అడ్డంగా వాహనాలు.. కాలనీవాసుల ఆవేదన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్లోని ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాల రద్దీతో రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లడం కష్టతరమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై కాలనీవాసులు సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. వెంటనే స్పందించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించి, తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
