రా ట్రాక్టర్ తయారీ కేంద్రంలో800కు పైగా ఉద్యోగాలు…

మహీంద్రా ట్రాక్టర్ తయారీ కేంద్రంలో800కు పైగా ఉద్యోగాలు

యువతకు మంచి అవకాశం

* కలెక్టర్ కోయ శ్రీహర్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఫామ్ డివిజన్ ట్రాక్టర్ తయారీ కేంద్రంలో 800కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి భారీ స్థాయిలో నియమకాలు జరుగు తున్నాయని, ఈ నియామక ప్రక్రి యకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా అభ్యర్థుల నమోదు చేపడుతు న్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టర్లో ఇచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేసుకుంటే, సంబంధిత కంపెనీ హెచ్ఎర్ టీమ్ తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం నేరుగా సంప్రదిస్తార న్నారు. ఈ అవకాశాన్ని ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు వినియోగించుకోవాలని జిల్లా కలె క్టర్ కోయ శ్రీహర్ష కోరారు

ఖాళీల వివరాలు:

1) NAPS ట్రైనీ- అసెంబ్లీ

ఉద్యోగ స్థలం: జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా

*: 300

* 2: 5. 14,000-15,000

అర్హతలు : ఇంటర్మీడియట్ (BiPC, MPC, CEC, HEC, MEC తదితర గ్రూపులు), ఒకేషనల్ లేదా డిప్లొమా

ఉద్యోగ విధులు: ట్రాక్టర్ తయారీ మరియు అసెంబ్లీ పనులు

2) డిప్లొమా అప్రెంటిస్

ఉద్యోగ స్థలం: జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా

* : 200

* 26: 215,000 – 20,000

అర్హతలు: డిప్లొమా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రా నిక్స్ / ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా

ఉద్యోగ విధులు: ఉత్పత్తి ప్రణాళిక మరియు షాప్ ఫ్లోర్ పర్యవేక్షణ

3) ఐటీఐ అప్రెంటిస్ – అసెంబ్లీ

ఉద్యోగ స్థలం: జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా

300,

. 2,2, 14,000-15,000

అర్హతలు: మిషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, డీజిల్ మెకా నిక్, మోటార్ వెహికిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తది తర ట్రేడ్స్లో ఐటీఐ ఉత్తీర్ణులు

ఉద్యోగ విధులు: ట్రాక్టర్ తయారీ మరియు అసెంబ్లీ పనులు

సౌకర్యాలు

16 కి.మీ వరకు ఉచిత రవాణా

సబ్సిడీతో క్యాంటీన్ సౌకర్యం

మెడికల్ ఇన్సూరెన్స్

సేఫ్టీ షూస్ మరియు యూనిఫాం

అర్హత ప్రమాణాలుఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు డిగ్రీ ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకో వచ్చు

కెరీర్ గ్యాప్ ఉన్న వారికి అవకాశంపురుషులు మరియు మహిళలు ఇద్దరూ అర్హులువెంటనే ఉద్యోగంలో అభ్యర్ధులకు ప్రాధాన్యం

దరఖాస్తు విధానం

అర్హత కలిగిన అభ్యర్థులు పోస్టర్లో ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న అభ్యర్థులను కంపెనీ HR టీమ్ నేరుగా సంప్రదించి ఇంటర్వ్యూ మరియు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది.

ఇంటర్మీడియట్, ఐటీఐ మరియు డిప్లొనూ పూర్తి చేసిన నిరు ద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్య ర్థులు వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) తెలం గాణ యువతకు ఉపాధి అవకాశాల కల్పనలో మరో ముందు అడుగు

error: Content is protected !!
Exit mobile version