మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డ లో…

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మర్రిగడ్డ లో “ఊయల మరియు జారుడు బల్ల” ప్రారంభించిన సర్పంచ్ దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి

చందుర్తి, నేటిధాత్రి:

ఈ రోజు మర్రిగడ్డ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన “ఊయల మరియు జారుడు బల్ల” ను గ్రామ సర్పంచ్ శ్రీమతి దూది మనీషా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.స్థానిక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేయుచున్న శ్రీ ఆకుల గంగనర్సయ్య దీనిని విరాళంగా అందించారు.ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడప రఘుపతి రావు మాట్లడుచు చిన్నారుల కొరకు వీటిని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని,పాఠశాల అవసరాలు తీర్చడంలో ఉపాధ్యాయులు కూడా తమ వంతు సహకారం అందిస్తారనడానికి నిదర్శనం ఈ ఊయలలు అని అన్నారు.అనంతరం దాత ఆకుల గంగనర్సయ్య కు మరియు బదిలీలలో చందుర్తి పాఠశాలకు వెళ్లిన గుర్రం బాలకిషన్ కి సర్పంచ్, చందుర్తి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు లచ్చిరెడ్డి,ఉపసర్పంచ్,అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు షకీరా మరియు ఉపాధ్యాయ బృందం చే సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో చందుర్తి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్ఛిరెడ్డి, స్థానిక ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి,వార్డు సభ్యులు,
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బండ శంకర్,కీర్తి,ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

చినిగేపల్లిలో ఉచిత ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

చినిగేపల్లిలో ప్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లి గ్రామంలో 59వ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఫ్రీ ప్రైమరీ పాఠశాల ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో

ఈ పాఠశాల మంజూరైంది. పాఠశాల ప్రారంభోత్సవంలో చిన్నారులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా చదువు కొనసాగించాలని వక్తలు సూచించారు. ఈ పాఠశాల మంజూరుపై గ్రామస్తులు, సర్పంచ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్, కార్యదర్శి, సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version